Jump to content

హీథర్ నైట్

వికీపీడియా నుండి

హీథర్ క్లేర్ నైట్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన ఒక ఇంగ్లీష్ క్రికెట్ క్రీడాకారిణి. ఇంగ్లాండ్, రోచ్‌డేల్‌ ప్రాంతంలో 1990 డిసెంబరు 26న జన్మించింది. డెవాన్‌లోని ప్లైమౌత్‌లోని రాష్ట్ర సెకండరీ పాఠశాల అయిన ప్లిమ్‌స్టాక్ పాఠశాలలో చదువుకుంది.[1] ఆమెకు ప్రకృతి (నాచురల్) శాస్త్రాలను అభ్యసించడానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కలిపించారు. కానీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు సమయం కోసం దానిని తిరస్కరించింది.[2] ఆమె కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో జీవ వైద్య శాస్త్రాలను (బయోమెడికల్ సైన్సెస్) అభ్యసించింది.[3]

హీథర్ నైట్

OBE
నైట్ 2017 లో మహిళా యాషెస్ టెస్ట్ ఆడుతున్నప్పుడు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హీథర్ క్లేర్ నైట్
పుట్టిన తేదీ (1990-12-26) 1990 డిసెంబరు 26 (వయసు 33)
రోచడలే, ఇంగ్లాండ్
మారుపేరుట్రెవ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్/ఆఫ్ బ్రేక్
పాత్రబాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 149)2011 22 జనవరి - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 22 జూన్ - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 115)2010 1 మార్చ్ - భారత దేశము తో
చివరి వన్‌డే2023 12 సెప్టెంబర్ - శ్రీ లంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.5
తొలి T20I (క్యాప్ 29)2010 22 November - శ్రీ లంక తో
చివరి T20I2023 6 సెప్టెంబర్ - శ్రీ లంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–2009డెవాన్ మహిళా క్రికెట్ జట్టు
2010–presentబెర్క్‌షైర్ మహిళా క్రికెట్ జట్టు
2014/15–2015/16టాస్మానియన్ రోర్
2015/16–2019/20హోబర్ట్ హరికేన్స్ (WBBL)
2016–presentవెస్ట్రన్ స్టార్మ్‌'
2020/21సిడ్నీ థండర్ (WBBL)
2021–presentలండన్ స్పిరిట్
2023–present(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I WLA
మ్యాచ్‌లు 11 134 104 223
చేసిన పరుగులు 771 3,765 1,673 8,466
బ్యాటింగు సగటు 47.62 36.91 23.23 47.83
100లు/50లు 2/4 2/26 1/4 16/52
అత్యుత్తమ స్కోరు 168* 106 108* 190
వేసిన బంతులు 413 1,923 543 4,747
వికెట్లు 7 56 21 138
బౌలింగు సగటు 23.71 24.92 25.04 23.03
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/7 5/26 3/9 5/14
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 42/– 30/– 78/–
మూలం: CricketArchive, 15 సెప్టెంబర్ 2023

నైట్ మారుపేరు "ట్రెవ్". 2015లో ఆమె క్రీడా పాత్రికేయుడు (స్పోర్ట్స్ జర్నలిస్ట్) క్లేర్ బాల్డింగ్‌కి తన మారు పేరు గురించి చెపుతూ, "నాకు దాదాపు 13 ఏళ్లు ఉన్నప్పుడు క్రికెట్ శిబిరంలో పరిచయం చేసుకున్నప్పుడు, నేను హీథర్ అని కాకుండా ట్రెవర్ అని చెప్పానని వారు అనుకున్నారు!" అని వివరించింది [4]

ఆమె కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేది. నైట్ 2019 డిసెంబరులో ఇంగ్లాండ్ తరపున తన 100వ మహిళల ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.

దేశీయ క్రికెట్

[మార్చు]

నైట్ 'డెవాన్ క్రికెట్ లీగ్‌'లో ప్లైమ్‌స్టాక్ క్రికెట్ క్లబ్ తరపున క్రికెట్ ఆడింది.[5] ఆమె 8 సంవత్సరాల వయస్సులో 'కోల్ట్స్' శిక్షణా తరగతులకు హాజరు కావడం ప్రారంభించి, ఆ క్లబ్ వ్యవస్థలో యువతగా ఎదిగింది.

