ఒడిశా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒడిశా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్శుభ్రాంశు సేనాపతి (ఫ.క్లా)
అభిషేక్ రౌత్ (లిస్ట్ ఎ& టి20)
కోచ్దినేష్ మోగియా[1]
యజమానిఒడిశా క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1949
స్వంత మైదానంబారాబతి స్టేడియం
సామర్థ్యం48,000
రెండవ స్వంత మైదానంDRIEMS గ్రౌండ్
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్OCA

ఒడిషా క్రికెట్ జట్టు భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో ఉన్న దేశీయ క్రికెట్ జట్టు. ఇది రంజీ ట్రోఫీలోని ఎలైట్ గ్రూప్‌లో ఉంది.

జట్టు ప్రధాన హోమ్ గ్రౌండ్ కటక్‌లోని బారాబతి స్టేడియం. హోమ్ మ్యాచ్‌లు కటక్‌లోని DRIEMS గ్రౌండ్, భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేడియం, సంబల్‌పూర్‌లోని వీర్ సురేంద్ర సాయి స్టేడియం, భువనేశ్వర్‌లోని KIIT క్రికెట్ స్టేడియం తదితర మైదానాల్లో కూడా ఆడతారు. ఒడిశా క్రికెట్ జట్టును ఒడిషా క్రికెట్ అసోసియేషన్ (OCA) ఎంపిక చేస్తుంది. OCA ప్రతి సంవత్సరం ఒడిషా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తుంది.

రంజీ ట్రోఫీలో జట్టు ఇటీవలి అత్యుత్తమ ప్రదర్శన 2016–17 సీజన్, 2019–20 సీజన్లలో క్వార్టర్-ఫైనల్ దశకు చేరుకుంది. 2016-17లో గోవింద పొద్దార్, 2019-20లో సుభ్రాంశు సేనాపతి కెప్టెన్సీలో వారు గత ఛాంపియన్‌లు గుజరాత్, బెంగాల్‌లతో ఓడిపోయారు. [2]

చరిత్ర

[మార్చు]

ఒడిశా 1949-50 రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ స్థాయిలో ఆడి బీహార్ చేతిలో 356 పరుగుల తేడాతో ఓడిపోయింది. [3] 1952-53లో, అస్సాంను ఇన్నింగ్స్‌తో ఓడించి మొదటి విజయం సాధించారు. [4] ఇతర ఈస్ట్ జోన్ జట్లతో (బీహార్, అస్సాం, బెంగాల్ ) మాత్రమే ఆడిన ఒడిశా జట్టు, మొదటిసారి రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌కు చేరుకుంది. [5]

2017-18 సీజన్ ముగిసే సమయానికి, ఒడిశా 296 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడింది. 64 మ్యాచ్‌లు గెలిచి, 106 ఓడిపోయారు. 126 డ్రా అయ్యాయి.[6]

గత, ప్రస్తుత ఆటగాళ్ళు

[మార్చు]

అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఒడిషా ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

దేశీయ స్థాయిలో ప్రముఖ ఆటగాళ్లు:

  • రష్మీ పరిదా
  • ప్రవంజన్ ముల్లిక్
  • రంజీబ్ బిస్వాల్
  • బసంత్ మొహంతి
  • బిప్లబ్ సామంత్రయ్
  • గోవింద పొద్దార్
  • నటరాజ్ బెహెరా

స్క్వాడ్

[మార్చు]

అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.

పేరు పుట్టినరోజు బ్యాఅటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
బ్యాటర్లు
సుభ్రాంశు సేనాపతి (1996-12-30) 1996 డిసెంబరు 30 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫస్ట్ క్లాస్ కెప్టెన్

ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడతాడు
శంతను మిశ్రా (1994-05-30) 1994 మే 30 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
కార్తీక్ బిస్వాల్ (1997-06-30) 1997 జూన్ 30 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అనురాగ్ సారంగి (1992-12-17) 1992 డిసెంబరు 17 (వయసు 31) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
రాకేష్ పట్నాయక్ (1992-06-30) 1992 జూన్ 30 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అంషుమన్ రాత్ (1997-11-05) 1997 నవంబరు 5 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ హాంగ్ కాంగ్‌కు అంతర్జాతీయ పోటీలు ఆడాడు
ఆల్ రౌండర్లు
అభిషేక్ రౌత్ (1987-03-03) 1987 మార్చి 3 (వయసు 37) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ లిస్ట్ ఎ, టి20 ల కెప్టెన్
గోవింద పొద్దార్ (1991-09-09) 1991 సెప్టెంబరు 9 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
ప్రయాష్ సింగ్ (1994-12-02) 1994 డిసెంబరు 2 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
బిప్లబ్ సామంత్రయ్ (1988-12-14) 1988 డిసెంబరు 14 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
సమీర్ మొహంతి (1986-03-12) 1986 మార్చి 12 (వయసు 38) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
వికెట్ కీపర్లు
రాజేష్ ధూపర్ (1999-12-02) 1999 డిసెంబరు 2 (వయసు 24) కుడిచేతి వాటం
సుజిత్ లెంక (1992-12-14) 1992 డిసెంబరు 14 (వయసు 31) కుడిచేతి వాటం
ఆశీర్వాద్ స్వైన్ (2005-03-03) 2005 మార్చి 3 (వయసు 19) కుడిచేతి వాటం
స్పిన్ బౌలర్లు
జయంత బెహెరా (1986-12-25) 1986 డిసెంబరు 25 (వయసు 37) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
సౌరభ్ కనోజియా (1997-02-22) 1997 ఫిబ్రవరి 22 (వయసు 27) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
ముస్తాక్ బేగ్ (1998-07-15) 1998 జూలై 15 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
సుశీల్ బారిక్ (2002-10-25) 2002 అక్టోబరు 25 (వయసు 22) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
పేస్ బౌలర్లు
సూర్యకాంత్ ప్రధాన్ (1993-09-30) 1993 సెప్టెంబరు 30 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
తరణి సా (1996-09-14) 1996 సెప్టెంబరు 14 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్
దేబబ్రత ప్రధాన్ (1996-10-10) 1996 అక్టోబరు 10 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
రాజేష్ మొహంతి (2000-05-20) 2000 మే 20 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
సునీల్ రౌల్ (1998-10-14) 1998 అక్టోబరు 14 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం

శిక్షకులు

[మార్చు]

ఒడిశా క్రికెట్ జట్టులోని కోచ్‌ల జాబితాను క్రింద చూడవచ్చు

మూలాలు

[మార్చు]
  1. "Mongia, Dhar appointed head coaches of Odisha cricket teams". Orisports. Retrieved 17 April 2023.
  2. "Samit Gohel's 359* shatters 117-year record". ESPN Cricinfo. 27 December 2016. Retrieved 21 December 2017.
  3. "Bihar v Orissa 1949–50". Cricinfo. Retrieved 21 December 2017.
  4. "Orissa v Assam 1952–53". Cricinfo. Retrieved 21 December 2017.
  5. "First-Class Matches played by Orissa". CricketArchive. Retrieved 21 December 2017.
  6. "Ranji Trophy Playing Record". CricketArchive. Retrieved 21 December 2017.