టిమ్ సౌథీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టిమ్ సౌథీ
2009 లో సౌతీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
టిం గ్రాంట్ సౌథీ
పుట్టిన తేదీ (1988-12-11) 1988 డిసెంబరు 11 (వయసు 35)
వంగారే, నార్త్‌లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రBowling ఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 237)2008 మార్చి 22 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2023 మార్చి 17 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 150)2008 జూన్ 15 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2023 జనవరి 13 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.38
తొలి T20I (క్యాప్ 30)2008 ఫిబ్రవరి 5 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 5 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.38
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–presentనార్దర్న్ డిస్ట్రిక్ట్స్
2011చెన్నై సూపర్ కింగ్స్
2011ఎసెక్స్
2014–2015రాజస్థాన్ రాయల్స్
2016–2017ముంబై ఇండియన్స్
2017మిడిల్‌సెక్స్
2018–2019రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2021–presentకోల్‌కతా నైట్‌రైడర్స్
2023London Spirit
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I FC
మ్యాచ్‌లు 94 154 112 135
చేసిన పరుగులు 1,976 720 280 2,803
బ్యాటింగు సగటు 16.06 12.41 11.20 16.68
100లు/50లు 0/6 0/1 0/0 1/8
అత్యుత్తమ స్కోరు 77* 55 39 156
వేసిన బంతులు 21,608 7,751 2,447 28,994
వికెట్లు 370 210 142 534
బౌలింగు సగటు 28.98 33.46 23.47 26.86
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 15 3 1 26
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 1
అత్యుత్తమ బౌలింగు 7/64 7/33 5/18 8/27
క్యాచ్‌లు/స్టంపింగులు 73/– 43/– 56/– 86/–
మూలం: ESPNcricinfo, 01 September 2023

తిమోతీ గ్రాంట్ సౌథీ (జననం 1988 డిసెంబరు 11), న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఆటలోని అన్ని ఫార్మాట్లలో ఆడే అంతర్జాతీయ క్రికెటరు. న్యూజీలాండ్ టెస్టు జట్టుకు అతను కెప్టెన్, T20I జట్టుకు వైస్ కెప్టెన్. అతను కుడి-చేతి ఫాస్ట్-మీడియం బౌలరు, బాగా షాట్లు కొట్టే దిగువ వరుస బ్యాటరు. 300 టెస్టు వికెట్లు తీసిన మూడవ న్యూజిలాండ్ బౌలరు. 2008 ఫిబ్రవరిలో 19 సంవత్సరాల వయస్సులో రంగప్రవేశం చేసిన దేశంలోని అతి పిన్న వయస్కులలో ఒకడు. ఇంగ్లండ్‌పై టెస్టు రంగప్రవేశం చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 40 బంతుల్లో 77 పరుగులు చేయడమే గాక, 5 వికెట్లు పడగొట్టాడు. [1] అతను ప్లంకెట్ షీల్డ్, ఫోర్డ్ ట్రోఫీ, సూపర్ స్మాష్‌లలో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున అలాగే హాక్ కప్‌లో నార్త్‌ల్యాండ్‌కు ఆడతాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి T20Iకి అతను న్యూజిలాండ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[2] ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. [3] సౌథీ 2019–2021 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడు.

సౌథీ చురుకైన వేగంతో లేట్ అవుట్‌స్వింగ్‌ని సృష్టించగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. తర్వాత తడిగా ఉన్న వికెట్‌పై, చివరి ఓవర్లలో, వేగంగా వేసే ఆఫ్ స్పిన్నరు లాగా స్లో కట్టర్లను వేస్తాడు. అతను 2011 ఐసిసి ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలరు (17.33 సగటుతో 18 వికెట్లు). 2015 ఐసిసి ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి, ఆకట్టుకున్నాడు. [4] ఈ ప్రదర్శనను విస్డెన్, ఆ దశాబ్దపు వన్‌డే స్పెల్‌గా పేర్కొంది. [5]

జీవితం తొలినాళ్ళు

[మార్చు]