నైట్ 'కౌంటీ' స్థాయిలో శక్తివంతమైన బ్యాటర్. ప్రారంభంలో ఆమె సొంత కౌంటీ అయిన డెవాన్ కోసం ఆడింది, ప్రస్తుతం బెర్క్‌షైర్ కోసం ఆడుతోంది. ఆమె 2008 లో 390 పరుగులు, 2009 లో 622 పరుగులతో రెండు కౌంటీ లోనూ అగ్రస్థానంలో ఉంది. ఆమె సూపర్ ఫోర్స్‌లో డైమండ్స్, సఫైర్స్, ఎమరాల్డ్స్ తరపున కూడా ఆడింది.

నైట్ (ప్రస్తుతం నిలిచిపోయిన)మహిళా క్రికెట్ సూపర్ లీగ్‌లో 'వెస్ట్రన్ స్టార్మ్‌'కు నాయకత్వం వహించి, 2017, 2019 సంవత్సరాలలో టైటిల్‌ సాధించింది.[6][7] నాలుగు సీజన్ల పోటీలో ఆమె అత్యధిక పరుగులు తీసిన క్రీడాకారిణి.[8] ఆమె 2020లో 'రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ'లో 'వెస్ట్రన్ స్టార్మ్' తరపున ఆడటం కొనసాగించింది.[9]

నైట్ దేశీయ స్థాయిలో ఆస్ట్రేలియాలో, గతంలో 'టాస్మానియన్ రోర్', 'హోబర్ట్ హరికేన్స్' తరపున, ఇంకా 'సిడ్నీ థండర్' కొరకు ఆడింది. ఆమె తన మొదటి సీజన్‌లో 'మహిళా బిగ్ బాష్ లీగ్‌'ని 'సిడ్నీ థండర్‌' జట్టు నుంచి గెలుచుకుంది, ఆఖరి రోజు ఆటలో 26*తో అధిక పరుగులు చేసింది.[10] 2021లో, ' ది హండ్రెడ్ ప్రారంభ సీజన్ కోసం లండన్ స్పిరిట్ ఆమె గురించి అనుకున్నారు.[11] 2022 ఏప్రిల్లో, 'ది హండ్రెడ్' సీజన్ కోసం ఆమెను 'లండన్ స్పిరిట్' ఎంపిక చేసింది.[12]

2023లో 'మహిళల ప్రీమియర్ లీగ్' ప్రారంభ సీజన్‌లో, నైట్‌ను 40 లక్షల ధరకు 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)' ఆమెను ఎంపిక చేసింది.[13]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

గాయపడిన 'సారా టేలర్‌'కు బదులుగా 2010లో భారత పర్యటన కోసం నైట్ ను ఇంగ్లండ్ జట్టులోకి పిలిపించారు. 5వ ఒక రోజు అంతర్జాతీయ పోటీలో మార్చి 1న ముంబైలో ఆడింది, బ్యాటింగ్ ప్రారంభించి ఆమె అంతర్జాతీయ పోటీలో 49 పరుగులు చేసింది.[14] ఆమె 2010లో ఇంగ్లండ్ జట్టు తరపున శ్రీలంకలో పర్యటించింది. నవంబరు 22న కొలంబోలో జరిగిన సిరీస్‌లోని 2వ మ్యాచ్‌తో ఆమె ట్వంటీ20 పోటీలను ఆడడము మొదలు పెట్టింది.[15] 2011 జనవరిలో సిడ్నీ బ్యాంక్‌స్టౌన్ ఓవల్‌' లో జరిగిన 'యాషెస్ టెస్ట్‌' లో ఆమె మొదటగా ఆడింది.

2014 ఏప్రిల్లో మహిళా క్రీడాకారుల కోసం ప్రకటించిన 18 ECB సెంట్రల్ కాంట్రాక్టుల మొదటి విడత జాబితాలో ఆమె పేరు నమోదు అయింది.[16]

2016 జూన్ 5న, 'షార్లెట్ ఎడ్వర్డ్స్' వైదొలిగిన తర్వాత నైట్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించింది.[17]

ఒక రోజు అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో యాభై పరుగులు చేసి, ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె పేరు నిలచింది.[18]

2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

హీథర్ నైట్ తన మొదటి మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించింది. ఈ జట్టు మొదటి (ఓపెనింగ్) మ్యాచ్‌లో భారత్‌తో ఓడిపోయినప్పటికీ టోర్నమెంట్‌ గెలుచుకున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ఆమె, నటాలీ స్కివర్‌తో కలిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (213) [19] లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ని 107 పరుగులతో ఓడించింది. చరిత్రలో రికార్డు స్థాయిలో 3వ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.[20] లార్డ్స్లో జరిగిన చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించడానికి నైట్ దోహదపడింది.[21][22][23] జట్టు విజయం తర్వాత, ఆమెకు 'క్వీన్స్ 2018' న్యూ ఇయర్ ఆనర్స్ జాబితాలో OBE (Order of the British Empire) లభించింది.[24]

