ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం
చెపాక్ స్టేడియం
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం
పటం
Locationవాలాజా రోడ్, చెపాక్, చెన్నై
Public transitGovernment Estate metro station
Chepauk MRTS Station
Ownerతమిళనాడు క్రికెట్ అసోసియేషన్
Operatorతమిళనాడు క్రికెట్ అసోసియేషన్
Capacity50,000[1]
Construction
Architectఈస్ట్ కోస్ట్ కన్‌స్ట్రక్షన్స్
హాప్కిన్స్ ఆర్కిటెక్ట్స్, లండన్[2]
చెపాక్ స్టేడియం
Lord's of India
మైదాన సమాచారం
స్థాపితం1916
వాడుతున్నవారుచెన్నై సూపర్ కింగ్స్ (2008 - ప్రస్తుతం)
తమిళనాడు క్రికెట్ జట్టు (1930 - ప్రస్తుతం)
భారత క్రికెట్ జట్టు (1934 - ప్రస్తుతం)
ఎండ్‌ల పేర్లు
అన్నా పెవిలియన్ ఎండ్
వి పట్టాభిరామన్ గేట్ ఎండ్
అంతర్జాతీయ సమాచారం
మొదటి టెస్టు1934 10–13 ఫిబ్రవరి:
 India v  ఇంగ్లాండు
చివరి టెస్టు2021 13–17 ఫిబ్రవరి:
 India v  ఇంగ్లాండు
మొదటి ODI1987 9 అక్టోబరు:
 India v  ఆస్ట్రేలియా
చివరి ODI202322 మార్చి:
 India v  ఆస్ట్రేలియా
మొదటి T20I2012 11 సెప్టెంబరు:
 India v  న్యూజీలాండ్
చివరి T20I2018 11 నవంబరు:
 India v  వెస్ట్ ఇండీస్
ఏకైక మహిళా టెస్టు1976 7–9 నవంబరు:
 India v  వెస్ట్ ఇండీస్
మొదటి WODI1984 23 ఫిబ్రవరి:
 India v  ఆస్ట్రేలియా
చివరి WODI2007 5 మార్చి:
 ఆస్ట్రేలియా v  న్యూజీలాండ్
మొదటి WT20I2016 23 మార్చి:
 దక్షిణాఫ్రికా v  ఐర్లాండ్
చివరి WT20I2016 27 మార్చి:
 ఇంగ్లాండు v  పాకిస్తాన్
జట్టు సమాచారం
తమిళనాడు (1916–ప్రస్తుతం)
చెన్నై సూపర్ కింగ్స్ (IPL) (2008–ప్రస్తుతం)
ఇండియా (1934-ప్రస్తుతం)
2023 22 మార్చి నాటికి
Source: ESPNcricinfo

ముత్తయ్య అన్నామలై చిదంబరం స్టేడియం, చెన్నైలోని క్రికెట్ స్టేడియం.[3] దీన్ని సాధారణంగా చెపాక్ స్టేడియం అని కూడా అంటారు. 1916లో స్థాపించబడిన ఈ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ తర్వాత దేశంలో రెండవ పురాతన క్రికెట్ స్టేడియం. గతంలో మద్రాస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌గా పిలిచే ఈ స్టేడియానికి BCCI మాజీ అధ్యక్షుడు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధిపతి అయిన MA చిదంబరం చెట్టియార్ పేరు పెట్టారు. ఇది తమిళనాడు క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ లకు హోమ్ గ్రౌండ్. చెపాక్‌లో 1934 ఫిబ్రవరి 10 న మొదటి టెస్ట్ మ్యాచ్, 1936లో మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్ నిర్వహించారు. 1952లో ఇంగ్లండ్‌పై భారత క్రికెట్ జట్టు సాధించిన టెస్టు విజయం ఈ మైదానంలో మొదటిది. టెస్టు చరిత్రలో టై అయిన రెండు టెస్టుల్లో ఒకటి ఈ స్టేడియం లోనే, 1986లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగింది.

