2011 క్రికెట్ ప్రపంచ కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2011 క్రికెట్ ప్రపంచ కప్
అధికారిక లోగో
తేదీలు2011 ఫిబ్రవరి 19 – ఏప్రిల్ 2
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్, నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు
 • ఇండియా
 • శ్రీలంక
 • బంగ్లాదేశ్
ఛాంపియన్లు భారతదేశం (2nd title)
పాల్గొన్నవారు14 (104 అభ్యర్థుల నుండి)
ఆడిన మ్యాచ్‌లు49
ప్రేక్షకుల సంఖ్య12,29,826 (25,098 ఒక్కో మ్యాచ్‌కు)
మ్యాన్ ఆఫ్ ది సీరీస్భారతదేశం యువరాజ్ సింగ్
అత్యధిక పరుగులుశ్రీలంక తిలకరత్నే దిల్షాన్ (500)
అత్యధిక వికెట్లు
2007
2015

2011 క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పదవది. దీన్ని మొదటిసారిగా భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో నిర్వహించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్, శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్‌ను గెలుచుకుంది. తద్వారా సొంత గడ్డపై క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను గెలుచుకున్న మొదటి దేశంగా నిలిచింది.[1] [2] మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. [3] ప్రపంచకప్ చరిత్రలో రెండు ఆసియా జట్లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 1992 ప్రపంచ కప్ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాల్గొనకపోవడం ఇదే తొలిసారి.

ఈ టోర్నమెంట్‌లో పద్నాలుగు జాతీయ క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఇందులో 10 మంది పూర్తిస్థాయి సభ్యులు కాగా, నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) లోని అసోసియేట్ సభ్యులు. [4] ప్రారంభ వేడుక 2011 ఫిబ్రవరి 17 న ఢాకా లోని బంగబంధు నేషనల్ స్టేడియంలో జరిగింది.[5] టోర్నమెంటు ఫిబ్రవరి 19, ఏప్రిల్ 2 ల మధ్య జరిగింది. ఢాకాలోని మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. [6]

తొలుత పాకిస్తాన్ కూడా సహ-హోస్ట్‌గా ఉండాలని అనుకున్నారు. అయితే 2009లో లాహోర్‌లో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై తీవ్రవాద దాడి తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దానిని రద్దు చేసింది.[7] లాహోర్‌లో ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ ప్రధాన కార్యాలయాన్ని ముంబైకి బదిలీ మార్చింది.[8] పాకిస్థాన్, ఒక సెమీఫైనల్‌తో సహా 14 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. [9] వీటిలో ఎనిమిది గేమ్‌లను (సెమీ-ఫైనల్‌తో సహా) భారతదేశానికి, నాలుగు శ్రీలంకకు, రెండు బంగ్లాదేశ్‌కు మార్చారు.[10]

ఫార్మాట్

[మార్చు]

2007 చివరలో, తొలుత అనుకున్న నాలుగు ఆతిథ్య దేశాలు 2011 ప్రపంచ కప్ కోసం సవరించిన ఆకృతిని అంగీకరించాయి. 1996 ప్రపంచ కప్ మాదిరిగానే ఉండే ఫార్మాటులో 12కి బదులు 14 జట్లు ఉండేలా దీన్ని రూపొందించారు. టోర్నమెంట్ మొదటి రౌండులో ఏడేసి జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. గ్రూప్‌లోని ప్రతి జట్టు మిగతా వాటితో ఒకసారి ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి నాలుగు జట్టు క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. [11] ఆవిధంగా ప్రతి జట్టు కనీసం ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది.

అర్హత పొందిన జట్ల జాబితా

[మార్చు]

కింది 14 జట్లు ఫైనల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.

గ్రూప్ A గ్రూప్ బి
ర్యాంక్ జట్టు ర్యాంక్ జట్టు
పూర్తి సభ్యులు
1  ఆస్ట్రేలియా 2  భారతదేశం (సహ-హోస్ట్)
3  పాకిస్తాన్ 4  దక్షిణాఫ్రికా
5  న్యూజీలాండ్ 6  ఇంగ్లాండు
7  శ్రీలంక (సహ-హోస్ట్) 8  వెస్ట్ ఇండీస్
9  జింబాబ్వే 10  బంగ్లాదేశ్ (సహ-హోస్ట్)
అసోసియేట్ సభ్యులు
11  కెనడా 12  ఐర్లాండ్
13  కెన్యా 14  నెదర్లాండ్స్

సన్నాహాలు

[మార్చు]

పాకిస్థాన్ కో-హోస్ట్ హోదాను కోల్పోయింది

[మార్చు]

2009 ఏప్రిల్‌లో ICC, పాకిస్తాన్ లోని "అనిశ్చిత భద్రతా పరిస్థితి" పట్ల వచ్చిన ఆందోళనల కారణంగా, ముఖ్యంగా 2009 లో లాహోర్‌లో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై జరిగిన దాడి తరువాత, 2011 ప్రపంచ కప్‌కు సహ-ఆతిథ్యం ఇచ్చే హక్కును పాకిస్తాన్ కోల్పోయిందని ప్రకటించింది. [12] [13] దీంతో తాము $10.5 మిలియన్లు నష్టపోతారని PCB అంచనా వేసింది.[14] ICC హామీ ఇచ్చిన ఒక్కో మ్యాచ్‌కి $750,000 ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనా అది. PCBకి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకూ వచ్చే నష్టం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేసారు.

