అమిత్ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమిత్ మిశ్రా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1982-11-24) 1982 నవంబరు 24 (వయసు 41)
ఢిల్లీ
మారుపేరుమిషి
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 259)2008 అక్టోబరు 17 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2016 డిసెంబరు 20 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 151)2003 ఏప్రిల్ 13 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2016 అక్టోబరు 29 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.99
తొలి T20I (క్యాప్ 33)2010 జూన్ 13 - జింబాబ్వే తో
చివరి T20I2017 ఫిబ్రవరి 1 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.99
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000–presentహర్యానా
2008–2010; 2015 –2021ఢిల్లీ క్యాపిటల్స్ (స్క్వాడ్ నం. 99)
2011–2012Deccan Chargers (స్క్వాడ్ నం. 99)
2013 – 2014సన్ రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 99)
2023లక్నో సూపర్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I
మ్యాచ్‌లు 22 36 8
చేసిన పరుగులు 648 28
బ్యాటింగు సగటు 21.60 4.80
100s/50s 0/4 0/0
అత్యధిక స్కోరు 84 14
వేసిన బంతులు 5,103 1,648 180
వికెట్లు 76 64 14
బౌలింగు సగటు 35.72 23.60 13.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/71 6/48 3/24
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 2/– 1/–
మూలం: Cricinfo, 2019 మార్చి 26

అమిత్ మిశ్రా (జననం 1982 నవంబరు 24) భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలరు, చివరి వరుసలో వచ్చే కుడిచేతి వాటం బ్యాటరు. అతను దేశవాళీ రంజీ ట్రోఫీలో హర్యానా తరపున ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. అతను టెస్ట్, వన్డేలు, T20 లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో మిశ్రా సభ్యుడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

టెస్ట్ కెరీర్

[మార్చు]

2002లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు కోసం మిశ్రాను తొలుత భారత జట్టులోకి పిలిచారు, కానీ తుదిజట్టులో ఎంపిక కాలేదు. కెప్టెను, ఫస్ట్-ఛాయిస్ లెగ్ స్పిన్నరూ అయిన అనిల్ కుంబ్లే గాయపడడంతో, మొహాలీ (PCA స్టేడియం) లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో మిశ్రా తన తొలి టెస్టు ఆడాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 71 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 2/35తో, మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [1] ఇదిలావుండగా, మూడో టెస్టుకు కుంబ్లే కోలుకుంటే మిశ్రాను తప్పిస్తానని భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్ చెప్పాడు. అయితే, హర్భజన్ సింగ్ గాయపడటంతో కుంబ్లే వచ్చాక కూడా మిశ్రా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కుంబ్లే ఆ తర్వాత టెస్టులో గాయపడి రిటైరవడంతో మిశ్రాను భారతజట్టులో మొదటి ఎంపిక టెస్ట్ లెగ్ స్పిన్నరయ్యాడు.

మిశ్రా 2009 ప్రారంభంలో న్యూజిలాండ్‌లోని టెస్ట్ టూర్‌కు ఎంపికయ్యాడు గానీ భారతదేశం కేవలం ఒక స్పిన్నర్‌ను మాత్రమే రంగంలోకి దింపింది. హర్భజన్ ఒంటరిగా స్పిన్ విధులను నిర్వర్తించాడు. భారత్ తదుపరి టెస్టు 2009 నవంబరు వరకు జరగలేదు. అత్యధిక స్కోరులతో డ్రా అయిన మొదటి టెస్టులో మిశ్రా, ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. మూడవ టెస్ట్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా రెండవ స్పిన్నర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో రెండవ టెస్టు జట్టులోకి మిశ్రాను తీసుకోలేదు.

మిశ్రాను బంగ్లాదేశ్ పర్యటనకు తిరిగి పిలిచారు. హర్భజన్‌కు గాయం కావడంతో చిట్టగాంగ్‌లో జరిగిన మొదటి టెస్టులో మిశ్రా ఏకైక స్పిన్నర్‌గా ఆడాడు. నైట్ వాచ్‌మన్‌ బ్యాటరుగా వచ్చి రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసి, ఆపై ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే, అతన్ని ఓజా కోసం తదుపరి టెస్టులో మరోసారి తొలగించారు.

తర్వాత 2011లో ఇంగ్లండ్‌లో జరిగిన భారత క్రికెట్ జట్టులో అతను చివరి టెస్టు మ్యాచ్‌లో 84 పరుగులతో తన అత్యధిక స్కోరును సాధించాడు. 2016లో వెస్టిండీస్‌లో భారత పర్యటన కోసం మిశ్రాను జట్టులో చేర్చారు. ఆ సీరీస్‌లో రెండు టెస్టులు ఆడి ఆరు వికెట్లు తీశాడు.

పరిమిత ఓవర్ల కెరీర్‌

[మార్చు]

2003లో TVS కప్ సందర్భంగా దక్షిణాఫ్రికాపై మిశ్రా, తన తొలి వన్డే అంతర్జాతీయ ఆడాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన 2009 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడాడు.

