1979 క్రికెట్ ప్రపంచ కప్
1979 క్రికెట్ ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ కప్ '79) | |
---|---|
తేదీలు | 1979 జూన్ 9 – జూన్ 23 |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | ఇంగ్లాండ్ |
ఛాంపియన్లు | వెస్ట్ ఇండీస్ (2nd title) |
పాల్గొన్నవారు | 8 |
ఆడిన మ్యాచ్‌లు | 15 |
ప్రేక్షకుల సంఖ్య | 1,32,000 (8,800 ఒక్కో మ్యాచ్‌కు) |
అత్యధిక పరుగులు | గార్డన్ గ్రీనిడ్జ్ (253) |
అత్యధిక వికెట్లు | మైక్ హెండ్రిక్ (10) |
← 1975 1983 → |
1979 క్రికెట్ ప్రపంచ కప్ (అధికారికంగా ప్రుడెన్షియల్ కప్ '79 అని పిలుస్తారు) క్రికెట్ ప్రపంచ కప్ రెండవ సంచిక. ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈ పోటీ ఇంగ్లాండ్‌లో 1979 జూన్ 9 నుండి 23 వరకు జరిగింది.
టోర్నమెంట్‌ను మళ్ళీ ప్రుడెన్షియల్ అస్యూరెన్స్ కంపెనీయే స్పాన్సర్ చేసింది. టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి, టోర్నమెంట్‌కు క్వాలిఫైయర్‌లో శ్రీలంకతో అర్హత సాధించిన కెనడా మాత్రమే మార్పు. ఫైనల్ పోటీ మళ్ళీ లార్డ్స్‌లోనే జరిగింది. ప్రతి గ్రూప్ నుండి రెండు జట్లు అర్హత సాధించడమనే ఫార్మాట్ కూడా మార్పు లేకుండా అలాగే ఉంది.
ఇంగ్లండ్ గ్రూప్ A నుండి రెండవ సెమీ-ఫైనలిస్టు పాకిస్తాన్‌తో చేరింది. గ్రూప్ Bలో వెస్టిండీస్ న్యూజిలాండ్ కంటే ముందు అగ్రస్థానంలో నిలిచింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండూ సెమీ-ఫైనల్స్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై గెలిచి, లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో తలపడ్డాయి. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్, గార్డన్ గ్రీనిడ్జ్ టోర్నమెంటులో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 253 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటరుగా నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు మైక్ హెండ్రిక్ పది వికెట్లతో అగ్ర బౌలరుగా నిలిచాడు.
ఫార్మాట్
[మార్చు]టోర్నమెంట్‌లోని ఎనిమిది జట్లను నాలుగు జట్లతో కూడిన రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతరులతో ఒకే రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సింగిల్-ఎలిమినేషన్ టోర్నమెంట్‌లో ఆడేందుకు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి.
పాల్గొన్న జట్లు
[మార్చు]1979 ప్రపంచ కప్‌లో మొదటి సారి క్వాలిఫైయర్‌లు ఆడారు.1979 ICC ట్రోఫీని ఇంగ్లీష్ మిడ్‌లాండ్స్‌లోని వివిధ మైదానాల్లో మే చివరి, జూన్ ప్రారంభంలో నిర్వహించారు. ఇద్దరు ఫైనలిస్టులు ప్రపంచ కప్‌కు అర్హత సాధించి, ఆటోమాటిగ్గా అర్హత సాధించిన ఆరు టెస్ట్ దేశాలతో పాటు ఆడారు.[1] సెమీ ఫైనల్స్‌లో డెన్మార్క్, బెర్ముడాలను ఓడించి శ్రీలంక, కెనడాలు ఈ అర్హత సాధించాయి. [2]
జట్టు | అర్హత విధానం | ఫైనల్స్ ప్రదర్శనలు | చివరి ప్రదర్శన | మునుపటి అత్యుత్తమ ప్రదర్శన | సమూహం |
---|---|---|---|---|---|
ఇంగ్లాండు | ఆతిధ్య దేశం | 2వ | 1975 | సెమీ-ఫైనల్ (1975) | ఎ |
