Jump to content

ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
ఇంగ్లాండ్
Refer to caption
England Cricket crest
అసోసియేషన్ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్హీథర్ నైట్
కోచ్జోన్ లూయిస్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాపూర్తి సభ్యురాలు (1909)
ICC ప్రాంతంయూరపియన్ క్రికెట్ కౌన్సిల్
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[1] అత్యుత్తమ
మవన్‌డే 3rd 2వ (1 Oct 2015)
మటి20ఐ 2nd 2వ
Women's Tests
తొలి మహిళా టెస్టుv  ఆస్ట్రేలియా బ్రిస్‌బేన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, 28–31 December 1934 డిసెంబరు 28-
చివరి మహిళా టెస్టుv  ఆస్ట్రేలియా ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్; 22–26 June 2023 జూన్ 22-26
మహిళా టెస్టులు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[2] 99 20/15
(64 డ్రాలు)
ఈ ఏడు[3] 1 0/1
(0 డ్రాలు)
Women's One Day Internationals
తొలి మహిళా వన్‌డేv ఇంటర్నేషనల్ XI , కౌంటీ క్రికెట్ గ్రౌండ్, హోవ్; 1973 జూన్ 23
చివరి మహిళా వన్‌డేv  శ్రీలంక గ్రేస్ రోడ్, లీసెస్టర్; 2023 సెప్టెంబరు 14
మహిళా వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[4] 386 227/145
(2 టైలు, 12 ఫలితం తేలనివి)
ఈ ఏడు[5] 6 4/1
(0 టైలు, 1 ఫలితం తేలనివి)
Women's World Cup appearances11 (first in 1973)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్లు (1973, 1993, 2009, 2017)
Women's Twenty20 Internationals
తొలి WT20Iv  న్యూజీలాండ్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్, హోవ్; 2004 ఆగస్టు 5
చివరి WT20Iv  శ్రీలంక కౌంటీ గ్రౌండ్, డెర్బీ; 2023 సెప్టెంబరు 6
WT20Is ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[6] 184 131/48
(3 టైలు, 2 ఫలితం తేలనివి)
ఈ ఏడు[7] 11 7/4
(0 టైలు, 0 ఫలితం తేలనివి)
Women's T20 World Cup appearances8 (first in 2009)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2009)
As of 2023 సెప్టెంబరు 14

ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఇంగ్లాండ్, వేల్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 1998 నుండి, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇసిబి) దీన్ని నిర్వహిస్తోంది. అంతకు ముందు మహిళా క్రికెట్ సంఘం నిర్వహించేది. ఇంగ్లాండ్‌కు, టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) హోదాతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. జట్టుకు ప్రస్తుతం హీథర్ నైట్ కెప్టెన్‌గా, జోన్ లూయిస్ కోచ్‌గా ఉన్నారు.

ఇంగ్లాండ్ జట్టు 1934లో మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడి, 9 వికెట్ల తేడాతో గెలిచింది. రెండు జట్లు ఇప్పుడు మహిళల యాషెస్ ట్రోఫీ కోసం క్రమం తప్పకుండా పోటీ పడుతున్నాయి. ఇంగ్లాండ్, 1973 లో సొంతగడ్డపై మొదటి మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడి, టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 1993, 2009, 2017 లో మరో మూడుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2017 విజయం తర్వాత, వారికి BBC స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 2005లో మొట్టమొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్‌పై ఆడారు. 2009 లో ప్రారంభ ICC మహిళల ప్రపంచ ట్వంటీ20ని గెలుచుకున్నారు.

చరిత్ర

[మార్చు]
1935లో సిడ్నీలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన రెండో మహిళల టెస్టు మ్యాచ్‌లో

మార్గదర్శులు

[మార్చు]

పురుషుల బాడీలైన్ పర్యటన మూడు సంవత్సరాల తర్వాత బెట్టీ ఆర్చ్‌డేల్ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు 1934–35 వేసవిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ విధంగా ఇంగ్లాండ్, మొట్టమొదటి మహిళా టెస్టు సిరీస్‌లో భాగమైంది. కెప్టెన్‌తో సహా ఇంగ్లాండ్‌ జట్టుకు ఆస్ట్రేలియా ప్రేక్షకుల నుండి స్వాగతం లభించింది.[8] మొదటి టెస్ట్‌లు రెండింటినీ గెలిచి, మూడోది డ్రా చేసుకుని ఇంగ్లండ్, మొదటి మహిళల టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అలాగే తిరిగి వెళ్తూ న్యూజిలాండ్‌తో కూడా ఆడి ఇన్నింగ్స్, 337 పరుగుల తేడాతో ఓడించింది.[9] ఆ మ్యాచ్‌లో బెట్టీ స్నోబాల్ 189 పరుగులు చేసింది. అర్ధ శతాబ్ది పాటు ఇది మహిళల టెస్టు రికార్డుగా నిలిచిఉంది.[10] అయితే ఆల్‌రౌండరు మైర్టిల్ మక్లాగన్, ఆ కాలంలో వారి ప్రముఖ క్రీడాకారిణి, ఆనాటి అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరు. ఆమె 1935 జనవరి 7న మహిళల టెస్టు మ్యాచ్‌లో మొట్టమొదటి సెంచరీ సాధించింది.