సౌథీ న్యూజిలాండ్‌లోని వాంగరేలో జన్మించాడు. నార్త్‌ల్యాండ్‌లో పెరిగాడు. అతను వాంగరే బాయ్స్ హై స్కూల్, కింగ్స్ కాలేజీ, ఆక్లాండ్‌లో చదువుకున్నాడు. పాఠశాలలో ఉన్నప్పుడు, అతను ఆక్లాండ్ సెకండరీ స్కూల్, నార్తర్న్ రీజియన్ జట్లకు ప్రతినిధి రగ్బీ ఆడుతూ క్రికెట్, రగ్బీ రెండింటిలోనూ రాణించాడు. [6]

సౌథీ బ్రయా ఫాహీని వివాహం చేసుకున్నాడు. [7] ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. [8] [9]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

సౌథీ తన అంతర్జాతీయ కెరీర్‌ను న్యూజిలాండ్‌కు ఆడిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా ప్రారంభించాడు. అతను మూడు ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ జట్టులో సాధారణ సభ్యుడిగా మారాడు.

న్యూజిలాండ్‌కు తొలి ట్వంటీ20 మ్యాచ్‌లు

[మార్చు]

సౌథీ యూత్ క్రికెట్ ఆడుతున్నప్పుడు న్యూజిలాండ్ సెలెక్టర్లు, కోచ్‌లు అతనిపై చాలా ఆసక్తిని కనబరిచారు. 2007లో జాతీయ బౌలింగ్ కోచ్ డేల్ హాడ్లీ అతన్ని భారత్‌కు తీసుకెళ్లాడు. అక్కడ డెన్నిస్ లిల్లీ తన చిన్నతనంలో సౌథీ ప్రతిభను గ్లెన్ మెక్‌గ్రాత్‌తో పోల్చాడని హాడ్లీ తర్వాత చెప్పాడు. న్యూజిలాండ్ క్రికెట్ సెలక్షన్ మేనేజర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ సోదరుడు హాడ్లీ కూడా "రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో సౌథీని తీసుకునే అవకాశం గురించి బ్లాక్ క్యాప్స్ కోచ్ జాన్ బ్రేస్‌వెల్ చెవిలో గుసగుసలాడుతున్నట్లు" చెప్పాడు. [10]


సౌథీ అంతర్జాతీయ రంగప్రవేశం అతను న్యూజిలాండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడిన రెండు సంవత్సరాల తర్వాత, 2008 ఫిబ్రవరి 5న ఆక్లాండ్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో అతను 1/38 తీసుకున్నాడు. [11] రెండో మ్యాచ్‌లో, సౌథీ నాలుగు ఓవర్లలో 2/22తో న్యూజిలాండ్‌కు అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. [12]

ఆ తర్వాత జరిగిన మొదటి మూడు వన్డే మ్యాచ్‌లకు న్యూజిలాండ్ జట్టులో చాలా వరకు మార్పులేమీ లేకుండా ఉంది. అయితే సౌథీ మాత్రం మలేషియాలో జరిగిన 2008 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం జాతీయ అండర్-19 జట్టులో తిరిగి చేరాడు. [13]

టెస్టు మ్యాచ్‌ రంగప్రవేశం

[మార్చు]

సౌథీ 2008 అండర్-19 ప్రపంచ కప్ నుండి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. అప్పటికి వన్డే సిరీస్ ముగిసింది కానీ మూడు మ్యాచ్‌ల టెస్టు సీరీస్ ప్రారంభం కానుంది. నేపియర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో గాయం కారణంగా కైల్ మిల్స్ తప్పుకున్నప్పుడు, సౌథీ జట్టులోకి తీసుకున్నారు. 2008 మార్చి 22న, కేవలం 19 సంవత్సరాల 102 రోజుల వయస్సులో, తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అతను న్యూజిలాండ్ తరఫున టెస్టులు ఆడిన పిన్నవయస్కులలో అతను ఏడవవాడు.[14]

