నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు
దస్త్రం:Logo of cricket Netherlands.png
నెదర్లాండ్స్ క్రికెట్ లోగో
అసోసియేషన్రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్స్కాట్ ఎడ్వర్డ్స్
కోచ్ర్యాన్ టెన్ డోషేట్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాఅసోసియేట్ మెంంబరు, వన్‌డే స్టేటసుతో (1966)
ICC ప్రాంతంయూరపియన్ క్రికెట్ కౌన్సిల్
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[1] అత్యుత్తమ
వన్‌డే 14వ 11వ (2021 మే 2)
టి20ఐ 16వ 10వ (2009 జూన్ 8)
వన్‌డేలు
తొలి వన్‌డేv.  న్యూజీలాండ్ రిలయన్స్ స్టేడియం, వదోదర; 1996 ఫిబ్రవరి 17
చివరి వన్‌డేv.  శ్రీలంక హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే; 2023 జూలై 9
వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[2] 114 39/69
(2 టైలు, 4 ఫలితం తేలనివి)
ఈ ఏడు[3] 13 5/7
(1 టై, 0 ఫలితం తేలనివి)
పాల్గొన్న ప్రపంచ కప్‌లు4 (first in 1996)
అత్యుత్తమ ఫలితంగ్రూప్ దశ
(1996, 2003, 2007, 2011)
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ12 (first in 1979 ఐసిసి ట్రోఫీ)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2001 ఐసిసి ట్రోఫీ)
ట్వంటీ20లు
తొలి టి20ఐv.  కెన్యా స్టోర్‌మౌంట్, బెల్ఫాస్ట్; 2008 ఆగస్టు 2
చివరి టి20ఐv.  దక్షిణాఫ్రికా అడిలైడ్ ఓవల్, అడిలైడ్; 2022 నవంబరు 6
టి20ఐలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[4] 98 49/44
(2 టైలు, 3 ఫలితం తేలనివి)
ఈ ఏడు[5] 0 0/0
(0 టైలు, 0 ఫలితం తేలనివి)
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ5 (first in 2009 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20)
అత్యుత్తమ ఫలితంసూపర్ 10 (2014 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20)
ఐసిసి టి20 ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ6 (first in 2008 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫయరు)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2008, 2015 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫయరు, 2019 ఐసిసి ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫయరు

ODI kit

T20I kit

As of 2023 ఆగస్టు 20

నెదర్లాండ్స్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఈ జట్టును "ది ఫ్లయింగ్ డచ్‌మెన్" అనే పేరుతో పిలుస్తారు.

నెదర్లాండ్స్‌లో కనీసం 19వ శతాబ్దం నుండి క్రికెట్ ఆడుతున్నారు. 1860లలో దేశంలో దీన్నొక ప్రధాన క్రీడగా పరిగణించారు. ప్రజాభిమానం విషయంలో ఇతర క్రీడలు - ముఖ్యంగా ఫుట్‌బాల్, ఫీల్డ్ హాకీ - క్రికెట్‌ను మించిపోయాయి. కానీ నేడు నెదర్లాండ్స్‌లో దాదాపు 6,000 మంది క్రికెటర్లు ఉన్నారు. నేటి రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్‌కు ముందున్న మొదటి జాతీయ సంఘం 1890లో ఏర్పడింది. నెదర్లాండ్స్ 1966లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అసోసియేట్ సభ్యత్వాన్ని సాధించింది.

నెదర్లాండ్స్ మొత్తం పదకొండు ICC ట్రోఫీ/వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటులలో పాల్గొంది. 2001లో కెనడాలో జరిగిన పోటీలో విజయం సాధించగా, మూడుసార్లు (1986, 1920, 2023 ) రన్నరప్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ 1996, 2003, 2007, 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లలో పాల్గొంది. 2023 ప్రపంచ కప్‌కు అర్హత పొందింది. 1995 నుండి జాతీయ జట్టు ఇంగ్లీష్ దేశీయ నాట్‌వెస్టు ట్రోఫీ పోటీలో (తరువాతి కాలంలో C&G ట్రోఫీ) ప్రవేశించింది. 2004లో వారు ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు. అబెర్డీన్‌లో స్కాట్లాండ్‌తో డ్రా చేసి, డెవెంటర్‌లో ఐర్లాండ్‌పై ఇన్నింగ్స్‌ ఓటమిని చవిచూశారు.

నెదర్లాండ్స్ 2006 జనవరి 1 నుండి 2014 ఫిబ్రవరి 1 వరకు పూర్తి వన్డే అంతర్జాతీయ హోదాను పొందింది.[6] 2014 జూన్లో ట్వంటీ20 అంతర్జాతీయ హోదాను తిరిగి పొందారు.[7] 2018 మార్చిలో 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ తమ వన్డే హోదాను తిరిగి పొందింది. 2015 - 17 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఫలితంగా ఐసిసి టోర్నమెంటుకు ముందు ఈ హోదాను హామీ ఇచ్చింది. తద్వారా 2020 - 23 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌కు అర్హత సాధించారు. 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు హోదా కొనసాగింది.

2018 ఏప్రిల్లో, ICC తన సభ్యులందరికీ పూర్తి ట్వంటీ 20 అంతర్జాతీయ (T20I) హోదాను మంజూరు చేయాలని నిర్ణయించింది. కాబట్టి, 2019 జనవరి 1 తర్వాత నెదర్లాండ్స్‌కు, ఇతర ICC సభ్యులకూ మధ్య జరిగే అన్ని ట్వంటీ20 మ్యాచ్‌లు పూర్తి స్థాయి T20Iగా ఉంటాయి. [8] స్కాట్ ఎడ్వర్డ్స్ ప్రస్తుత జట్టు కెప్టెన్.[9]

చరిత్ర

[మార్చు]

19వ శతాబ్దంలో నెపోలియన్ యుద్ధాల సమయంలో బ్రిటిషు సైనికులు నెదర్లాండ్స్‌కు క్రికెట్‌ను పరిచయం చేశారు. [10] 1870లలో మరిన్ని క్లబ్‌లు ఉనికిలోకి వచ్చాయి. నెదర్లాండ్స్ జాతీయ జట్టు 1881లో తమ మొదటి ఆట ఆడింది. వారు ఉక్స్‌బ్రిడ్జ్ క్రికెట్ క్లబ్ XIకి వ్యతిరేకంగా 22 మంది ఆటగాళ్లను రంగంలోకి దించారు. అయినప్పటికీ ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు. డచ్ క్రికెట్ యూనియన్ 1890లో ఏర్పడింది. ఇందులో 18 సభ్యుల క్లబ్‌లు ఉండేవి. వాటిలో నాలుగు నేటికీ ఉనికిలో ఉన్నాయి. [11]