స్థానం

[మార్చు]

బంగాళాఖాతం వెంబడి మెరీనా బీచ్ నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో చెపాక్ వద్ద ఈ స్టేడియం ఉంది. ఉత్తరాన వాలాజా రోడ్, పశ్చిమాన బాబు జగ్జీవన్‌రామ్ రోడ్, దక్షిణాన పైక్రాఫ్ట్స్ రోడ్ నుండి స్టేడియం చేరుకోవచ్చు. ఈ స్టేడియం గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ ద్వారా, చెన్నై మెట్రో ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇది చెన్నై MRTS చెన్నై బీచ్ - వేలచేరి విభాగంలో ఉన్న చెపాక్ MRTS రైల్వే స్టేషన్ నుండి కూడా రవాణా సౌకర్యం ఉంది. స్టేడియానికి ఉత్తరం వైపుగా బకింగ్‌హామ్ కెనాల్ ప్రవహిస్తుంది.

చెపాక్ స్టేడియం 1768 నుండి 1855 వరకు ఆర్కాట్ నవాబ్ఉ అధికారిక నివాసం అయిన చెపాక్ ప్యాలెస్ సమీపంలో ఉంది. స్టేడియం ప్రదేశం చెపాక్ ప్యాలెస్ కు చెందిన ప్యాలెస్ మైదానంలో భాగంగా ఉండేది. స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మూడు ఇండో సారాసెనిక్ శైలి స్తంభాలు పూర్వపు ప్యాలెస్ గ్రౌండ్స్‌తో అనుబంధం యొక్క చివరి అవశేషాలు. ఈ స్తంభాలు నవాబ్ ముహమ్మద్ అలీ ఖాన్ వాలాజా [4][5] పాలన నాటి రాష్ట్ర క్రికెట్ అసోసిటేర్ చేత నిర్మించబడ్డాయి.

చరిత్ర

[మార్చు]

1859లో, మద్రాస్ ప్రెసిడెన్సీ చెపాక్ ప్యాలెస్‌ను వేలంలో 589,000కి కొనుగోలు చేసింది.[6][7] 1865లో మద్రాస్ క్రికెట్ క్లబ్‌కు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పెవిలియన్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పెవిలియన్ 1866లో పూర్తయింది. 1892లో దాన్ని పునర్నిర్మించారు.[8] స్టేడియం పునరుద్ధరణలో భాగంగా 1982 లో ధ్వంసం చేసేంతవరకు ఉపయోగించబడింది.[7]

చెపాక్ స్టేడియాన్ని 1916లో నిర్మించారు. అప్పటి నుండి ఇది తమిళనాడు క్రికెట్ జట్టుకు స్వంత వేదికగా ఉంది.[9] కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ తర్వాత ఇది దేశంలో రెండవ పురాతన క్రికెట్ స్టేడియం. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయి. బాంబే జింఖానా మొదటిది అయినప్పటికీ, ప్రస్తుతం దాన్ని అంతర్జాతీయ క్రికెట్‌కు ఉపయోగించడం లేదు.

1960 నుండి 1988 వరకు, ఏటా జనవరి రెండవ వారంలో ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్‌ జరుగుతూ ఉండేది. ఆ సమయానికి వచ్చే పొంగల్ (సంక్రాంతి) పండుగ పేరిట దాన్ని పొంగల్ టెస్ట్ అని అనేవారు.[10][11]

నవీకరణలు

[మార్చు]

2010 జూన్‌లో, రూ 175 కోట్ల వ్యయంతో స్టేడియం నవీకరణ పనులు చేపట్టారు.[12][13] బాగా వెలుతురు వచ్చేలా PTFE మెమ్బ్రేన్ కప్పుతో, 12,000 మంది ప్రేక్షకులు కూచునేలా, 24 హాస్పిటాలిటీ బాక్స్‌లు ఉండేలా I, J, K అనే మూడు కొత్త స్టాండ్‌లను నిర్మించడం ఈ ప్రణాళికలో భాగం.[14] ఈ నిర్మాణాల కోసం హాప్కిన్స్ ఆర్కిటెక్ట్స్, లండన్, నటరాజ్ & వెంకట్ ఆర్కిటెక్ట్స్, చెన్నైతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది.