2009 ఏప్రిల్ 9 న PCB ఛైర్మన్ ఇజాజ్ బట్, ICC నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము లీగల్ నోటీసు జారీ చేశామని వెల్లడించాడు. [15] అయితే, పిసిబి ఇప్పటికీ సహ-హోస్ట్‌గానే ఉందని, తాము పాకిస్తాన్ నుండి మ్యాచ్‌లను మాత్రమే తరలించామనీ ఐసిసి పేర్కొంది. [16] 2015 ప్రపంచ కప్‌కు దక్షిణాసియా ఆతిథ్యం ఇవ్వాలని, 2011 ఈవెంట్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు ఆతిథ్యం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. అయితే ఇది వారి సహ-హోస్ట్‌లకు అనుకూలంగా లేనందున అంగీకారం పొందలేదు. [17]

మీడియా, ప్రచారం

[మార్చు]

ఒక్కో ప్రపంచ కప్ టోర్నమెంటు జరిగే కొద్దీ అది మీడియా ఈవెంట్‌గా పెరుగుతూ వచ్చింది. ICC 2011 ఈవెంట్ ప్రసార హక్కులను ESPN స్టార్ స్పోర్ట్స్, స్టార్ క్రికెట్‌కు 200 కోట్ల డాలర్లకు విక్రయించారు. మొదటిసారిగా, టోర్నమెంటును హై-డెఫినిషన్ ఫార్మాట్‌లో ప్రసారం చేసారు. ఇటీవలి సాంకేతికతను ఉపయోగించి కనీసం 27 కెమెరాల ద్వారా కవర్ చేయాలని తలపెట్టారు. ఆన్‌లైన్, మొబైల్ 3G వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించడానికి కూడా ప్లాన్ చేసారు. ICC ఈవెంట్‌లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ (UDRS) ఉండటం ఇదే మొదటిసారి. [18]

రేటింగ్ ఏజెన్సీలైన TAM, aMap ల ప్రకారం, ఫైనల్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని 13.5 కోట్ల మంది చూసారు. [19] [20] ఇందులో 6.76 కోట్ల కేబుల్, ఉపగ్రహ వీక్షకులు కూడా ఉన్నారు. [21] భారతదేశంలో టీవీ-ఉన్న కుటుంబాల్లో సగటున 13.6% ఫైనల్‌ను చూసాయి. ఆట ముగిసే సమయానికి ఇది 21.44% గరిష్ట స్థాయికి చేరుకుంది, [22] భారత, పాకిస్తాన్ల మధ్య జరిగిన సెమీ-ఫైనల్‌ను చూసిన 11.74% కుటుంబాల సంఖ్యను ఇది దాటేసింది.[20]


అధికారిక ఈవెంట్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ . [23]

మస్కట్

[మార్చు]

స్టంపీ అనే ఒక పిల్ల ఏనుగును 2011 క్రికెట్ ప్రపంచ కప్‌కు అధికారిక చిహ్నంగా ఎంచుకున్నారు. [24] 2010 ఏప్రిల్ 2 న కొలంబోలో జరిగిన ఒక కార్యక్రమంలో దాన్ని ఆవిష్కరించారు. [25] జూలై చివరి వారంలో ICC నిర్వహించిన ఆన్‌లైన్ పోటీ తర్వాత 2010 ఆగస్టు 2 న దాని పేరు ప్రకటించారు. [26]

ప్రారంభ వేడుక

[మార్చు]

బంగ్లాదేశ్‌, ఢాకాలోని బంగబంధు నేషనల్ స్టేడియంలో 2011 ఫిబ్రవరి 17 న, మొదటి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు, ప్రారంభ వేడుక జరిగింది.