భారతదేశం | పూర్తిస్థాయి సభ్యులు | 2వ | 1975 | గ్రూప్ స్టేజ్ (1975) | బి |
ఆస్ట్రేలియా | 2వ | 1975 | రన్నరప్ (1975) | ఎ | |
పాకిస్తాన్ | 2వ | 1975 | గ్రూప్ స్టేజ్ (1975) | ఎ | |
వెస్ట్ ఇండీస్ | 2వ | 1975 | ఛాంపియన్స్ (1975 ) | బి | |
న్యూజీలాండ్ | 2వ | 1975 | సెమీ-ఫైనల్ (1975) | బి | |
శ్రీలంక | 1979 ICC ట్రోఫీ విజేత | 2వ | 1975 | గ్రూప్ స్టేజ్ (1975) | బి |
కెనడా | 1979 ICC ట్రోఫీ రన్నరప్ | 1వ | — | అరంగేట్రం | ఎ |
వేదికలు
[మార్చు]లండన్ | లండన్ | |
---|---|---|
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ | ది ఓవల్ | |
సామర్థ్యం: 30,000 | సామర్థ్యం: 23,500 | |
బర్మింగ్‌హామ్ | మాంచెస్టర్ | |
ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ | ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ | |
సామర్థ్యం: 21,000 | సామర్థ్యం: 19,000 | |
నాటింగ్‌హామ్ | లీడ్స్ | |
ట్రెంట్ బ్రిడ్జ్ | హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్ | |
కెపాసిటీ: 15,350 | సామర్థ్యం: 14,000 | |
గ్రూప్ దశ
[మార్చు]సారాంశం
[మార్చు]ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లు జూన్ 9న మొదలైంది. ఆ రోజున నాలుగు మ్యాచ్‌లు ఆడారు. ఇంగ్లండ్ లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది. స్వదేశీ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, చక్కటి ఫీల్డింగు, బౌలింగుతో ఆస్ట్రేలియన్లను ఒక వికెట్ నష్టానికి 97 పరుగులకు పరిమితం చేసింది. ఆండ్రూ హిల్డిచ్ లంచ్ తర్వాత ఎదుర్కొన్న రెండవ బంతిని స్టంప్స్‌మీదకి లాక్కుని ఔటయ్యాక, ఆస్ట్రేలియన్లు నాలుగు రనౌట్‌లతో సహా 159 పరుగులకే పరిమితమయ్యారు. పరుగుల వేటలో మైక్ బ్రెర్లీ, గ్రాహం గూచ్ ఇన్నింగ్స్‌ను నియంత్రించారు. ఇంగ్లాండ్ ఆరు వికెట్లతో గెలిచింది.[3]
గ్రూప్ A
[మార్చు]Pos | Team | Pld | W | L | T | NR | Pts | RR |
---|---|---|---|---|---|---|---|---|
1 | England | 3 | 3 | 0 | 0 | 0 | 12 | 3.066 |
2 | Pakistan | 3 | 2 | 1 | 0 | 0 | 8 | 3.602 |
3 | Australia | 3 | 1 | 2 | 0 | 0 | 4 | 3.164 |
4 | Canada | 3 | 0 | 3 | 0 | 0 | 0 | 1.606 |
9 June 1979 Scorecard |
ఆస్ట్రేలియా 159/9 (60 overs) |
v | ఇంగ్లాండు 160/4 (47.1 overs) |
ఇంగ్లాండ్ 6 వికెట్లతో గెలిచింది Lord's, London, England |
9 June 1979 Scorecard |
కెనడా 139/9 (60 overs) |
v | పాకిస్తాన్ 140/2 (40.1 overs) |
పాకిస్తాన్ 8 వికెట్లతో గెలిచింది Headingley, Leeds, England |
14 June 1979 Scorecard |
పాకిస్తాన్ 286/7 (60 overs) |
v | ఆస్ట్రేలియా 197 (57.1 overs) |
పాకిస్తాన్ 89 పరుగులతో గెలిచింది Trent Bridge, Nottingham, England |
14 June 1979 Scorecard |
కెనడా 45 (40.3 overs) |
v | ఇంగ్లాండు 46/2 (13.5 overs) |
ఇంగ్లాండ్ 8 వికెట్లతో గెలిచింది Old Trafford, Manchester, England |
16 June 1979 Scorecard |
ఇంగ్లాండు 165/9 (60 overs) |
v | పాకిస్తాన్ 151 (56 overs) |
ఇంగ్లాండ్ 14 పరుగులతో గెలిచింది Headingley, Leeds, England |