2018 ఏప్రిల్లో జరిగిన మ్యాచ్ లో ఆమె 2017 ప్రపంచ కప్ విజయంతో ఐదుగురు విస్ డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికైంది.[25]

2018 ప్రపంచ ట్వంటీ20

[మార్చు]

2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన ICC మహిళల ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్‌కు ఆమె ఇంగ్లాండ్ జట్టుకు నాయకురాలిగా ఎంపికైంది.[26][27]

Knight batting for England during the 2020 ICC Women's T20 World Cup
2020 ICC మహిళల T20 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లండ్ తరపున నైట్ బ్యాటింగ్ చేస్తోంది.

2019 ఫిబ్రవరిలో, ఆమెకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) తరపున ఆడటానికి పూర్తి కేంద్ర కాంట్రాక్టును అందచేసింది.[28][29] 2019 జూన్లో, ECB మహిళల యాషెస్‌లో పోటీ చేయడానికి ఆస్ట్రేలియాతో తమ ప్రారంభ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఆమెను ఎంపిక చేసింది.[30][31]

2019 డిసెంబరు 12న, మలేషియాలో పాకిస్థాన్‌తో జరిగిన ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా, నైట్ ఇంగ్లండ్ తరపున 100 WODI మ్యాచ్‌లు ఆడిన పదవ మహిళగా అవతరించింది.[32]

2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే ICC మహిళల, T20 ప్రపంచ కప్‌కు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా నైట్ ఎంపిక అయింది..[33] టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ తమ రెండవ మ్యాచ్‌లో, థాయ్‌లాండ్‌తో జరిగిన WT20Iలలో నైట్ తన 1,000వ పరుగును సాధించింది.[34] ఆమె WT20I క్రికెట్‌లో తన మొదటి శతకాన్ని సాధించింది.[35] మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో శతకాలను చేసిన మొదటి క్రికెటర్‌గా గుర్తింపబడింది.[36]

2020 జూన్ 18న, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ మహిళల మ్యాచ్‌లకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 24 మంది ఆటగాళ్లతో కూడిన జట్టులో నైట్‌ని ఎంపిక చేశారు.[37][38] 2021 జూన్లో, భారత్‌తో జరిగే వన్-ఆఫ్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు నైట్ కెప్టెన్‌గా ఎంపిక అయింది..[39][40] 2021 జూలై 3న, భారత్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో, నైట్ తన 3,000వ పరుగును సాధించి WODI క్రికెట్‌లో 50వ వికెట్‌ను తీసింది.[41][42] 2021 డిసెంబరులో, 'మహిళల యాషెస్‌'లో పోటీ చేసేందుకు ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా నైట్ ఎంపికయింది.[43] 2022 ఫిబ్రవరిలో, ఆమె న్యూజిలాండ్‌లో జరిగే మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.[44] 2022 జూలైలో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.[45]

అంతర్జాతీయ శతకాలు

[మార్చు]

నైట్ క్రికెట్ మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ శతకం సాధించిన మొదటి ఇంగ్లండ్ మహిళా క్రీడాకారిణి.[46][47] ఆమె చేసిన అంతర్జాతీయ శతకాలు:

టెస్టు సెంచరీలు

[మార్చు]
హీథర్ నైట్ టెస్ట్ శతకాలు [48]
# పరుగులు మ్యాచ్ ప్రత్యర్థులు నగర దేశం వేదిక సంవత్సరం
1 157 2  ఆస్ట్రేలియా ఇంగ్లాండ్వార్మ్స్లీ, ఇంగ్లాండ్ సర్ పాల్ గెట్టిస్ గ్రౌండ్ 2013 [49]
2 168 * 9  ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకాన్బెర్రా, ఆస్ట్రేలియా మనుకా ఓవల్ 2022 [50]

అంతర్జాతీయ ఒక రోజు అంతర్జాతీయ శతకాలు

[మార్చు]
హీథర్ నైట్ ఒక రోజు అంతర్జాతీయ శతకాలు[51]
# పరుగులు మ్యాచ్ ప్రత్యర్థులు నగరం దేశం వేదిక సంవత్సరం
1 106 68  పాకిస్తాన్ ఇంగ్లాండ్ Leicester, England Grace Road 2017[52]
2 101 111  న్యూజీలాండ్ ఇంగ్లాండ్ Derby, England County Ground 2021[53]