మరుసటి సంవత్సరం మొదటి జాతీయ టోర్నమెంటు నిర్వహించారు. దీనిని హాగ్స్చే CC గెలుచుకుంది. 1890లో ఆంగ్ల పర్యటన జట్లు సందర్శించడం ప్రారంభించాయి. 1891లో పర్యటించిన జట్టులో షెర్లాక్ హోమ్స్ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ ఉన్నాడు. [11]

1894లో, జెంటిల్‌మెన్ ఆఫ్ హాలండ్, ఇంగ్లాండ్‌ను సందర్శించిన మొదటి డచ్ జట్టు. ఈ పర్యటనలో MCC తో లార్డ్స్‌లో జరిగిన ఆటలో MCC, ఒక ఇన్నింగ్స్ 169 పరుగుల తేడాతో గెలిచింది. [12] 1890వ దశకంలో ఇంగ్లీష్ జట్ల పర్యటనలు కొనసాగాయి. ఈ సమయం లోనే నెదర్లాండ్స్ క్రికెట్లో కార్స్టు పోస్థుమా ఉద్భవించాడు. తర్వాత అతను ఫస్టు క్లాస్ క్రికెట్ ఆడిన మొదటి డచ్ ఆటగాడయ్యాడు. [11] అతను, నెదర్లాండ్స్‌లో తన కెరీర్‌లో 8.2339 సగటుతో 66 వికెట్లు తీశాడు. [13]

1979, 1982 లలో జరిగిన మొదటి రెండు ICC ట్రోఫీ టోర్నమెంటుల్లో డచ్‌ జట్టుకు పెద్దగా విజయాలేమీ రాలేదు. రెండు టోర్నమెంటులలోనూ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు. కానీ 1986 టోర్నమెంటులో, వారు జింబాబ్వే తరువాత రన్నరప్‌గా నిలిచారు. అదే సంవత్సరం, పాల్-జాన్ బక్కర్, కౌంటీ క్రికెట్ ఆడిన మొదటి డచ్ ప్లేయర్ అయ్యాడు. [11] 1989లో డచ్చి జట్టు, ఇద్దరు భవిష్యత్ ఇంగ్లండ్ కెప్టెన్లు అలెక్ స్టీవర్ట్, నాసర్ హుస్సేన్‌లతో కూడిన బలమైన ఇంగ్లాండ్ XIని 3 పరుగుల తేడాతో ఓడించింది.[14]

1995లో నెదర్లాండ్స్ మొదటిసారిగా నాట్‌వెస్టు ట్రోఫీలోకి ప్రవేశించింది. పదేళ్లపాటు ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. 1999 లో డర్హామ్‌ను ఓడించి నాల్గవ రౌండ్‌కు చేరుకోవడం ఈ ట్రోఫీలో వారి అత్యుత్తమ ప్రదర్శన.

నెదర్లాండ్స్ 1997 ICC ట్రోఫీలో ఆరో స్థానంలో మాత్రమే నిలిచినందున, 1999 ప్రపంచ కప్‌కు అర్హత పొందలేదు. అయితే నెదర్లాండ్స్, ఆమ్‌స్టెల్‌వీన్‌లో కెన్యా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ని నిర్వహించింది.[11]

నెదర్లాండ్స్ 1996లో మొదటి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడి రెండవ స్థానంలో నిలిచింది. అప్పటి నుండి వారు ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంటులో పోటీ పడ్డారు, 1998, 2000 లలో గెలిచారు.[11]

21 వ శతాబ్దం

[మార్చు]

2000–2009

[మార్చు]

2001లో టొరంటోలో జరిగిన ఫైనల్లో నమీబియాను ఓడించి నెదర్లాండ్స్ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. తద్వారా వారు 2003 ప్రపంచ కప్‌కు అర్హత సాధించారు. అయితే, మళ్లీ వారు టోర్నమెంటులో మొదటి రౌండు దాటి ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ తమ మొదటి వన్డే అంతర్జాతీయ విజయాన్ని నమీబియాపై సాధించారు. ఫెయికో క్లోపెన్బర్గ్ (121) క్లాస్ - జాన్ వాన్ నూర్ట్విజ్క్‌లు (134 నాటౌట్) జట్టు చరిత్రలో మొదటి రెండు వన్డే అంతర్జాతీయ సెంచరీలు సాధించారు.[11]

2005 ICC ట్రోఫీలో నెదర్లాండ్స్, 5వ స్థానంలో నిలిచి, 2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. 2009 ICC ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకూ వన్డే అంతర్జాతీయ హోదాను పొందింది. ఈ కొత్త హోదాతో వారి మొదటి అంతర్జాతీయ వన్డే, 2006 మార్చిలో కెన్యాతో జరగాల్సి ఉంది; అయితే ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌లో కెన్యా పర్యటన కారణంగా రద్దైంది. దాంతో, ఈ హోదాతో నెదర్లాండ్స్ మొదటి వన్‌డే (మొత్తం మీద పన్నెండవది) శ్రీలంకతో జరిగింది. స్వదేశంలో ఇది వారి మొదటి వన్డే. శ్రీలంక రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అప్పటి రికార్డు వన్‌డే స్కోరు 443–9 ఈ మ్యాచ్‌లలో ఒకదనిలో వచ్చింది. [11]

డచ్ వారు తమ మొదటి ఇంటర్‌కాంటినెంటల్ కప్ మ్యాచ్‌, 2006 మార్చిలో నైరోబీలో కెన్యాతో ఆడారు. ఆట డ్రాగా ముగిసింది కానీ నెదర్లాండ్స్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆరు పాయింట్లు సాధించింది.[15] ఆగస్టులో నెదర్లాండ్స్ యూరోపియన్ ఛాంపియన్షిప్ డివిజన్ వన్లో పోటీ చేసింది. వారు డెన్మార్క్, ఇటలీలను ఓడించి, స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయారు. ఐర్లాండ్తో ఆట వర్షం కారణంగా రద్దయింది. టోర్నమెంటులో వారు మూడవ స్థానంలో నిలిచారు.[11]