20 June 1979 Scorecard |
ఇంగ్లాండు 221/8 (60 overs) |
v | న్యూజీలాండ్ 212/9 (60 overs) |
England won by 9 runs Old Trafford, Manchester, England |
గ్రూప్ బి
[మార్చు]Pos | Team | Pld | W | L | T | NR | Pts | RR |
---|---|---|---|---|---|---|---|---|
1 | West Indies | 3 | 2 | 0 | 0 | 1 | 10 | 3.928 |
2 | New Zealand | 3 | 2 | 1 | 0 | 0 | 8 | 3.553 |
3 | Sri Lanka | 3 | 1 | 1 | 0 | 1 | 6 | 3.558 |
4 | India | 3 | 0 | 3 | 0 | 0 | 0 | 3.128 |
9 June 1979 Scorecard |
భారతదేశం 190 (53.1 overs) |
v | వెస్ట్ ఇండీస్ 194/1 (51.3 overs) |
వెస్టిండీస్ 9 వికెట్లతో గెలిచింది Edgbaston, Birmingham, England |
9 June 1979 Scorecard |
శ్రీలంక 189 (56.5 overs) |
v | న్యూజీలాండ్ 190/1 (47.4 overs) |
న్యూజీలాండ్ 9 వికెట్లతో గెలిచింది Trent Bridge, Nottingham, England |
13, 14, 15 June 1979 Scorecard |
శ్రీలంక |
v | వెస్ట్ ఇండీస్ |
Match abandoned without a ball bowled The Oval, London, England |
13 June 1979 Scorecard |
భారతదేశం 182 (55.5 overs) |
v | న్యూజీలాండ్ 183/2 (57 overs) |
న్యూజీలాండ్ 8 వికెట్లతో గెలిచింది Headingley, Leeds, England |
18 June 1979 Scorecard |
శ్రీలంక 238/5 (60 overs) |
v | భారతదేశం 191 (54.1 overs) |
Sri Lanka won by 47 runs Old Trafford, Manchester, England |
16 June 1979 Scorecard |
వెస్ట్ ఇండీస్ 244/7 (60 overs) |
v | న్యూజీలాండ్ 212/9 (60 overs) |
వెస్టిండీస్ 32 పరుగులతో గెలిచింది Trent Bridge, Nottingham, England |
నాకౌట్ దశ
[మార్చు]Semi-finals | Final | ||||||
20 June – Old Trafford, Manchester | |||||||
ఇంగ్లాండు | 221/8 | ||||||
న్యూజీలాండ్ | 212/9 | ||||||
23 June – Lord's, London | |||||||
ఇంగ్లాండు | 194 | ||||||
వెస్ట్ ఇండీస్ | 286/9 | ||||||
20 June – The Oval, London | |||||||
వెస్ట్ ఇండీస్ | 293/6 | ||||||
పాకిస్తాన్ | 250 |
సెమీ ఫైనల్స్
[మార్చు]పోటాపోటీగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్సు ఘోరంగా మొదలై, 38/2తో పడిపోయింది. మైక్ బ్రేర్లీ (115 బంతుల్లో 53, 3 ఫోర్లు), గ్రాహం గూచ్ (84 బంతుల్లో 71, 1 ఫోర్, 3 సిక్సర్లు) ల బ్యాటింగుతో పుంజుకుంది. డెరెక్ రాండాల్ (50 బంతుల్లో 42, 1 ఫోర్, 1 సిక్స్) ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో బాగా ఆడాడు. ఇంగ్లాండ్ 98/4 నుండి కోలుకుని 221 (8 వికెట్లు, 60 ఓవర్లు) స్కోరు చేసింది. ప్రతిస్పందనగా, జాన్ రైట్ (137 బంతుల్లో 69) ప్రారంభంలో బాగానే బ్యాటింగు చేశాడు. అయితే, వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ వెనకబడీంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా ఆలస్యంగా విజృంభించినప్పటికీ, న్యూజిలాండ్ పుంజుకోలేకపోయింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ మిగిలిన 14 పరుగులను సాధించలేకపోవడంతో, ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది.
