Jump to content

ఇషా గుహ

వికీపీడియా నుండి
ఇషా గుహ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇషా తారా గుహ
పుట్టిన తేదీ (1985-05-21) 1985 మే 21 (వయసు 39)
హై వైకోంబ్, బకింగ్‌హామ్‌షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలింగ్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 137)2002 14 ఆగస్టు - భారతదేశం తో
చివరి టెస్టు2011 22 జనవరి - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 94)2001 10 ఆగస్టు - స్కాట్లాండ్ తో
చివరి వన్‌డే2011 21 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.19
తొలి T20I (క్యాప్ 5)2004 5 ఆగస్టు - న్యూజిలాండ్ తో
చివరి T20I2011 29 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I WLA
మ్యాచ్‌లు 8 83 22 205
చేసిన పరుగులు 113 122 39 1,556
బ్యాటింగు సగటు 16.14 8.71 7.80 14.67
100లు/50లు 0/0 0/0 0/0 0/5
అత్యుత్తమ స్కోరు 31* 26 13* 72*
వేసిన బంతులు 1,491 3,767 459 9,550
వికెట్లు 29 101 18 249
బౌలింగు సగటు 18.93 23.21 25.05 22.43
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 2 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/40 5/14 3/21 5/14
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 26/– 4/– 71/–
మూలం: CricketArchive, 2021 మార్చి 7

ఇషా తారా గుహ (జననం 1985 మే 21) బ్రిటీష్ క్రికెట్ వ్యాఖ్యాత, టెలివిజన్, రేడియో క్రికెట్ బ్రాడ్‌కాస్టర్ కూడా.[1] ఆమె 2005 ప్రపంచ కప్, 2009 ప్రపంచ కప్‌లలో ఆడిన మాజీ ఇంగ్లాండు క్రికెటర్.[2]

2009లో ప్రపంచ కప్ గెలవడం తన కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది.[3] ఆమె కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్‌, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది. ఆమె 2001, 2011ల మధ్య ఇంగ్లాండు తరపున 8 టెస్ట్ మ్యాచ్‌లు, 83 వన్డే ఇంటర్నేషనల్, 22 ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఆమె థేమ్స్ వ్యాలీ, బెర్క్‌షైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[4]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె ఇంగ్లాండ్‌లోని హై వైకోంబ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు 1970లలో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వలస వెళ్ళారు.[5] ఆమె ఎనిమిదేళ్ల వయసులో తన అన్నయ్యతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించింది.[5] కాగా 13 ఏళ్ల వయస్సులో డెవలప్‌మెంట్ ఇంగ్లాండ్ జట్టుకు ఆమె ఎంపికైంది.[6]

బాలికల రాష్ట్ర పాఠశాల అయిన వైకోంబ్ హైస్కూల్ లో ఆమె చదువుకుంది.[7] ఆమె బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పట్టాపుచ్చుకుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో ఆమె న్యూరోసైన్స్‌లో ఎంఫిల్ పూర్తిచేసింది.[8][9]

క్రికెట్ కెరీర్

[మార్చు]

రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ అయిన ఆమె 2002లో భారతదేశంపై 17 పరుగులతో తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసింది.[10] అదే పర్యటనలో భాగంగా, ఆమె 2002 మహిళల ట్రై-సిరీస్‌లో ఆడింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ ఓడిపోయినా ఆమె మూడు వికెట్లు పడగొట్టి మంచి ఆటతీరు ప్రదర్శించింది.[11] ఆమె ఇంగ్లాండ్ తరపున ఆడిన మొదటి భారతీయ వారసత్వ మహిళ అవడం విశేషం.[12]

2002లో, ఆమె బిబిసి ఏషియన్ నెట్‌వర్క్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యింది.[13] 2008లో వెస్టిండీస్‌పై 14 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం 44 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆమె అత్యుత్తమ బౌలింగ్ గా నిలిచింది.[14] 2008 డిసెంబరు 31 నాటికి, ఆమె ఐసిసి మహిళల వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచింది. 2009 ఫిబ్రవరిలో బౌరల్‌లోని బ్రాడ్‌మాన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తన ఏడవ టెస్టు మ్యాచ్‌లో ఆమె 40 పరుగులకు 5 వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది. 2008, ఆ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టింది, ఇంగ్లండ్ యాషెస్‌ను నిలబెట్టుకోవడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది.[15][16]

2009 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఆమె భాగం అయింది. ఆమె 2012 మార్చి 9న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది, అయినప్పటికీ తాను బెర్క్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడటం కొనసాగిస్తానని చెప్పింది.[17]

మహిళల ఒడిఐ చరిత్రలో ఆమె, లిన్సే ఆస్క్యూతో కలిసి తొమ్మిదో వికెట్‌కు 73 పరుగులతో ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.[18][19]

మీడియా

[మార్చు]

బిబిసి స్పోర్ట్ వెబ్‌సైట్ లో ఇషా గుహ కాలమిస్ట్ గా చేసింది.[20] ఆమె టెస్ట్ మ్యాచ్ స్పెషల్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[21] ఆమె 2012 ఏప్రిల్లో ఐటీవి స్పోర్ట్‌లో ఐటీవి4 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కవరేజీకి సహ-ప్రెజెంటర్‌గా చేసింది.[22][23][24]