నగదు బహుమతి

[మార్చు]

2011 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టుకు US$3 మిలియన్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నర్-అప్ కు US$1.5 మిలియన్లు లభిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ టోర్నమెంట్ కోసం కేటాయించిన మొత్తాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. గెలిచిన జట్టు 1999 నుండి అందించబడుతున్న ICC క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రతిరూపాన్ని కూడా తీసుకుంటుంది. 2010 ఏప్రిల్ 20 న దుబాయ్‌లో జరిగిన ICC బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.[27]

 • US$250,000 – ఓడిపోయిన క్వార్టర్-ఫైనలిస్టులు (4 జట్లు)
 • US$500,000 - ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు
 • US$1,500,000 - రన్నర్స్-అప్
 • US$3,250,000 - విజేతలు

వేదికలు

[మార్చు]

టోర్నమెంట్ కోసం అన్ని భారతీయ స్టేడియాలు 2009 అక్టోబరు మధ్య నాటికి, [28] బంగ్లాదేశ్, శ్రీలంకల స్టేడియాలు 2009 అక్టోబరు చివరి నాటికీ ఖరారయ్యాయి. ICC 2009 నవంబరు 2 న ముంబైలో వేదికలన్నిటి జాబితాను ప్రకటించింది. ఈ ఈవెంట్ కోసం శ్రీలంకలోని క్యాండీ, హంబన్‌తోటలో రెండు కొత్త స్టేడియాలు నిర్మించారు. [29]

భారతదేశం India
కోల్‌కతా చెన్నై ఢిల్లీ బాగపూర్ అహ్మదాబాదు
ఈడెన్ గార్డెన్స్ ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం విదర్భ క్రికెట్ అసోసియేషను స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం
సామర్థ్యం: 66,349 సామర్థ్యం: 50,000 సామర్థ్యం: 41,820 సామర్థ్యం: 45,000 సామర్థ్యం: 54,000
ముంబై మొహాలి బెంగళూరు
వాంఖెడే స్టేడియం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎం. చిన్నస్వామి స్టేడియం
సామర్థ్యం: 33,108 సామర్థ్యం: 26,950 సామర్థ్యం: 40,000
శ్రీలంక Sri Lanka బంగ్లాదేశ్ Bangladesh
కొలంబో క్యాండీ హంబన్‌తోట చిట్టగాంగ్ ఢాకా
ఆర్ ప్జ్రేమదాస స్టేడియం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మహీంద రాజపక్ష అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం Zohur Ahmed<br id="mwAcY"><br>Chowdhury Stadium Sher-e-Bangla<br id="mwAck"><br>National Cricket Stadium
సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 20,000 సామర్థ్యం: 26,000

 

 

 

అంపైర్లు

[మార్చు]

ప్రపంచ కప్‌లో రిజర్వ్ అంపైర్ ఎనాముల్ హక్ (బంగ్లాదేశ్) మినహా 18 మంది అంపైర్లను అంపైర్ సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది: ఆస్ట్రేలియా నుండి ఐదుగురు, ఇంగ్లండ్ నుండి ముగ్గురు, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకల నుండి ఇద్దరు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల నుండి ఒక్కొక్కరు ఉన్నారు.

Australia

New Zealand


South Africa

Pakistan

India


England

Sri Lanka

West Indies

ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు 14 వార్మప్ మ్యాచ్‌లు జరిగాయి. [30] [31] గణాంకాల రీత్యా, ఈ మ్యాచ్‌లను వన్డే ఇంటర్నేషనల్‌లుగా పరిగణించబడవు.

 

