విజయ్ హజారే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1915లో మహారాష్ట్ర లోని సాంగ్లీలో జన్మించిన విజయ్ హజారే భారత మాజీ క్రికెట్ కెప్టెన్. ఇతను 30 టెస్టులలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి, 47.65 సగటుతో 2192 పరుగులు చేసాడు. ఇందులో 7 సెంచరీలు, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 164*. బౌలింగ్ లో 20 వెకెట్లు కూడా తీసుకున్నాడు. 1951 నుంచి 1953 మధ్య కాలంలో 14 టెస్టులకు నాయకత్వం వహించాడు. 1951-52 లో ఇంగ్లాండుతో జరిగిన భారత్ యొక 25 వ టెస్టులో అతని నాయకత్వంలోనే భారత్ తొలి టెస్ట్ విజయాన్ని నమోదుచేసింది. ఈ టెస్టులో భారత్ ఇంగ్లాండును ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఓడించింది. 1947-48 లో ఆస్ట్రేలియాతో అడిలైడ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిల్చాడు. రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే అవుటైన తొలి భారతీయుడు కూడా ఇతనే. వరుసగా 3టెస్ట్ లలో సెంచరీలు సాధంచిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు. రిటైర్మెంట్ తర్వాత కొద్ది కాలం టెస్ట్ క్రికెట్ సెలెక్టర్ గా పనిచేసాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్

[మార్చు]

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 238 మ్యాచ్‌లు ఆడి 60 సెంచరీలతో 18740 పరుగులు సాధించాడు. ఈ విషయంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ల తర్వాత ఇతనిది మూడవ స్థానం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇతను 10 డబుల్ సెంచరీలు కూడా చేసాడు. బౌలింగ్ లో 595 వికెట్లు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను మహారాష్ట్ర, సెంట్రల్ ఇండియా, బరోడా తరఫున ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ ఇతడే. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన భారతీయులలో ఇతనే ప్రప్రథముడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 50 సెంచరీలు సాధించిన తొలి భారతీయుడూ ఇతనే. అంతేకాకుండా 1947లో రంజీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బరోడా రతఫున హోల్కర్ పై ఆడుతూ గుల్ మహ్మద్తో కల్సి 557 పరుగుల పాట్నర్‌షిప్ తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2006లో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, మహలే జయవర్థనేలు 624 పరుగులు చేసేంతవరకు ఈ రికార్డు అలాగే కొనసాదింది.

బిరుదులు, గుర్తింపులు

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం
  • భారత ప్రభుత్వం ఇతని సేవలను గుర్తించి పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.
  • ఇతని పేరుతో జోనల్ క్రికెట్ టోర్నమెంటులో విజయ్ హజారే ట్రోఫీని ప్రధానం చేస్తున్నారు.

బయటి లింకులు

[మార్చు]