నవంబరులో, డచ్ వారు దక్షిణాఫ్రికా వెళ్లారు. మొదట బెర్ముడాతో ఇంటర్‌కాంటినెంటల్ కప్ మ్యాచ్ ఆడారు. డ్రా అయిన ఆ మ్యాచ్‌లో డేవిడ్ హెంప్, అప్పటికి ఆ పోటీల్లో రికార్డు స్కోరు 247 పరుగులతో అజేయంగా నిలిచాడు. [16] దీని తర్వాత బెర్ముడా, కెనడాలతో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను నెదర్లాండ్స్‌ గెలిచుకుంది. [17] 2006లో వారి చివరి గేమ్, దక్షిణాఫ్రికాలోనే, కెనడాతో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్ గేమ్. వారు 7 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌ను గెలుపొందారు. ర్యాన్ టెన్ డోషేట్ ఆ పోటీల్లో కొత్త వ్యక్తిగత రికార్డు స్కోరు 259 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. [18]

2007 ప్రారంభంలో, వారు వరల్డ్ క్రికెట్ లీగ్‌లో డివిజన్ వన్‌లో పాల్గొనడానికి కెన్యాలోని నైరోబీకి వెళ్లారు. అక్కడ ఆరు జట్లలో మూడవ స్థానంలో నిలిచారు. [19] దీని తర్వాత 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో వారు స్కాట్‌లాండ్‌ను ఓడించినప్పటికీ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు. [20]

ప్రపంచ కప్ తర్వాత, జట్టు పలు పరివర్తనలకు లోనైంది. కెప్టెన్ లూక్ వాన్ ట్రూస్ట్, టిమ్ డి లీడ్, కోచ్ పీటర్ కాంట్రెల్ రిటైరయ్యారు. డాన్ వాన్ బంగే కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొత్తగా వచ్చిన కోచ్, బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఇయాన్ పాంట్ సేవలను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాడు.

2007 జూన్‌లో నెదర్లాండ్స్ జట్టు, కెనడాలో పర్యటించింది. మొదట కెనడాతో కింగ్ సిటీ, అంటారియోలో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. [21] తర్వాత మొదటి వన్‌డేని 117 పరుగుల తేడాతో గెలుపొందగా, [22] రెండవది రద్దైంది. [23] తర్వాత వారు ఐర్లాండ్‌లో చతుర్భుజి సిరీస్‌ను ఆడారు, వెస్టిండీస్‌తో పది వికెట్ల తేడాతో, [24] ఐర్లాండ్‌తో ఒక పరుగు తేడాతో ఓడిపోయారు.[25] స్కాట్‌లాండ్‌తో జరిగిన ఆట వర్షం కారణంగా రద్దైంది. [26]

2008 ఆగస్టులో నెదర్లాండ్స్, 2009 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్‌లో పాల్గొంది. వారు ట్వంటీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడడం అదే మొదలు.[27] రన్ రేట్ ఆధారంగా గ్రూప్ Bలో మొదటి స్థానంలో నిలిచారు. [28] సెమీ-ఫైనల్స్‌లో స్కాట్‌లాండ్‌ను ఓడించిన తర్వాత, [29] ఫైనల్ వర్షం కారణంగా రద్దైంది. ట్రోఫీని నెదర్లాండ్స్, ఐర్లాండ్ పంచుకున్నారు. [30]

ICC వరల్డ్ ట్వంటీ20 2009 ప్రారంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, ఇంగ్లాండ్‌ను ఓడించి, క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. [31] [32][33]

తమ రెండవ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓడిపోయారు.[34] రన్ రేట్ ఆధారంగా సూపర్ 8 దశకు అర్హత సాధించలేదు.

2010లో ICC WCL డివిజన్ వన్, రోటర్‌డ్యామ్‌లో నెదర్లాండ్స్ జాతీయ క్రికెట్ జట్టు

2010–ప్రస్తుతం

[మార్చు]

2010 జూలై 20న నెదర్లాండ్స్, వన్‌డేల్లో మొదటిసారిగా పూర్తి-సభ్య దేశాన్ని ఓడించింది. వర్షం కారణంగా 30 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. [35] ఇతర అసోసియేట్, అనుబంధ దేశాలపై వారి గెలుపు శాతంపై ఆధారపడి, నెదర్లాండ్స్ ICC అధికారిక వన్‌డే-ర్యాంకింగ్స్‌లో చేర్చబడింది. [36] [37]

2011 ఫిబ్రవరి 22న నెదర్లాండ్స్, 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి, ఇంగ్లండ్‌పై 292 పరుగులు చేసి, పూర్తి-సభ్య దేశంపై తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ర్యాన్ టెన్ డోస్చేట్ 110 బంతుల్లో 119 పరుగులు చేశాడు. అయితే, నెదర్లాండ్స్ తమ బలమైన స్కోరును కాపాడుకోలేకపోయింది. ఇంగ్లాండ్ 2 ఓవర్లు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలిచింది. వారు చివరికి తమ గ్రూప్ మ్యాచ్‌లలో దేనినీ గెలవలేకపోయారు, గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచారు.

2011 సెప్టెంబరులో నెదర్లాండ్స్, స్వదేశంలో జరిగిన చిన్న రెండు-మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో కెన్యాను వైట్‌వాష్ చేసింది. [38]

నెదర్లాండ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ని నిర్వహించిన అన్ని స్టేడియాల స్థానాలు

2014 ICC వరల్డ్ ట్వంటీ20 లో, నెదర్లాండ్స్ తమ చివరి గేమ్‌కు ముందు ఒక విజయం, ఒక ఓటమి పొందింది. జింబాబ్వే, ఐర్లాండ్‌లపై నెట్ రన్ రేట్‌ను సాధించాలంటే, వారు 14.2 ఓవర్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఐర్లాండ్ స్కోర్‌ను ఛేదించాలి. ఐర్లాండ్ 189 పరుగులు చేసినందున, ఇది దాదాపు అసంభవంగా కనిపించింది. అయితే, బలమైన, దూకుడు బ్యాటింగ్ కారణంగా 13.5 ఓవర్లలోనే 193/4 స్కోర్ చేసి, 2014 ICC వరల్డ్ ట్వంటీ 20 సూపర్ 10 లకు చేరుకుంది. శ్రీలంకతో జరిగిన 39/10తో సహా గ్రూప్‌లో వారి మొదటి మూడు గేమ్‌లను కోల్పోయినప్పటికీ, వారు తమ చివరి గేమ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు సాధించారు.

