ఇషాంత్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇషాంత్ శర్మ
2012 లో ఇషాంత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇషాంత్ శర్మ
పుట్టిన తేదీ (1988-09-02) 1988 సెప్టెంబరు 2 (వయసు 35)
ఢిల్లీ, India
మారుపేరులంబూ
ఎత్తు6 ft 4 in (193 cm)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 258)2007 మే 25 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2021 నవంబరు 25 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 169)2007 జూన్ 29 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2016 జనవరి 17 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.1
తొలి T20I (క్యాప్ 21)2008 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2013 అక్టోబరు 10 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.1
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–presentఢిల్లీ
2008–2010కోల్‌కతా నైట్‌రైడర్స్
2011–2012డెక్కన్ చార్జర్స్
2013–2015సన్ రైజర్స్ హైదరాబాద్
2016రైజింగ్ పూణే సూపర్‌జైంట్
2017కింగ్స్ XI పంజాబ్
2018ససెక్స్
2019–presentఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 105 80 149 123
చేసిన పరుగులు 785 72 1,061 174
బ్యాటింగు సగటు 8.26 4.80 8.69 6.96
100లు/50లు 0/1 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 57 13 66 31
వేసిన బంతులు 19,160 3,733 26,808 5,834
వికెట్లు 311 115 481 178
బౌలింగు సగటు 32.40 30.98 28.35 28.95
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 11 0 16 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 2 0
అత్యుత్తమ బౌలింగు 7/74 4/34 7/24 5/21
క్యాచ్‌లు/స్టంపింగులు 23/– 19/– 33/– 26/–
మూలం: ESPNcricinfo, 25 November 2021

ఇషాంత్ శర్మ (జననం 1988 సెప్టెంబరు 2) భారతదేశానికి టెస్టులు, వన్‌డేలు, T20I లలో ప్రాతినిధ్యం వహించిన క్రికెట్‌ ఆటగాడు.. అతను 6 అడుగుల 4 అంగుళాల పొడవున్న [1] [2] [3] కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్. [4] [5] 18 సంవత్సరాల వయస్సులో శర్మ, 2006-07లో దక్షిణాఫ్రికా పర్యటించిన భారత జట్టులో చేరమని కబురొచ్చింది. అయితే, ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటూండగా అతన్ని ఎంపిక చెయ్యలేదని మళ్ళీ కబురొచ్చింది.[6] అండర్-19 రోజులలో అతని ఎత్తు, బక్కపల్చటి శరీరాకృతిని ప్రస్తావిస్తూ, అతనికి లంబూ అని మారుపేరు పెట్టారు. [7] [8] 2011లో, అతను 100 టెస్ట్ వికెట్లు సాధించిన ఐదవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 2013లో దక్షిణాఫ్రికాపై ఇషాంత్ శర్మ వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు. "రిథమ్" బౌలర్‌గా ఉన్నప్పటికీ, 150 కిమీ/గం పైచిలుకు వేగంతో బౌలింగ్ చేసిన అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్లలో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. 2011లో బాక్సింగ్ డే టెస్ట్‌లో రికీ పాంటింగ్‌కి 152.2 కిమీ/గం వేగంతో బంతి వేశాడు. 2020లో, క్రికెట్‌లో అతని అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతనికి అర్జున అవార్డును ప్రదానం చేసింది. 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో శర్మ సభ్యుడు.

2021 ఫిబ్రవరిలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇషాంత్, టెస్ట్ క్రికెట్‌లో తన 300వ వికెట్‌ను తీసుకున్నాడు.[9][10] అతన్ని భారత క్రికెట్‌లోని గొప్ప పేసర్‌లలో ఒకరిగా పరిగణిస్తారు.[11]

దేశీయ, ఫస్ట్-క్లాస్ కెరీర్[మార్చు]

ఇషాంత్ దేశీయ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడుతూ 14 ఫస్ట్-క్లాస్ మ్యాచిల్లో 68 వికెట్లు తీసాడు.[12] [13] నాలుగో రోజున బరోడాపై తీసిన ఐదు వికెట్ల పంట కూడా ఇందులో కలిసి ఉంది.[14]