గ్రూప్ దశ

[మార్చు]
పోస్ జట్టు
2011 ఫిబ్రవరి 20
స్కోరు
కెన్యా 
69 (23.5 ఓవర్లు)
v  న్యూజీలాండ్
72/0 (8 ఓవర్లు)
న్యూజీలాండ్ 10 వికెట్లతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
2011 ఫిబ్రవరి 20 (D/N)
స్కోరు
శ్రీలంక 
332/7 (50 ఓవర్లు)
v  కెనడా
122 (36.5 ఓవర్లు)
శ్రీలంక 210 పరుగులతో గెలిచింది
మహీంద రాజపక్ష అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హంబన్‌తోట
2011 ఫిబ్రవరి 21 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
262/6 (50 ఓవర్లు)
v  జింబాబ్వే
171 (46.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 91 పరుగులతో గెలిచింది
నరేంద్ర మోడి స్టేడియం, అహ్మదాబాదు
2011 ఫిబ్రవరి 23 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 
317/7 (50 ఓవర్లు)
v  కెన్యా
112 (33.1 ఓవర్లు)
పాకిస్తాన్ 205 పరుగులతో గెలిచింది
మహీంద రాజపక్ష అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హంబన్‌తోట
2011 ఫిబ్రవరి 25
స్కోరు
న్యూజీలాండ్ 
206 (45.1 ఓవర్లు)
v  ఆస్ట్రేలియా
207/3 (34 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్లతో గెలిచింది
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 ఫిబ్రవరి 26 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 
277/7 (50 ఓవర్లు)
v  శ్రీలంక
266/9 (50 ఓవర్లు)
పాకిస్తాన్ 11 పరుగులతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 ఫిబ్రవరి 28
స్కోరు
జింబాబ్వే 
298/9 (50 ఓవర్లు)
v  కెనడా
123 (42.1 ఓవర్లు)
జింబాబ్వే 175 పరుగులతో గెలిచింది
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 మార్చి 1 (D/N)
స్కోరు
కెన్యా 
142 (43.4 ఓవర్లు)
v  శ్రీలంక
146/1 (18.4 ఓవర్లు)
శ్రీలంక 9 వికెట్లతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 3 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 
184 (43 ఓవర్లు)
v  కెనడా
138 (42.5 ఓవర్లు)
పాకిస్తాన్ 46 పరుగులతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 4 (D/N)
స్కోరు
జింబాబ్వే 
162 (46.2 ఓవర్లు)
v  న్యూజీలాండ్
166/0 (33.3 ఓవర్లు)
న్యూజీలాండ్ 10 వికెట్లతో గెలిచింది
నరేంద్ర మోడి స్టేడియం, అహ్మదాబాదు
2011 మార్చి 5 (D/N)
స్కోరు
శ్రీలంక 
146/3 (32.5 ఓవర్లు)
v  ఆస్ట్రేలియా
No result
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 7 (D/N)
స్కోరు
కెన్యా 
198 (50 ఓవర్లు)
v  కెనడా
199/5 (45.3 ఓవర్లు)
Canada won by 5 wickets
Feroz Shah Kotla Ground, Delhi
2011 మార్చి 8 (D/N)
స్కోరు
న్యూజీలాండ్ 
302/7 (50 ఓవర్లు)
v  పాకిస్తాన్
192 (41.4 ఓవర్లు)
న్యూజీలాండ్ 110 పరుగులతో గెలిచింది
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
2011 మార్చి 10 (D/N)
స్కోరు
శ్రీలంక 
327/6 (50 ఓవర్లు)
v  జింబాబ్వే
188 (39 ఓవర్లు)
శ్రీలంక 139 పరుగులతో గెలిచింది
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
2011 మార్చి 13 (D/N)
స్కోరు
న్యూజీలాండ్ 
358/6 (50 ఓవర్లు)
v  కెనడా
261/9 (50 ఓవర్లు)
న్యూజీలాండ్ 97 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
2011 మార్చి 13 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
324/6 (50 ఓవర్లు)
v  కెన్యా
264/6 (50 ఓవర్లు)
ఆస్ట్రేలియా 60 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 14 (D/N)
స్కోరు
జింబాబ్వే 
151/7 (39.4 ఓవర్లు)
v  పాకిస్తాన్
164/3 (34.1 ఓవర్లు)
పాకిస్తాన్ 7 వికెట్లతో గెలిచింది
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
2011 మార్చి 16 (D/N)
స్కోరు
కెనడా 
211 (45.4 ఓవర్లు)
v  ఆస్ట్రేలియా
212/3 (34.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 18 (D/N)
స్కోరు
శ్రీలంక 
265/9 (50 ఓవర్లు)
v  న్యూజీలాండ్
153 (35 ఓవర్లు)
శ్రీలంక 112 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
2011 మార్చి 19 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
176 (46.4 ఓవర్లు)
v  పాకిస్తాన్
178/6 (41 ఓవర్లు)
పాకిస్తాన్ 4 వికెట్లతో గెలిచింది
ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
2011 మార్చి 20
స్కోరు
జింబాబ్వే 
308/6 (50 ఓవర్లు)
v  కెన్యా
147 (36 ఓవర్లు)
జింబాబ్వే 161 పరుగులతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