2011 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యమిచ్చిన 2011 ప్రపంచకప్‌లో సౌథీ 17.33 సగటుతో 18 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలరు ( షాహిద్ అఫ్రిది, జహీర్ ఖాన్ సంయుక్తంగా వికెట్ టేకర్లలో అగ్రస్థానంలో ఉన్నారు). "టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్" [15] లో ఐసిసి అతన్ని 12వ ఆటగాడిగా చేర్చింది.[16] అతను న్యూజిలాండ్ ఎనిమిది మ్యాచ్‌లలో ఏడింటిలో బౌలింగ్ ప్రారంభించాడు. మరొకదానిలో మొదటి మార్పులో రంగం లోకి దిగాడు. న్యూజిలాండ్ ఆ టోర్నమెంట్‌లో 12 మంది బౌలర్లను ఉపయోగించింది. అన్ని మ్యాచ్‌లలోనూ బౌలింగు చేసినది సౌథీ, నాథన్ మెకల్లమ్ ఇద్దరే. [17]

చివరికి సెమీ-ఫైనలిస్టులు పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంలో సౌథీ అత్యుత్తమ గణాంకాలు వచ్చాయి. అతను 3/25 తీసుకున్నాడు. ఔటైన బ్యాట్స్‌మన్లందరూ మొదటి ఐదు స్థానాల్లో ఆడినవాళ్ళే. [18] సౌథీ కెన్యా, జింబాబ్వే, శ్రీలంకతో రెండుసార్లు మూడేసి వికెట్ల చొప్పున తీసాడు. న్యూజిలాండ్ ఆడిన అన్ని మ్యాచ్‌లలో వికెట్లు తీశాడు - గ్రూప్ దశలలో, మొదటి సెమీ-ఫైనల్‌లోనూ. [19]


న్యూజిలాండ్ జట్టు జనవరి 2011 నుండి దక్షిణాఫ్రికా మాజీ ఫాస్టు బౌలర్ అలన్ డొనాల్డ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ప్రపంచ కప్‌లో సౌథీ అభివృద్ధికి, విజయానికీ దోనాల్డ్ కృషి చాలా దోహదపడింది. టోర్నమెంటు ముగిసే సమయానికి డొనాల్డ్, ప్రపంచ క్రికెట్‌లో సౌథీ అత్యుత్తమ స్వింగ్ బౌలరు కాగలడని అంచనా వేసాడు: [20]

2014-15, క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

2014 మొదటి అర్ధభాగంలో, సౌథీ ప్రపంచంలోని అత్యుత్తమ న్యూ బాల్ బౌలర్‌లలో ఒకరిగా తనను తాను స్థిరపరచుకోవడం కొనసాగించాడు, న్యూజిలాండ్‌ పర్యటించిన భారత జట్టుపై 11 వికెట్లతో వరుస స్థిరమైన ప్రదర్శనలతో టెస్టు సిరీస్ విజయానికి బాటలు వేసాడు. వెస్టిండీస్ పర్యటనలో న్యూజిలాండ్ బౌలర్లను మరోసారి ముందుండి నడిపించాడు. సౌథీ మళ్లీ 11 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ 12 ఏళ్ల తర్వాత ప్రధాన ప్రత్యర్థిపై తమ తొలి విదేశీ సిరీస్‌ను గెలుచుకుంది. పర్యటన ముగిసే సమయానికి, సౌథీ ఐసిసి ప్రపంచ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానానికి చేరుకున్నాడు. 2014లో అతని ప్రదర్శనకు, అతను ఐసిసి వరల్డ్ టెస్టు XIలో ఎంపికయ్యాడు. [21]

వెల్లింగ్‌టన్‌లో జరిగిన 2015 క్రికెట్ ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్‌లో, అతను ఇంగ్లాండ్‌పై 7/33తో తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను అందుకున్నాడు. ప్రత్యర్థులు 123 పరుగులకే ఆలౌటయ్యారు. సౌథీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో బ్లాక్ క్యాప్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. [22]

కెప్టెన్సీ

[మార్చు]

వెస్టిండీస్‌తో జరిగిన మొదటి T20Iకి సౌథీని స్టాండ్-ఇన్ T20I కెప్టెన్‌గా నియమించారు. 2017 డిసెంబరు 29న, అతను తన T20I కెప్టెన్సీ రంగప్రవేశం చేసాడు. [23] అతని కెప్టెన్సీలో న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచింది. [24] [25] కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరం కావడంతో సౌథీ మళ్లీ పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20కి న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. [26]

గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు నుంచి తప్పుకోవడంతో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సౌథీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 28న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, సౌథీ న్యూజిలాండ్‌కు వన్డే కెప్టెన్సీ మొదలుపెట్టాడు [27] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [28] [29] 2019 ఆగస్టులో, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో అతను న్యూజిలాండ్‌కు స్టాండ్-ఇన్ T20I కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [30] 2019 అక్టోబరులో, కేన్ విలియమ్సన్ తుంటి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన T20I సిరీస్‌కు దూరమయ్యాడు, [31] సౌథీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [32]


మొదటి టెస్టులో ఓటమి తర్వాత, 2023 ఫిబ్రవరి 28న ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌ను ఫాలో-ఆన్ చేయమని కోరిన తర్వాత ఇది జరిగింది. వెస్టిండీస్ తర్వాత, ఇంత తేడాతో టెస్టు మ్యాచ్‌ను గెలిచిన రెండవ జట్టుగా, ఫాలో-ఆన్ తర్వాత నాలుగోసారి గెలిచిన జట్టుగా అవతరించింది.

ఆట తీరు

[మార్చు]

సౌథీ, కుడిచేతి మీడియం ఫాస్టు అవుట్-స్వింగ్ బౌలరు. [33] తోటి కొత్త-బంతి బౌలరు ట్రెంట్ బౌల్ట్ అంత వేగం సౌథీలో లేనప్పటికీ, సౌథీ లోని ఖచ్చితత్వం, బాగా వైవిధ్యం వలన బౌలింగు దాడికి నిజమైన నాయకుడిగా అవతరించాడు. 2008లో సౌథీ మొదటిసారిగా జాతీయ జట్టులో ఎంపికైనప్పుడు రిచర్డ్ హ్యాడ్లీ అతని గురించి "అతను సూటిగా పరుగెత్తుతాడు. చక్కటి యాక్షనుంది. అతను బంతిని బ్యాటరు నుండి దూరంగా మళ్ళిస్తాడు" అని పేర్కొన్నాడు. [34] అతను బౌల్ట్‌తో కొత్త ఓపెనింగ్ బౌలింగ్ అటాక్ భాగస్వామ్యాన్ని కూడా స్థాపించాడు , [35] [36] 2013 నుండి పడిన మొత్తం వికెట్లలో వాళ్ళిద్దరే 46% తీసుకున్నారి - ముఖ్యంగా క్రిస్ మార్టిన్ రిటైరైన తరువాత. [37] సీమింగ్ పరిస్థితుల్లో లేదా పాత బాల్‌తో బౌలింగ్ చేయడంలో, అతను ఎక్కువ క్రాస్-సీమ్ డెలివరీలను బౌలింగ్ చేస్తాడు. తడిగా ఉన్న పిచ్‌లలో, అతను వేగవంతమైన ఆఫ్ స్పిన్‌కు సమానమైన కట్టర్‌లను వేస్తాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వికెట్ల పంటలు

[మార్చు]

సౌథీ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 సార్లు ఐదు వికెట్ల పంట తీసాడు. 2008లో నేపియర్‌లోని మెక్లీన్ పార్క్‌లో ఇంగ్లండ్‌పై తన తొలి టెస్టు ఆడుతూ, తొలి ఇన్నింగ్స్‌లో 5/55 తో టెస్టు రంగప్రవేశంలోనే ఐదు వికెట్లు తీసిన ఆరో న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. [38] [39] టెస్టుల్లో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ గణాంకాలు 7/64. 2012లో బెంగుళూరులో భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకున్నాడు [40]

అతని అత్యుత్తమ వన్‌డే గణాంకాలు 2015 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్‌పై అతను చేసిన 7/33. [41] [42] T20Iలో అతని అత్యుత్తమ గణాంకాలు 5/18, 2010లో పాకిస్తాన్‌పై సాధించాడు.[43]