ఇషాంత్ 2006లో భారత్ అండర్-19 తో పాటు 2006 లో ఇంగ్లండ్‌, 2006-07లో పాకిస్థాన్‌లో పర్యటించాడు. భారతదేశం తరపున మూడు యూత్ టెస్టులు, ఆరు యూత్ వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2008లో ఆస్ట్రేలియాలో అతని ప్రదర్శన ఆధారంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ $950,000 కు ఇషాంత్ శర్మను కొనుగోలు చేసింది. టోర్నీలో ఏ బౌలర్‌కైనా చెల్లించిన అత్యధిక మొత్తం ఇదే.

2018 ఫిబ్రవరి 15 న ఇషాంత్, 2018 కౌంటీ సీజన్‌లో మొదటి రెండు నెలల పాటు సస్సెక్స్ CCC లో చేరతాడని అధికారికంగా ప్రకటించారు, 2018 ఏప్రిల్ 4 నుండి జూన్ 4 వరకు ఆడాడు. తద్వారా అతను ససెక్స్ తరపున ఆడిన 9వ భారతీయుడిగా నిలిచాడు.[15]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2008లో ఇషాంత్ శర్మ

2007 మేలో శర్మ బంగ్లాదేశ్ పర్యటించిన టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ స్థానంలో ఆడాడు. రెండో టెస్టులో ఆడి, ఒక మెయిడిన్‌తో సహా మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. వికెట్ తీసుకోలేదు, ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. [16] తరువాత, అతను 2007 జూలై-ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు పిలిచారు.

2007 డిసెంబరులో పాకిస్తాన్ భారత పర్యటన సందర్భంగా 3వ టెస్టులో భారత ఫ్రంట్‌లైన్ పేసర్లు జహీర్ ఖాన్, RP సింగ్, శ్రీశాంత్ గాయపడటంతో శర్మకు తిరిగి జట్టులోకి పిలుపు వచ్చింది.[17] బెంగళూరులో జరిగిన మూడో టెస్టులో శర్మ 5 వికెట్లు తీశాడు. [18] ఈ ప్రదర్శనతో అతనికి ఆస్ట్రేలియా పర్యటించే భారత జట్టులో చోటు దొరికింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ తమ ప్రధాన ఫాస్ట్ బౌలర్లు జహీర్ ఖాన్, RP సింగ్‌లను తీసుకుని శర్మను తప్పించారు. అయితే 2008 జనవరిలో SCG లో జరిగిన రెండో టెస్టులో గాయపడిన జహీర్ ఖాన్ స్థానంలో శర్మను తీసుకున్నారు. శర్మ బౌలింగులో ఆండ్రూ సైమండ్స్, కీపర్ MS ధోనీకి క్యాచ్‌ ఇచ్చినపుడు స్టీవ్ బక్నర్ అది నాటౌట్‌గా ఇచ్చాడు. అతను మ్యాచ్‌లో బాగానే బౌలింగ్ చేశాడు గానీ, వికెట్లు పడలేదు.

అతను పెద్ద విజయం పొందనప్పటికీ, పెర్త్‌లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌కు మేనేజ్‌మెంట్ అతనిని కొనసాగించింది. మ్యాచ్ నాల్గవ రోజున అతను ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌కి అసాధారణమైన బౌలింగ్ చేసి, అతని వికెట్ తీసాడు. భారతదేశం విజయం సాధించడంలో అది సహాయపడింది. [19] అతను బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడానికి WACA వికెట్‌లో ఉండే పేస్, బౌన్స్‌లను ఉపయోగించుకున్నాడు. అడిలైడ్‌లో జరిగిన తదుపరి టెస్టులో అతను రెండు వికెట్లు పడగొట్టి తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతను ఆస్ట్రేలియా పర్యటనను 6/358 తో, 59.66 సగటుతో, స్ట్రైక్ రేట్ 101.0తో ముగించాడు. [20]