గ్రూప్ బి

[మార్చు]
Pos Team Pld W L T NR Pts NRR
1  South Africa 6 5 1 0 0 10 2.026
2 దస్త్రం:Flag of ఇండియా.svg ఇండియా 6 4 1 1 0 9 0.900
3  England 6 3 2 1 0 7 0.072
4  West Indies 6 3 3 0 0 6 1.066
5  Bangladesh 6 3 3 0 0 6 −1.361
6  Ireland 6 2 4 0 0 4 −0.696
7  Netherlands 6 0 6 0 0 0 −2.045
2011 ఫిబ్రవరి 19 (D/N)
స్కోరు
భారతదేశం 
370/4 (50 ఓవర్లు)
v  బంగ్లాదేశ్
283/9 (50 ఓవర్లు)
ఇండియా 87 పరుగులతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 ఫిబ్రవరి 22 (D/N)
స్కోరు
నెదర్లాండ్స్ 
292/6 (50 ఓవర్లు)
v  ఇంగ్లాండు
296/4 (48.4 ఓవర్లు)
ఇంగ్లాండ్ 6 వికెట్లతో గెలిచింది
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 ఫిబ్రవరి 24 (D/N)
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
222 (47.3 ఓవర్లు)
v  దక్షిణాఫ్రికా
223/3 (42.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 7 వికెట్లతో గెలిచింది
Feroz Shah Kotla Ground, Delhi
2011 ఫిబ్రవరి 25 (D/N)
స్కోరు
బంగ్లాదేశ్ 
205 (49.2 ఓవర్లు)
v  ఐర్లాండ్
178 (45 ఓవర్లు)
బంగ్లాదేశ్ 27 పరుగులతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 ఫిబ్రవరి 27 (D/N)
స్కోరు
భారతదేశం 
338 (49.5 ఓవర్లు)
v  ఇంగ్లాండు
338/8 (50 ఓవర్లు)
Match Tied
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 ఫిబ్రవరి 28 (D/N)
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
330/8 (50 ఓవర్లు)
v  నెదర్లాండ్స్
115 (31.3 ఓవర్లు)
వెస్టిండీస్ 215 పరుగులతో గెలిచింది
Feroz Shah Kotla Ground, Delhi
2011 మార్చి 2 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 
327/8 (50 ఓవర్లు)
v  ఐర్లాండ్
329/7 (49.1 ఓవర్లు)
ఐర్లాండ్ 3 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 3
స్కోరు
దక్షిణాఫ్రికా 
351/5 (50 ఓవర్లు)
v  నెదర్లాండ్స్
120 (34.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 231 పరుగులతో గెలిచింది
Punjab Cricket Association IS Bindra Stadium, Mohali
2011 మార్చి 4 (D/N)
స్కోరు
బంగ్లాదేశ్ 
58 (18.5 ఓవర్లు)
v  వెస్ట్ ఇండీస్
59/1 (12.2 ఓవర్లు)
వెస్టిండీస్ 9 వికెట్లతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 మార్చి 6
స్కోరు
ఇంగ్లాండు 
171 (45.4 ఓవర్లు)
v  దక్షిణాఫ్రికా
165 (47.4 ఓవర్లు)
ఇంగ్లాండ్ 6 పరుగులతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
2011 మార్చి 6 (D/N)
స్కోరు
ఐర్లాండ్ 
207 (47.5 ఓవర్లు)
v  భారతదేశం
210/5 (46.0 ఓవర్లు)
ఇండియా 5 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
2011 మార్చి 9 (D/N)
స్కోరు
నెదర్లాండ్స్ 
189 (46.4 ఓవర్లు)
v  భారతదేశం
191/5 (36.3 ఓవర్లు)
ఇండియా 5 వికెట్లతో గెలిచింది
Feroz Shah Kotla Ground, Delhi
2011 మార్చి 11
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
275 (50 ఓవర్లు)
v  ఐర్లాండ్
231 (49 ఓవర్లు)
వెస్టిండీస్ 44 పరుగులతో గెలిచింది
Punjab Cricket Association IS Bindra Stadium, Mohali
2011 మార్చి 11 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 
225 (49.4 ఓవర్లు)
v  బంగ్లాదేశ్
227/8 (49 ఓవర్లు)
బంగ్లాదేశ్ 2 వికెట్లతో గెలిచింది
Zohur Ahmed Chowdhury Stadium, Chittagong
2011 మార్చి 12 (D/N)
స్కోరు
భారతదేశం 
296 (48.4 ఓవర్లు)
v  దక్షిణాఫ్రికా
300/7 (49.4 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 3 వికెట్లతో గెలిచింది (2 balls left)]]
విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం , నాగపూర్
2011 మార్చి 14 (D/N)
స్కోరు
నెదర్లాండ్స్ 
160 (46.2 ఓవర్లు)
v  బంగ్లాదేశ్
166/4 (40.2 ఓవర్లు)
బంగ్లాదేశ్ 6 వికెట్లతో గెలిచింది
Zohur Ahmed Chowdhury Stadium, Chittagong
2011 మార్చి 15 (D/N)
స్కోరు
దక్షిణాఫ్రికా 
272/7 (50 ఓవర్లు)
v  ఐర్లాండ్
141 (33.2 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 131 పరుగులతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
2011 మార్చి 17 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 
243 (48.4 ఓవర్లు)
v  వెస్ట్ ఇండీస్
225 (44.4 ఓవర్లు)
ఇంగ్లాండ్ 18 పరుగులతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
2011 మార్చి 18
స్కోరు
నెదర్లాండ్స్ 
306 (50 ఓవర్లు)
v  ఐర్లాండ్
307/4 (47.4 ఓవర్లు)
ఐర్లాండ్ 6 వికెట్లతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
2011 మార్చి 19
స్కోరు
దక్షిణాఫ్రికా 
284/8 (50 ఓవర్లు)
v  బంగ్లాదేశ్
78 (28 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 206 పరుగులతో గెలిచింది
Sher-e-Bangla National Cricket Stadium, Dhaka
2011 మార్చి 20 (D/N)
స్కోరు
భారతదేశం 
268 (49.1 ఓవర్లు)
v  వెస్ట్ ఇండీస్
188 (43 ఓవర్లు)
ఇండియా 80 పరుగులతో గెలిచింది
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై

నాకౌట్ దశ

[మార్చు]

2011 Cricket World Cup knockout stage

12 March 2011

v

ఫైనల్

[మార్చు]
భారత జట్టు 2011 ప్రపంచ కప్ గెలిచిన సందర్భాన్ని వేడుకగా జరుపుకుంటున్న పుణె అభిమానులు

ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంకల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్‌, ఛాంపియన్‌గా నిలిచింది. భారత కెప్టెన్ MS ధోని 79 బంతుల్లో 91 పరుగులతో అజేయంగా, మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత గౌతమ్ గంభీర్ 97 పరుగులతో కీలకమైన స్కోరును అందించాడు. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు తన చివరి ప్రపంచకప్‌లో ఆడుతున్న సచిన్ టెండూల్కర్‌కు నివాళులర్పించారు. ఫైనల్‌కు ప్రపంచవ్యాప్తంగా 55.8 కోట్ల మంది వీక్షించారు. [32]

గణాంకాలు

[మార్చు]
Leading run scorers
పరుగులు ఆటగాడు జట్టు మ్యాచ్‌లు
500 దిల్షాన్, తిలకరత్నేతిలకరత్నే దిల్షాన్  శ్రీలంక 9
482 టెండూల్కర్, సచిన్సచిన్ టెండూల్కర్  భారతదేశం 9
465 సంగక్కర, కుమారకుమార సంగక్కర  శ్రీలంక 9
422 ట్రాట్, జోనాథన్జోనాథన్ ట్రాట్  ఇంగ్లాండు 7
395 చందన, ఉపుల్ఉపుల్ చందన  శ్రీలంక 8


Leading wicket takers
వికెట్లు ఆటగాడు జట్టు మ్యాచ్‌లు
21 అఫ్రిది, షహీద్షహీద్ అఫ్రిది  పాకిస్తాన్ 8
21 ఖాన్, జహీర్జహీర్ ఖాన్  భారతదేశం 9
18 సౌథీ, టిమ్టిమ్ సౌథీ  న్యూజీలాండ్ 8
15 పీటర్సన్, రాబిన్రాబిన్ పీటర్సన్  దక్షిణాఫ్రికా 7
15 సింగ్, యువరాజ్యువరాజ్ సింగ్  భారతదేశం 9

వివాదాలు

[మార్చు]
 • మార్చి 4న ఢాకాలో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన తర్వాత, తమ హోటల్‌కు తిరిగి వెళ్తున్న వెస్టిండీస్ జట్టు బస్సుపై బంగ్లాదేశ్ అభిమానులు రాళ్లు విసిరారు. రాళ్ళు విసిరేవారు దాన్ని బంగ్లాదేశ్ టీమ్ బస్సు అనుకున్నారని తర్వాత వాదనలు వినిపించాయి.[33] దాడి తర్వాత బంగ్లాదేశ్‌లోని ఎలైట్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ 38 మందిని అరెస్టు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ను క్షమాపణలు కోరారు. [34]
 • పాకిస్థాన్ జట్టు అర్హత సాధిస్తే ముంబైలో జరిగే ఫైనల్‌కు అంతరాయం కలిగిస్తామని రాజకీయ పార్టీ శివసేన బెదిరించింది. [35]
 • భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో, ఇయాన్ బెల్ లెగ్ బిఫోర్ వికెట్‌ అయినప్పటికీ, అతనికి నాటౌట్ ఇచ్చారు. భారత కెప్టెన్ MS ధోని ఈ నిర్ణయాన్ని టీవీ అంపైర్‌కు నివేదించాడు. బంతి స్టంపులనుండి 2.5 m (8 ft 2 in) కంటే దూరాన బెల్‌ను తాకడంతో అంపైరు నిర్ణయాన్నే ధృవీకరించారు. అంత దూరాన స్టంప్‌లలో ఉండే హాక్-ఐ వ్యవస్థ విశ్వసనీయత ఆమోదయోగ్యమైన స్థాయిల కంటే తక్కువగా ఉంటుంది. ఈ నిబంధన వల్ల తన జట్టుకు రావాల్సిన వికెట్ రాకుండా పోయిందని ధోని ఆ తర్వాత ఫిర్యాదు చేశాడు. [36] అనంతరం నిబంధనలను సవరించి అంపైర్లకు కొత్త మార్గదర్శకాలను అందించారు. [37] టోర్నమెంట్ జరుగుతూండగా, 2.5 మీటర్ల నిబంధనను మార్చడాన్ని శ్రీలంక కెప్టెన్, కుమార సంగక్కర తరువాత విమర్శించాడు. [38]
 • భారత్-శ్రీలంక ల మధ్య జరిగిన ఫైనల్‌లో భారత కెప్టెన్ ధోనీ నాణేన్ని టాస్ చేయగా, శ్రీలంక కెప్టెన్ సంగక్కర పిలుపు ప్రేక్షకుల గోలలో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోకు వినబడలేదు. టాస్ మళ్లీ చేయాల్సి వచ్చింది - ఇది చాలా అసాధారణమైన సంఘటన, ముఖ్యంగా ప్రపంచ కప్ ఫైనల్ వంటి ప్రముఖ ఈవెంట్లో. [39]
 • 2020 జూన్‌లో, ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందనీ, శ్రీలంక, ఆ మ్యాచ్‌ను భారత్‌కు అమ్మేసుకుందనీ ఆరోపణలు వచ్చాయి.[40] శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద అలుత్‌గమాగే మాట్లాడుతూ, '2011 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్సింగు చేసారు. నేను చెప్పేదానికి కట్టుబడి ఉంటాను. నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగింది." [41] అంతకుముందు, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఫైనల్ ఫిక్స్ అయ్యిందనీ, ఈ విషయంపై విచారణ జరపాలనీ డిమాండ్ చేశాడు. [42] అయితే, 2020 జూలైలో ఆరోపణలను ధృవీకరించే సహాయక సాక్ష్యాధారాలేమీ లభించనందున దర్యాప్తును నిలిపివేసారు.[43] ఫైనల్ మ్యాచ్ సమగ్రతను అనుమానించడానికి తమకు ఎటువంటి కారణం దొరకలేదని ఐసిసి పేర్కొంది. [44]