గార్డన్ గ్రీనిడ్జ్ (107 బంతుల్లో 73, 5 ఫోర్లు, 1 సిక్స్), డెస్మండ్ హేన్స్ (115 బంతుల్లో 65, 4 ఫోర్లు) బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించి, మ్యాచ్‌లో 132 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ కూడా గట్టి సహకారం అందించారు. దాంతో వెస్టిండీస్, పాకిస్తాన్‌పై 293 (6 వికెట్లు, 60 ఓవర్లు) పరుగులు చేసింది. మాజిద్ ఖాన్ (124 బంతుల్లో 81, 7 ఫోర్లు), జహీర్ అబ్బాస్ (122 బంతుల్లో 93) రెండో వికెట్‌కు 36 ఓవర్లలో 166 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, ఇతర పాకిస్థానీ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు, జావేద్ మియాందాద్ మొదటి బంతికి డకౌట్ అయ్యాడు. ఈ సెమీ-ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 56.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ చేసి, వెస్టిండీస్ ఫైనల్‌కు చేరింది.
20 June 1979 Scorecard |
వెస్ట్ ఇండీస్ 293/6 (60 overs) |
v | పాకిస్తాన్ 250 (56.2 overs) |
West Indies won by 43 runs The Oval, London, England |
ఫైనల్
[మార్చు]టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రీనిడ్జ్, హేన్స్, కాళీచరణ్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌ల వైఫల్యంతో వెస్టిండీస్ 99/4కి పడిపోయింది. అయితే వివియన్ రిచర్డ్స్ (157 బంతుల్లో 138, 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కొల్లిస్ కింగ్ (66 బంతుల్లో 86, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్ ను సుస్థిరం చేశారు. కింగ్ ముఖ్యంగా 130.3 స్ట్రైక్ రేట్‌తో ఇంగ్లీష్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. కోలిస్ కింగ్‌ను కోల్పోవడంతో 139 పరుగుల భాగస్వామ్యం ముగిసినప్పటికి వెస్టిండీస్ 238/5 వద్ద ఉంది. వివియన్ రిచర్డ్స్, మిగతా బ్యాటర్లు కలిసి వెస్టిండీస్‌ను 286 పరుగులకు (9 వికెట్లు, 60 ఓవర్లు) తీసుకెళ్లారు.
ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు శుభారంభం లభించింది. కానీ ఓపెనర్లు మైక్ బ్రెర్లీ (130 బంతుల్లో 64, 7 ఫోర్లు), జియోఫ్ బాయ్‌కాట్ (105 బంతుల్లో 57, 3 ఫోర్లు) చాలా నెమ్మదిగా స్కోరు చేశారు. వారు 38 ఓవర్లలో 129 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐదు రోజుల టెస్టులో ఆడినట్లు ఆడారు. ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యే సమయానికి, అవసరమైన రన్ రేట్ చాలా ఎక్కువగా పెరిగింది. గ్రాహం గూచ్ తన 32 పరుగులు చేయడంలో కొన్ని భారీ స్ట్రోక్‌లు ఆడి, ఇంగ్లాండ్‌ను 183/2కి తీసుకెళ్లాడు. అయితే, డెరెక్ రాండాల్‌ను కోల్పోవడం బ్యాటింగ్ పతనానికి దారితీసింది. ఇంగ్లాండ్ 11 పరుగులకే తమ చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయి 51 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. వివియన్ రిచర్డ్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
23 June 1979 Scorecard |
వెస్ట్ ఇండీస్ 286/9 (60 overs) |
v | ఇంగ్లాండు 194 (51 overs) |
West Indies won by 92 runs Lord's, London, England |
గణాంకాలు
