రైజింగ్ పూణే సూపర్‌జైంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రైజింగ్ పూణే సూపర్‌జైంట్
వ్యక్తిగత సమాచారం
యజమానిసంజీవ్ గోయెంకా (ఆర్.పి - సంజీవ్ గోయెంకా గ్రూప్)
జట్టు సమాచారం
నగరంపూణే, మహారాష్ట్ర, భారతదేశం
స్థాపితండిసెంబర్ 2015 (డిసెంబర్ 2015)
విలీనంమే 2017 (మే 2017)
స్వంత మైదానంమహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే (సామర్థ్యం: 37,400)
రెండవ స్వంత మైదానండా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం (సామర్థ్యం: 50,000)
చరిత్ర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు0

రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఐపీఎల్‌- 2016, 2017 సీజన్‌తో పూణే ఫ్రాంఛైజీ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించిన జట్టు. రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా కు సంబందించిన ఆర్.పి - సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్కించుకుంది.

ఇది 2016 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడడం మొదలుపెట్టి, 2017 లో ఫైనలిస్ట్‌గా ఆడింది. [1] [2] పూణే వారియర్స్ ఇండియా తర్వాత పూణేకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో జట్టు ఇది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్ల యజమానులు అక్రమ బెట్టింగ్‌లో పాల్గొనడం వల్ల ఆ జట్లను రెండేళ్ళ పాటు సస్పెండు చేసినపుడు, రైజింగ్ పూణే సూపర్‌జైంట్, గుజరాత్ లయన్స్‌ జట్లు వాటి స్థానంలో ఆడాయి..[3]

ఆ జట్టు 2017 IPL ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌తో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ జట్టుకు IPLలో చివరి గేం అదే.[4][5] అదే యజమాని 2021 అక్టోబరులో మరో ఫ్రాంచైజీ, లక్నో సూపర్ జెయింట్‌లను కొనుగోలు చేసింది. ఇది ఇప్పుడు లీగ్‌లోని 10 జట్లలో ఒకటి.

సీజన్లు[మార్చు]

ఇండియన్ ప్రీమియర్ లీగ్[మార్చు]

సంవత్సరం లీగ్ స్టాండింగ్ ఫైనల్ స్టాండింగ్
2016 8లో 7వది లీగ్ వేదిక
2017 8లో 2వది రన్నర్స్-అప్

పనితీరు[మార్చు]

ఇండియన్ ప్రీమియర్ లీగ్[మార్చు]

సంవత్సరం టైడ్ స్థానం సారాంశం
2016 14 5 9 0 0 35.71% 7 గ్రూప్ స్టేజ్
2017 16 10 6 0 0 62.5% 2 రన్నర్స్-అప్

రికార్డులు[మార్చు]

అత్యధిక పరుగులు[మార్చు]

ఆటగాడు మ్యాచ్‌లు పరుగులు బ్యాటింగ్ సగటు
అజింక్య రహానే 30 862 33.15
స్టీవ్ స్మిత్ 23 742 41.22
ఎంఎస్ ధోని 30 574 31.88
రాహుల్ త్రిపాఠి 14 391 27.92
మనోజ్ తివారీ 15 324 32.40
మూలం: క్రిక్ఇన్ఫో [6]

అత్యధిక వికెట్లు[మార్చు]

ఆటగాడు మ్యాచ్‌లు వికెట్లు అత్యుత్తమ బౌలింగ్ బౌలింగ్ సగటు
జయదేవ్ ఉనద్కత్ 12 24 5/30 13.41
ఆడమ్ జాంపా 11 19 6/19 14.63
ఇమ్రాన్ తాహిర్ 12 18 3/18 20.50
బెన్ స్టోక్స్ 12 12 3/18 26.33
అశోక్ దిండా 12 12 3/20 29.16
మూలం: క్రిక్ఇన్ఫో [7]

మూలాలు[మార్చు]

  1. "Indian Premier League 2016 Squads". ESPN Cricinfo. Retrieved 16 November 2020.
  2. "Indian Premier League 2017 Squads". ESPN Cricinfo. Retrieved 16 November 2020.
  3. "IPL to have two new teams from Pune and Rajkot". The Times of India. 8 December 2015. Retrieved 16 November 2020.
  4. Krishnaswamy, Karthik (21 May 2017). "Mumbai Indians clinch third IPL title in last-ball finish". ESPNcricinfo. Retrieved 24 May 2017.
  5. Ramesh, Aditya (7 May 2017). "RPS,GL contracts won't be extended". Times of India. Retrieved 27 May 2017.
  6. "Rising Pune Supergiant / Records / Twenty20 Matches / Most Runs". Cricinfo. ESPN. Retrieved 25 May 2017.
  7. "Rising Pune Supergiant / Records / Twenty20 Matches / Most Wickets". Cricinfo. ESPN. Retrieved 25 May 2017.