Five-wicket hauls in Test matches[44]
నం. తేదీ వేదిక ప్రత్యర్థి ఇన్నిం ఓవర్లు పరుగులు వికెట్లు ఫలితం
1 2008 మార్చి 22 మెక్లీన్ పార్క్, నేపియర్  ఇంగ్లాండు &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&023.10000023.1 &&&&&&&&&&&&&055.&&&&&055 5 ఓడిపోయారు[39]
2 2012 ఆగస్టు 31 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు  భారతదేశం &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&024.&&&&&024 &&&&&&&&&&&&&064.&&&&&064 7 ఓడిపోయారు[40]
3 2012 నవంబరు 25 పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో  శ్రీలంక &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&022.&&&&&022 &&&&&&&&&&&&&062.&&&&&062 5 గెలిచారు[45]
4 2013 మే 16 లార్డ్స్, లండన్  ఇంగ్లాండు &&&&&&&&&&&&&&03.&&&&&03 &&&&&&&&&&&&&019.&&&&&019 &&&&&&&&&&&&&050.&&&&&050 6 ఓడిపోయారు[46]
5 2016 నవంబరు 25 సెడాన్ పార్క్, హామిల్టన్  పాకిస్తాన్ &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&021.&&&&&021 &&&&&&&&&&&&&080.&&&&&080 6 గెలిచారు[47]
6 2017 జనవరి 20 హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్  బంగ్లాదేశ్ &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&028.30000028.3 &&&&&&&&&&&&&094.&&&&&094 5 గెలిచారు[48]
7 2018 మార్చి 30 హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్  ఇంగ్లాండు &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&026.&&&&&026 &&&&&&&&&&&&&062.&&&&&062 6 డ్రా అయింది[49]
8 2018 డిసెంబరు 15 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్  శ్రీలంక &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&027.&&&&&027 &&&&&&&&&&&&&068.&&&&&068 6 డ్రా అయింది[50]
9 2019 డిసెంబరు 12 పెర్త్ స్టేడియం, పెర్త్  ఆస్ట్రేలియా &&&&&&&&&&&&&&03.&&&&&03 &&&&&&&&&&&&&021.10000021.1 &&&&&&&&&&&&&069.&&&&&069 5 ఓడిపోయారు[51]
10 2020 ఫిబ్రవరి 21 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్  భారతదేశం &&&&&&&&&&&&&&03.&&&&&03 &&&&&&&&&&&&&021.&&&&&021 &&&&&&&&&&&&&061.&&&&&061 5 గెలిచారు[52]
11 2020 డిసెంబరు 11 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్  వెస్ట్ ఇండీస్ &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&017.40000017.4 &&&&&&&&&&&&&032.&&&&&032 5 గెలిచారు[53]
12 2021 జూన్ 2 లార్డ్స్, లండన్  ఇంగ్లాండు &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&025.10000025.1 &&&&&&&&&&&&&043.&&&&&043 6 డ్రా అయింది[54]
13 2021 నవంబరు 25 గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్  భారతదేశం &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&027.40000027.4 &&&&&&&&&&&&&069.&&&&&069 5 డ్రా అయింది[55]
14 2022 ఫిబ్రవరి 17 హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్  దక్షిణాఫ్రికా &&&&&&&&&&&&&&03.&&&&&03 &&&&&&&&&&&&&017.40000017.4 &&&&&&&&&&&&&035.&&&&&035 5 గెలిచారు[56]
వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఐదు వికెట్ల హల్‌లు [57]
నం. తేదీ వేదిక ప్రత్యర్థి ఇన్నిం ఓవర్లు పరుగులు వికెట్లు ఫలితం
1 2011 జనవరి 22 వెల్లింగ్టన్ రీజినల్ స్టేడియం, వెల్లింగ్టన్  పాకిస్తాన్ &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&09.3000009.3 &&&&&&&&&&&&&033.&&&&&033 5 గెలిచింది [58]
2 2015 ఫిబ్రవరి 20 వెల్లింగ్టన్ రీజినల్ స్టేడియం, వెల్లింగ్టన్  ఇంగ్లాండు &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&09.&&&&&09 &&&&&&&&&&&&&033.&&&&&033 7 గెలిచింది [41]
3 2019 ఫిబ్రవరి 20 యూనివర్శిటీ ఓవల్, డునెడిన్  బంగ్లాదేశ్ &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&&09.2000009.2 &&&&&&&&&&&&&065.&&&&&065 6 గెలిచింది [59]
T20Iలలో ఐదు వికెట్ల ప్రదర్శన [60]
నం. తేదీ వేదిక ప్రత్యర్థి ఇన్నిం ఓవర్లు పరుగులు వికెట్లు ఫలితం
1 2010 డిసెంబరు 26 ఈడెన్ పార్క్, ఆక్లాండ్  పాకిస్తాన్ &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&04.&&&&&04 &&&&&&&&&&&&&018.&&&&&018 5 గెలిచింది [61]
2 2023 ఆగస్టు 17 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&04.&&&&&04 &&&&&&&&&&&&&025.&&&&&025 5 గెలిచింది [62]

