Jump to content

డెసిషన్ రివ్యూ సిస్టమ్

వికీపీడియా నుండి

 

డెసిషన్ రివ్యూ సిస్టమ్
ఔటా.. కాదా..?
పొడిపదాలుDRS
స్థితిActive
మొదలైన తేదీ2008
తొలి ప్రచురణ2008
సంస్థఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)
ప్రాథమిక ప్రమాణాలుబాల్ ట్రాకింగ్: హాక్ ఐ లేదా వర్చువల్ ఐ

ధ్వని విశ్లేషణ: స్నిక్కోమీటరు

ఇన్‌ఫ్రా రెడ్ ఇమేజింగ్: హాట్ స్పాట్

డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS), క్రికెట్‌లో మ్యాచ్ అధికారులకు నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేయడానికి ఉపయోగించే సాంకేతిక వ్యవస్థ. గతంలో దీన్ని అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ (UDRS) అని పిలిచేవారు, మైదానం లోని అంపైర్లు థర్డ్ అంపైర్‌తో సంప్రదించినపుడు (అంపైర్ రివ్యూ అని పిలుస్తారు) గాని, మైదానం లోని అంపైర్ల నిర్ణయాన్ని పరిశీలించమని ఆటగాళ్లు గాని అభ్యర్థించవచ్చు (ప్లేయర్ రివ్యూ అని పిలుస్తారు).

టెలివిజన్ రీప్లేలు, బంతి మార్గాన్ని పరిశీలించే సాంకేతికత అది ఎలా వెళ్ళి ఉండేదో అంచనా వేసే సాంకేతికత, బంతి బ్యాట్‌ను గాని, ప్యాడ్‌ను గానీ తాకినప్పుడు వచ్చే చిన్న శబ్దాలను గుర్తించడానికి మైక్రోఫోన్‌లు, బంతి బ్యాట్‌కి లేదా ప్యాడ్‌కి తగలడంతో.ఉష్ణోగ్రత మార్పులను గుర్తించడానికి ఇన్‌ఫ్రా-రెడ్ ఇమేజింగ్ సాంకేతికలను ఇందులో ఉపయోగించారు.

1992 నవంబరు నుండి మైదానంలో ఉండే టెస్ట్ మ్యాచ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కి కొన్ని నిర్ణయాలను పరిశీలించమని అడగడం మొదలైంది. ఆటగాళ్ళ సమీక్ష అభ్యర్థనలు తీసుకునే అధికారిక DRS వ్యవస్థను మాత్రం మొదటిసారిగా 2008లో టెస్ట్ మ్యాచ్‌లో ఉపయోగించారు. దీనిని 2011 జనవరిలో మొదటిసారిగా వన్డే ఇంటర్నేషనల్ లో ఉపయోగించగా, ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో 2017 అక్టోబరులో మొదలైంది.

భాగాలు

[మార్చు]

DRS యొక్క భాగాలు:

  • స్లో మోషన్‌తో సహా వీడియో రీప్లేలు .
  • హాక్-ఐ, [1] లేదా వర్చువల్ ఐ (ఈగిల్ ఐ అని కూడా పిలుస్తారు): బాల్-ట్రాకింగ్ టెక్నాలజీ, బ్యాటరు అడ్డుకున్న బంతి పథం ఎలా ఉండేదో, అది స్టంపులకు తగిలి ఉండేదా లేదా అనేది అంచనా వేయగలదు.
  • రియల్ టైమ్ స్నికో (RTS) లేదా అల్ట్రా-ఎడ్జ్ [2] [3] [4] (హాక్-ఐ ఇన్నోవేషన్స్): బంతి, బ్యాటుకో, ప్యాడుకో తగిలినప్పుడు వచ్చే చిన్న శబ్దాలను గుర్తించడానికి డైరెక్షనల్ మైక్రోఫోన్‌లు. ఒరిజినల్ స్నికోమీటర్‌ స్థానంలో 2013 లో రియల్ టైమ్ స్నికో వచ్చింది. [5] [6] [7] [8] [9] RTS ఆట రోజుల్లో దీన్ని ప్రతి ఉదయం క్యాలిబరేషను చేస్తారు.[10] RTS/అల్ట్రా-ఎడ్జ్ డేటాను పరిశీలించి థర్డ్ అంపైర్, బాల్ బ్యాట్‌ను దాటిన ఫ్రేములో గాని, దాని తర్వాతి ఫ్రేములో గాని, దానికి ముందరి ఫ్రేములో గాని ఆడియోలో స్పైకులేమైనా వచ్చాయేమో తెలుసుకుంటాడు. [11] [12]
  • హాట్ స్పాట్: ఇది ఇన్‌ఫ్రా-రెడ్ ఇమేజింగ్ సిస్టం. బంతి బ్యాటుకు గాని, ప్యాడుకు గానీ తగిలిందా అనేది చూపిస్తుంది. 2012 సీజనులో మెరుగైన కెమెరాలను ప్రవేశపెట్టారు. [13] 2013లో ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ తర్వాత ఈ వ్యవస్థపై విమర్శలు వచ్చాయి. [14] బ్యాటు మీద సిలికాన్ టేప్‌ను చుడితే, బంతి మెల్లగా తగిలినపుడు హాట్ స్పాట్ గుర్తించలేదని తెలిసింది. MIT నివేదిక దీన్ని నిర్థారించింది.[15]
బాల్-ట్రాకింగ్ టెక్నాలజీ పోలిక
వ్యవస్థ కెమెరాల సంఖ్య కెమెరా ఫ్రేమ్‌రేట్
హాక్-ఐ 6 [16] 340 fps [16]
వర్చువల్ ఐ (ఈగిల్ ఐ) 4 [17] 230 fps [17]

వ్యవస్థ

[మార్చు]

అంపైర్ సమీక్షలు

[మార్చు]

అనేక సందర్భాల్లో, సంఘటన సెకనులో కొన్ని వంతుల్లో జరుగుతుంది. మైదానం లోని అంపైర్లు తామిచ్చిన/ఇవ్వదలచిన క్రింది రకాలైన ఔట్ నిర్ణయాలను సమీక్షించవలసిందిగా థర్డ్ అంపైరును అభ్యర్థించవచ్చు: [18]

  • రనౌట్. మైదానంలోని అంపైర్లు బ్యాట్స్‌మన్ ఔట్ అయ్యాడో లేదో నిర్ణయించలేకపోతే, బ్యాట్స్‌మన్ క్రీజులోకి చేరుకున్నాడో లేదో నిర్ధారించమని వారు థర్డ్ అంపైర్‌ను అభ్యర్థించవచ్చు. అలాగే ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌కి చేరితే, ఏ బ్యాటరు మొదట్గా క్రీజు లోకి చేరాడో మైదానం లోని అంపైర్లు నిశ్చితంగా చెప్పలేకపోవచ్చు. దీనికి ఉదాహరణ 2006లో న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడవ టెస్టు.[19]
  • క్యాచ్, ఫీల్డ్‌ను అడ్డుకోవడం సందర్భాల్లో అంపైర్లిద్దరికీ ఖచ్చితంగా తెలియని సందర్భంలో. కొన్ని సందర్భాల్లో ఫీల్డరు నేల నుండి చాలా కొద్ది ఎత్తులో బంతిని పట్టుకోవచ్చు. అంపైర్ దృష్టి అస్పష్టంగా ఉంటే లేదా ఫీల్డర్ బంతిని పట్టుకునే ముందు బంతి బౌన్స్ అయిందో లేదో ఖచ్చితంగా తెలియకపోతే, అతను థర్డు అంపైరుకు నివేదించవచ్చు. ఈ అవుట్‌ల కోసం, మైదానం లోని అంపైరు అది అవుట్ అని భావించాలా వద్దా అని చెప్పడానికి "సాఫ్ట్-సిగ్నల్" ఇవ్వాలి. థర్డ్ అంపైరుకు నిశ్చయాత్మకమైన సాక్ష్యం ఉంటేనే మైదాన నిర్ణయం తప్పు అని చెప్పాలి. క్యాచ్ పట్టుకున్నప్పుడు థర్డ్ అంపైరు, మొదట ఆ బంతి నో-బాలా కాదా, బ్యాటరు బంతిని కొట్టాడా లేదా అని తనిఖీ చేస్తాడు.
  • బ్యాటరును ఔట్‌ చేసిన బంతి నో బాలా కాదా అనేది చూసేందుకు.