2008 ఫిబ్రవరి 10 న, ఆస్ట్రేలియాతో జరిగిన CB సిరీస్ 4వ వన్‌డేలో శర్మ నాలుగు ముఖ్యమైన వికెట్లు సాధించి 4/38తో మ్యాచ్‌ను ముగించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. [21] అదే సీరీస్‌లో 2008 ఫిబ్రవరి 18 న జరిగిన 7వ ODIలో రెండు ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. [22]

2008లో ఆస్ట్రేలియాతో భారత్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, ఇషాంత్ 16 పరుగులతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచాడు. భారత్ 2-0తో విజయం సాధించడంతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. తద్వారా 1983లో అవార్డు గెలుచుకున్న కపిల్ దేవ్ తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్‌లో ఇలాంటి అవార్డును గెలుచుకున్న తొలి భారత పేస్‌మెన్‌గా నిలిచాడు. కొన్నిసార్లు ఎనిమిది ఓవర్ల లోపు మాత్రమే ఆడిన బంతులను కూడా రివర్స్ స్వింగ్ చేయడంలో శర్మ ప్రసిద్ది చెందాడు. సీనియర్ ఓపెనింగ్ బౌలర్ జహీర్ ఖాన్‌తో కలిసి పర్యాటక ఆస్ట్రేలియన్లను ఇబ్బంది పెట్టాడు. [23] అతను ఆ సిరీస్‌లో మూడుసార్లు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ వికెట్‌ను తీసుకున్నాడు. ఆరు టెస్టుల్లో ఆరుసార్లు పాంటింగ్‌ను ఔట్ఇ చేసాడు. భారత మీడియా, పాంటింగ్‌ను ఇషాంత్ బన్నీ అని వర్ణించింది.[24]


అయితే, 2009 లో, ఇషాంత్ ఫామ్ క్షీణించింది. శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టు జట్టు నుండి అతన్ని తొలగించి, అతని స్థానంలో శ్రీశాంత్‌ని తీసుకున్నారు.

2010 అక్టోబరు 5 న మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 8/124కి పడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తేడాతో విజయం సాధించడంలో ఇషాంత్, వీవీఎస్ లక్ష్మణ్‌కు తోడ్పడ్డాడు. ఇషాంత్ 81 పరుగుల భాగస్వామ్య సమయంలో లక్ష్మణ్‌కు మద్దతునిచ్చాడు, ఇందులో అతను 31 పరుగులను అందించాడు. [25]

2008లో నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ శర్మ


వెస్టిండీస్ పర్యటన తర్వాత, భారత్ విదేశీ టెస్టుల్లో వరుసగా ఎనిమిది పరాజయాలను చవిచూసింది. జూలై, ఆగస్టులలో జట్టు ఇంగ్లాండ్‌లో నాలుగు టెస్టులు ఆడింది. ఇంగ్లండ్ భారత్‌పై 4-0 తో గెలిచింది.[26] ఆ ప్రక్రియలో భారత్‌ స్థానంలో నం.1 టెస్ట్ జట్టు ర్యాంకుకు చేరింది. [27] మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన శర్మ, 60 సగటుతో 11 వికెట్లు సాధించాడు.[28] సిరీస్ సమయంలో శర్మ చీలమండ గాయంతో బాధపడి ODI లకు దూరమయ్యాడు, అయితే నవంబరులో వెస్టిండీస్‌తో భారత్ మూడు టెస్టులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతను తగినంతగా కోలుకున్నాడు. [29] భారత్ 2-0తో గెలుపొందగా, శర్మ మూడు మ్యాచ్‌ల నుండి 65 కంటే ఎక్కువ సగటుతో ఐదు వికెట్లు సాధించాడు. [30] శర్మ 2011-12లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం నాలుగు టెస్టుల్లో ఆడాడు. భారత్ 4-0తో సిరీస్ కోల్పోయింది, శర్మ 451 పరుగులిచ్చి, ఐదు వికెట్లు పడగొట్టాడు. [31]

2012 మార్చిలో శర్మ తన చీలమండపై శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇది అతనిని ఒక సంవత్సరం పాటు ఇబ్బంది పెట్టింది. ఆపరేషన్ వల్ల అతను 2012 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. [32]

