జాన్ రైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ రైట్

మూస:Post-nominals/NZL
1990లో జాన్ రైట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ జాఫ్రీ రైట్
పుట్టిన తేదీ (1954-07-05) 1954 జూలై 5 (వయసు 69)
డార్ఫీల్డ్, న్యూజిలాండ్
బ్యాటింగులెఫ్ట్ హ్యాండెడ్
బౌలింగుకుడిచేతి మీడియం పేస్ బౌలింగ్
పాత్రఓపెనింగ్ బ్యాట్స్‌మన్
బంధువులుజియోఫ్ రైట్ (క్రికెటర్) (తండ్రి)
అలన్ రైట్ (అంకుల్)[1]
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 141)1978 ఫిబ్రవరి 10 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1993 మార్చి 16 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 28)1978 జూలై 15 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1992 డిసెంబరు 12 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975/76–1983/84Northern Districts
1977–1988Derbyshire
1984/85–1988/89Canterbury
1989/90–1992/93Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 82 149 366 349
చేసిన పరుగులు 5,334 3,891 25,073 10,240
బ్యాటింగు సగటు 37.82 26.46 42.35 30.84
100లు/50లు 12/23 1/24 59/126 6/68
అత్యుత్తమ స్కోరు 185 101 192 108
వేసిన బంతులు 30 24 370 42
వికెట్లు 0 0 2 1
బౌలింగు సగటు 169.50 18.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/4 1/8
క్యాచ్‌లు/స్టంపింగులు 38/– 51/– 192/– 108/–
మూలం: Cricinfo, 2016 నవంబరు 4

జాన్ రైట్ (ఆంగ్లం: John Wright; 1954 జులై 5) భారత జట్టుకు తొలి విదేశీ కోచ్. న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన మాజీ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన అంతర్జాతీయ క్రికెట్ లోకి 1978లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. ఆయన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (ఎంబిఇ) గ్రహిత.

ఆయన 5,000 కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేసి మొదటి న్యూజిలాండ్ టెస్ట్ ఆటగాడుగా నిలిచాడు.[2] 12 టెస్ట్ సెంచరీలతో ఒక్కో ఔట్‌కి సగటున 37.82 పరుగులు చేశాడు, వాటిలో 10 న్యూజిలాండ్‌లో ఉన్నాయి. అతను 1977 నుండి 1988 వరకు ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్ తరపున కూడా ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను 50కి పైగా ఫస్ట్-క్లాస్ సెంచరీలతో సహా 25,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.[3] అతను లిస్ట్ - ఎ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 10,000కు పైగా పరుగులు చేశాడు.

ఆయన పదవీ విరమణ 1993లో జరిగింది. ఆ తరువాత 2000 నుండి 2005 వరకు భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. అలాగే 2010 నుండి 2012 వరకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించాడు.

సంగీతం పై మక్కువ[మార్చు]

క్రికెటర్‌గా పర్యటనలో ఉన్నప్పుడు జాన్ రైట్ ఎల్లప్పుడూ తన గిటార్‌ను వెంటపెట్టుకుంటాడు. ఆయన 2017లో తన తొలి ఆల్బమ్ రెడ్ స్కైస్‌(Red Skies)ని విడుదల చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా, కోచ్‌గా ఉన్న ఆయన తన కెరీర్ మొత్తం పాటలతోనే సాగింది. ఆయన జంప్ ది సన్(Jump the Sun) పేరుతో కొత్త పాటల ఈపిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.[4][5]

ప్రచురణలు[మార్చు]

న్యూజిలాండ్ రచయిత పాల్ థామస్‌తో కలిసి 1990లో జాన్ రైట్ క్రిస్మస్ ఇన్ రరోటోంగా (Christmas in Rarotonga) అనే ఆత్మకథను రాశాడు.[6] భారతీయ జర్నలిస్టు శారదా ఉగ్రా, పాల్ థామస్‌లతో కలిసి, జాన్ రైట్ భారత జట్టు కోచ్‌గా తన అనుభవాలను వివరిస్తూ 2006లో జాన్ రైట్స్ ఇండియన్ సమ్మర్స్ అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "Celebrating Sir Allan Wright". Christ's College. మార్చి 24 2021. Retrieved అక్టోబరు 3 2022. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  2. "Bodyline's quiet beginning". ESPNcricinfo. Retrieved డిసెంబరు 4 2017. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "How many overseas players have made their IPL debut before their first-class debuts?". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 19 2022. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "Cricketing great John Wright on going from the crease to the stage". Stuff (in ఇంగ్లీష్). 2019-11-01. Retrieved 2021-04-20.
  5. "Former cricketer John Wright has a shot at rhythm, and blues". Stuff (in ఇంగ్లీష్). 2016-12-22. Retrieved 2021-04-20.
  6. Haigh, Gideon (డిసెంబరు 20 2003). "Cricket, the Wright way". The Age. Retrieved మే 7 2020. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  7. Haigh, Gideon (డిసెంబరు 20 2003). "Cricket, the Wright way". The Age. Retrieved మే 7 2020. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=జాన్_రైట్&oldid=4030265" నుండి వెలికితీశారు