[మార్చు]గార్డన్ గ్రీనిడ్జ్ నాలుగు గేమ్‌ల నుండి 253 పరుగులతో టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటరుగా నిలిచాడు. రెండవ స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు, వివ్ రిచర్డ్స్ నాలుగు గేమ్‌లలో 217 పరుగులు చేసాడు. ఇందులో ఫైనల్‌లో టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 138 ఉంది. ఇంగ్లాండ్‌కు చెందిన గ్రాహం గూచ్ మూడవ స్థానంలో నిలిచాడు. [4] ఇంగ్లండ్‌కు చెందిన మైక్ హెండ్రిక్ ఐదు మ్యాచ్‌లలో పది వికెట్లతో టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో ఉండగా, బ్రియాన్ మెక్‌కెచ్నీ (న్యూజిలాండ్), ఆసిఫ్ ఇక్బాల్ (పాకిస్తాన్), క్రిస్ ఓల్డ్ లు ఒక్కొక్కరు తొమ్మిది వికెట్లు పడగొట్టి రెండవ స్థానంలో నిలిచారు.[5]
అత్యధిక పరుగులు
[మార్చు]ఆటగాడు | జట్టు | Mat | Inns | పరుగులు | Ave | SR | HS | 100 | 50 | 4s | 6s |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గోర్డాన్ గ్రీనిడ్జ్ | వెస్ట్ ఇండీస్ | 4 | 4 | 253 | 84.33 | 62.31 | 106* | 1 | 2 | 17 | 3 |
వివ్ రిచర్డ్స్ | వెస్ట్ ఇండీస్ | 4 | 4 | 217 | 108.50 | 74.06 | 138* | 1 | 0 | 13+ | 4+ |
గ్రాహం గూచ్ | ఇంగ్లాండు | 5 | 5 | 210 | 52.50 | 63.82 | 71 | 0 | 2 | 18 | 4 |
గ్లెన్ టర్నర్ | న్యూజీలాండ్ | 4 | 4 | 176 | 88.00 | 56.05 | 83* | 0 | 1 | 12+ | 0+ |
జాన్ రైట్ | న్యూజీలాండ్ | 4 | 4 | 166 | 41.50 | 50.00 | 69 | 0 | 1 | 16+ | 0+ |
అత్యధిక వికెట్లు
[మార్చు]ఆటగాడు | జట్టు | Mat | Inns | Wkts | Ave | Econ | BBI | SR |
---|---|---|---|---|---|---|---|---|
మైక్ హెండ్రిక్ | ఇంగ్లాండు | 5 | 5 | 10 | 14.90 | 2.66 | 4/15 | 33.6 |
బ్రియాన్ మెక్ కెచ్నీ | న్యూజీలాండ్ | 4 | 4 | 9 | 15.66 | 3.07 | 3/24 | 30.5 |
ఆసిఫ్ ఇక్బాల్ | పాకిస్తాన్ | 4 | 4 | 9 | 17.44 | 3.34 | 4/56 | 31.3 |
క్రిస్ ఓల్డ్ | ఇంగ్లాండు | 5 | 5 | 9 | 17.44 | 2.70 | 4/8 | 38.6 |
మైఖేల్ హోల్డింగ్ | వెస్ట్ ఇండీస్ | 4 | 4 | 8 | 13.25 | 2.58 | 4/33 | 30.7 |
అధికారులు
[మార్చు]ప్రపంచ కప్‌లో 16 మ్యాచ్‌లను పర్యవేక్షించేందుకు ఇంగ్లండ్‌కు చెందిన 8 మంది అంపైర్లు ఎంపికయ్యారు. మొదటి సెమీఫైనల్‌ను జాన్ లాంగ్రిడ్జ్, కెన్ పాల్మెర్ పర్యవేక్షించగా, రెండవ సెమీఫైనల్‌ను లాయిడ్ బడ్, డేవిడ్ కాన్స్టాంట్ పర్యవేక్షించారు. డిక్కీ బర్డ్, బారీ మేయర్ ఫైనల్ పర్యవేక్షణకు ఎంపికయ్యారు.
హాజరు
[మార్చు]టోర్నమెంట్‌లో మొత్తం హాజరు 132,000, [6] ఫైనల్‌లో 25,000 మంది ఉన్నారు. [7]
మూలాలు
[మార్చు]- ↑ "ICC Trophy 1979 – background". ESPNcricinfo.com. Archived from the original on 9 November 2013. Retrieved 9 November 2013.
- ↑ "Canada fight back to earn Cup place". The Daily Telegraph. 7 June 1979. p. 33.
- ↑ Melford, Michael (11 June 1979). "ఇంగ్లాండ్ triumph in fine show of all-round skills". The Guardian. p. 30.
- ↑ "Cricket World Cup: Highest Run Scorers". ESPNcricinfo. Retrieved 2011-08-23.
- ↑ "Cricket World Cup: Most Wickets". ESPNcricinfo. Retrieved 2011-08-23.
- ↑ "The Prudential World Cup 1979". Wisden Almanack. 1 January 1980.
- ↑ "The Richards Cup". ESPNcricinfo. 3 November 2014.