ఆర్థర్ కోనన్ డోయల్
సర్ ఆర్థర్ కోనన్ డోయల్ మూస:Postnom | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఆర్థర్ ఇగ్నేషియస్ డోయల్ 1859 మే 22 ఎడిన్‌బర్గ్, మిడ్లోథియన్, స్కాట్లాండ్ |
మరణం | 1930 జూలై 7 క్రోబరో, ససెక్స్, ఇంగ్లండు | (వయసు 71)
వృత్తి |
|
విద్య | యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ |
రచనా రంగం |
|
గుర్తింపునిచ్చిన రచనలు |
|
జీవిత భాగస్వామి |
|
సంతానం | 5 (అడ్రియన్, జీన్ తో కలిపి) |
సంతకం |
ఆర్థర్ కోనన్ డోయల్ (1859 మే 22 - 1930 జులై 7) ఒక బ్రిటిష్ రచయిత, వైద్యుడు. 1887 లో ఈయన తన నాలుగు నవలలు, కథల కోసం షెర్లాక్ హోమ్స్ అనే పాత్రను సృష్టించాడు. ఈ పాత్ర ప్రధానంగా సాగిన రచనలు క్రైమ్ ఫిక్షన్ లో ఒక మైలురాయిలా నిలిచింది. ఈయన చేయి తిరిగిన రచయిత షెర్లాక్ హోమ్స్ పాత్రతోనే కాక, ఫాంటసీ, చారిత్రక నవలలు, వైజ్ఞానిక కల్పన, నాన్ ఫిక్షన్ విభాగాల్లో కూడా రచనలు చేశాడు.
జీవితం
[మార్చు]డోయల్ 1859 మే 22 న స్కాట్లాండులోని ఎడిన్‌బర్గ్ లో జన్మించాడు.[1][2] అతని తండ్రి చార్లెస్ ఆల్టమాంట్ డోయల్, తల్లి మేరీ. చార్లెస్ మద్యపానానికి బానిస కావడంతో 1864 లో డోయల్ కుటుంబం చెల్లా చెదురైంది. పిల్లలు ఎడిన్‌బర్గ్ లో అక్కడక్కడా నివాసం ఉండేవారు. 1867 లో ఈ కుటుంబం మళ్ళీ కలుసుకుంది.[3] చార్లెస్ 1893 లో మానసిక వ్యాధి ముదరడంతో మరణించాడు.[4][5] డోయల్ చిన్నతనం నుంచి అమ్మకు అనేక ఉత్తరాలు రాసేవాడు. అవన్నీ భద్రపరచబడి ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Scottish Writer Best Known for His Creation of the Detective Sherlock Holmes". Encyclopædia Britannica. Archived from the original on 27 May 2009. Retrieved 30 December 2009.
- ↑ "Sir Arthur Conan Doyle Biography". sherlockholmesonline.org. Archived from the original on 2 February 2011. Retrieved 13 January 2011.
- ↑ Owen Dudley Edwards, "Doyle, Sir Arthur Ignatius Conan (1859–1930)", Oxford Dictionary of National Biography, Oxford University Press, 2004.
- ↑ Lellenberg, Jon; Stashower, Daniel; Foley, Charles (2007). Arthur Conan Doyle: A Life in Letters. HarperPress. pp. 8–9. ISBN 978-0-00-724759-2.
- ↑ Stashower, pp. 20–21.