2022 ICC T20 ప్రపంచ కప్‌లో తమ చివరి మ్యాచ్‌లో, నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికాను ఓడించింది, ఫలితంగా దక్షిణాఫ్రికా టోర్నమెంటు నుండి నిష్క్రమించింది. T20 ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు వారి అత్యుత్తమ స్థానం (8వ స్థానం)లో నిలిచింది. [39]

నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు is located in Netherlands
హాజెఒలార్వెగ్
హాజెఒలార్వెగ్
థర్లీడ్
థర్లీడ్
వెస్ట్‌వ్లియెట్
వెస్ట్‌వ్లియెట్
వి ఆర్ ఎ గ్రౌండ్
వి ఆర్ ఎ గ్రౌండ్
షూట్స్‌వెల్డ్
షూట్స్‌వెల్డ్
మార్షాకర్‌వీర్డ్
మార్షాకర్‌వీర్డ్
నెదర్లాండ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ఒలు జరిగిన స్టేడియాల స్థానాలు

టోర్నమెంటు చరిత్ర

[మార్చు]

సంవత్సరం చుట్టూ ఉన్న ఎరుపు పెట్టె నెదర్లాండ్స్‌లో ఆడిన టోర్నమెంటులను సూచిస్తుంది

ICC క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]
ప్రపంచకప్ రికార్డు
సంవత్సరం రౌండు స్థానం GP W ఎల్ టి NR
ఇంగ్లాండ్ 1975 పాల్గొనలేదు
ఇంగ్లాండ్ 1979 అర్హత సాధించలేదు
ఇంగ్లాండ్ 1983
భారతదేశంపాకిస్తాన్1987
ఆస్ట్రేలియాన్యూజీలాండ్1992
భారతదేశంపాకిస్తాన్శ్రీలంక1996 గ్రూప్ దశ 12/12 5 0 5 0 0
ఇంగ్లాండ్వేల్స్1999 అర్హత సాధించలేదు
దక్షిణాఫ్రికా 2003 గ్రూప్ దశ 11/14 6 1 5 0 0
వెస్ట్ ఇండీస్ 2007 గ్రూప్ దశ 12/16 3 1 2 0 0
భారతదేశంశ్రీలంకబంగ్లాదేశ్2011 గ్రూప్ దశ 13/14 6 0 6 0 0
ఆస్ట్రేలియాన్యూజీలాండ్2015 అర్హత సాధించలేదు
ఇంగ్లాండ్వేల్స్2019
భారతదేశం 2023 అర్హత సాధించారు
మొత్తం 4/13 0 శీర్షికలు 20 2 18 0 0

ICC T20 ప్రపంచ కప్

[మార్చు]
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు
సంవత్సరం రౌండు స్థానం GP W ఎల్ టి NR
దక్షిణాఫ్రికా 2007 అర్హత సాధించలేదు
ఇంగ్లాండ్ 2009 గ్రూప్ దశ 9/12 2 1 1 0 0
వెస్ట్ ఇండీస్ 2010 అర్హత సాధించలేదు
శ్రీలంక 2012
బంగ్లాదేశ్ 2014 సూపర్ 10 9/16 7 3 4 0 0
India 2016 గ్రూప్ దశ 12/16 3 1 1 0 1
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2021 గ్రూప్ దశ 15/16 3 0 3 0 0
ఆస్ట్రేలియా 2022 సూపర్ 12 8/16 8 4 4 0 0
వెస్ట్ ఇండీస్United States2024 అర్హత సాధించారు
మొత్తం 6/9 0 శీర్షికలు 23 9 13 0 1

ఇతర టోర్నమెంటులు

[మార్చు]

రికార్డులు, గణాంకాలు

[మార్చు]

అంతర్జాతీయ మ్యాచ్ సారాంశం – నెదర్లాండ్స్ [40] [41]

చివరిగా 2023 జూలై 9న నవీకరించబడింది.

స్థూల గణాంకాలు
ఫార్మాట్ మ్యా గె టై ఫతే తొలి మ్యాచ్
వన్-డే ఇంటర్నేషనల్స్ 114 39 69 2 4 1996 ఫిబ్రవరి 17
ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ 98 49 44 2 3 2008 ఆగస్టు 2

వన్-డే ఇంటర్నేషనల్స్

[మార్చు]

ICC Champions Trophy
World Cricket League
Intercontinental Cup
ICC 6 Nations Challenge
 • 2000: Runners-up[50]
 • 2002: 6th place[51]
 • 2004: 4th place[52]
ICC Trophy / World Cup Qualifier
European Championship
 • 1996: Runners-up[11]
 • 1998: Won[11]
 • 2000: Division One winners[11]
 • 2002: 4th place (Division One)[11]
 • 2004: 3rd place (Division One)[11]
 • 2006: 3rd place (Division One)[11]
 • 2010–2015: Ineligible
ICC World Twenty20 Qualifier
 • 2008: Joint winner (with Ireland)
 • 2010: 4th place
 • 2012: 4th place
 • 2013: 5th place
 • 2015: Joint winner (with Scotland)
 • 2019: Won
 • 2022: Runners-up

† The final was washed out by rain, so the trophy was shared.

 • అత్యధిక జట్టు స్కోరు: 374/9 v. వెస్టిండీస్ 2023 జూన్ 26న తకాషింగా క్రికెట్ క్లబ్, హరారే [53] లో
 • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 137 *, వెస్లీ బరేసి v. కెన్యా 2014 జనవరి 23న బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్, లింకన్ [54] లో
 • ఉత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు: 5/24, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ వి. కెనడా 2013 ఆగస్టు 29న కింగ్ సిటీలోని మేపుల్ లీఫ్ క్రికెట్ క్లబ్‌లో [55]
 • ఇప్పటికీ నెదర్లాండ్స్ కోసం ఆడుతున్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.

ఇతర దేశాలతో పోలిస్తే వన్‌డే రికార్డు [56]

వన్‌డే #4620కి రికార్డ్‌లు పూర్తయ్యాయి. చివరిగా 2023 జూలై 9న నవీకరించబడింది.

