సంజయ్ రాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ రాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సంజయ్ సుశాంత రాల్
పుట్టిన తేదీ6 October 1976 (1976-10-06) (age 48)
కటక్, ఒడిషా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 118)1998 సెప్టెంబరు 13 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1998 సెప్టెంబరు 20 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 8
బ్యాటింగు సగటు 4.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 8
వేసిన బంతులు 36
వికెట్లు 1
బౌలింగు సగటు 27.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/13
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: Cricinfo, 2021 జూలై 14

సంజయ్ రాల్, ఒడిషాకు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.[1]

జననం

[మార్చు]

సంజయ్ రాల్ 1976, అక్టోబరు 6న ఒడిషాలోని కటక్లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

సంజయ్ రౌల్ స్ట్రోక్‌ఫుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1998 ప్రారంభంలో పాకిస్తాన్‌లో భారతదేశం 'ఎ' పర్యటనలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[3] 1998లో టొరంటోలోని స్కేటింగ్ & కర్లింగ్ క్లబ్‌లో పాకిస్తాన్‌తో తన రెండు వన్డేలు ఆడాడు,[4] కానీ రెండు మ్యాచ్‌లలో బాగా రాణించలేకపోయాడు.

దేశీయ సీజన్ 1996/97లో 644 పరుగులు చేసి 37 వికెట్లు తీసుకున్నాడు. ఒడిషా తరపున బ్యాటింగ్, బౌలింగ్ సగటులలో అగ్రస్థానంలో నిలిచాడు. ఓడిఏలో ప్రొఫెషనల్ మ్యాచ్ రిఫరీగా చేశాడు.[5] త్రిపుర తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు. 1995/96 సంవత్సరంలో భారత జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా, ఒడిశా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Sanjay Raul Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  2. "Sanjay Raul Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  3. "PAK vs IND, Pakistan tour of Canada 1998, 2nd ODI at Toronto, September 13, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  4. "IND vs PAK, Pakistan tour of Canada 1998, 5th ODI at Toronto, September 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  5. "Sanjay Raul enjoying his second innings". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). 2016-11-21. Retrieved 2023-08-05.

బయటి లింకులు

[మార్చు]