మీడియాలో

[మార్చు]
 • ఈ ఫైనల్ మ్యాచ్ ఫుటేజీని MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016) సినిమా నిర్మాతలు మేకర్స్ కొనుగోలు చేసి, తమ చిత్రంలో ఉపయోగించారు. ఇది భారత కెప్టెన్ ఎంఎస్ ధోని ఆధారంగా బాలీవుడ్ చిత్రం. [45]

మూలాలు

[మార్చు]
 1. Sri Lanka won the 1996 World Cup as co-hosts, but the final was played in Pakistan .
 2. India beat Sri Lanka to win ICC World Cup 2011 Archived 16 సెప్టెంబరు 2018 at the Wayback Machine Times of India. Retrieved 20 November 2011
 3. Yuvraj Singh named man of the tournament Archived 28 డిసెంబరు 2011 at the Wayback Machine Times of India. Retrieved 21 November 2011
 4. "2011 World Cup Schedule". from CricketWorld4u. Archived from the original on 4 October 2009. Retrieved 7 October 2009.
 5. "Opening ceremony of 2011 World Cup on Feb 17 in Bangladesh: ICC". Daily News and Analysis. PTI. 2 September 2009. Archived from the original on 6 September 2009. Retrieved 31 December 2010.
 6. "Final World Cup positions secured". BBC. 17 April 2009. Archived from the original on 18 April 2009. Retrieved 17 April 2009.
 7. "No World Cup matches in Pakistan". BBC. 18 April 2009. Archived from the original on 18 April 2009. Retrieved 17 April 2009.
 8. "World Cup shifts base from Lahore to Mumbai". Cricinfo. Archived from the original on 30 April 2009. Retrieved 17 April 2009.
 9. "Pakistan counts cost of Cup shift". BBC. 18 April 2009. Archived from the original on 18 April 2009. Retrieved 18 April 2009.
 10. "Pakistan nears solution to World Cup dispute". AFP. 31 July 2009. Archived from the original on 9 May 2010. Retrieved 31 July 2009.
 11. New format for World Cup Archived 10 ఫిబ్రవరి 2011 at the Wayback Machine Sky Sports. Retrieved 10 December 2009.
 12. "World Cup matches moved out of Pakistan". Cricinfo. Archived from the original on 22 April 2009. Retrieved 17 April 2009.
 13. Pakistan loses 2011 World Cup Archived 19 జనవరి 2012 at the Wayback Machine Sky Sports. Retrieved 2 December 2009
 14. "Cricket-Pakistan counts financial losses of World Cup shift". Reuters. 18 April 2009. Archived from the original on 31 March 2012. Retrieved 2 July 2012.
 15. "PCB issues legal notice to ICC". Content.cricinfo.com. Pakistan Cricket News. 9 May 2009. Archived from the original on 19 January 2012. Retrieved 2 July 2012.
 16. "ICC clears air over PCB's claims". Cricinfo. Archived from the original on 16 May 2009. Retrieved 15 May 2009.
 17. "Pakistan discusses two World Cup options". Cricinfo. Archived from the original on 19 May 2009. Retrieved 17 May 2009.
 18. "Over 180 countries to view WC". Daily News. 18 February 2011. Archived from the original on 21 February 2011. Retrieved 23 June 2011.
 19. "135 mn saw World Cup final: TAM", Hindustan Times, 10 April 2011, archived from the original on 13 April 2011, retrieved 19 April 2011
 20. 20.0 20.1 "World Cup final had highest rating: TAM". Economic Times. Archived from the original on 13 February 2015. Retrieved 13 February 2015.
 21. "World Cup win shatters all records as 67.6mn tune in". Hindustan Times. 3 April 2011. Archived from the original on 7 April 2011.
 22. Arora, Rajat (4 April 2011). "India-Sri Lanka ICC World Cup Final match breaks all TRP records". Best Media Info. Archived from the original on 2 April 2015. Retrieved 27 March 2015.