మూలాలు

[మార్చు]
  1. "Tim Southee". Cricinfo. Retrieved 2019-05-29.
  2. "Kitchen called up for WI T20s, Guptill returns". ESPN Cricinfo. 23 December 2017. Retrieved 23 December 2017.
  3. "1st T20I, West Indies tour of New Zealand at Nelson, Dec 29 2017". ESPNcricinfo. 29 December 2017. Retrieved 29 December 2017.
  4. "Tim Southee Biography, Achievements, Career Info, Records & Stats - Sportskeeda". www.sportskeeda.com (in ఇంగ్లీష్). Retrieved 2019-05-29.
  5. "Men's ODI Spell Of The Decade, No.1: Tim Southee Picks Super Seven". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-12-12. Retrieved 2020-03-06.
  6. "Timothy Grant Southee (official Black Caps profile)". blackcaps.co.nz. New Zealand Cricket. Archived from the original on 2014-10-05. Retrieved 2023-09-12.
  7. "tim_southee on Instagram". Archived from the original on 11 ఏప్రిల్ 2023. Retrieved 12 సెప్టెంబరు 2023.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Birth announcement of first daughter". Instagram. Archived from the original on 11 ఏప్రిల్ 2023. Retrieved 12 సెప్టెంబరు 2023.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Birth announcement of second daughter". Instagram. Archived from the original on 18 ఏప్రిల్ 2023. Retrieved 12 సెప్టెంబరు 2023.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Hadlee scouts bowling talent". The Nelson Mail / stuff.co.nz (Fairfax Media). 1 February 2008.
  11. Scorecard – New Zealand v England Twenty20 in Auckland, New Zealand, 5 February 2008
  12. Scorecard – New Zealand v England Twenty20 in Christchurch, New Zealand, 7 February 2008
  13. "Fresh talent added for Black Caps". TVNZ. 30 January 2008.
  14. "Southee "a natural", says Vettori". stuff.co.nz (Farifax Media). 22 March 2008.
  15. "Cricket: Southee 12th man in tournament team". New Zealand Herald. 4 April 2011.
  16. 2011 World Cup records – Most wickets (on ESPNCricinfo.com)
  17. Statistics – New Zealand bowlers at the 2011 ICC World Cup (on ESPNCricinfo.com)
  18. Scorecard – New Zealand def. Pakistan, match 24 (group A), ICC 2011 World Cup, Kandy (Sri Lanka), 8 March 2011
  19. Statistics – Tim Southee at the 2011 ICC World Cup (on ESPNCricinfo.com)
  20. "Southee could lead NZ attack – Allan Donald". stuff.co.nz (Fairfax Media). 27 March 2011.
  21. "Johnson takes top honours at LG ICC Awards 2014". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2019-09-04.
  22. Hoult, Nick. "Tim Southee claims 7–33 as England humiliated by New Zealand in Cricket World Cup thrashing in Wellington". Retrieved 20 February 2015.
  23. "Kitchen expected to debut for Black Caps". Otago Daily Times. 29 December 2017. Retrieved 29 December 2017.
  24. "Black Caps seamer Tim Southee doesn't need captaincy role long-term". Stuff Limited. Retrieved 28 February 2017.
  25. "Captain Tim Southee's 100 per cent record continues: 'it's pretty easy when they play like that'". Stuff Limited. Retrieved 28 February 2017.
  26. "Kane Williamson ruled out of Twenty20 against Pakistan, Tim Southee to captain Black Caps". Stuff. 22 January 2018. Retrieved 22 January 2018.
  27. "England level series with domineering win". ESPN Cricinfo. Retrieved 28 February 2017.
  28. "Sodhi and Blundell named in New Zealand World Cup squad". ESPN Cricinfo. 2 April 2019. Retrieved 3 April 2019.
  29. "Uncapped Blundell named in New Zealand World Cup squad, Sodhi preferred to Astle". International Cricket Council. Retrieved 3 April 2019.
  30. "Kane Williamson, Trent Boult rested for Sri Lanka T20Is; Tim Southee to lead". ESPN Cricinfo. Retrieved 20 August 2019.
  31. "Kane Williamson out of New Zealand's T20 series against England". Sky Sports. Retrieved 25 October 2019.