ప్రత్యర్థి M W L T NR తొలి మ్యాచ్ తొలి గెలుపు
ఐసిసి పూర్తి స్థాయి సభ్యులు
 ఆఫ్ఘనిస్తాన్ 9 2 7 0 0 2009 ఆగస్టు 30 2009 ఆగస్టు 30
 ఆస్ట్రేలియా 2 0 2 0 0 2003 ఫిబ్రవరి 20
 బంగ్లాదేశ్ 2 1 1 0 0 2010 జూలై 20 2010 జూలై 20
 ఇంగ్లాండు 6 0 6 0 0 1996 ఫిబ్రవరి 22
 భారతదేశం 2 0 2 0 0 2003 ఫిబ్రవరి 12
 ఐర్లాండ్ 13 3 8 1 1 2006 ఆగస్టు 8 2007 ఫిబ్రవరి 5
 న్యూజీలాండ్ 4 0 4 0 0 1996 ఫిబ్రవరి 17
 పాకిస్తాన్ 6 0 6 0 0 1996 ఫిబ్రవరి 26
 దక్షిణాఫ్రికా 7 0 6 0 1 1996 మార్చి 5
 శ్రీలంక 5 0 5 0 0 2002 సెప్టెంబరు 16
 వెస్ట్ ఇండీస్ 6 1 5 0 0 2007 జూలై 10 2023 జూన్ 26
 జింబాబ్వే 7 3 4 0 0 2003 ఫిబ్రవరి 28 2019 జూన్ 19
ఐసిసి అనుబంధ సభ్యులు
 బెర్ముడా 7 6 1 0 0 2006 నవంబరు 28 2006 నవంబరు 28
 కెనడా 9 8 0 0 1 2006 నవంబరు 26 2006 నవంబరు 26
 కెన్యా 10 7 3 0 0 2007 జనవరి 31 2008 ఆగస్టు 21
 నమీబియా 1 1 0 0 0 2003 మార్చి 3 2003 మార్చి 3
 నేపాల్ 3 2 1 0 0 2018 ఆగస్టు 1 2018 ఆగస్టు 1
 ఒమన్ 1 1 0 0 0 2023 జూలై 3 2023 జూలై 3
 స్కాట్‌లాండ్ 12 4 7 0 1 2006 ఆగస్టు 6 2007 మార్చి 22
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1 0 1 0 0 1996 మార్చి 1
 United States 1 1 0 0 0 2023 జూన్ 22 2023 జూన్ 22

ట్వంటీ20 ఇంటర్నేషనల్స్

[మార్చు]

Most ODI runs for Netherlands[60]

Player Runs Average Career span
Ryan ten Doeschate 1,541 67.00 2006–2011
Tom Cooper 1,317 47.03 2010–2023
Scott Edwards 1,212 40.40 2018–2023
Wesley Barresi 1,193 30.58 2010–2023
Max O'Dowd 1,158 37.35 2019–2023

Most ODI wickets for Netherlands[61]

Player Wickets Average Career span
Mudassar Bukhari 57 28.08 2007–2014
Pieter Seelaar 57 35.68 2006–2022
Ryan ten Doeschate 55 24.12 2006–2011
Peter Borren 46 35.21 2006–2014
Logan van Beek 34 33.40 2021–2023

ఇతర దేశాలతో పోలిస్తే T20I రికార్డు [62]

T20I #1871కి రికార్డ్‌లు పూర్తయ్యాయి. చివరిగా నవీకరించబడింది 2022 నవంబరు 6.

Opponent M W L T NR First match First win
ICC Full members
 ఆఫ్ఘనిస్తాన్ 4 2 2 0 0 2010 ఫిబ్రవరి 12 2010 ఫిబ్రవరి 12
 బంగ్లాదేశ్ 4 1 3 0 0 2012 జూలై 25 2012 జూలై 26
 ఇంగ్లాండు 2 2 0 0 0 2009 జూన్ 5 2009 జూన్ 5
 భారతదేశం 1 0 1 0 0 2022 అక్టోబరు 27
 ఐర్లాండ్ 13 7 5 0 1 2008 ఆగస్టు 5 2014 మార్చి 21
 న్యూజీలాండ్ 3 0 3 0 0 2014 మార్చి 29
 పాకిస్తాన్ 2 0 2 0 0 2009 జూన్ 9
 దక్షిణాఫ్రికా 2 1 1 0 0 2014 మార్చి 27 2022 నవంబరు 6
 శ్రీలంక 3 0 3 0 0 2014 మార్చి 24
 జింబాబ్వే 5 2 2 1 0 2014 మార్చి 19 2019 జూన్ 23
ICC Associate members
 బెర్ముడా 1 1 0 0 0 2019 అక్టోబరు 26 2019 అక్టోబరు 26
 కెనడా 3 2 1 0 0 2008 ఆగస్టు 2 2010 ఫిబ్రవరి 9
 హాంగ్ కాంగ్ 3 2 1 0 0 2017 జనవరి 18 2019 అక్టోబరు 10
 కెన్యా 6 4 2 0 0 2008 ఆగస్టు 2 2008 ఆగస్టు 2
 మలేషియా 2 1 0 1 0 2021 ఏప్రిల్ 18 2021 ఏప్రిల్ 18
 నమీబియా 3 2 1 0 0 2019 అక్టోబరు 19 2019 అక్టోబరు 19
 నేపాల్ 9 4 4 0 1 2015 జూన్ 30 2015 జూన్ 30
 ఒమన్ 4 2 1 0 1 2016 మార్చి 11 2017 జనవరి 15
 పపువా న్యూగినియా 3 2 1 0 0 2019 అక్టోబరు 24 2019 నవంబరు 2
 స్కాట్‌లాండ్ 13 6 7 0 0 2008 ఆగస్టు 4 2008 ఆగస్టు 4
 సింగపూర్ 1 1 0 0 0 2019 అక్టోబరు 22 2019 అక్టోబరు 22
 ఉగాండా 1 1 0 0 0 2022 జూలై 14 2022 జూలై 14
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 9 5 4 0 0 2014 మార్చి 17 2014 మార్చి 17
 United States 1 1 0 0 0 2022 జూలై 15 2022 జూలై 15

ఇతర రికార్డులు

[మార్చు]

ICC ట్రోఫీ

[మార్చు]
 • అత్యధిక జట్టు స్కోరు: 425/4 v. ఇజ్రాయెల్, 1986 జూన్ 18 సోలిహుల్, ఇంగ్లాండ్ [63]
 • అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్: 169 నాటౌట్, రూపర్ట్ గోమ్స్ v. ఇజ్రాయెల్, 1990 జూన్ 4 నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో [64]
 • బెస్టు ఇన్నింగ్స్ బౌలింగ్: 7/9, అసిమ్ ఖాన్ v. తూర్పు & మధ్య ఆఫ్రికా, 1997 మార్చి 24లో రాయల్ మిలిటరీ కాలేజీ, కౌలాలంపూర్, మలేషియా [65]

ప్రముఖ ఆటగాళ్లు

[మార్చు]

Most T20I runs for Netherlands[66]

Player Runs Average Career span
Max O'Dowd 1,589 29.98 2015–2022
Ben Cooper 1,239 28.15 2013–2021
Stephan Myburgh 915 21.78 2012–2022
Wesley Barresi 799 22.82 2012–2019
Tom Cooper 659 23.53 2012–2022

Most T20I wickets for Netherlands[67]

Player Wickets Average Career span
Paul van Meekeren 64 21.21 2013–2022
Pieter Seelaar 58 22.24 2008–2021
Ahsan Malik 44 16.59 2012–2017
Mudassar Bukhari 43 18.13 2008–2016
Roelof van der Merwe 42 18.21 2015–2022
Timm van der Gugten 42 22.35 2012–2022

ర్యాన్ టెన్ డోస్చేట్ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు రికార్డును కలిగి ఉన్నాడు.