 23. "Sachin Tendulkar to be event ambassador for ICC world cup 2011". ICC. Archived from the original on 25 January 2011. Retrieved 19 January 2011.
 24. "2011 World Cup mascot to be called 'Stumpy'". NDTVSports.com. NDTV Cricket. 2 August 2010. Archived from the original on 8 April 2015. Retrieved 2 July 2012.
 25. First Look: Mascot for 2011 Cricket World Cup by Rediff Sport Archived 9 ఏప్రిల్ 2010 at the Wayback Machine. Retrieved 2 April 2010.
 26. "ICC to name ICC Cricket World Cup 2011 mascot on 2 August". International Cricket Council. 20 July 2010. Archived from the original on 6 April 2012. Retrieved 2 August 2010.
 27. Prize Money for ICC Cricket World Cup 2011 confirmed Archived 2 ఏప్రిల్ 2015 at the Wayback Machine by the ICC. Retrieved 10 November 2014.
 28. "India unveil eight World Cup venues". Agence France-Presse. 14 October 2009. Archived from the original on 12 April 2010. Retrieved 17 October 2009.
 29. "CWC 2011 Venue". International Cricket Council. Archived from the original on 13 April 2010. Retrieved 10 March 2010.
 30. Warm up matches schedule. Archived 23 జనవరి 2011 at the Wayback Machine Cricinfo. Retrieved 1 February 2011.
 31. World Cup Warm up matches schedule. Archived 25 జనవరి 2011 at the Wayback Machine Yahoo! Cricket. Retrieved 1 February 2011.
 32. "Will a billion people watch the Champions Trophy final?". ESPNcricinfo. Retrieved 2022-03-10.
 33. West Indies team bus stoned in Dhaka Archived 9 మార్చి 2011 at the Wayback Machine. Espncricinfo.com. Retrieved 3 August 2011.
 34. "Bangladeshi Fans stone bus of WI Team". Cricket Blog. 6 March 2011. Archived from the original on 20 September 2012. Retrieved 25 March 2011.
 35. "Shiv Sena threat over ICC CWC final". ESPN STAR. Archived from the original on 19 July 2012.. Espnstar.Com (17 February 2011). Retrieved 3 August 2011.
 36. "Dhoni angered by UDRS ruling". ESPNcricinfo. ESPN Sports Media. 27 February 2011. Archived from the original on 15 August 2011. Retrieved 3 August 2011.
 37. Ugra, Sharda (6 March 2011). "ICC tweaks 2.5 metre DRS rule for 'consistency'". ESPNcricinfo. ESPN Sports Media. Archived from the original on 27 June 2015. Retrieved 15 February 2015.
 38. "Sangakkara slams ICC for changing 2.5 meter UDRS rule during World Cup". The Times of India. 8 March 2011. Archived from the original on 30 May 2017. Retrieved 15 February 2015.
 39. "India v Sri Lanka: Toss taken twice after confusion over call". ESPNcricinfo. ESPN Sports Media. 2 April 2011. Archived from the original on 4 April 2015. Retrieved 3 August 2011.
 40. "Sri Lanka "Sold" 2011 Cricket World Cup Final, Says Former Sports Minister | Cricket News". NDTVSports.com.
 41. "2011 ICC World Cup final between India and Sri Lanka was fixed, claims former SL Sports Minister". www.timesnownews.com.
 42. "Arjuna Ranatunga says India vs Sri Lanka World Cup final was fixed, wants probe". Hindustan Times. 14 July 2017.
 43. "Investigation into Sri Lanka's 2011 World Cup final defeat dropped". ESPN Cricinfo. Retrieved 3 July 2020.
 44. "Statement from Alex Marshall - General Manager, ICC ACU". International Cricket Council. Retrieved 3 July 2020.
 45. "Makers of MS Dhoni: The Untold Story purchase the footage of 2011's World ..." Bollywood Hungama.