బంగ్లాదేశ్ పర్యటన ప్రారంభంలో హర్భజన్, చివరి రెండు రౌండ్-రాబిన్ మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకున్న తర్వాత, మిశ్రా ముక్కోణపు టోర్నమెంట్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు వన్‌డేలలో ఆడాడు. 2013 జూలైలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌కు అతన్ని పిలిచారు. అతను 2013 జూలై 28 న ఆడిన 3వ వన్‌డేలో జింబాబ్వేపై 4/47 ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

2013 జూలైలో జింబాబ్వేతో జరిగిన 5-మ్యాచ్‌ల సిరీస్‌లో, ఓ సీరీస్‌లో గాని, టోర్నమెంట్‌లో గానీ అత్యధిక వికెట్లు సాధించిన బౌలరుగా నిలిచాడు. 18 వికెట్లతో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలింగ్ దిగ్గజం జవగల్ శ్రీనాథ్ ప్రపంచ రికార్డును కూడా ఈ స్పిన్నరు సమం చేశాడు. శ్రీనాథ్ తన ఫీట్‌ను 7 మ్యాచ్‌ల్లో చేసాడు. మిశ్రా తక్కువ మ్యాచ్‌ల్లోనే ఆ రికార్డును సమం చేశాడు.

2014 ఫిబ్రవరి 2 న జరిగిన ఆసియా కప్‌లో 6వ మ్యాచ్‌లో మిశ్రా పాకిస్థాన్‌పై రెండు వికెట్లు పడగొట్టాడు. మిశ్రా తన 10 ఓవర్లలో 28 పరుగులకు 2 వికెట్లు సాధించడం ఆసియా కప్ చరిత్రలో ఆరవ అత్యుత్తమ పొదుపు బౌలింగు గణాంకాలు (కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్లను మాత్రమే పరిగణిస్తారు). [2] అతను క్రిక్‌ఇన్ఫో వారి 2014 ICC ప్రపంచ T20 కప్‌ 2వ XI జట్టులో ఎంపికయ్యాడు. [3]

2016లో వెస్టిండీస్‌లో భారత పర్యటన కోసం మిశ్రాను జట్టులోకి తీసుకున్నారు. అతను రెండు T20I గేమ్‌లలో ఒకదానిలో మూడు వికెట్లు పడగొట్టాడు. అందులోనే తన కెరీర్లో అత్యుత్తమమైన 3/24 గణాంకాలు సాధించాడు. 2016-17 న్యూజిలాండ్ భారత పర్యటనలో, అతను వన్‌డే జట్టులో చేరాడు. ఐదు గేమ్‌లలో 15 వికెట్లు తీశాడు. ఇందులో చివరి గేమ్‌లో 5/18తో సహా భారత్ 3-2తో సిరీస్‌ను గెలుచుకోవడంలో సహాయపడ్డాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. [4]

ఐపీఎల్ కెరీర్

[మార్చు]

2013 ఏప్రిల్ 17 న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపిఎల్ 2013 ) సీజన్ 6లో పుణె వారియర్స్ ఇండియాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యాట్రిక్ సాధించాడు. ఈ హ్యాట్రిక్‌తో ఐపిఎల్ చరిత్రలో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అతను ఇంతకుముందు IPL 2008 లో డెక్కన్ ఛార్జర్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడుతూ, ఆపై IPL 2011 లో కింగ్స్ XI పంజాబ్‌పై డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడుతూ హ్యాట్రిక్‌లు సాధించాడు. 2013లో అతని ప్రదర్శనలకు, అతను క్రిక్‌ఇన్‌ఫో IPL XI జట్టుకి[5] ఎంపికయ్యాడు.

షార్జాలో KKRపై DC విజయం సాధించిన సమయంలో మిశ్రా వేలికి గాయమైంది. మిశ్రా మైదానం వెలుపలికి వెళ్లే ముందు కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. [6] మిశ్రా ఐపిఎల్‌లో అత్యధిక సార్లు రోహిత్ శర్మను అవుట్ చేసి, ఐపిఎల్‌లో అత్యధిక సార్లు ఓ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన జహీర్, సందీప్‌ల రికార్డును మిశ్రా సమం చేశాడు. [6]

అతను IPL 2015, IPL 2016, IPL 2017 లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు . 2018 జనవరిలో, 2018 IPL వేలంలో అతన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. [7] 2019 ఐపీఎల్‌లో అతడిని కొనసాగించారు. 2020 ఐపీఎల్‌లో, మిశ్రా 7.20 ఎకానమీ రేటుతో 3 వికెట్లు పడగొట్టి అద్భుతంగా ప్రారంభించాడు. [8]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో లసిత్ మలింగ (170 వికెట్లు), డ్వేన్ బ్రావో (170 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2015లో లైంగిక వేధింపుల కేసులో అనుమానితుడిగా మిశ్రాను అరెస్టు చేశారు. ఆ తరువాత అతనికి బెయిల్ మంజూరైంది. [9]

మూలాలు

[మార్చు]
  1. "2nd Test: India v Australia at Mohali, Oct 17–21, 2008". espncricinfo. Retrieved 2011-12-18.
  2. Sarath (3 March 2014). "Stats: Best economy rates in the Asia Cup". Sportskeeda.
  3. "Power, pace and spin: The team of the tournament".
  4. "India vs New Zealand: Amit Mishra shines brightest among big stars". The Indian Express. 29 October 2016. Retrieved 30 October 2016.
  5. 2013 Indian Premier League#Cricinfo IPL XI
  6. 6.0 6.1 "IPL 2021: Amit Mishra becomes Rohit Sharma's biggest nemesis as DC bowler gets MI captain for 7th time". India Today (in ఇంగ్లీష్). ఏప్రిల్ 20, 2021. Retrieved 2021-08-27.
  7. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
  8. "Amit Mishra ruled out of IPL 2020 with finger injury".
  9. "Indian cricketer Amit Mishra awarded bail in women assault case". 27 October 2015.