రెండు సంవత్సరాల తర్వాత, నార్తాంప్టన్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్, మొదటి టెస్టు ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా చేసిన ఆ తొలి పర్యటనలో, ఏడుగురు కొత్త ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టు మొదటి రోజు 300 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 102 పరుగులకు ఆలౌట్ చేసినప్పటికీ, వారు 31 పరుగుల తేడాతో ఓడిపోయారు.[11] రెండవ టెస్టులో మైర్టిల్ మక్లాగన్ మొదటి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసి, ఆ తరువాత బౌలింగులో ఐదు వికెట్లు పడగొట్టింది. ఇంగ్లండ్ ఆ టెస్టును చేజిక్కించుకుంది.[12] మూడవ టెస్టు డ్రా అవడంతో సిరీస్‌ను 1-1తో సమంగా ముగిసింది.[13]

మొదటి ప్రపంచ కప్

[మార్చు]

వెస్టిండీస్‌కు ఇంకా టెస్టు హోదా ఇవ్వనప్పటికీ, 1969-70, 1970-71లో ఇంగ్లండ్, సర్ జాక్ హేవార్డ్ స్పాన్సరు చేయగా రెండు సార్లు అక్కడికి పర్యటనలకు వెళ్లింది.[14] స్పాన్సర్‌షిప్ కోసం ఇంగ్లండ్ కెప్టెన్ హేహో-ఫ్లింట్ హేవార్డ్‌కు ఉత్తరాలు రాసింది. 1971లో ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత, హేవార్డ్, ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్‌లో మొదటి ప్రపంచ కప్‌గా అవతరించిన ప్రారంభ మహిళల ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి అంగీకరించారు. ఇంగ్లండ్ రెండు జట్లను రంగం లోకి దింపింది: మామూలు సీనియర్ జట్టుతో పాటు పేరుతో మరో జట్టు. యంగ్ ఇంగ్లండ్ జట్టు మొదటి మహిళల వన్డే ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో 57 పరుగులకే ఆలౌట్ అయింది.[15] ఇవి కాకుండా, ముగ్గురు ఇంగ్లీష్ మహిళలు, ఆడ్రీ డిస్బరీ, వెండీ విలియమ్స్, పమేలా క్రెయిన్ అంతర్జాతీయ XI జట్టు తరఫున ఆడారు.[16]

యంగ్ ఇంగ్లండ్ జట్టు ఇంటర్నేషనల్ XI పై ఒక గేమ్ గెలిచింది. అయితే ప్రధాన ఇంగ్లాండ్ జట్టు, తమ మొదటి ఐదు గేమ్‌లలో నాలుగు గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, వర్షం కారణంగా 15 ఓవర్ల తర్వాత, చివరి 20 నుండి 71 పరుగులకు ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు వచ్చాయి. "సగటు రన్ రేట్" ప్రకారం న్యూజిలాండ్‌ను విజేతగా ప్రకటించారు.[17] ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌లు చివరి గేమ్‌ ఆడాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో "అద్భుతమైన" వాతావరణంలో ఎనిడ్ బేక్‌వెల్, టోర్నమెంట్‌లో తన రెండవ సెంచరీ సాధించింది.[18] ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. బేక్‌వెల్ 12 ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులిచ్చి, జాకీ పోటర్ వికెట్ తీసింది. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను 60 ఓవర్లలో 187 పరుగులకే పరిమితం చేసి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.[19]

2012 వరల్డ్ ట్వంటీ20

[మార్చు]

శ్రీలంకలో జరిగిన 2012 ప్రపంచ ట్వంటీ20 లో, ఇంగ్లండ్ ఫేవరెట్‌గా రంగం లోకి దిగింది. ఇంగ్లాండ్ జట్టు లోని సూసీ రోవ్‌కు బొటనవేలు విరగడంతో ఆమె స్థానంలో కొత్త క్రీడాకారిణి అమీ జోన్స్ వచ్చింది.

ఇంగ్లండ్ పాకిస్తాన్‌పై విజయంతో ప్రారంభించింది. వారి రెండవ గేమ్‌లో భారత్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి, నాకౌట్ దశకు అర్హత సాధించారు.

ఇంగ్లాండ్ ఆఖరి గ్రూప్ గేమ్ ఆస్ట్రేలియాతో జరిగింది. ఇరు జట్లు ఇప్పటికే అర్హత సాధించినప్పటికీ, సంభావ్య ఫైనల్ మ్యాచ్-అప్‌కి ముందు మానసిక ప్రయోజనాన్ని పొందడానికి ఈ గేమ్ మంచి అవకాశంగా భావించబడింది. ఆస్ట్రేలియా 144–5 చేసి ఆకట్టుకుంది. టేలర్ 65* వ్యాట్ 33* పరుగులతో ఇంగ్లండ్ సునాయాసంగా విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్ ఇదే జోరును కొనసాగించి, రెండవసారి ప్రపంచ ట్వంటీ20 ఫైనల్‌కు చేరుకుంది.

ఫైనల్ మ్యాచ్ అక్టోబరు 7న కొలంబోలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగింది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగు చేస్తూ అత్యధిక మెరుగైన ప్రారంభం సాధించింది. పవర్‌ప్లే సమయంలో, మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. ఆ తరువాత జెస్ కామెరాన్ 34 బంతుల్లో 45 పరుగులు చేసింది. కామెరాన్ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా తమ చివరి 23 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, 142–4 తో ముగించి, ఇంగ్లాండ్‌కు గట్టి లక్ష్యాన్నే నిర్దేశించారు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా లాగా వేగంగా మొదలుపెట్టలేకపోయింది. ముఖ్యమైన సమయాల్లో ఆస్ట్రేలియా కీలకమైన వికెట్లు తీసింది. బ్రంట్‌ 17వ ఓవర్‌ తొలి బంతికి జెస్‌ జోనాస్సేన్‌ బౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ్‌ 23 బంతుల్లో 42 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 3 వికెట్లు మాత్రమే మిగిలాయి. జెన్నీ గన్, డానియెల్ హాజెల్‌లు సాహసోపేతమైన ప్రయత్నాలు చేసారు. ఎరిన్ ఒస్బోర్న్ వేసిన ఆఖరి బంతిని హాజెల్ సిక్స్ కొట్టలేకపోయింది, ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది.

2013 మహిళల ప్రపంచ కప్

[మార్చు]

ఇంగ్లండ్ 2013 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారతదేశం వెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, శ్రీలంకతో ఓడిపోయింది. రెండవ మ్యాచ్‌లో భారత్‌పై నెగ్గింది. ఆ తరువాత శ్రీలంక భారత్‌పై కూడా నెగ్గి తరువాతి దశకు చేరుకుంది.