2019 ఆగస్టులో ఇషాంత్, వెస్టిండీస్‌పై టెస్టుల్లో 9 వ 5-వికెట్‌ల పంట తీసాడు. 2019 భారత వెస్టిండీస్ పర్యటనలో 1వ టెస్ట్ మ్యాచ్‌లో సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో 1వ ఇన్నింగ్స్‌లో 5/43తో ఇది సాధించాడు. [33] అదే సిరీస్‌లోని 2వ టెస్ట్ మ్యాచ్‌లో, నం.9 వద్ద బ్యాటింగ్ చేస్తున్న ఇషాంత్, టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. [34] 2021 ఫిబ్రవరిలో, మోటేరా స్టేడియంలో [35] [36] [37] ఇషాంత్ శర్మ తన 100 వ టెస్ట్మా ఆడాడు, 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 4వ భారత బౌలరతను. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్, ఇషాంత్‌లు మాత్రమే ఈ ఘనత సాధించిన ఫాస్ట్ బౌలర్లు. [38]

బౌలింగ్ శైలి[మార్చు]

రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలరైన శర్మ, అంతర్జాతీయ వేదికపైకి వచ్చినప్పటి నుండి అతని బౌలింగ్ వేగం తగ్గింది.[39] అయితే 2008లో అతను 152 కి.మీ./గం వేగంతో బౌలింగు చేశాడు.[40] అతని పేస్ దాదాపు 130 కి.మీ./గం కి పడిపోయింది. అయితే ఎరిక్ సైమన్స్ (ఇతను 2010 నుండి 2012 వరకు భారత బౌలింగ్ కోచ్) కింద 2011/12లో భారతదేశం ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు శర్మ క్రమం తప్పకుండా 140 km/h (87 mph) కంటే ఎక్కువ బౌలింగ్ చేసేవాడు. [41] [42] భారత మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ ప్రకారం, అతను భారత సెటప్‌లో అత్యంత అంకితభావంతో ఆడిన బౌలర్‌లలో ఒకడు. [43]

సైమన్స్ శర్మ బౌలింగ్ చేసిన లెంగ్త్‌లో ఎత్తు ఒక కారణమని చెప్పాడు, "ఇషాంత్ స్టంప్‌లను కొట్టాలంటే, అతను దానిని ఫుల్ లెంగ్తులో పిచ్ చేయాలి, అంటే బ్యాట్స్‌మన్ దానిని కొట్టే అవకాశం ఎక్కువ" అని చెప్పాడు. [42] వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ శర్మ బౌలింగ్ యాక్షన్‌తో రెండు సమస్యలున్నాయని గుర్తించాడు: బంతిని వేసేప్పుడు అతని తల ముందుకు వాలుతుంది. మణికట్టు స్థానం మారుతూ ఉంటుంది. మొదటిదాని వలన బంతి వేగ కొంత తగ్గుతుంది. రెండవదాని వలన బంతి సీమింగు, స్వింగింగు అయ్యే అవకాశం తగ్గుతుంది. భారత మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్, శర్మ బౌలింగ్‌లో కదలిక లేకపోవడం వల్ల బంతిని పైకి పిచ్ చేయకుండా, షార్ట్ బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నాడని అన్నాడు. మంజ్రేకర్, "అతని ప్రతిభ, నిబద్ధత లకు సరిపోయినంతగా వికెట్లు తీసుకోలేదు" అని అన్నాడు. 2012 జనవరిలో ఈ వ్యాఖ్య చేసినప్పుడు, శర్మ 43 టెస్టుల నుండి దాదాపు 37 బౌలింగ్ సగటును కలిగి ఉన్నాడు. [44]