టీ20 అంతర్జాతీయ శతకాలు

[మార్చు]
హీథర్ నైట్ T20 అంతర్జాతీయ శతకాలు [54]
# పరుగులు మ్యాచ్ ప్రత్యర్థులు నగరం దేశం వేదిక సంవత్సరం
1 108 * 72  థాయిలాండ్ ఆస్ట్రేలియా కాన్బెర్రా, ఆస్ట్రేలియా మనుకా ఓవల్ 2020 [55]

గౌరవాలు

[మార్చు]

జట్టుకి

[మార్చు]
  • మహిళల క్రికెట్ ప్రపంచ కప్ విజేత : 2017 [23]
  • మహిళల బిగ్ బాష్ లీగ్ విజేత: 2020–21 [10]

వ్యక్తిగత

[మార్చు]
  • 2x వాల్టర్ లారెన్స్ మహిళా అవార్డు విజేత: 2013, 2019 [56][57][58]
  • ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్: 2018 [24]
  • ఐదుగురు విస్ డెన్ క్రికెటర్లలో ఒకరు: 2018 [25]

ఇది కూడ చూడు

[మార్చు]
  • మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో శతకాల జాబితా
  • మహిళల టెస్టు క్రికెట్‌లో శతకాల జాబితా
  • మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో శతకాల జాబితా

