నైరోబి
నైరోబి కెన్యా దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. ఈ నగరంలో ప్రవహించే నైరోబి నదిని ఉద్దేశించిన ఎంకరే నైరోబీ అనే పదబంధం నుంచి ఈ నగరానికా పేరు వచ్చింది. కెన్యా ప్రాంతీయ భాష మాసాయ్ లో ఎంకరే నైరోబీ అంటే చల్లని నీళ్ళు అని అర్థం. 2019 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా 4,397,073. మెట్రోపాలిటన్ ఏరియాను కూడా కలుపుకుంటే 9,354,580. ఈ నగరాన్ని గ్రీన్ సిటీ ఇన్ ద సన్ అని వ్యవహరిస్తారు.[1]
నైరోబిని 1899 లో వలసరాజ్యాల అధికారులు బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉగాండా రైల్వేలో డిపోగా స్థాపించారు.[2] ఈ నగరం వెంటనే పెద్దదిగా విస్తరించి 1907 లో అంతకు మునుపు కెన్యా రాజధాని యైన మొంబాసా నగరం స్థానాన్ని ఆక్రమించింది. 1963 లో కెన్యా స్వాతంత్ర్యం అనంతరం రిపబ్లిక్ ఆఫ్ కెన్యాకు రాజధానిగా మారింది.[3] వలస పరిపాలనలో నైరోబి, కాఫీ, టీ తోటల పెంపకంలో ప్రసిద్ధి గాంచింది.[4][5] ఈ నగరం కెన్యా దక్షిణ మధ్యభాగంలో సముద్రమట్టానికి 1795 మీటర్ల ఎత్తులో ఉంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Pulse Africa. "Not to be Missed: Nairobi 'Green City in the Sun'". pulseafrica.com. Archived from the original on 28 April 2007. Retrieved 14 June 2007.
- ↑ Roger S. Greenway, Timothy M. Monsma, Cities: missions' new frontier, (Baker Book House: 1989), p.163.
- ↑ britannica.com. "Nairobi History". www.britannica.com/. Retrieved 18 February 2020.
- ↑ "Production". East Africa Sisal (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-24.
- ↑ Rashid, Mahbub (2016-06-16). The Geometry of Urban Layouts: A Global Comparative Study (in ఇంగ్లీష్). Springer. ISBN 978-3-319-30750-3.
- ↑ AlNinga. "Attractions of Nairobi". alninga.com. Archived from the original on 30 September 2007. Retrieved 14 June 2007.