మైదాన అంపైర్లు LBW నిర్ణయాన్ని సమీక్షించమని థర్డ్ అంపైరును అభ్యర్థించకపోవచ్చు (బంతి నో-బాలా కాదా అనేది కాకుండా).

మైదాన అంపైర్లు కింది వాటిని సమీక్షించాలని కూడా థర్డ్ అంపైరును అభ్యర్థించవచ్చు:

  • బౌండరీ కాల్స్ (బ్యాటరు కొట్టింది ఫోరా, సిక్సా అనేది చూడటానికి). కొన్ని సందర్భాల్లో బౌండరీ రోప్ లోపల బంతి కేవలం ఒక అడుగు దూరంలో బౌన్స్ కావచ్చు, ఫలితంగా నాలుగు పరుగులు వస్తాయి. అంపైర్ అది 4 లేదా 6 అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, అతను థర్డ్ అంపైర్‌ను సంప్రదించవచ్చు. బౌండరీకి సమీపంలో, తరచుగా ఫీల్డరు దూకి బంతిని బౌండరీ దాటకుండా కాపాడవచ్చు. ఫీల్డరు బౌండరీని, బంతినీ ఏకకాలంలో పట్టుకుంటే 4 పరుగులు వస్తాయి. అటువంటి సందర్భంలో థర్డ్ అంపైర్‌ని కూడా సంప్రదించవచ్చు.
  • బంతి మైదానం లోపల గానీ, మైదానానికి పైన గానీ ఉన్న కెమెరాలకు తగిలితే.

థర్డ్ అంపైర్ ఉండి, కానీ పూర్తి UDRS ఉపయోగంలో లేని సందర్భంలో కూడా అంపైర్ రివ్యూలు మైదాన అంపైర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంలో, థర్డ్ అంపైరు ఒక నిర్ణయానికి రావడానికి టెలివిజన్ రీప్లేలను (మాత్రమే) ఉపయోగిస్తాడు. బాల్-ట్రాకింగ్ వంటి అదనపు సాంకేతికతను ఉపయోగించరు.[20]

ప్లేయర్ సమీక్షలు

[మార్చు]
ఆటగాళ్ళ DRS విఫల సమీక్ష అభ్యర్థనలు ఇంకా ఇండియాకు 2, ఇంగ్లాండుకు 2 మిగిలి ఉన్నాయని చూపిస్తున్న స్కోరుబోర్డు
ఆటగాళ్ళ DRS విఫల సమీక్ష అభ్యర్థనలు ఇంకా ఇండియాకు 2, ఇంగ్లాండుకు 2 మిగిలి ఉన్నాయని చూపిస్తున్న స్కోరుబోర్డు

ఫీల్డింగ్ జట్టు "నాటౌట్" నిర్ణయంతో విభేదించినపుడు సమీక్ష కోసం సిస్టమ్‌ను ఉపయోగించవచ్చు. బ్యాటింగ్ జట్టు "అవుట్" నిర్ణయంతో విభేదించినపుడు దానిని ఉపయోగించవచ్చు. ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ గానీ అవుటైన బ్యాటరు గానీ చేతులను లేదా చేయి, బ్యాటును "T" లాగా పెట్టి సంకేతం చేయడం ద్వారా ఈ సమీక్ష కోరుతారు. ఇది కేవలం ఔటైన లేదా ఔటుకు దారితీసే పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలి: ఉదాహరణకు, క్యాచ్ సరైనదా కాదా అని నిర్ణయించడానికి (బ్యాటరు బ్యాటుతో గని, గ్లోవ్‌తో గానీ బంతిని తాకడం, ఫీల్డరి క్యాచ్‌ పట్టుకునే ముందు బంతి నేలను తాకకపోవడం), లేదా ఎల్‌బిడబ్ల్యూ అవుట్‌ ఇవ్వాలనే విధంగా బంతి ప్రయాణం ఉంటే.

సవాలును చేసాక, అది దృష్టికి వచ్చాక, దాన్ని ఆమోదించాక, థర్డ్ అంపైరు ఆటను సమీక్షిస్తాడు.