పునరుద్ధరణ 2011లో పూర్తయింది. పాత స్టేడియంలో ప్రేక్షకులకు అడ్డుగా ఉండే స్తంభాలతో కూడిన పాత కప్పు స్థానంలో తేలికైన శంఖాకారపు కప్పు వేసారు. ప్రస్తుతం ఈ స్టేడియంలో 50,000 మంది ప్రేక్షకులు కూచునే సామర్థ్యం ఉంది. స్టాండ్‌లు 36° వాలులో ఉంటాయి. సముద్రపు గాలి ధారాళంగా లోపలికి వస్తుంది.[15]

పునర్నిర్మాణం ప్రజా భద్రతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తోందని 2015 మార్చి 31 న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.[16][17] నిబంధనలను ఉల్లంఘించే పునరుద్ధరణ భాగాలను కూల్చివేయాలనీ, తగిన ప్లానింగ్ అనుమతులు జారీ చేసి, కూల్చివేత పూర్తయ్యే వరకూ, మూడు స్టాండ్‌లకు (I, J, K) సీలు వేయాలని కోర్టు తీర్పు చెప్పింది.[18][19] ఆ తరువాత స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లలో I, J, K స్టాండ్‌లకు తాళం వేసే ఉంచారు. చివరకు 2020 మార్చిలో వీటిని తిరిగి తెరిచారు.[20]

2021 డిసెంబరులో, కొత్త పెవిలియన్, కొత్త స్టాండ్‌ల కోసం పాత అన్నా పెవిలియన్, అన్నా పెవిలియన్ స్టాండ్, MCC క్లబ్‌హౌస్ లను కూల్చివేసారు.[21] కొత్త నిర్మాణాలు 2023లో పూర్తవుతాయని అంచనా. దీనితో పాటు, తాత్కాలిక సీటింగ్, స్టాండింగ్ లను తొలగించి, శాశ్వత సీటింగ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సామర్థ్యాన్ని 40,000కి తగ్గిస్తారు.[21] దీని వ్యయం ₹139 కోట్ల అవుతుంది.

స్టేడియంలో అన్నా పెవిలియన్‌ ఉండే కొత్త స్టాండ్‌కు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరు పెట్టనున్నారు. రీడిజైన్ చేసిన అన్నా పెవిలియన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యాధునిక ఇండోర్ శిక్షణా సౌకర్యం ఉంటుంది. దీనిని 2023 మార్చి 17 న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి ప్రారంభించాడు.[22]

లీజు

[మార్చు]

స్టేడియం మొత్తం వైశాల్యం 69,900 చ.మీ. ఈ భూమి ప్రభుత్వానికి, అసోసియేషనుకూ మధ్య లీజు ఒప్పందంలో ఉంది. 2015 ఏప్రిల్‌లో ఈ లీజు ఒప్పందం రద్దయింది.[23] 2019 నవంబరులో తమిళనాడు ప్రభుత్వం స్టేడియం లీజును 2015 నుండి 21 సంవత్సరాలకు పొడిగించింది.