ఆస్ట్రేలియన్ మాజీ గ్రేట్, గ్లెన్ మెక్‌గ్రాత్, ఇషాంత్ స్ట్రైక్ బౌలర్ కంటే వర్క్‌హార్స్ అని చెప్పాడు. భారత జట్టులో తన పాత్ర ఏమిటో అతను గుర్తించాల్సిన అవసరం ఉంది, అయితే ఇషాంత్ నెమ్మదిగా పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. "ఇషాంత్ ప్రారంభించినప్పుడు, అతను మంచి పేస్ బౌలింగ్‌తో అలరించాడు. ఇప్పుడతను బహుశా అదే వేగంతో బౌలింగ్ చేస్తూండకపోవచ్చు. కానీ అతను ఇప్పుడు మంచి నియంత్రణతో వేస్తున్నాడు. ఇషాంత్ తనను తాను బాగా మలుచుకుంటున్నాడని ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కనబడింది" అని మెక్‌గ్రాత్ అన్నాడు. పెద్దగా ఆకట్టుకోని ఇషాంత్ రికార్డుకు కారణాం, ఉప-ఖండం లోని పిచ్‌ల మీద ఎక్కువ ఆడటం అయి ఉండవచ్చనే వాస్తవాన్ని అతను అంగీకరించాడు. ఇషాంత్ సీమ్‌ను కొడుతూండాళని భావిస్తూ, "సీమ్‌ను కొట్టాలి, పిచ్‌ నుంచి వచ్చే కొంచెం కదలిక మరింత సహకరించవచ్చు. నా ఆయుధం బౌన్స్, అప్పుడప్పుడు కొంచెం సీమ్ కదలిక" అన్నాడు. [45]

ఐపీఎల్ కెరీర్[మార్చు]

ఇషాంత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు. 2018 డిసెంబరులో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. [46] [47]

వ్యక్తిగత జీవితం[మార్చు]

శర్మ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. [48] 2016 డిసెంబరు 10 న అతను భారత బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌ను పెళ్ళి చేసుకున్నాడు. [49]

ప్రస్తావనలు[మార్చు]