ప్రతి జట్టుకు విఫలమైన సవాళ్ళకు ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి చేరుకునే వరకు సమీక్షలను కోరవచ్చు. టెస్టు మ్యాచ్‌లో ఐతే ఒక్కో ఇన్నింగ్స్‌కు రెండు, వన్డే ఇంటర్నేషనల్‌లో ఒక ఇన్నింగ్స్‌కు ఒకటీ - విఫలమైన రివ్యూ అభ్యర్థనల పరిమితి ఉంటుంది. 2020 జూలై నుండి ఈ పరిమితిని తాత్కాలికంగా టెస్ట్‌లలో ఒక్కో ఇన్నింగ్సుకు మూడు, వన్డే మ్యాచ్‌లకు రెండుగా పెంచారు.[21] 2013 నుండి 2017 సెప్టెంబరు వరకు, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో జట్టుకు అందుబాటులో ఉన్న సమీక్షల సంఖ్యకు 80 ఓవర్ల తర్వాత మరో రెండు వచ్చి చేరేవి. 2017 అక్టోబరు నుండి, DRS "అంపైర్ కాల్" చూపుతున్నందున మైదాన నిర్ణయం మారకుండా ఉంటే, జట్టు తన సమీక్షను కోల్పోదు. [22] [23] [24]

స్పందనలు

[మార్చు]

డెసిషన్ రివ్యూ సిస్టమ్ ప్రారంభించినప్పటి నుండి సాధారణంగా ఆటగాళ్లు, కోచ్‌ల నుండి సానుకూల స్పందన వచ్చింది. సానుకూల స్పందన కారణంగా ICC, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల క్రికెట్ గేమ్‌లలో DRS ను ఏకరీతిగా వర్తింపజేయడానికి ప్రయత్నించింది. అయితే దీనిని అమలు చేయడం కొన్ని దేశాలకు కష్టంగా మారింది. కొన్ని దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు, సాంకేతికతను కొనుగోలు చేయలేకపోతున్నాయి. దానిలోని కొన్ని భాగాలనే ఉపయోగించడమో లేదా అస్సలు ఉపయోగించకపోవడమో ఎంచుకున్నాయి. [25] ఇది అంపైర్ల నిర్ణయాల్లో ఉండే లోపాలను రూపుమాపడానికి రూపొందించబడింది. ఇది చాలా ఆటలలో ఆ పని చేసింది.

అయితే, DRS టెక్నాలజీకి కొన్ని ప్రతికూల స్పందనలు కూడా వచ్చాయి. వెస్టిండీస్ లెజెండ్ జోయెల్ గార్నర్ ఈ వ్యవస్థను "జిమ్మిక్" అని తేల్చేసాడు. [26] ప్రయోగాత్మక రిఫరల్ సిస్టమ్‌కు తాను మద్దతు ఇవ్వనని మరో వెస్ట్ ఇండియన్ రామ్‌నరేష్ సర్వాన్ అన్నాడు. [27] మాజీ అంపైర్ డిక్కీ బర్డ్ కూడా ఈ వ్యవస్థను విమర్శించాడు. ఇది మైదాన అంపైర్ల అధికారాన్ని దెబ్బతీస్తుందని అన్నాడు. [28] బిసిసిఐ, ఈ వ్యవస్థ దాదాపుగా మాత్రమే పరిపూర్ణంగా ఉంటే దానిని అమలు చెయ్యడంపై సందేహాస్పద అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. [29] పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ భారత్‌తో జరిగిన 2011 క్రికెట్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ తర్వాత డెసిషన్ రివ్యూ సిస్టమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. డీఆర్‌ఎస్‌లో బంతి రేఖ ఒరిజినల్ రేఖ నుండి ఎక్కువగా డీవియేటు అయిందని అతను చెప్పాడు. [30] దుబాయ్‌లో (2014 నవంబరు 17-21) న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ షాన్ మసూద్‌ను అవుట్ చేసిన నిర్ణయంలో తమ రివ్యూ టెక్నాలజీ పొరపాటు చేసిందని హాక్-ఐ అధికారులు 2014 డిసెంబరులో అంగీకరించారు. రెండు వారాల తర్వాత దుబాయ్‌లోని ఐసిసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో, లెగ్ బిఫోర్ వికెట్ నిర్ణయానికి తమ సాంకేతికత ఉపయోగించిన ప్రొజెక్షన్ తప్పు అని పాక్ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్, జట్టు మేనేజర్ మొయిన్ ఖాన్‌ల వద్ద హాక్-ఐ అంగీకరించినట్లు తెలిసింది.[31] అలాగే, ఒక నిర్ణయం తీసుకున్నప్పటి నుండి కెప్టెన్ 15-సెకండ్ల లోపులో మాత్రమే సవాలు చేయగలడు. కానీ స్పష్టమైన నిర్ణయం తీసుకోనట్లయితే దానిని పొడిగించవచ్చు. ప్రత్యేకించి అంపైరు నుండి ఎటువంటి ప్రతిస్పందన లేనట్లయితే వారు నాట్ అవుట్‌గా భావించబడతారు.