గుర్తించదగిన సంఘటనలు

[మార్చు]
 • రంజీ ట్రోఫీలో మొదటి మ్యాచ్ 1934 నవంబరు 4న మద్రాసు, మైసూరుల మధ్య చెపాక్‌లో జరిగింది.[24] మద్రాస్‌కు చెందిన ఎంజే గోపాలన్‌ ఎన్‌ కర్టిస్‌కు తొలి బంతి వేశాడు.
 • 1952లో చెపాక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 24వ మ్యాచ్‌లో భారత్ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
 • క్రికెట్ చరిత్రలో టై అయిన రెండో టెస్టు 1986లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరిగింది.
 • సునీల్ గవాస్కర్ తన 30వ టెస్ట్ మ్యాచ్ సెంచరీని 1983లో సాధించి, టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టాడు.[25]
 • 1988 జనవరిలో వెస్టిండీస్‌పై నరేంద్ర హిర్వానీ 61 పరుగులకు 8 వికెట్లు పడగొట్టడం తొలి టెస్టులో భారతీయుడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. క్రికెట్‌ చరిత్రలో మూడోది. 2023 జూలై నాటికి, తొలి టెస్టులో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక భారతీయ క్రికెటరు అతనే. ఈ మ్యాచ్‌లో హిర్వానీ 136 పరుగులకు 16 వికెట్లు పడగొట్టాడు.
 • 1997లో భారత్‌పై పాకిస్థాన్‌కు చెందిన సయీద్ అన్వర్ 194 పరుగులు చేశాడు, ఆ సమయానికి అది అత్యధిక వన్డే స్కోరు.[26][27]
 • 2004 అక్టోబరు 15 న షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ సాధించిన 532 టెస్ట్ వికెట్ల సంఖ్యను అధిగమించి ఆ సమయంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
 • ఈ స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్, దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. 2008 ఏప్రిల్ లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇక్కడ జరిగిన మొదటి టెస్టులో కేవలం 278 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. ఇది టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. డోనాల్డ్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారాల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ నిలిచాడు. మ్యాచ్ మూడవ రోజు ఒక్కరోజునే అతను 257 పరుగులు చేసాడు. ఇది 1954 నుండి ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక రోజులో ఒక బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు. పాకిస్తాన్‌తో నాటింగ్‌హామ్ టెస్ట్ రెండో రోజున డెనిస్ కాంప్టన్ 273 పరుగులు చేసాడు.[28]
 • దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, 10,000 టెస్ట్ పరుగులను పూర్తి చేశాడు. అదే మ్యాచ్‌లో సెహ్వాగ్ 319 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ చివరికి కూడా ఆ టెస్ట్ ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు.
 • సచిన్ టెండూల్కర్ చెపాక్‌లో భారతదేశంలోని ఇతర వేదికల కంటే ఎక్కువ పరుగులు చేశాడు, తొమ్మిది టెస్టుల్లో 87.60 సగటుతో 876 పరుగులు చేశాడు.
 • 2001 మార్చి 22 న, భారత్ 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది, ఇది టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు ఉన్న 16 వరస మ్యాచ్ విజయాల పరంపరను ముగించింది.
 • 2008 డిసెంబరులో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో నాల్గవ ఇన్నింగ్స్‌లో భారత్ 387/4 స్కోరు చేసి, ఆ మ్యాచ్ గెలుచుకుంది. భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక విజయవంతమైన పరుగుల వేట అది.
 • 2013 ఫిబ్రవరి 24న స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 1వ టెస్టులో మహేంద్ర సింగ్ ధోని 224 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతడు. మొత్తం టెస్ట్ క్రికెట్‌లో అది సాధించిన 7వ వికెట్ కీపర్. ఆ టెస్టులో భారత్, 572 పరుగులకు తమ ఇన్నింగ్స్ ముగించింది.
 • 2016 డిసెంబరు 19న స్వదేశీ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టెస్టులో కరుణ్ నాయర్ 303* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 759–7పై ఇన్నింగ్స్‌లో డిక్లేర్ చేసింది, ఇది ఆ జట్టు చేసిన అత్యధిక స్కోరు. అతను 300 పరుగులు చేసిన 6వ అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మనే కాక, అది సాధించిన 2 వ భారత ఆటగాడిగా (వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత) నిలిచాడు.
 • జో రూట్ 2021 ఫిబ్రవరి 6 న భారత్‌తో జరిగిన 1వ టెస్ట్‌లో 218 (337) పరుగులు చేశాడు. ఇది భారతదేశంలో ఒక ఇంగ్లీష్ క్రికెటర్ చేసిన అత్యధిక స్కోరు. ఏ క్రికెటరైనా 100 వ టెస్ట్‌లో చేసిన అత్యధిక స్కోరు అది.[29]

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు

[మార్చు]

టెస్ట్ బ్యాటింగ్ రికార్డులు

[మార్చు]

Test Matches Record[30]
Team Pld W L T D
 భారతదేశం 34 15 7 1 11
 ఇంగ్లాండు 11 4 6 0 1
 ఆస్ట్రేలియా 7 1 3 1 2
 వెస్ట్ ఇండీస్ 7 1 4 0 2
 పాకిస్తాన్ 4 1 1 0 2
 న్యూజీలాండ్ 2 0 1 0 1
 శ్రీలంక 2 0 0 0 2
 దక్షిణాఫ్రికా 1 0 0 0 1