  1. "I enjoy being India's bowling spearhead: Ishant Sharma". The Times of India. Archived from the original on 24 August 2013. Retrieved 19 September 2013.
  2. "Finn and Ishant: The tale of two tall spearheads". The Times of India. Archived from the original on 21 May 2013. Retrieved 19 September 2013.
  3. A CORRESPONDENT (20 October 2013), "All over in one Ishant over - Australia win by 4 wickets to take 2-1 lead", The Telegraph India. Retrieved 13 February 2020.
  4. "Ishant Sharma". Cricinfo. Retrieved 17 January 2012.
  5. "First-class bowling for each team by Ishant Sharma". Cricket Addictor. 12 July 2019. Retrieved 8 January 2022.
  6. Ishant won't be going to SA, by Anand Vasu, Cricinfo, 27 December 2006
  7. "Speedster Ishant Sharma earns Curtly Ambrose comparison". Herald and Weekly Times. Archived from the original on 16 అక్టోబర్ 2008. Retrieved 3 November 2008. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  8. Ramamoorthy, Mangala (3 April 2008). "Season's flavour". The Hindu. Archived from the original on 20 October 2013. Retrieved 15 July 2012.
  9. "Ishant Sharma, the man for the 'dirty job', climbs Mt 300". Times of India. Retrieved 8 February 2021.
  10. "Ishant Sharma Becomes 2nd Indian Pacer to Play 100 Tests". TheQuint (in ఇంగ్లీష్). 24 February 2021. Retrieved 2021-02-26.
  11. {{Cite web|https://timesofindia.indiatimes.com/sports/cricket/england-in-india/1st-test-ishant-sharma-becomes-third-indian-pacer-to-take-300-test-wickets/articleshow/80747352.cms%7C
  12. "First-class bowling for each team by Ishant Sharma". Cricket Archive. Retrieved 17 February 2012.
  13. "First-class batting and fielding for each team by Ishant Sharma". Cricket Archive. Retrieved 17 February 2012.
  14. Ishant scalps five as Jadhav and Kanitkar make merry, by Cricinfo, 9 December 2006
  15. "Ishant Sharma signs for Sussex". Sussex County Cricket Club. Retrieved 15 February 2018.
  16. Ishant Sharma to replace injured Munaf, by Anand Vasu, Cricinfo, 18 May 2007
  17. "Pathan, VRV and Ishant drafted in". ESPNcricinfo. 5 December 2007.
  18. Misbah and Ishant light up the day, by Dilip Premchandran, Cricinfo, 11 December 2007
  19. Ishant savour spell to Ponting, by Siddharth Vaidyanathan, Cricinfo, 20 January 2008
  20. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPN Cricinfo". Stats.espncricinfo.com. Retrieved 2013-03-30.
  21. Australia v India, 10 February 2008, MCG, by Cricinfo, 10 February 2008
  22. Australia v India, 18 February 2008, Adelaide Oval, by Cricinfo, 18 February 2008
  23. "Aussies bamboozled by Sultans of Swing". Australian Broadcasting Corporation. 22 October 2008. Retrieved 23 September 2009.
  24. "Ishant has a new bunny in Ponting". Espnstar.com. 20 October 2008. Archived from the original on 31 July 2012. Retrieved 23 September 2009.
  25. "Recent Match Report - Australia vs India 1st Test 2010 | ESPNcricinfo.com". www.espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-10.
  26. McGlashan, Andrew (22 August 2011). "Swann's six completes India's humiliation". Cricinfo. Retrieved 17 February 2012.
  27. "England dethrone India to become No.1". Cricinfo. 13 August 2011. Retrieved 17 February 2012.
  28. "Records / Pataudi Trophy, 2011 / Most wickets". Cricinfo. Retrieved 17 February 2012.
  29. "Don't think I need ankle surgery – Ishant". Cricinfo. 13 November 2011. Retrieved 17 February 2012.
  30. "Records / West Indies in India Test Series, 2011/12 / Most wickets". Cricinfo. Retrieved 17 February 2012.
  31. "Records / Border-Gavaskar Trophy, 2011/12 / Most wickets". Cricinfo. Retrieved 28 January 2012.
  32. "Ankle surgery rules Ishant Sharma out of IPL". Cricinfo. 26 March 2012. Retrieved 26 March 2012.
  33. "1st Test: All-round Ishant Sharma puts India on top vs West Indies in Antigua". India Today. Retrieved 24 August 2019.
  34. Kumar, Saurabh (సెప్టెంబరు 1, 2019). "India vs West Indies: Ishant Sharma hits maiden fifty in 92nd Test". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-09-10.
  35. "Ishant Sharma all charged up for the 100th Test". sportstiger.com. 22 February 2021. Retrieved 24 February 2021.
  36. "Ishant Sharma to join India's elite 100-Test club". icc-cricket.com. Retrieved 24 February 2021.
  37. "Milestone-man Ishant Sharma better than before". indianexpress.com. 23 February 2021. Retrieved 24 February 2021.
  38. "Ishant Sharma plays his 100th test". sixsports.in. 25 February 2021. Archived from the original on 23 మే 2022. Retrieved 10 ఆగస్టు 2023.
  39. "Varun Aaron says he won't compromise on pace". Cricinfo. 22 August 2011. Retrieved 17 January 2012.
  40. "Australia clinch low-scoring scrap overview". Cricinfo. Retrieved 17 February 2008.
  41. "India confirm Simons as bowling consultant". Cricinfo. 11 January 2010. Retrieved 17 February 2012.
  42. 42.0 42.1 Monga, Sidharth (17 February 2012). "Ishant is one of the unluckiest bowlers – Eric Simons". Cricinfo. Retrieved 17 February 2012.
  43. Veera, Sriram (3 June 2011). "Tide is high for India's young and restless". Cricinfo. Retrieved 17 January 2012.
  44. Manjrekar, Sanjay (11 January 2012). "The truth about 'unlucky' Ishant". Cricinfo. Retrieved 17 January 2012.
  45. "Ishant Sharma needs to figure out his role in the team: Glenn McGrath". PTI. 6 August 2018.
  46. "IPL 2019 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 18 December 2018.
  47. "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 18 December 2018.
  48. "'I have given all that up' - Ishant Sharma discloses the sacrifices he made to stay fit". 3 October 2019.
  49. "Ishant Sharma, Pratima Singh tie the knot, MS Dhoni, Yuvraj Singh attend". The Indian Express. 10 December 2016.