ఆటగాళ్ళ సమీక్ష గణాంకాలు

[మార్చు]

2009 సెప్టెంబరు - 2017 మార్చి మధ్య 2,100 పైచిలుకు ఆటగాళ్ళ సమీక్షలను విశ్లేషించినపుడు కింది ఫలితాలు తేలాయి: [32] [33]

  • 26% ఆటగాళ్ళ సమీక్షల్లో మైదాన నిర్ణయాలు రద్దు చేయబడ్డాయి.
  • బ్యాటర్ల సమీక్షలు బౌలింగ్ జట్ల సమీక్షల కంటే తక్కువగా ఉన్నాయి. 41% బ్యాట్స్‌మెన్, 59% బౌలింగ్ జట్ల ద్వారా సమీక్షించబడ్డాయి.
  • బ్యాట్స్‌మెన్ సమీక్షలు ఎక్కువగా విజయవంతమయ్యాయి. వాళ్ళ 34% సక్సెస్ రేటుతో పోలిస్తే, బౌలింగ్ జట్ల సక్సెస్ రేటు 20% ఉంది.
  • 74% సమీక్షలు LBW కోసం కాగా, 18% వికెట్ కీపర్ క్యాచ్‌ల కోసం, మిగిలినవి వేరే క్యాచ్‌లు లేదా అనిర్దిష్ట కారణాల కోసం. వికెట్ కీపర్ క్యాచ్‌ల విషయంలో 40% విజయవంతం కాగా, LBW లో 22% మాత్రమే విజయం సాధించాయి.
  • ఒక్కో మ్యాచ్‌కు సగటున 1.4 బ్యాటింగ్ ఓవర్‌టర్న్‌లు, 1.2 బౌలింగ్ ఓవర్‌టర్న్‌లు జరిగాయి. డిఆర్‌ఎస్ వల్ల తొలగింపుల సంఖ్య పెరుగుతుందన్న తొలి భయాలు నిజం కాలేదు.
  • UDRS లో 90% ఖచ్చితత్వం ఉందని చెప్పుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Technology in Sports:DRS,GoalRef & HawkEye | TechBuzzIn™". TechBuzzIn™ (in అమెరికన్ ఇంగ్లీష్). 9 April 2017. Archived from the original on 26 April 2017. Retrieved 15 April 2017.
  2. "Ultra-edge ready for Test use". ESPNcricinfo. Archived from the original on 14 November 2020. Retrieved 13 November 2020.
  3. "Q&A with Geoff Allardice on the Loughborough technology trial". Archived from the original on 20 December 2016. Retrieved 10 December 2016.
  4. "Why universal use of DRS is getting closer, but still not close enough | Mike Selvey". The Guardian. 20 October 2015. Archived from the original on 14 November 2020. Retrieved 13 November 2020.
  5. "Hot Spot may earn Ashes reprieve". Archived from the original on 29 November 2016. Retrieved 29 November 2016.
  6. TNN (7 July 2011). "'Hot spot's success rate is 90-95%'". The Times of India. Archived from the original on 6 September 2012. Retrieved 21 July 2013.
  7. "Hawk-Eye needs a leap of faith - Srinivasan". Archived from the original on 2 February 2012.
  8. "DRS: BCCI warms up to MIT-approved technology | Cricket News - Times of India". The Times of India. 20 October 2016. Archived from the original on 24 November 2020. Retrieved 13 November 2020.
  9. "No HotSpot for India-England Tests". ESPNcricinfo.
  10. "Snicko is Hot Spot's insurance policy". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 31 December 2020. Retrieved 2022-01-07.
  11. "England baffled by Root's DRS dismissal". ESPN.com (in ఇంగ్లీష్). 2013-12-14. Archived from the original on 11 November 2020. Retrieved 2022-01-07.
  12. "Cricket: Talking points from day two of the Fifth Ashes Test". NZ Herald (in New Zealand English). Archived from the original on 7 January 2022. Retrieved 2022-01-07.
  13. "New cameras should capture faintest of edges - Hot Spot inventor". Archived from the original on 11 January 2012.
  14. "Hot Spot should be removed - Vaughan". BBC Sport. Archived from the original on 29 November 2020. Retrieved 13 November 2020.
  15. Hoult, Nick (6 June 2016). "Hot Spot can be fooled by bat tape, say scientists". The Daily Telegraph. Archived from the original on 7 January 2022. Retrieved 3 December 2018.
  16. 16.0 16.1 "Cricket: Review scandal questions accuracy of Hawk-Eye technology". NZ Herald (in New Zealand English). Archived from the original on 30 November 2020. Retrieved 2022-01-07.