ODI Matches Record[31]
Team Pld W L T NR
 భారతదేశం 13 7 5 0 1
 వెస్ట్ ఇండీస్ 7 2 5 0 0
 ఆస్ట్రేలియా 5 4 1 0 0
 న్యూజీలాండ్ 4 1 2 0 1
 ఇంగ్లాండు 3 2 1 0 0
 పాకిస్తాన్ 2 2 0 0 0
 కెన్యా 2 1 1 0 0
 దక్షిణాఫ్రికా 2 0 2 0 0
 బంగ్లాదేశ్ 1 0 1 0 0
 జింబాబ్వే 1 0 1 0 0
Asia XI 2 2 0 0 0
Africa XI 2 0 2 0 0

T20I Record[32]
జట్టు Pld W L T NR
 భారతదేశం 2 1 1 0 0
 న్యూజీలాండ్ 1 1 0 0 0
 వెస్ట్ ఇండీస్ 1 0 1 0 0

Most career runs[33]
Runs Player Period
1,018 (21 ఇన్నింగ్స్‌లు) భారతదేశం సునీల్ గవాస్కర్ 1973–1987
970 (16 ఇన్నింగ్స్‌లు) భారతదేశం సచిన్ టెండుల్కర్ 1993–2013
785 (17 ఇన్నింగ్స్‌లు) భారతదేశం గుండప్ప విశ్వనాథ్ 1969–1982
729 (10 ఇన్నింగ్స్‌లు) భారతదేశం వీరేంద్ర సెహ్వాగ్ 2002–2013
708 (17 ఇన్నింగ్స్‌లు) భారతదేశం కపిల్ దేవ్ 1979–1993

Most career runs (non-India)[34]
Runs Player Period
391 (6 ఇన్నింగ్స్‌లు) ఇంగ్లాండ్ జో రూట్ 2016–2021
345 (4 ఇన్నింగ్స్‌లు) ఆస్ట్రేలియా అలన్ బోర్డర్ 1976–1986
335 (4 ఇన్నింగ్స్‌లు) ఆస్ట్రేలియా మ్యాథ్యూ హేడెన్ 2001–2004
249 (2 ఇన్నింగ్స్‌లు) దక్షిణాఫ్రికా నీల్ మెకెంజీ 2008
245 (4 ఇన్నింగ్స్‌లు) పాకిస్తాన్ జావేద్ మియాందాద్ 1980–1987

Highest individual scores[35]
Runs Player Year
319 v. South Africa భారతదేశం వీరేంద్ర సెహ్వాగ్ 2008
303* v. England భారతదేశం కరుణ్ నాయర్ 2016
236* v. West Indies భారతదేశం సునీల్ గవాస్కర్ 1983
224 v. Australia భారతదేశం మహేంద్రసింగ్ ధోని 2013
222 v. England భారతదేశం గుండప్ప విశ్వనాథ్ 1982

Most centuries (3 or more)[36]
Centuries Player Period
5 (16 ఇన్నింగ్స్‌లు) భారతదేశం సచిన్ టెండుల్కర్ 1993–2013
3 (21 ఇన్నింగ్స్‌లు) భారతదేశం సునీల్ గవాస్కర్ 1973–1987

క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

3 ప్రపంచ కప్‌లలో 7 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరిగాయి. 1997 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్ కూడా జరిగింది.

