దేబాశిష్ మొహంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేబాశిష్ మొహంతి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Debasish Sarbeswar Mohanty
పుట్టిన తేదీ20 July 1976 (1976-07-20) (age 47)
భువనేశ్వర్, ఒడీశా
ఎత్తు6 ft 1 in (185 cm)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm ఫాస్ట్ మీడియం
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 213)1997 ఆగస్టు 9 - శ్రీలంక తో
చివరి టెస్టు1997 నవంబరు 19 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 107)1997 సెప్టెంబరు 13 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2001 జూలై 22 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996–2010ఒడిశా
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లి ఎ
మ్యాచ్‌లు 2 45 117 129
చేసిన పరుగులు 28 1,553 218
బ్యాటింగు సగటు 5.59 13.62 7.26
100లు/50లు 0/0 0/5 0/0
అత్యుత్తమ స్కోరు 18* 97 22
వేసిన బంతులు 430 1,996 22,053 6,024
వికెట్లు 4 57 417 160
బౌలింగు సగటు 59.75 29.15 21.05 26.84
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 19 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 3 0
అత్యుత్తమ బౌలింగు 4/78 4/56 10/46 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 10/– 47/– 26/–
మూలం: Cricinfo, 2019 జనవరి 23

దేబాశీష్ సర్బేశ్వర్ మొహంతి (జననం 1976 జూలై 20) 1997, 2001 మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 45 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మాజీ భారతీయ క్రికెటర్ . అతను రైట్ ఆర్మ్ మీడియం-ఫాస్ట్ బౌలరు. పొడవైన తన శరీరానికి పేస్‌ని జత చేసి మంచి ఫలితాలు సాధించాడు. అతను పరిమిత-ఓవర్ల ఫార్మాట్‌లో 30 కంటే తక్కువ సగటుతో సగటున ఒక ఆటకు ఒక వికెట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు. 2020 డిసెంబరు 24 న మొహంతి, భారత క్రికెట్ జట్టు జాతీయ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

వెంకటేష్ ప్రసాద్‌తో కలిసి మొహంతి బలమైన కొత్త బాల్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కాలం ఉంది. 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో ప్రారంభించి, అతను భారత ప్రధాన వికెట్ టేకర్ జవగల్ శ్రీనాథ్ కంటే నాలుగు ఆటలు తక్కువగా ఆడినప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన రెండవ భారతీయుడు. మొహంతి 17 వన్‌డేలు ఆడి, సుమారు 20 చిల్లర సగటుతో 29 వికెట్లు తీశాడు. ICC వన్‌డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి చేరాడు. అయితే, అజిత్ అగార్కర్ తిరిగి రావడంతో, అతని అవకాశాలు తగ్గిపోయి, మరో ఏడు గేమ్‌లు మాత్రమే ఆడాడు. 1990లలో టొరంటోలో పాకిస్తాన్‌తో జరిగిన సహారా కప్ సిరీస్‌లో ఒకదానిని గెలవడంలో హర్విందర్ సింగ్‌తో కలిసి మొహంతి కీలకపాత్ర పోషించాడు.

మొహంతీ ఒక పించ్ హిట్టరు అయినప్పటికీ, భారతీయ థింక్ ట్యాంక్ అతన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. అతను చాలా సమర్ధుడైన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. భారత క్రికెట్‌లో 11వ ఆటగాడు మొహంతి, 10వ ర్యాంక్‌లో ఉన్న రాహుల్ సంఘ్వీలు ఓడిపోయిన మ్యాచ్‌లలో కూడా మంచి సిక్సర్‌లతో ప్రేక్షకులను అలరించారు. అతను బంతిని వేసిన వేగం కంటే అతని బౌలింగ్ యాక్షన్ చాలా ప్రమాదకరమైనది. ఫ్లాట్ పిచ్‌లపై, శక్తిని ఆదా చేయడానికి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయమని అతనికి సలహాలు ఇచ్చారు.


2000-01 సీజన్‌లో, అగర్తలాలో జరిగిన ఈస్ట్ జోన్ v సౌత్ జోన్ కోసం ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ఆడిన మొహంతీ 46 పరుగులకు మొత్తం 10 వికెట్లూ తీసుకున్నాడు. అది అతని కెరీర్-బెస్ట్ బౌలింగు ప్రదర్శన. తద్వారా ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీయడం అనే అరుదైన ఘనతను సాధించాడు. [1]

కోచింగ్ కెరీర్

[మార్చు]

2006లో, అతను వేల్స్‌లోని కోల్విన్ బే క్రికెట్ క్లబ్‌లో క్లబ్ ప్రొఫెషనల్‌గా చేరాడు. అతను భువనేశ్వర్‌లోని నాల్కోలో ఉద్యోగం చేస్తున్నాడు. 2011 నుండి ఒడిశా రంజీ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. అతను మాజీ కోచ్ మైఖేల్ బెవన్ స్థానంలో చేరాడు. 7 సంవత్సరాల తర్వాత అతని స్థానంలో మరొక మాజీ భారత క్రికెటర్ శివ సుందర్ దాస్ 2017లో ఆ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు [2] మహంతి, ఈస్ట్ జోన్ జట్టుకు శిక్షణ ఇచ్చి, ఆ జట్టు తమ మొదటి దులీప్ ట్రోఫీని గెలుచుకోవడాంలో దోహద పడ్డాడు.

మూలాలు

[మార్చు]

మూస:India Squad 1999 Cricket World Cup

  1. Cricket Archive – profile.
  2. "Shiv Sundar Das appointed as the coach of Odisha Ranji Team". CricTracker (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-24. Retrieved 2019-01-23.