చాలా మంది డచ్ క్రికెటర్లు ఫస్ట్-క్లాస్ స్థాయిలో ఇతర చోట్ల కూడా ఆడారు, వీరిలో బహుశా అత్యంత విజయవంతమైన రోలాండ్ లెఫెబ్రే ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో సోమర్‌సెట్, గ్లామోర్గాన్‌లతోపాటు న్యూజిలాండ్‌లోని కాంటర్‌బరీ తరపున ఆడాడు.

ఇంటర్ కాంటినెంటల్ కప్ వెలుపల ఫస్టు క్లాస్ క్రికెట్ ఆడిన డచ్ ఆటగాళ్ళు:

 • ర్యాన్ టెన్ డోషేట్ – ఎసెక్స్, కాంటర్‌బరీ విజార్డ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, మషోనాలాండ్ ఈగల్స్ కోసం ఆడుతున్నారు.
 • డిర్క్ నన్నెస్ - ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ బుష్రేంజర్స్, IPLలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఆస్ట్రేలియా తరపున T20I, వన్‌డే క్రికెట్ ఆడాడు.
 • నోలన్ క్లార్క్ - బార్బడోస్ తరపున 1969/1976 నుండి 70/77 వరకు ఆడాడు.
 • టామ్ కూపర్ - ప్రస్తుతం సౌత్ ఆస్ట్రేలియా తరపున ఫస్టు క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు
 • మైఖేల్ స్వార్ట్ - వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 202011 నుండి 10 వరకు ఆడాడు.
 • పాల్-జాన్ బక్కర్ - హాంప్‌షైర్ తరపున 191992 నుండి 86 వరకు ఆడాడు.
 • Alexei Kervezee – 2007 నుండి వోర్సెస్టర్‌షైర్ తరపున ఆడుతున్నారు.
 • బిల్ గ్లెరమ్ – 1957లో ఫ్రీ ఫారెస్టర్స్ కోసం ఒక ఫస్టు క్లాస్ గేమ్ ఆడాడు.
 • కార్స్టు పోస్ట్‌థుమా - 1903లో లండన్ కౌంటీ క్రికెట్ క్లబ్ కోసం ఐదు ఫస్టు క్లాస్ గేమ్‌లు ఆడాడు.
 • డారన్ రీకర్స్ – ఒటాగో కోసం 1997/98లో మూడు ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడాడు. ఒటాగో, కాంటర్‌బరీ (1994/95-2001/02) రెండింటికీ లిస్టు A మ్యాచ్‌లు ఆడాడు.
 • డాన్ వాన్ బంగే – 2004లో మిడిల్‌సెక్స్ తరపున ఆడాడు.
 • ఆండ్రీ వాన్ ట్రూస్టు - 191998 నుండి 91 వరకు సోమర్‌సెట్ కోసం, 1994/95 సీజన్‌లో దక్షిణాఫ్రికాలో గ్రిక్వాలాండ్ వెస్టు కోసం ఆడాడు.
 • బాస్ జుయిడరెంట్ - 202003 నుండి 01 వరకు ససెక్స్ తరపున ఆడాడు.
 • టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ – న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఇతరుల కోసం ఆడాడు. ఇప్పుడు గ్లామోర్గాన్ తరపున ఆడుతున్నాడు.
 • లోగాన్ వాన్ బీక్ - ప్రస్తుతం వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ తరపున ఆడుతున్నాడు. గతంలో కాంటర్‌బరీ విజార్డ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

ఇటీవలి వన్‌డే, T20I జట్టుల్లో ఎంపికైన క్రియాశీల ఆటగాళ్ల జాబితా ఇది. ఇందులో పదవీ విరమణ చేసిన స్టీఫెన్ మైబర్గ్ను చేర్చలేదు. ఇప్పటివరకు అసలు ఆడని ఆటగాళ్ళ పేర్లను వాలుగా చూపించాం.