సూపర్ సిక్స్ దశలో ఇంగ్లాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌ తరువాతి పరిస్థితి - ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను ఓడించి, ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను ఓడిస్తే ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ పరిస్థితిలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో తన చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌కి దిగింది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభ దశలో ఉండగానే - వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని సాధించిందని వార్తలు వచ్చాయి. అంటే ఫైనల్‌లో పోటీపడెది ఆ రెండు జట్లేనని తేలిపోయింది. ఇక ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు 3, 4 స్థానాల కోసం పోటీ పడతాయి. దాంతో ఆట లోని తీవ్రత పోయింది. ఇంగ్లాండ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మళ్ళీ అవే జట్లు 3వ/4వ స్థానం కోసం పోటీ పడ్డాయి. ఇంగ్లాండ్ మళ్ళీ గెలిచి, 3 వ స్థానంలో నిలిచింది.

వేల్స్ స్థితి

[మార్చు]

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులో భాగంగా ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్, వేల్స్ రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. లిన్ థామస్ వంటి వెల్ష్ క్రికెటర్లు ఇంగ్లాండ్ తరపున ఆడారు.[20]

క్రికెట్ వేల్స్ నిరంతరం ఇసిబికి మద్దతు ఇస్తోంది. వేల్స్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు మహిళల కౌంటీ క్రికెట్ నిర్మాణంలో దేశీయ జట్టుగా పనిచేస్తుంది. మహిళల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 2019 వరకు పోటీపడింది. మహిళల ట్వంటీ20 కప్‌లో పోటీని కొనసాగిస్తుంది.[21][22] దేశం లోని కొత్త ప్రాంతీయ క్రికెట్ నిర్మాణంలో వేల్స్ కూడా ఒక భాగం. ఇది వెస్ట్రన్ స్టార్మ్ ప్రాంతీయ హబ్‌లో భాగం, అలాగే ది హండ్రెడ్‌లో వెల్ష్ ఫైర్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది.[23][24]

పురుషుల క్రికెట్‌లో అంతర్జాతీయంగా పోటీపడే వెల్ష్ క్రికెట్ జట్టు లేకపోవడంపై రాజకీయ నాయకులు అనేక వ్యాఖ్యలు చేసారు. సెనెడ్‌లో చర్చలు చేసారు.[25][26] అయితే, వీళ్ళ చర్చలు మహిళల ఆటపై కూడానా అనేది అస్పష్టంగా ఉంది. 2005లో మహిళల యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో వేల్స్ అంతర్జాతీయంగా పోటీ చేసింది. ఆ టోర్నమెంటు వేల్స్‌లోనే జరిగింది, ఇంగ్లాండ్‌తో పాటు, మరో మూడు యూరోపియన్ మహిళా క్రికెట్ జట్లతో ఆడింది.[27]

టోర్నమెంటు చరిత్ర

[మార్చు]

మహిళల క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]
ఇంగ్లాండ్ ప్రపంచ కప్ స్టార్లు (LR) షార్లెట్ ఎడ్వర్డ్స్, లిన్నే థామస్, ఎనిడ్ బేక్‌వెల్, 2017–18 మహిళల యాషెస్ టెస్టు సందర్భంగా నార్త్ సిడ్నీ ఓవల్‌లో తీసిన ఫోటో
  • 1973 : విజేతలు
  • 1978 : రన్నర్స్-అప్
  • 1982 : రన్నర్స్-అప్
  • 1988 : రన్నరప్
  • 1993 : విజేతలు
  • 1997 : సెమీ-ఫైనల్స్
  • 2000 : ఐదవ స్థానం
  • 2005 : సెమీ-ఫైనల్స్
  • 2009 : విజేతలు
  • 2013 : మూడవ స్థానం
  • 2017 : విజేతలు
  • 2022 : రన్నరప్

మహిళల యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్

[మార్చు]
  • 1989: విజేతలు
  • 1990: విజేతలు
  • 1991: విజేతలు
  • 1995: విజేతలు
  • 1999: విజేతలు
  • 2001: రన్నర్స్-అప్
  • 2005: విజేతలు (డెవలప్‌మెంట్ స్క్వాడ్)
  • 2007: విజేతలు (డెవలప్‌మెంట్ స్క్వాడ్)

(గమనిక: ఇంగ్లండ్ ప్రతి యూరోపియన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కి డెవలప్‌మెంట్ స్క్వాడ్‌ను పంపింది, అయితే ఇది ప్రత్యేకంగా 2005 & 2007లో మాత్రమే సూచించబడింది).

ICC మహిళల ప్రపంచ ట్వంటీ20

[మార్చు]
  • 2009 : విజేతలు
  • 2010 : గ్రూప్ స్టేజ్
  • 2012 : రన్నరప్
  • 2014 : రన్నర్స్-అప్
  • 2016 : సెమీ-ఫైనల్స్
  • 2018 : రన్నర్స్-అప్
  • 2020 : సెమీ-ఫైనల్స్
  • 2023 : సెమీ-ఫైనల్స్

గౌరవాలు

[మార్చు]
  • మహిళల ప్రపంచ కప్ :
    • ఛాంపియన్స్ (4): 1973, 1993, 2009, 2017
    • రన్నర్స్-అప్ (4): 1978, 1982, 1988, 2022
  • మహిళల టీ20 ప్రపంచకప్ :
    • ఛాంపియన్స్ (1): 2009
    • రన్నర్స్-అప్ (3): 2012, 2014, 2018

ప్రస్తుత అంతర్జాతీయ ర్యాంకింగ్స్

[మార్చు]

ICC వన్డే, T20I ప్రదర్శనల ద్వారా జట్లను ర్యాంకింగ్ చేస్తుంది. వారు టెస్టు క్రికెట్ కోసం మహిళల జట్లకు ర్యాంక్ ఇవ్వరు.

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

ఇంగ్లండ్‌తో సెంట్రల్ కాంట్రాక్టు పొందిన వారు గానీ, 2023లో సిరీస్ కోసం జట్టులో చేరినవారు గానీ క్రీడాకారిణుల జాబితా.

