బోర్డర్ గవాస్కర్ ట్రోఫి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫి, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్. ఇది ఐ.సీ.సీ చే నిర్వహించబడుచున్న సిరీస్. ఆస్ట్రేలియా క్రికెటర్ అల్లెన్ బొర్డర్, భారత క్రికెటర్ సునిల్ గవాస్కర్ ల పేరుతో నిర్వహించబడుచున్నది. వీరిద్దరూ టెస్టు క్రికెట్ లో 10వేలకు పైగా పరుగులు, వారి వారి జట్లకు సారథులుగా వ్యవహరించారు. తొలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని 1996-97 సీజనులో ఆడారు. ఈ సీరీస్ ను భారత్ 1-0 తో నెగ్గింది. 2023 వరకు 16 సిరీస్ లు జరగ్గా, అందులో భారత్ 10 సార్లు గెలిస్తే, ఆస్ట్రేలియా 5 సార్లు నెగ్గింది, ఒక సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తదుపరి సీరీస్ 2024-25 లో ఆస్ట్రేలియాలో జరగనుంది.

ఫలితాలు[మార్చు]

సంవత్సరం ఆతిథ్య దేశం ఫలితం మ్యాన్ ఆఫ్ ది సిరీస్
1996-1997 భారత్ 1-0 తో సిరీస్ నెగ్గిన భారత్ నయన్ మోంగియా
1997-1998 భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన భారత్ సచిన్ టెండుల్కర్
1999-2000 ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో నెగ్గిన ఆస్ట్రేలియా సచిన్ టెండుల్కర్
2000-2001 భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన భారత్ హర్భజన్ సింగ్
2003-2004 ఆస్ట్రేలియా 1-1తో డ్రా అయిన 4మ్యాచ్ ల సిరీస్ రాహుల్ ద్రవిడ్
2004-2005 భారత్ 4మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన ఆస్ట్రేలియా డామియెన్ మార్టిన్
2007-2008 ఆస్ట్రేలియా 4మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన ఆస్ట్రేలియా బ్రెట్ లీ
2008-2009 భారత్ 4మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో నెగ్గిన భారత్ ఇషాంత్ శర్మ
2010-2011 భారత్ 2మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో నెగ్గిన భారత్ సచిన్ టెండుల్కర్
2011–12 ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల సీరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 తో గెలుచుకుంది మైకెల్ క్లార్క్
2012–13 భారత్ 4 మ్యాచ్‌ల సీరీస్‌ను భారత్ 4-0 తో గెలుచుకుంది రవిచంద్రన్ అశ్విన్
2014–15 ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల సీరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తో గెలుచుకుంది. 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి స్టీవ్ స్మిత్
2016–17 భారత్ 4 మ్యాచ్‌ల సీరీస్‌ను భారత్ 2-1 తో గెలుచుకుంది. 1 మ్యాచ్ డ్రా అయింది రవీంద్ర జడేజా
2018–19 ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల సీరీస్‌ను భారత్ 2-1 తో గెలుచుకుంది. 1 మ్యాచ్ డ్రా అయింది చతేశ్వర్ పుజారా
2020-21 ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల సీరీస్‌ను భారత్ 2-1 తో గెలుచుకుంది. 1 మ్యాచ్ డ్రా అయింది ప్యాట్ కమ్మిన్స్
2022–23 భారత్ 4 మ్యాచ్‌ల సీరీస్‌ను భారత్ 2-1 తో గెలుచుకుంది. 1 మ్యాచ్ డ్రా అయింది రవిచంద్రన్ ఆస్విన్, రవీంద్ర జడేజా