పేరు వయస్సు బ్యాటింగు శైలి బౌలింగు శైలి రూపాలు S/N చివరి వన్‌డే చివరి T20I
బ్యాటర్లు
మాక్స్ ఓ'డౌడ్ 30 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ వన్‌డే, T20I 4 శ్రీలంక 2023 దక్షిణాఫ్రికా 2022
విక్రమ్‌జిత్ సింగ్ 21 ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వన్‌డే, T20I 7 శ్రీలంక 2023 భారతదేశం 2022
టామ్ కూపర్ 37 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ T20I 26 దక్షిణాఫ్రికా 2023 దక్షిణాఫ్రికా 2022
వెస్లీ బరేసి 40 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ వన్‌డే 34 శ్రీలంక 2023 దక్షిణాఫ్రికా 2019
మూసా అహ్మద్ 26 ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ వన్‌డే 77 దక్షిణాఫ్రికా 2023
మైఖేల్ లెవిట్ 20 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం వన్‌డే 55
ఆల్ రౌండర్లు
బాస్ డి లీడే 24 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వన్‌డే, T20I 5 స్కాట్‌లాండ్ 2023 దక్షిణాఫ్రికా 2022
తేజ నిడమనూరు 29 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ వన్‌డే, T20I 25 శ్రీలంక 2023 న్యూజీలాండ్ 2022
కోలిన్ అకెర్మాన్ 33 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ T20I 48 జింబాబ్వే 2023 దక్షిణాఫ్రికా 2022
సాకిబ్ జుల్ఫికర్ 27 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ వన్‌డే 66 శ్రీలంక 2023 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019
వికెట్ కీపర్లు
స్కాట్ ఎడ్వర్డ్స్ 27 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ వన్‌డే (C), T20I (C) 35 శ్రీలంక 2023 దక్షిణాఫ్రికా 2022
నోవా క్రోస్ 24 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ వన్‌డే 36 శ్రీలంక 2023 36
స్పిన్ బౌలర్లు
ఆర్యన్ దత్ 21 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ వన్‌డే 88 శ్రీలంక 2023 ఉగాండా 2022
షరీజ్ అహ్మద్ 21 ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ వన్‌డే, T20I 18 శ్రీలంక 2023 భారతదేశం 2022
టిమ్ ప్రింగిల్ 21 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ T20I 11 పాకిస్తాన్ 2022 పాకిస్తాన్ 2022
క్లేటన్ ఫ్లాయిడ్ 27 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ వన్‌డే 96 శ్రీలంక 2023 న్యూజీలాండ్ 2022
పేస్ బౌలర్లు
లోగాన్ వాన్ బీక్ 33 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వన్‌డే, T20I 17 శ్రీలంక 2022 దక్షిణాఫ్రికా 2022
ఫ్రెడ్ క్లాసెన్ 31 కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ T20I 12 దక్షిణాఫ్రికా 2023 దక్షిణాఫ్రికా 2022
పాల్ వాన్ మీకెరెన్ 31 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ T20I 47 దక్షిణాఫ్రికా 2023 దక్షిణాఫ్రికా 2022
ర్యాన్ క్లైన్ 26 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వన్‌డే 15 శ్రీలంక 2023 న్యూజీలాండ్ 2022
వివియన్ కింగ్మా 29 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వన్‌డే 23 వెస్ట్ ఇండీస్ 2023 నేపాల్ 2021
బ్రాండన్ గ్లోవర్ 27 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ T20I 20 జింబాబ్వే 2023 దక్షిణాఫ్రికా 2022
టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ 33 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ T20I 10 దక్షిణాఫ్రికా 2021 శ్రీలంక 2022

2023 జూలై 9 నాటికి నవీకరించబడింది

కోచింగ్ సిబ్బంది

[మార్చు]
స్థానం పేరు
టీమ్ మేనేజర్ నెదర్లాండ్స్ స్టీవెన్ వాన్ డిజ్క్
ప్రధాన కోచ్ నెదర్లాండ్స్ ర్యాన్ టెన్ డోషేట్
అసిస్టెంట్ కోచ్‌లు నెదర్లాండ్స్ పీటర్ బోరెన్
నెదర్లాండ్స్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్
బ్యాటింగ్ కన్సల్టెంట్ నెదర్లాండ్స్ స్టీఫెన్ మైబర్గ్
సలహాదారు ఆస్ట్రేలియా డాన్ క్రిస్టియన్
విశ్లేషకుడు ఆస్ట్రేలియా జేమ్స్ హిల్డిచ్
ఫిజియోథెరపిస్ట్ నెదర్లాండ్స్ జార్జ్ డన్‌లప్
కండిషనింగ్ కోచ్ దక్షిణాఫ్రికా డీన్ మున్సామి

శిక్షకులు

[మార్చు]

కింది వ్యక్తులు డచ్ జాతీయ జట్టుకు వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. కొంతమంది కోచ్‌లకు, వారి పదవీకాలపు ఖచ్చితమైన తేదీలు అందుబాటులో లేవు, అయినప్పటికీ కీలక టోర్నమెంటులు గుర్తించబడ్డాయి:

పేరు నియమితులయ్యారు రాజీనామా చేశారు ప్రముఖ టోర్నమెంటులు
బార్బడోస్ ఎమ్మెర్సన్ ట్రోట్మాన్ 1996/1997 2004 అక్టోబరు [68] 2001 ICC ట్రోఫీ (గెలిచింది)
2002 ఛాంపియన్స్ ట్రోఫీ
2003 ప్రపంచ కప్
ఆస్ట్రేలియా /నెదర్లాండ్స్ పీటర్ కాంట్రెల్ (తాత్కాలిక) 2004 అక్టోబరు 2004 నవంబరు
ఆస్ట్రేలియా బాబ్ సింప్సన్ 2004 నవంబరు [69] 2005 ICC ట్రోఫీ తర్వాత 2005 ICC ట్రోఫీ
ఆస్ట్రేలియా /నెదర్లాండ్స్ పీటర్ కాంట్రెల్ 2005 నవంబరు [70] 2007 ఏప్రిల్ [71] 2007 WCL (డివి. 1)2007 ప్రపంచ కప్
నెదర్లాండ్స్ పాల్-జాన్ బక్కర్ (తాత్కాలిక) 2007 మే 1 [72] 2008 జనవరి 2007–08 ఇంటర్‌కాంటినెంటల్ కప్ (మొదటి రెండు మ్యాచ్‌లు)
ఆస్ట్రేలియా పీటర్ డ్రిన్నెన్ 2008 జనవరి [73] 2013 అక్టోబరు [74] 2007–08 ఇంటర్‌కాంటినెంటల్ కప్ (చివరి ఐదు మ్యాచ్‌లు)
2009 ప్రపంచ కప్ క్వాలిఫైయర్
2010 WCL (డివి. 1)
2011 ప్రపంచ కప్
2011–13 WCL ఛాంపియన్‌షిప్
దక్షిణాఫ్రికా అంటోన్ రౌక్స్ (ప్రారంభంలో తాత్కాలిక) 2013 అక్టోబరు [74] 2016 2014 ప్రపంచ కప్ క్వాలిఫైయర్
ఆస్ట్రేలియా ర్యాన్ కాంప్‌బెల్ 2017 ఏప్రిల్ [75] 2022 నవంబరు 2018 ప్రపంచ కప్ క్వాలిఫైయర్