2016లో, ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ట్రిపుల్ ఎమ్ రేడియో టెస్ట్ క్రికెట్ కామెంటరీ టీమ్‌లో ఆమె ఒకరు.[25] 2018లో, ఆమె ఇంగ్లాండ్/పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లకు స్కై స్పోర్ట్స్‌కు వ్యాఖ్యాతగా పనిచేసింది.[26] అంతేకాకుండా వారి ఆస్ట్రేలియన్ క్రికెట్ కవరేజ్ కోసం ఫాక్స్ క్రికెట్‌కు వ్యాఖ్యాతగా ఎంపికైంది.[27] ఆమె 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో వ్యాఖ్యాన బృందంలో కూడా సభ్యురాలు. 2020లో ఆమె కొత్త బిబిసి టీవి టెస్ట్, ఒడిఐ హైలైట్స్ షోకు ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[28][29]

2023లో, ఆమె వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ల బిబిసి కవరేజీ కోసం ప్రెజెంటింగ్ టీమ్‌లో చేరింది.[30]

దాతృత్వం

[మార్చు]

ఇషా గుహ స్పోర్టింగ్ ఈక్వల్స్, బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్‌లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.[31][32][33][34] 2023లో, మహిళా క్రికెట్ క్రీడాకారులకు మద్దతుగా గాట్ యువర్ బ్యాక్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.[35]

మూలాలు

[మార్చు]
  1. "Isha Guha : కామెంటేటర్‌గా రాణిస్తున్నానంటే.. ఆ క్రెడిట్‌ అంతా వార్న్‌దే! | Commentator Isha Guha mvs". web.archive.org. 2023-08-13. Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Isa Guha ESPN Cricinfo
  3. Walker, Phil (23 అక్టోబరు 2012). "A Drink With… Isa Guha". All Out Cricket. Archived from the original on 12 మే 2014. Retrieved 12 మే 2014.
  4. "Isa Guha". CricketArchive. Retrieved 7 March 2021.
  5. 5.0 5.1 Qureshi, Huma (2012-10-10). "Isa Guha: 'England is leading the way in women's cricket'". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2019-12-03.
  6. Kumar, K. C. Vijaya (2014-07-25). "I had the best of both worlds: Isa Guha". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-03.
  7. "Wycombe girl named under 17s Cricketer of the Year". Bucks Free Press. 28 February 2002.Dunhill, Lawrence (12 July 2010). "Nine decades of pupils attend renunion". Bucks Free Press.
  8. UCL (2006-08-15). "Student cricket star". UCL News (in ఇంగ్లీష్). Retrieved 2019-12-03.
  9. "How Isa Guha is Changing Perceptions about Cricket Presenters | Forbes India Blog". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2019-12-03.
  10. "Isa Guha". Cricinfo. Retrieved 2019-04-04.
  11. "Isa Guha NZ". Independent.co.uk. 20 July 2002. Retrieved 2020-03-12.
  12. Guha was the first Asian woman to play for England
  13. "England's Isa Guha retires from international cricket". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2012-03-09. Retrieved 2019-04-04.
  14. "Full Scorecard of England Women vs West Indies Women 2nd ODI 2008 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2019-04-04.
  15. "Full Scorecard of Australia Women vs England Women Only Test 2008 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2019-04-04.
  16. "England women win to retain Ashes" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2008-02-18. Retrieved 2019-04-04.
  17. Isa Guha retires from international cricket ESPN Cricinfo, 9 March 2012
  18. "12th Match: England Women v New Zealand Women at Chennai, Mar 3, 2007 | Cricket Scorecard |". Cricinfo. ESPN. Retrieved 17 April 2017.
  19. "Records | Women's One-Day Internationals | Partnership records | Highest partnerships by wicket |". Cricinfo. ESPN. Retrieved 17 April 2017.
  20. Isa Guha column: 'I've picked a winner with the Black Keys' BBC Sport, 15 February 2012
  21. "BBC Radio 4 – Test Match Special, The 2019 Men's World Cup Final". BBC (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-12-03.
  22. Indian Premier League cricket returns to ITV4 Archived 8 మే 2012 at the Wayback Machine ITV Press Centre, 21 March 2012
  23. The Indian Premier League returns to ITV4 and ITV.com Archived 27 జనవరి 2013 at Archive.today ITV.com, 30 March 2012
  24. ITV Snap up England's Women Cricket Star Isa Guha to present IPL coverage Archived 22 మే 2012 at the Wayback Machine Total Sport Promotions, 15 April 2011
  25. Triple M Delivers Best Ever Ashes Commentary Team Triple M Melbourne, 22 September 2017
  26. "Isa Guha is 'new face of cricket' on the BBC..." www.asian-voice.com.
  27. Commentary Team Foxtel
  28. "Cricket on the BBC: Isa Guha to present Test & ODI highlights shows". BBC Sport. 4 June 2020.
  29. Martin, Ali (2020-06-04). "Geoffrey Boycott could end TMS career after BBC omit 79-year-old from lineup". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2020-08-07.
  30. ""Who is Wimbledon presenter Isa Guha?". www.radiotimes.com. 27 June 2023.
  31. "Isa Guha". Supporters. Sporting Equals. Archived from the original on 2 February 2017. Retrieved 21 January 2017.
  32. Brand Ambassadors Archived 9 మే 2012 at the Wayback Machine Sporting Equals
  33. ITV Snap up England's Women Cricket Star Isa Guha to present IPL coverage Archived 22 మే 2012 at the Wayback Machine Total Sport Promotions, 15 April 2011
  34. "VIVO IPL 2017 Schedule". Archived from the original on 18 ఫిబ్రవరి 2017. Retrieved 20 ఫిబ్రవరి 2017. British Asian Trust, September 2016
  35. "Guha launches initiative to support women in cricket". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2023-02-28. Retrieved 2023-06-01.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇషా_గుహ&oldid=4016437" నుండి వెలికితీశారు