  32. "Kane Williamson: New Zealand captain out of England T20 series with injury". BBC Sport. Retrieved 25 October 2019.
  33. Gollapudi, Nagraj (23 March 2011). "'You've got to have skills but you also need attitude'". Cricinfo. Retrieved 23 March 2011.
  34. Barclay, Chris (31 January 2008). "Cricket: Southee prepares for tough examination". The New Zealand Herald. Retrieved 22 November 2011.
  35. Cricket: Skipper loves the 3–4 punch
  36. Southee-Boult the best new ball pair around
  37. Sri Lanka tour of Australia and New Zealand, 1st Test: New Zealand v Sri Lanka at Christchurch, Dec 26–30, 2014
  38. "List of New Zealand cricketers to take a five-wicket haul on debut". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  39. 39.0 39.1 "3rd Test, Napier, Mar 22 - Mar 26 2008, England tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  40. 40.0 40.1 "2nd Test, Bengaluru, Aug 31 - Sep 3 2012, New Zealand tour of India". ESPNcricinfo. Retrieved 21 January 2021.
  41. 41.0 41.1 "9th Match, Pool A (D/N), Wellington, Feb 20 2015, ICC Cricket World Cup". ESPNcricinfo. Retrieved 21 January 2021.
  42. "ICC Cricket World Cup best bowling figures". ESPNcricinfo. Retrieved 21 January 2021.
  43. "1st T20I, Auckland, Dec 26 2010, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 21 January 2021.
  44. "List of five-wicket hauls in Test cricket by Tim Southee". ESPNcricinfo. Retrieved 21 January 2021.
  45. "2nd Test, Colombo, Nov 25-29 2012, New Zealand tour of Sri Lanka". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  46. "1st Test, London, May 16-19 2013, New Zealand tour of England". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  47. "2nd Test, Hamilton, Nov 25-29 2016, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  48. "2nd Test, Christchurch, Jan 20-23 2017, Bangladesh tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  49. "2nd Test, Christchurch, Mar 30-Apr 3 2018, England tour of Australia and New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  50. "1st Test, Wellington, Dec 15-19 2018, Sri Lanka tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  51. "1st Test (D/N), Perth, Dec 12-15 2019, ICC World Test Championship". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  52. "1st Test, Wellington, Feb 21-24 2020, India tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  53. "2nd Test, Wellington, Dec 11-14 2020, West Indies tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  54. "1st Test, Lord's, June 02 - 06, 2021, New Zealand tour of England". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  55. "1st Test, Kanpur, November 25 - 29, 2021, New Zealand tour of India". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  56. "1st Test, Christchurch, February 17 - 19, 2022, South Africa tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  57. "List of five-wicket hauls in One-Day International cricket by Tim Southee". ESPNcricinfo. Retrieved 21 January 2021.
  58. "1st ODI (D/N), Wellington, Jan 22 2011, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  59. "3rd ODI, Dunedin, Feb 20 2019, Bangladesh tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  60. "List of five-wicket hauls in T20 International cricket by Tim Southee". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  61. "1st ODI (D/N), Wellington, Jan 22 2011, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
  62. "1st ODI (D/N), Wellington, Jan 22 2011, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 22 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=టిమ్_సౌథీ&oldid=4334499" నుండి వెలికితీశారు