మూలాలు

[మార్చు]
 1. "ICC Rankings". International Cricket Council.
 2. "ODI matches - Team records". ESPNcricinfo.
 3. "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
 4. "T20I matches - Team records". ESPNcricinfo.
 5. "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
 6. "Netherlands, Kenya and Canada lose ODI status". ESPNcricinfo. 1 February 2014. Retrieved 3 February 2016.
 7. "Nepal, Netherlands get T20 international status". ESPNcricinfo. 28 June 2014. Retrieved 28 June 2014.
 8. "All T20 matches between ICC members to get international status". International Cricket Council. 26 April 2018. Retrieved 1 September 2018.
 9. "Scott Edwards takes Netherlands captaincy in his stride after mid-series coronation". ESPN Cricinfo. Retrieved 21 June 2022.
 10. "Cricket below sea level".
 11. 11.00 11.01 11.02 11.03 11.04 11.05 11.06 11.07 11.08 11.09 11.10 11.11 11.12 11.13 11.14 11.15 11.16 11.17 11.18 11.19 11.20 11.21 11.22 11.23 11.24 11.25 11.26 Netherlands timeline Archived 2014-02-22 at the Wayback Machine at CricketEurope
 12. "Oops… Looks like something went wrong! This page does not exist or has been moved".
 13. Carst Posthuma at Cricinfo
 14. Scorecard of Netherlands v England, 16 August 1989 at Cricket Archive
 15. Scorecard of Kenya v Netherlands, 29 March 2006 at Cricket Archive
 16. Scorecard of Bermuda v Netherlands, 21 November 2006 at Cricket Archive
 17. ICC Associates South Africa Tri-Series points table at Cricket Archive
 18. Scorecard of Canada v Netherlands, 5 December 2006 at Cricket Archive
 19. 19.0 19.1 2007 ICC World Cricket League Division One points table at Cricket Archive
 20. 2007 World Cup at Cricinfo
 21. Scorecard of Canada v Netherlands, 28 June 2007 at Cricket Archive
 22. Scorecard of Canada v Netherlands, 3 July 2007 at Cricket Archive
 23. Scorecard of Canada v Netherlands, 4 July 2007 at Cricket Archive
 24. Scorecard of Netherlands v West Indies, 10 July 2007 at Cricket Archive
 25. Scorecard of Ireland v Netherlands, 11 July 2007 at Cricket Archive
 26. Scorecard of Netherlands v Scotland, 13 July 2007 at Cricket Archive
 27. "Ireland to host inaugural World Twenty20 qualifiers".
 28. "Points Table – ICC World Twenty20 Qualifier 2008 – ESPN Cricinfo".
 29. "2nd Semi-Final: Netherlands v Scotland at Belfast, Aug 4, 2008 – Cricket Scorecard – ESPN Cricinfo".
 30. "Ireland and Netherlands share the trophy".
 31. "1st Match, Group B: England v Netherlands at Lord's, Jun 5, 2009 – Cricket Scorecard – ESPN Cricinfo".
 32. "1st Match, Group B: England v Netherlands at Lord's, Jun 5, 2009 – Cricket Scorecard – ESPN Cricinfo".
 33. "Update 2-Cricket-Dutch upset England in spectacular start". Reuters. 5 June 2009.
 34. "9th Match, Group B: Netherlands v Pakistan at Lord's, Jun 9, 2009 – Cricket Scorecard – ESPN Cricinfo".
 35. "Only ODI: Bangladesh v Netherlands at Glasgow, Jul 20, 2010 – Cricket Scorecard – ESPN Cricinfo".
 36. "Dutch prepare to take on Bangladesh". Archived from the original on 24 February 2011.
 37. "Barresi carries Netherlands to major victory". 20 July 2010.
 38. "India vs Netherlands, ICC World Cup 2011". Cricket Archives. 9 March 2011.
 39. "Shock defeat ends South Africa's World Cup as Netherlands script famous win". ESPNcricinfo. 6 November 2022. Retrieved 6 November 2022.
 40. "Records | One-Day Internationals | Team records | Results summary". Cricinfo. Retrieved 21 August 2022.
 41. "Records | Twenty20 Internationals | Team records | Results summary". Cricinfo. Retrieved 21 August 2022.
 42. 1998 ICC Knockout at Cricinfo
 43. 2000 ICC Knockout at Cricinfo
 44. 2002 ICC Champions Trophy at Cricinfo
 45. 2004 ICC Champions Trophy at Cricinfo
 46. 2006 ICC Champions Trophy at Cricinfo
 47. 2004 ICC Intercontinental Cup Points Table at Cricket Archive
 48. 2005 ICC Intercontinental Cup Points Table at Cricket Archive
 49. 2006 ICC Intercontinental Cup points table at Cricket Archive
 50. ICC Emerging Nations Tournament points table at Cricket Archive
 51. 2002 ICC 6 Nations Challenge points table at Cricket Archive
 52. 2004 ICC 6 Nations Challenge points table at Cricket Archive
 53. "Records / Netherlands / One-Day Internationals / Highest totals". ESPNcricinfo. Retrieved 26 June 2023.
 54. "Records / Netherlands / One-Day Internationals / Highest Scores". ESPNcricinfo. Retrieved 28 May 2019.
 55. "Records / Netherlands / One-Day Internationals / Best bowling figures". ESPNcricinfo. Retrieved 28 May 2019.
 56. "Netherlands Cricket Team Records & Stats". Cricinfo. Retrieved 18 August 2022.
 57. "Records / Netherlands / Twenty20 Internationals / Highest totals". ESPNcricinfo. Retrieved 22 May 2019.
 58. "Records / Netherlands / Twenty20 Internationals / High scores". ESPNcricinfo. Retrieved 22 May 2019.
 59. "Records / Netherlands / Twenty20 Internationals / Best bowling figures". ESPNcricinfo. Retrieved 22 May 2019.
 60. "Records / Netherlands / One-Day Internationals / Most runs". ESPNcricinfo. Retrieved 14 August 2022.
 61. "Records / Netherlands / One-Day Internationals / Most wickets". ESPNcricinfo. Retrieved 14 August 2022.
 62. "Netherlands Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-01-04.
 63. Netherlands totals of 200 and more in an innings in the ICC Trophy Archived 2012-10-08 at the Wayback Machine at Cricket Archive
 64. Individual scores of 100 and more in an innings for Netherlands in the ICC Trophy Archived 2012-10-08 at the Wayback Machine at Cricket Archive
 65. Five or more wickets in an innings for Netherlands in the ICC Trophy Archived 2012-10-08 at the Wayback Machine at Cricket Archive
 66. "Records / Netherlands / Twenty20 Internationals / Most runs". ESPNcricinfo. Retrieved 15 January 2017.
 67. "Records / Netherlands / Twenty20 Internationals / Most wickets". ESPNcricinfo. Retrieved 15 January 2017.
 68. Tony Munro (8 October 2004).
 69. (13 November 2004).
 70. Rod Lyall (26 November 2005).
 71. (7 April 2007).
 72. (22 April 2007).
 73. Will Luke (29 January 2008).
 74. 74.0 74.1 "Drinnen leaves Netherlands post" – ESPNcricinfo.
 75. "Ex-Australia wicketkeeper Campbell to coach Netherlands".