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Knight is a first among equals at Plymstock". This is Cornwall. Northcliffe Media. 3 December 2008. Archived from the original on 5 May 2013. Retrieved 24 October 2011.
  2. Westbury, Isabelle (27 July 2015). "Women's Cricket: Turning down Cambridge degree course was right for Heather Knight". The Independent. Archived from the original on 9 May 2022. Retrieved 28 July 2015.
  3. "Performance: Sports Bursar selected for India training camp". News Archive – Sport. Cardiff University. 22 January 2010. Retrieved 24 October 2011.[permanent dead link]
  4. Balding, Clare (19 February 2015). "Balding bowled over by England's women cricketers". BT Sport. Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.
  5. "Heather Knight: New England captain's journey from Plymstock to India". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 3 June 2016. Retrieved 2022-03-09.
  6. "Western Storm seal 2017 KSL title with famous win". England and Wales Cricket Board. 1 September 2017. Retrieved 4 January 2021.
  7. "Western Storm claim the 2019 Kia Super League title". England and Wales Cricket Board. 1 September 2019. Retrieved 4 January 2021.
  8. "RECORDS / WOMEN'S CRICKET SUPER LEAGUE / MOST RUNS". ESPNcricinfo. Retrieved 4 January 2021.
  9. "RECORDS / RACHAEL HEYHOE FLINT TROPHY, 2020 - WESTERN STORM / BATTING AND BOWLING AVERAGES". ESPNcricinfo. Retrieved 4 January 2021.
  10. 10.0 10.1 "WBBL Final: Sydney Thunder thrash Melbourne Stars by seven wickets to win title". BBC Sport. 28 November 2020. Retrieved 4 January 2021.
  11. "The Hundred 2021 - full squad lists". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-03-09.
  12. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  13. Tripathi, Anuj (ed.). "England captain Heather Knight 'absolutely delighted' to be part of Royal Challengers Bangalore". India Today. Retrieved 22 February 2023.
  14. "England Women Tour of India 2009/10". Cricinfo.com. Retrieved 2014-05-08.
  15. "2nd T20I: Sri Lanka Women v England Women at Colombo (NCC), Nov 22, 2010 | Cricket Scorecard". ESPN Cricinfo. Retrieved 2014-05-08.
  16. "England women earn 18 new central contracts". BBC. 20 April 2015. Retrieved 6 May 2014.
  17. "Heather Knight appointed England women's captain". Sky Sports. Retrieved 27 October 2016.
  18. "Records | Women's One-Day Internationals | All-round records | A fifty and five wickets in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  19. "Cricket Records | Records | Women's World Cup | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-07-07.
  20. "5th Match: England Women v Pakistan Women at Leicester, Jun 27, 2017 | Cricket | ESPN Cricinfo". ESPNCricinfo. Retrieved 2017-07-07.[permanent dead link]
  21. Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
  22. World Cup Final, BBC Sport, 23 July 2017.
  23. 23.0 23.1 England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.
  24. 24.0 24.1 "Women's cricket rewarded in wake of World Cup win". The Daily Telegraph. 30 December 2017. p. 6.
  25. 25.0 25.1 Wisden names three female World Cup winners in its five cricketers of 2017 The Guardian, 11 April 2018
  26. "England name Women's World T20 squad". England and Wales Cricket Board. Retrieved 4 October 2018.
  27. "Three uncapped players in England's Women's World T20 squad". ESPN Cricinfo. Retrieved 4 October 2018.
  28. "Freya Davies awarded England Women contract ahead of India tour". ESPN Cricinfo. Retrieved 6 February 2019.
  29. "Freya Davies 'thrilled' at new full central England contract". International Cricket Council. Retrieved 6 February 2019.
  30. "Fran Wilson called into England squad for Ashes ODI opener against Australia". ESPN Cricinfo. Retrieved 29 June 2019.
  31. "England announce squad for opening Women's Ashes ODI". Times and Star. Retrieved 29 June 2019.
  32. "From bailing the team out of crises to clinching the World Cup: Heather Knight's top ODI knocks". Women's CricZone. Retrieved 12 December 2019.
  33. "England Women announce T20 World Cup squad and summer fixtures". England and Wales Cricket Board. Retrieved 17 January 2020.
  34. "Heather Knight becomes the first centurion in Women's T20 World Cup 2020". The Cricket Times. Retrieved 26 February 2020.
  35. "Heather Knight scores maiden T20I century". Siasat. 26 February 2020. Retrieved 26 February 2020.
  36. "First woman to score a ton in all 3 formats: The numbers from Heather Knight's T20 World Cup blitz". Scroll. Retrieved 26 February 2020.
  37. "England Women confirm back to training plans". England and Wales Cricket Board. Retrieved 18 June 2020.
  38. "England Women return to training with September tri-series on the cards". ESPN Cricinfo. Retrieved 18 June 2020.
  39. "Emily Arlott earns call-up to England Women Test squad". England and Wales Cricket Board. Retrieved 9 June 2021.
  40. "Emily Arlott earns maiden call-up as England announce squad for India Test". Women's CricZone. Retrieved 9 June 2021.
  41. "Magnificent Mithali guides India home in a thriller". Women's CricZone. Archived from the original on 9 July 2021. Retrieved 3 July 2021.
  42. "India's Mithali Raj breaks run-scoring record in tense ODI win against England". Sky Sports. Retrieved 3 July 2021.
  43. "Heather Knight vows to 'fight fire with fire' during Women's Ashes". ESPN Cricinfo. Retrieved 17 December 2021.
  44. "Charlie Dean, Emma Lamb in England's ODI World Cup squad". ESPN Cricinfo. Retrieved 10 February 2022.
  45. "Alice Capsey named in England's Commonwealth Games squad, Tammy Beaumont omitted". ESPN Cricinfo. Retrieved 15 July 2022.
  46. "Hat-trick of centuries! England's Heather Knight becomes first woman to score tons in all three formats". Times Now (in ఇంగ్లీష్). 26 February 2020. Retrieved 28 April 2022.
  47. "Cricket: England captain Heather Knight hits a record-breaking century at the Women's T20 World Cup - CBBC Newsround". BBC newsround. 26 February 2020. Retrieved 28 April 2022.
  48. "All-round records | Women's Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com – Heather Knight". ESPNcricinfo. Retrieved 3 November 2021.
  49. "Full Scorecard of AUS Women vs ENG Women Only Test 2013 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 3 November 2021.
  50. "Only Test, Canberra, Jan 27 - 30 2022, Women's Ashes - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 29 January 2022.
  51. "All-round records | Women's One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com – Heather Knight". Cricinfo. Retrieved 3 November 2021.
  52. "Full Scorecard of ENG Women vs PAK Women 5th Match 2017 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 3 November 2021.
  53. "Full Scorecard of NZ Women vs ENG Women 4th ODI 2021 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 3 November 2021.
  54. "All-round records | Women's Twenty20 Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com – Heather Knight". ESPNcricinfo. Retrieved 3 November 2021.
  55. "Full Scorecard of ENG Women vs Thai Women 7th Match, Group B 2019/20 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 3 November 2021.
  56. "Walter Lawrence Trophy 2013: England's Shining Knight". The Walter Lawrence Trophy (in ఇంగ్లీష్). 2013-10-02. Retrieved 2023-04-18.
  57. "Walter Lawrence Trophy 2019: Knight's Double". The Walter Lawrence Trophy (in ఇంగ్లీష్). 2019-09-27. Retrieved 2023-04-18.
  58. "Hall of Fame: Walter Lawrence Women's Award". The Walter Lawrence Trophy. Retrieved 2023-04-18.