  17. 17.0 17.1 "Take DRS out of players' hands: Virtual Eye Head Ian Taylor". The New Indian Express. Archived from the original on 27 January 2021. Retrieved 2022-01-07.
  18. "ICC Men's Test Match Playing Conditions Effective 1 September 2019". ICC. pp. Appendix D: Decision Review System (DRS), Section 2 Umpire Review. Archived from the original on 6 December 2019. Retrieved 1 January 2020.
  19. "Bizarre Runout". YouTube. Archived from the original on 2023-05-31. Retrieved 2023-08-19.
  20. "ICC Men's One Day International Playing Conditions Effective 30 September 2018". ICC. 30 September 2018. Archived from the original on 6 December 2019. Retrieved 14 January 2020. Appendix D, paragraph 1.1.6, THIRD UMPIRE (NON-DRS), Replays that can be used: The third umpire shall only have access to replays of any camera images. Other technology which may be in use by the broadcaster for broadcast purposes (for example, ball-tracking technology, sound-based edge detection technology, and heat-based edge detection technology) shall not be used during Umpire Reviews.
  21. "How many reviews in Test cricket: Have number of DRS reviews changed in the COVID-19 era?". Archived from the original on 19 September 2020. Retrieved 14 August 2020.
  22. "The new cricket rule changes coming into effect from September 28". ESPNcricinfo. Archived from the original on 7 April 2018. Retrieved 13 October 2017.
  23. "Cricket to change, new rules on run-outs, bat size, poor behaviour from Sept. 28". Hindustan Times. 26 September 2017. Archived from the original on 13 November 2020. Retrieved 13 November 2020.
  24. "Reviews to be reset after 80 overs". Archived from the original on 21 October 2017. Retrieved 21 October 2017.
  25. "Decision Review System: Explaining the technology behind it". sportskeeda. Archived from the original on 17 April 2021. Retrieved 31 March 2020.
  26. "Garner labels review system as a 'gimmick'". The Independent. London. 10 December 2009. Archived from the original on 15 December 2018. Retrieved 18 February 2010.
  27. Weaver, Paul (6 December 2009). "Sarwan unhappy with umpire review system despite reprieve". The Guardian. Archived from the original on 4 November 2013. Retrieved 18 February 2010.
  28. "Dickie Bird criticises review system". ESPNcricinfo. 7 December 2009. Archived from the original on 7 January 2022. Retrieved 18 February 2010.
  29. "BCCI open to use DRS if its near perfection: Anurag Thakur". 3 October 2016. Archived from the original on 10 November 2016. Retrieved 29 November 2016.
  30. "Ajmal speaks against DRS". The News International. 2 April 2011. Archived from the original on 5 April 2011. Retrieved 3 April 2011.
  31. "Hawk-Eye admits technical error in Masood dismissal". ESPN Sports Media Ltd. 10 December 2014. Archived from the original on 21 December 2014. Retrieved 8 January 2015.
  32. Charles Davis. "Statistics and the DRS" (PDF). Archived (PDF) from the original on 13 October 2017. Retrieved 12 October 2017.
  33. "The art of the review" (in ఇంగ్లీష్). ESPN. 1 June 2017. Archived from the original on 13 October 2017. Retrieved 12 October 2017.