ఈ స్టేడియం వేదికగా జరిగే ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

1987 క్రికెట్ ప్రపంచ కప్

1987 అక్టోబరు 9
ఆస్ట్రేలియా 
270/6 (50 ఓవర్లు)
v
 భారతదేశం
269 (49.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా 1 పరిఉగుతో గెలిచింది
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్, డికీ బర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జెఫ్ మార్ష్

1996 క్రికెట్ ప్రపంచ కప్

1996 మార్చి 11
న్యూజీలాండ్ 
286/9 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
289/4 (47.5 ఓవర్లు)
మార్క్ వా 110 (112)
డియోన్ నాష్ 1/44 (9 ఓవర్లు)

2011 క్రికెట్ ప్రపంచ కప్

2011 ఫిబ్రవరి 20
కెన్యా 
69 (23.5 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
72/0 (8 ఓవర్లు)
రాకేప్ పటేల్ 16 (23)
హామిష్ బెన్నెట్ 4/16 (5 ఓవర్లు)
మార్టిన్ గప్తిల్ 39* (32)
థామస్ ఒడోవో 0/25 (3 ఓవర్లు)
న్యూజీలాండ్10 వికెట్లతో గెలిచింది
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్, రాడ్ టకర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హామిష్ బెనెట్
2011 మార్చి 6
ఇంగ్లాండు 
171 (45.4 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
165 (47.4 ఓవర్లు)
రవి బొపారా 60 (98)
ఇమ్రాన్ తాహిర్ 4/38 (8.4 ఓవర్లు)
హాషిం ఆమ్లా 42 (51)
స్టూవర్ట్ బ్రాడ్ 4/15 (6.4 ఓవర్లు)
ఇంగ్లాండ్ 6 పరుగులతో గెలిచింది
అంపైర్లు: సైమన్ టౌఫెల్, అమీష్ సాహెబా
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవి బొపారా
2011 మార్చి 17 (D/N)
ఇంగ్లాండు 
243 (48.4 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
225 (44.4 ఓవర్లు)
జొనాథన్ ట్రాట్ 47 (38)
ఆండ్రే రస్సెల్ 4/49 (8 ఓవర్లు)
ఆండ్రే రస్సెల్ 49 (46)
జేమ్స్ ట్రెడ్వెల్ 4/48 (10 ఓవర్లు)
ఇంగ్లాండ్ 18 పరుగులతో గెలిచింది
అంపైర్లు: బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్, స్టీవ్ డేవిస్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జేమ్స్ ట్రెడ్వెల్

మహిళల క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]
1997 డిసెంబరు 26
స్కోర్‌కార్డ్
న్యూజీలాండ్ 
175/6 (50 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
155 (47.5 ఓవర్లు)
డెబ్బీ కాక్లీ 43 (104)
కరేన్ స్మితీస్ 3/40 (10 ఓవర్లు)
జానెట్ బ్రిటిన్ 32 (88)
క్లేర్ నికోల్సన్ 2/29 (10 ఓవర్లు)
న్యూజీలాండ్ మహిళలు 20 పరుగులతో గెలిచారు
అంపైర్లు: ఎన్. మురళీధరన్, పి. వెంకటేశన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డెబ్బీ కాక్లీ (NZ)
 • న్యూజీలాండ్ మహిళలు టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
 • టెస్ట్ క్రికెట్ మైదానాల జాబితా
 • MA చిదంబరం స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ ఐదు వికెట్ల ప్రదర్శన జాబితా