  • వాలు పేర్లున్న ప్లేయర్లు కొత్తవారు.
  • ఇసిబి సెంట్రల్ కాంట్రాక్ట్ 2022–2023 కాలాన్ని సూచిస్తుంది.[28]
  • ఫుల్-టైమ్ డొమెస్టిక్ కాంట్రాక్ట్ అనేది ప్రాంతీయ హబ్ సైడ్ కోసం ప్రొఫెషనల్‌గా ఆడే ఆటగాళ్లను సూచిస్తుంది.[29]
పేరు వయస్సు బ్యాటింగు శైలి బౌలింగు శైలి దేశీయ జట్టు ఆడిన టెస్టులు ఆడిన వన్‌డేలు ఆడిన T20 లు S/N C/T
కెప్టెన్, ఆల్ రౌండరు
హీథర్ నైట్ 33 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ వెస్టర్న్ స్టార్మ్ 11 134 104 5 సెంట్రల్
వైస్ కెప్టెన్, ఆల్ రౌండరు
నాట్ స్కివర్-బ్రంట్ 32 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-fast నార్దర్న్ డయమండ్స్ 9 100 111 39 సెంట్రల్
బ్యాటర్లు
మైయా బౌచియర్ 26 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం సదరన్ వైపర్స్ 3 22 15 ఫుల్ టైం డొమెస్టిక్
సోఫియా డంక్లీ 26 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ సౌత్ ఈస్ట్ స్టార్స్ 4 31 47 47 సెంట్రల్
డాని వ్యాట్ 33 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ సదరన్ వైపర్స్ 1 105 149 28 సెంట్రల్
వికెట్ కీపర్లు
టామీ బ్యూమాంట్ 33 కుడిచేతి వాటం ది బ్లేజ్ 8 109 99 12 సెంట్రల్
బెస్ హీత్ 23 కుడిచేతి వాటం నార్దర్న్ డయమండ్స్ 1 67 ఫుల్ టైం డొమెస్టిక్
అమీ జోన్స్ 31 కుడిచేతి వాటం సెంట్రల్ స్పార్క్స్ 5 82 91 40 సెంట్రల్
లారెన్ విన్ఫీల్డ్-హిల్ 34 కుడిచేతి వాటం నార్దర్న్ డయమండ్స్ 5 55 44 58 ఫుల్ టైం డొమెస్టిక్
ఆల్ రౌండర్లు
ఆలిస్ క్యాప్సే 20 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ సౌత్ ఈస్ట్ స్టార్స్ 10 21 64 సెంట్రల్
ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ 30 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం సౌత్ ఈస్ట్ స్టార్స్ 1 6 8 36 ఫుల్ టైం డొమెస్టిక్
డేనియల్ గిబ్సన్ 23 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం వెస్టర్న్ స్టార్మ్ 6 66 ఫుల్ టైం డొమెస్టిక్
ఫ్రెయా కెంప్ 19 ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం సదరన్ వైపర్స్ 2 12 73 సెంట్రల్
ఎమ్మా లాంబ్ 27 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ నార్త్ వెస్ట్ థండర్ 2 11 1 6 సెంట్రల్
పేస్ బౌలరులు
లారెన్ బెల్ 23 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం సదరన్ వైపర్స్ 2 8 12 63 సెంట్రల్
కేట్ క్రాస్ 33 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం నార్త్ వెస్ట్ థండర్ 7 59 16 16 సెంట్రల్
ఫ్రెయా డేవిస్ 29 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం సౌత్ ఈస్ట్ స్టార్స్ 9 26 61 సెంట్రల్
తాష్ ఫర్రాంట్ 28 ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం సౌత్ ఈస్ట్ స్టార్స్ 6 18 53 సెంట్రల్
లారెన్ ఫైలర్ 23 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం వెస్టర్న్ స్టార్మ్ 1 3 82 ఫుల్ టైం డొమెస్టిక్
మహికా గౌర్ 18 కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం నార్త్ వెస్ట్ థండర్ 2 2 68 ఫుల్ టైం డొమెస్టిక్
ఇస్సీ వాంగ్ 22 కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం సెంట్రల్ స్పార్క్స్ 1 3 10 25 సెంట్రల్
స్పిన్ బౌలరుస్
చార్లీ డీన్ 23 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ సదరన్ వైపర్స్ 1 25 15 24 సెంట్రల్
సోఫీ ఎక్లెస్టోన్ 25 కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ నార్త్ వెస్ట్ థండర్ 6 58 73 19 సెంట్రల్
సారా గ్లెన్ 25 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ సెంట్రల్ స్పార్క్స్ 14 52 3 సెంట్రల్

రికార్డులు

[మార్చు]

టెస్టు క్రికెట్ - వ్యక్తిగత రికార్డులు

[మార్చు]

బోల్డ్‌గా చూపించిన ఆటగాళ్లు ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో చురుకుగా ఉన్నారు

అత్యధిక మ్యాచ్‌లు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యాచ్‌లు [30]
1 జాన్ బ్రిటిన్ 1979–1998 27
2 షార్లెట్ ఎడ్వర్డ్స్ 1996–2015 23
3 రాచెల్ హేహో ఫ్లింట్ 1960–1979 22
4 జేన్ స్మిత్ 1992–2006 21
5 కరోల్ హోడ్జెస్ 1984–1992 18
6 జాక్వెలిన్ కోర్ట్ 1976–1987 17
మేరీ దుగ్గన్ 1949–1963 17
8 క్లార్ కానర్ 1995–2005 16
క్లేర్ టేలర్ 1995–2003 16
10 ఎడ్నా బార్కర్ 1957–1969 15
మోలీ హైడ్ 1934–1954 15
కరెన్ స్మితీస్ 1987–1999 15
క్లైర్ టేలర్ 1999–2009 15
ఈ నాటికి 1 July 2022