మూలాలు

[మార్చు]
 1. "MA Chidambaram Stadium". Cricbuzz.com. Retrieved 2023-02-16.
 2. "Construction Begins at Chennai". Hopkins Architects. 27 November 2009. Archived from the original on 25 December 2018. Retrieved 16 October 2011.
 3. "About M. A. Chidambaram Stadium". BCCI. Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 20 February 2021.
 4. "Passing through the gates of history". Hindustan Times. Retrieved 20 February 2021.
 5. "Those Were The Days: The day Chepauk spun India into cricket history". DT Next. 20 October 2019. Retrieved 20 February 2021.
 6. V, Ramnarayan. "An MCC of our own". Cricinfo. Retrieved 20 February 2021.
 7. 7.0 7.1 "CRICKET IN MADRAS". Madras Vignettes. 16 July 2013. Retrieved 20 February 2021.
 8. "The Madras that was". Frontline. Retrieved 20 February 2021.
 9. Menon, Suresh. "Indian cricket's spiritual home". Cricinfo. Retrieved 20 February 2021.
 10. Arjun, Siddharth (15 January 2019). "Pongal Test: Forgotten tradition of Indian cricket". Sportskeeda. Retrieved 20 February 2021.
 11. "Pongal Test – The history of India's own Boxing Day cricket match". The Bridge. 13 January 2021. Retrieved 20 February 2021.
 12. "N Srinivasan unanimously elected TNCA President". Zee News. 28 June 2009. Archived from the original on 7 July 2012. Retrieved 16 October 2011.
 13. "Upgradation/Modernisation of M.A.Chidambaram Stadium". TNCA. Archived from the original on 19 October 2011. Retrieved 16 October 2011.
 14. "New Chepauk stands ready for Pakistan ODI". The Times of India. Chennai. 19 December 2012. Archived from the original on 26 January 2013. Retrieved 25 December 2012.
 15. Dinakar, S. (16 February 2011). "Chepauk's new innings". The Hindu. Chennai. Retrieved 16 October 2011.
 16. "Demolish unauthorised construction in MA Chidambaram stadium says SC". IBN Live. 31 March 2015. Archived from the original on 1 April 2015. Retrieved 26 February 2016.
 17. "Supreme court orders TN to demolish three cheupak stadiums". Hindustan Times. 1 April 2016. Archived from the original on 1 April 2015. Retrieved 26 February 2016.
 18. "Demolish unauthorised construction at Chepauk says SC". Zee news. 31 March 2015. Retrieved 26 February 2016.
 19. "Chepauk waits for planning permissions". The Hindu. 1 April 2015. Retrieved 26 February 2016.
 20. @tncacricket (March 13, 2020). "The I, J, K Stands at the M.A. Chidambaram Stadium were de-sealed and opened today (Friday, 13 March, 2020)" (Tweet). Retrieved 2020-08-18 – via Twitter.
 21. 21.0 21.1 Kumar, C Santhosh (2021-11-25). "Renovated Chepauk stadium likely to be ready for new season". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-12-26.
 22. Chauhan, Anukul (10 March 2023). "Ahead of IND vs AUS Chennai ODI, CSK skipper MS Dhoni & Tamil Nadu CM MK Stalin to inaugurate new stand at MA Chidambaram Stadium named after M Karunanidhi". InsideSport. Retrieved 10 March 2023.
 23. TNCA owes government Rs 2,081 crore rent for Chepauk stadium
 24. "Scorecard, Madras v Mysore". cricketarchive.com. Retrieved 19 March 2016.
 25. "When Gavaskar upstaged Bradman". Deccan Chronicle. 28 December 2013. Retrieved 19 March 2016.
 26. "Sachin becomes first batsman to score 200 in an ODI". The Times of India. 24 February 2010. Retrieved 24 November 2010.
 27. "Sachin break Anwar's Record". Cricketworld4u.com. Archived from the original on 6 May 2010. Retrieved 24 November 2010.
 28. "The day the records tumbled". ESPN Cricinfo. 17 April 2008. Retrieved 19 March 2016.
 29. "Ind vs Eng: Joe Root scores 200 in 100th Test, breaks multiple records". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-07.
 30. "Statistics / Statsguru / Test matches / Results records / MA Chidambaram". ESPN Cricinfo. Retrieved 17 February 2021.
 31. "Statistics / Statsguru / ODI / Results records / MA Chidambaram". ESPN Cricinfo. Retrieved 17 February 2021.
 32. "Statistics / Statsguru / T20I / Results records / MA Chidambaram". ESPN Cricinfo. Retrieved 17 February 2021.
 33. "Statistics / Statsguru / Test matches / Batting records / MA Chidambaram / Runs scored". ESPN Cricinfo. Retrieved 17 February 2021.
 34. "Statistics / Statsguru / Test matches / Batting records / MA Chidambaram / Runs scored (Non-India)". ESPN Cricinfo. Retrieved 17 February 2021.
 35. "Statistics / Statsguru / Test matches / Batting records / MA Chidambaram Stadium / Runs scored in an innings". ESPN Cricinfo. Retrieved 17 February 2020.
 36. "Statistics / Statsguru / Test matches / Batting records / MA Chidambaram / Hundreds scored". ESPN Cricinfo. Retrieved 17 February 2021.