అత్యధిక పరుగులు చేసినవారు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యా ఇన్ని పరుగులు [31] సగ అత్య 50 100
1 జాన్ బ్రిటిన్ 1979–1998 27 44 1,935 49.61 167 11 5
2 షార్లెట్ ఎడ్వర్డ్స్ 1996–2015 23 43 1,676 44.10 117 9 4
3 రాచెల్ హేహో ఫ్లింట్ 1960–1979 22 38 1,594 45.54 179 10 3
4 కరోల్ హోడ్జెస్ 1984–1992 18 31 1,164 40.13 158* 6 2
5 ఎనిడ్ బేక్వెల్ 1968–1979 12 22 1,078 59.88 124 7 4
6 క్లైర్ టేలర్ 1999–2009 15 27 1,030 41.20 177 2 4
7 మర్టల్ మక్లాగన్ 1934–1951 14 25 1,007 41.95 119 6 2
8 మోలీ దాచు 1934–1954 15 27 872 36.33 124* 5 2
9 సిసిలియా రాబిన్సన్ 1949–1963 14 27 829 33.16 105 2 2
10 హీథర్ నైట్ 2011–2022 10 17 705 47.00 168* 3 2
ఈ నాటికి 1 July 2022

అత్యధిక స్కోర్లు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి అధిక స్కోరు [32] బంతులు 4s 6s ప్రత్యర్థి తేదీ
1 టామీ బ్యూమాంట్ 208 331 27 0 ఆస్ట్రేలియా 2023 జూన్ 24
2 బెట్టీ స్నోబాల్ 189 1 0 న్యూజిలాండ్ 1935 ఫిబ్రవరి 16
3 రాచెల్ హేహో ఫ్లింట్ 179 28 0 ఆస్ట్రేలియా 1976 జూలై 24
4 క్లైర్ టేలర్ 177 287 22 0 దక్షిణ ఆఫ్రికా 2003 ఆగస్టు 7
5 నాట్ స్కివర్-బ్రంట్ 169* 263 21 0 దక్షిణ ఆఫ్రికా 2022 జూన్ 27
6 హీథర్ నైట్ 168* 294 17 1 ఆస్ట్రేలియా 2022 జనవరి 27
7 జాన్ బ్రిటిన్ 167 402 17 0 ఆస్ట్రేలియా 1998 ఆగస్టు 11
8 బార్బరా డేనియల్స్ 160 268 19 0 న్యూజిలాండ్ 1996 జూన్ 24
9 కరోల్ హోడ్జెస్ 158* 323 21 0 న్యూజిలాండ్ 1984 జూలై 27
10 హీథర్ నైట్ 157 338 20 0 ఆస్ట్రేలియా 2013 ఆగస్టు 11
ఈ నాటికి 1 July 2022

అత్యధిక వికెట్లు తీసినవారు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యా ఇన్ని వికె[33] సగ BBI BBM పొదు స్ట్రై 5 10
1 మేరీ దుగ్గన్ 1949–1963 17 27 77 13.49 7–6 9–58 1.66 48.4 5 0
2 మర్టల్ మక్లాగన్ 1934–1951 14 27 60 15.58 7–10 7–41 1.63 57.2 3 0
3 కేథరీన్ స్కివర్-బ్రంట్ 2004–2022 14 25 51 21.52 6–69 9–111 2.52 51.1 3 0
4 ఎనిడ్ బేక్వెల్ 1968–1979 12 22 50 16.62 7–61 10–75 1.84 53.9 3 1
5 గిలియన్ మెక్కాన్వే 1984–1987 14 25 40 25.47 7–34 7–40 1.59 95.6 2 0
6 అవ్రిల్ స్టార్లింగ్ 1984–1986 11 21 37 24.64 5–36 7–97 1.99 74.0 1 0
7 మోలీ దాచు 1934–1954 15 26 36 15.25 5–20 8–58 1.59 57.3 1 0
8 అన్నే సాండర్స్ 1954–1969 11 19 32 16.62 4–29 7–69 1.50 66.3 0 0
9 లూసీ పియర్సన్ 1996–2004 12 20 30 29.36 7–51 11–107 2.40 73.1 1 1
10 జూలియా గ్రీన్వుడ్ 1976–1979 6 11 29 16.13 6–46 11–63 2.50 38.7 3 1
ఇసా గుహ 2002–2011 8 15 29 18.93 5–40 9–100 2.20 51.4 1 0
జెన్నీ గన్ 2004–2014 11 21 29 22.24 5–19 5–59 1.76 75.4 1 0
ఈ నాటికి 1 July 2022

అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి సంఖ్యలు
(వికెట్లు/పరుగులు) [34]
ప్రత్యర్థి తేదీ
1 మేరీ దుగ్గన్ 7–6 ఆస్ట్రేలియా 1958 ఫిబ్రవరి 21
2 మర్టల్ మక్లాగన్ 7–10 ఆస్ట్రేలియా 1934 డిసెంబరు 28
3 గిలియన్ మెక్కాన్వే 7–34 భారతదేశం 1986 జూలై 12
4 లూసీ పియర్సన్ 7–51 ఆస్ట్రేలియా 2003 ఫిబ్రవరి 22
5 ఎనిడ్ బేక్వెల్ 7–61 వెస్టు ఇండీస్ 1979 జూలై 1
6 జూలియా గ్రీన్వుడ్ 6–46 వెస్టు ఇండీస్ 1979 జూన్ 16
7 మేరీ దుగ్గన్ 6–55 న్యూజిలాండ్ 1957 నవంబరు 28
8 కేథరీన్ స్కివర్-బ్రంట్ 6–69 ఆస్ట్రేలియా 2009 జూలై 10
9 గిలియన్ మెక్కాన్వే 6–71 ఆస్ట్రేలియా 1987 ఆగస్టు 1
10 జాయ్ పార్ట్రిడ్జ్ 6–96 ఆస్ట్రేలియా 1935 జనవరి 4
ఈ నాటికి 15 September 2023

వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ - వ్యక్తిగత రికార్డులు

[మార్చు]

బోల్డ్‌గా చూపించిన ఆటగాళ్లు ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో చురుకుగా ఉన్నారు

అత్యధిక మ్యాచ్‌లు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యాచ్‌లు [35]
1 షార్లెట్ ఎడ్వర్డ్స్ 1997–2016 191
2 జెన్నీ గన్ 2004–2019 144
3 కేథరీన్ స్కివర్-బ్రంట్ 2005–2022 141
4 హీథర్ నైట్ 2010– 134
5 లిడియా గ్రీన్‌వే 2004–2016 126
క్లైర్ టేలర్ 1998–2011 126
సారా టేలర్ 2006–2019 126
8 జేన్ స్మిత్ 1993–2007 109
టామీ బ్యూమాంట్ 2009– 109
10 క్లేర్ టేలర్ 1988–2005 105
డాని వ్యాట్ 2010– 105
ఈ నాటికి 15 September 2023

అత్యధిక పరుగులు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యా ఇన్ని పరుగులు[36] సగ అత్య 50 100
1 షార్లెట్ ఎడ్వర్డ్స్ 1997–2016 191 180 5,992 38.16 173* 46 9
2 క్లైర్ టేలర్ 1998–2011 126 120 4,101 40.20 156* 23 8
3 సారా టేలర్ 2006–2019 126 119 4,056 38.26 147 20 8
4 హీథర్ నైట్ 2010– 134 128 3,765 36.91 106 26 2
5 టామీ బ్యూమాంట్ 2009– 109 100 3,650 40.10 168* 18 9
6 నాట్ స్కివర్-బ్రంట్ 2013– 100 89 3,402 46.60 148* 20 8
7 లిడియా గ్రీన్‌వే 2003–2016 126 111 2,554 30.04 125* 12 1
8 జాన్ బ్రిటిన్ 1979–1998 63 59 2,121 42.42 138* 8 5
9 అర్రాన్ బ్రిండిల్ 1999–2014 88 84 1,928 27.94 107* 11 1
10 డాని వ్యాట్ 2010– 105 91 1,841 23.60 129 5 2
ఈ నాటికి 15 September 2023

అత్యధిక స్కోర్లు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి అధిక స్కోరు [37] బంతులు 4s 6s SR ప్రత్యర్థి తేదీ
1 షార్లెట్ ఎడ్వర్డ్స్ 173* 155 19 0 111.61 ఐర్లాండ్ 1997 డిసెంబరు 16
2 టామీ బ్యూమాంట్ 168* 144 20 0 116.66 పాకిస్తాన్ 2016 జూన్ 27
3 క్లైర్ టేలర్ 156* 151 9 0 103.31 భారతదేశం 2006 ఆగస్టు 14
4 నాట్ స్కివర్-బ్రంట్ 148* 121 15 1 122.31 ఆస్ట్రేలియా 2022 ఏప్రిల్ 3
5 టామీ బ్యూమాంట్ 148 145 22 1 102.06 దక్షిణ ఆఫ్రికా 2017 జూలై 5
6 సారా టేలర్ 147 104 24 0 141.34 దక్షిణ ఆఫ్రికా 2017 జూలై 5
7 కరోలిన్ అట్కిన్స్ 145 155 12 0 93.54 దక్షిణ ఆఫ్రికా 2008 ఆగస్టు 8
8 బార్బరా డేనియల్స్ 142* 103 18 1 137.86 పాకిస్తాన్ 1997 డిసెంబరు 12
9 షార్లెట్ ఎడ్వర్డ్స్ 139* 152 17 0 91.44 నెదర్లాండ్స్ 2000 నవంబరు 30
10 జాన్ బ్రిటిన్ 138* 175 11 0 78.86 అంతర్జాతీయ XI 1982 జనవరి 14
ఈ నాటికి 15 September 2023

అత్యధిక వికెట్లు తీసిన బౌలరు

[మార్చు]
స్థానం ఆటగాడు వ్యవధి మ్యా ఇన్ని వికె[38] సగ BBI పొదు స్ట్రై 4 5
1 కేథరీన్ స్కివర్-బ్రంట్ 2005–2022 141 139 170 24.00 5–18 3.57 40.2 3 5
2 జెన్నీ గన్ 2004–2019 144 136 136 28.10 5–22 3.88 43.4 4 2
3 లారా మార్ష్ 2006–2019 103 102 129 26.84 5–15 3.89 41.3 3 1
4 అన్య ష్రూబ్సోల్ 2008–2022 86 85 106 26.53 6–46 4.21 37.7 4 2
5 క్లేర్ టేలర్ 1998–2005 105 104 102 23.95 4–13 2.85 50.3 2 0
6 ఇసా గుహ 2001–2011 83 81 101 23.21 5–14 3.73 37.2 2 2
7 హోలీ కొల్విన్ 2006–2013 72 68 98 21.80 4–17 3.58 36.5 3 0
8 సోఫీ ఎక్లెస్టోన్ 2016– 58 58 92 21.40 6–36 3.71 34.5 2 1
9 క్లార్ కానర్ 1995–2005 93 83 80 26.01 5–49 3.48 44.7 1 1
10 కేట్ క్రాస్ 2013– 59 58 79 25.32 5–24 4.50 33.8 3 2
ఈ నాటికి 15 September 2023

అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి సంఖ్యలు
(వికెట్లు/పరుగులు)[39]
ఓవర్లు ప్రత్యర్థి తేదీ
1 జో చాంబర్‌లైన్ 7–8 9.0 డెన్మార్క్ 1991 జూలై 19
2 సోఫీ ఎక్లెస్టోన్ 6–36 8.0 దక్షిణ ఆఫ్రికా 2022 మార్చి 31
3 అన్య ష్రూబ్సోల్ 6–46 9.4 భారతదేశం 2017 జూలై 23
4 లారా హార్పర్ 5–12 8.4 నెదర్లాండ్స్ 1999 జూలై 19
5 ఇసా గుహ 5–14 8.0 వెస్ట్ ఇండీస్ 2008 జూలై 12
6 గిల్ స్మిత్ 5-15 5.3 డెన్మార్క్ 1990 జూలై 19
లారా మార్ష్ 5–15 10.0 పాకిస్తాన్ 2009 మార్చి 12
8 అన్య ష్రూబ్సోల్ 5–17 10.0 దక్షిణ ఆఫ్రికా 2013 ఫిబ్రవరి 10
9 జో చాంబర్‌లైన్ 5–18 10.4 ఐర్లాండ్ 1989 జూలై 21
కేథరీన్ స్కివర్-బ్రంట్ 5–18 10.0 ఆస్ట్రేలియా 2011 జూలై 7
ఈ నాటికి 15 September 2023

ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ - వ్యక్తిగత రికార్డులు

[మార్చు]

బోల్డ్‌గా చూపించిన ఆటగాళ్లు ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో చురుకుగా ఉన్నారు

అత్యధిక మ్యాచ్‌లు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యాచ్‌లు [40]
1 డాని వ్యాట్ 2010– 149
2 కేథరీన్ స్కివర్-బ్రంట్ 2005–2023 112
3 నాట్ స్కివర్-బ్రంట్ 2013– 111
4 జెన్నీ గన్ 2004–2018 104
హీథర్ నైట్ 2010– 104
6 టామీ బ్యూమాంట్ 2009– 99
7 షార్లెట్ ఎడ్వర్డ్స్ 2004–2016 95
8 అమీ జోన్స్ 2013– 91
9 సారా టేలర్ 2006–2019 90
10 లిడియా గ్రీన్‌వే 2004–2016 85
డేనియల్ హాజెల్ 2009–2018 85
ఈ నాటికి 15 September 2023

అత్యధిక పరుగుల స్కోరరు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యా ఇన్ని పరుగులు[36] సగ అత్య స్ట్రై 50 100 4 6
1 షార్లెట్ ఎడ్వర్డ్స్ 2004–2016 95 93 2,605 32.97 92* 106.93 12 0 338 10
2 డాని వ్యాట్ 2010– 149 128 2,527 21.78 124 126.66 12 2 305 36
3 నాట్ స్కివర్-బ్రంట్ 2013– 111 107 2,230 26.54 82 114.71 12 0 236 15
4 సారా టేలర్ 2006–2019 90 87 2,177 29.02 77 110.67 16 0 241 6
5 టామీ బ్యూమాంట్ 2009– 99 83 1,721 23.90 116 108.37 10 1 199 21
6 హీథర్ నైట్ 2010– 104 92 1,673 23.23 108* 117.98 4 1 174 28
7 అమీ జోన్స్ 2013– 91 75 1,327 21.75 89 121.18 5 0 155 19
8 లిడియా గ్రీన్‌వే 2004–2016 85 73 1,192 24.32 80* 96.12 2 0 93 5
9 లారా మార్ష్ 2007–2019 67 53 755 16.41 54 101.07 1 0 92 7
10 సోఫియా డంక్లీ 2018– 47 37 740 24.66 61* 117.08 3 0 84 10
ఈ నాటికి 15 September 2023

అత్యధిక స్కోర్లు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి అధిక స్కోరు [41] బంతులు 4 6 స్ట్రై ప్రత్యర్థి తేదీ
1 డాని వ్యాట్ 124 64 15 5 193.75 భారతదేశం 2018 మార్చి 25
2 టామీ బ్యూమాంట్ 116 52 18 4 223.07 దక్షిణ ఆఫ్రికా 2018 జూన్ 20
3 హీథర్ నైట్ 108* 66 13 4 163.63 థాయిలాండ్ 2020 ఫిబ్రవరి 26
4 డాని వ్యాట్ 100 57 13 2 175.43 ఆస్ట్రేలియా 2017 నవంబరు 21
5 టామీ బ్యూమాంట్ 97 65 13 1 149.23 న్యూజిలాండ్ 2021 సెప్టెంబరు 1
6 షార్లెట్ ఎడ్వర్డ్స్ 92* 59 13 1 155.93 ఆస్ట్రేలియా 2014 జనవరి 29
7 డాని వ్యాట్ 89* 56 12 1 158.92 భారతదేశం 2021 జూలై 14
8 అమీ జోన్స్ 89 52 11 3 171.15 పాకిస్తాన్ 2019 డిసెంబరు 19
9 టామీ బ్యూమాంట్ 82 53 10 2 154.71 పాకిస్తాన్ 2016 జూలై 3
నాట్ స్కివర్-బ్రంట్ 82 61 9 1 134.42 వెస్టు ఇండీస్ 2020 సెప్టెంబరు 26
ఈ నాటికి 15 September 2023

అత్యధిక వికెట్లు తీసినవారు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి వ్యవధి మ్యా ఇన్ని వికె[42] సగ BBI పొదు స్ట్రై 4 5
1 కేథరీన్ స్కివర్-బ్రంట్ 2005–2023 112 111 114 19.19 4–15 5.57 20.6 1 0
2 సోఫీ ఎక్లెస్టోన్ 2016– 73 72 102 15.37 4–18 5.84 15.8 1 0
అన్య ష్రూబ్సోల్ 2008–2022 79 79 102 15.55 5–11 5.95 15.6 2 1
4 డేనియల్ హాజెల్ 2009–2018 85 85 85 20.75 4–12 5.55 22.4 1 0
5 నాట్ స్కివర్-బ్రంట్ 2013– 111 101 81 21.61 4–15 6.50 19.9 2 0
6 జెన్నీ గన్ 2004–2018 104 76 75 19.82 5–18 66.44గా ఉంది 18.4 2 1
7 లారా మార్ష్ 2007–2019 67 66 64 20.64 3–12 5.29 23.3 0 0
8 హోలీ కొల్విన్ 2007–2013 50 50 63 15.41 4–9 5.19 17.7 1 0
9 సారా గ్లెన్ 2019– 52 49 61 17.14 4–23 6.12 16.8 1 0
10 డాని వ్యాట్ 2010– 149 45 46 15.54 4–11 5.65 16.5 1 0

అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

[మార్చు]
స్థానం క్రీడాకారిణి సంఖ్యలు
(వికెట్లు-పరుగులు) [43]
ఓవర్లు ప్రత్యర్థి తేదీ
1 అన్య ష్రూబ్సోల్ 5–11 4.0 న్యూజిలాండ్ 2012 ఫిబ్రవరి 17
2 జెన్నీ గన్ 5–18 4.0 న్యూజిలాండ్ 2013 అక్టోబరు 22
3 జెన్నీ గన్ 4–9 2.0 దక్షిణ ఆఫ్రికా 2007 ఆగస్టు 10
హోలీ కొల్విన్ 4–9 3.4 పాకిస్తాన్ 2012 సెప్టెంబరు 27
5 డాని వ్యాట్ 4–11 3.0 దక్షిణ ఆఫ్రికా 2010 మే 9
అన్య ష్రూబ్సోల్ 4–11 4.0 ఆస్ట్రేలియా 2015 ఆగస్టు 31
7 అన్య ష్రూబ్సోల్ 4–12 4.0 పాకిస్తాన్ 2012 సెప్టెంబరు 4
డేనియల్ హాజెల్ 4–12 4.0 వెస్టు ఇండీస్ 2012 సెప్టెంబరు 15
లారెన్ బెల్ 4–12 3.0 వెస్టు ఇండీస్ 2022 డిసెంబరు 18
10 జెన్నీ గన్ 4–13 3.0 ఆస్ట్రేలియా 2017 నవంబరు 19

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ICC Rankings". International Cricket Council.
  2. "Women's Test matches - Team records". ESPNcricinfo.
  3. "Women's Test matches - 2023 Team records". ESPNcricinfo.
  4. "WODI matches - Team records". ESPNcricinfo.
  5. "WODI matches - 2023 Team records". ESPNcricinfo.
  6. "WT20I matches - Team records". ESPNcricinfo.
  7. "WT20I matches - 2023 Team records". ESPNcricinfo.
  8. Player Profile: Betty Archdale, from Cricinfo, retrieved 6 July 2006
  9. Only Test: New Zealand Women v England Women, Christchurch, 16–18 February 1935, from Cricinfo, retrieved 6 June 2006
  10. Player Profile: Betty Snowball, from Cricinfo, retrieved 6 July 2006
  11. 1st Test: England Women v Australia Women at Northampton, 12–15 Jun 1937, from Cricinfo, retrieved 6 July 2006
  12. 2nd Test: England Women v Australia Women at Blackpool, 26–29 Jun 1937, from Cricinfo, retrieved 6 July 2006
  13. 3rd Test: England Women v Australia Women at Kennington Oval, 10–13 Jul 1937, from Cricinfo, retrieved 6 July 2006
  14. When the women set the agenda, by Jenny Thompson, Cricinfo, retrieved 7 September 2006
  15. 2nd Match: Australia v Young England at Bournemouth, 23 Jun 1973, from Cricinfo, retrieved 7 September 2006
  16. Women's World Cup, 1973 Averages – International XI Women, from Cricinfo, retrieved 7 September 2006
  17. 13th Match: England v New Zealand at Exmouth, 14 Jul 1973, from Cricinfo, retrieved 7 September 2006
  18. Women's One-Day International Centuries, from Cricinfo, retrieved 7 September 2006
  19. 21st Match: England v Australia at Birmingham, 28 July 1973, from Cricinfo, retrieved 7 September 2006
  20. "Player Profile: Lynne Thomas". ESPNCricinfo. Retrieved 8 November 2021.
  21. "Clearing the Boundaries" (PDF). Cricket Wales.
  22. "Team Profile: Wales Women". CricketArchive. Retrieved 8 November 2021.
  23. "Women's regional hubs to play for Rachael Heyhoe Flint Trophy". the Cricketer. Retrieved 8 November 2021.
  24. "The Hundred team names, kits and badges revealed for the first time". Sky Sports. Retrieved 8 November 2021.
  25. "Establishment of a Welsh Cricket Team". BBC Democracy Live. 23 October 2013. Retrieved 8 November 2021.
  26. "Wales cricket team should play one-day games, Carwyn Jones says". BBC. BBC News. 4 July 2017.
  27. "ECB Women's European Championship 2005 Tables". Cricket Archive. Retrieved 8 November 2021.
  28. "Six players earn first England Women Central Contract". ECB. 2 November 2022. Retrieved 2 November 2022.
  29. "Forty-one female players sign full-time domestic contracts". ECB. 3 December 2020. Retrieved 20 July 2021.
  30. "Cricket Records | Records | England Women | Women's Test matches | Most matches | ESPN Cricinfo". Stats.espncricinfo.com. Retrieved 2014-05-08.
  31. "Tests Most runs". Cricinfo. Retrieved 15 July 2015.
  32. "Tests High scores". Cricinfo. Retrieved 26 March 2015.
  33. "Tests Most wickets". Cricinfo. Retrieved 2 February 2021.
  34. "Tests Best bowling figures in an innings". Cricinfo. Retrieved 15 July 2015.
  35. "ODI Most matches". Cricinfo. Retrieved 28 February 2021.
  36. 36.0 36.1 "Tests Most runs". Cricinfo. Retrieved 15 July 2015.
  37. "ODI High scores". Cricinfo. Retrieved 2 February 2021.
  38. "ODI Most wickets". Cricinfo. Retrieved 28 February 2021.
  39. "ODI Best bowling figures in an innings". Cricinfo. Retrieved 2 February 2021.
  40. "T20I Most matches". Cricinfo. Retrieved 7 March 2021.
  41. "T20I High scores". Cricinfo. Retrieved 3 February 2021.
  42. "T20I Most wickets". Cricinfo. Retrieved 7 March 2021.
  43. "T20I Best bowling figures in an innings". Cricinfo. Retrieved 3 February 2021.