దినేష్ మోంగియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దినేష్ మోంగియా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1977-04-17) 1977 ఏప్రిల్ 17 (వయసు 47)
చండీగఢ్, పంజాబ్
ఎత్తు6 అ. 0 అం. (183 cమీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 136)2001 మార్చి 28 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2007 మార్చి 12 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.28
ఏకైక T20I (క్యాప్ 6)2006 డిసెంబరు 1 - దక్షిణాఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే టీ20I ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 57 1 121 198
చేసిన పరుగులు 1,230 38 8,028 5,535
బ్యాటింగు సగటు 27.95 38.00 48.95 35.25
100లు/50లు 1/4 0/0 27/28 10/26
అత్యుత్తమ స్కోరు 159* 38 308* 159*
వేసిన బంతులు 571 4,037 3,834
వికెట్లు 14 46 116
బౌలింగు సగటు 40.78 36.67 25.65
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/31 4/34 5/44
క్యాచ్‌లు/స్టంపింగులు 21/– 1/– 121/– 85/–
మూలం: Cricinfo, 2017 ఆగస్టు 27

దినేష్ మోంగియా, పంజాబ్కి చెందిన మాజీ భారతీయ క్రికెటర్, రాజకీయ నాయకుడు. భారతదేశం తరపున అంతర్జాతీయ పరిమిత ఓవర్ మ్యాచులలో ఆడాడు. భారతదేశంతోపాటు, 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉమ్మడి విజేతలలో ఒకరైన భారత జట్టులో సభ్యుడిగా, ఆ టైటిల్‌ను శ్రీలంకతో కూడా పంచుకున్నాడు, 2003 క్రికెట్ ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

జననం

[మార్చు]

దినేష్ మోంగియా 1977, ఏప్రిల్ 17న పంజాబ్ లోని చండీగఢ్లో జన్మించాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

దేశీయ క్రికెట్ కెరీర్‌లో మోంగియా 50 కంటే తక్కువ సగటుతో 8,100 పరుగులు చేశాడు. 308 అత్యధిక స్కోరు అజేయంగా నిలిచాడు.

2004లో స్టువర్ట్ లా గాయపడినప్పుడు విదేశీ ఆటగాడిగా లాంక్షైర్‌కు సంతకం చేశాడు. 2005లో అతను లీసెస్టర్‌షైర్ పూర్తి-సమయ ఒప్పందంపై సంతకం చేశాడు.

మోంగియా లాషింగ్స్ వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఆడుతున్నాడు. నిలిపివేయబడిన ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చండీగఢ్ లయన్స్ తరపున కూడా ఆడాడు.

తొలి భారత టీ20 క్రికెటర్

[మార్చు]

2004 ట్వంటీ20 కప్‌లో లీసెస్టర్‌షైర్‌తో లాంక్షైర్‌కు వ్యతిరేకంగా టీ20 మ్యాచ్ ఆడిన మొదటి భారతీయ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.[1] 2004 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంక్షైర్ తరపున ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2001లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన మోంగియా, పెద్దగా విజయం సాధించలేదు. తన ఐదో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై తొలి అర్ధ సెంచరీ (75 బంతుల్లో 71) సాధించాడు. అరంగేట్రం చేసిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత 2002లో తన మొదటి, ఏకైక సెంచరీని (జింబాబ్వేపై కేవలం 147 బంతుల్లో 159 పరుగులతో అజేయంగా) సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ పర్యటనలో అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ కూడా అందుకున్నాడు.

2003 క్రికెట్ ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోబడ్డాడు, అక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ ఓడిపోయింది. ఆ తరువాత తన ఆట పేలవంగా ఉండడంతో 2005 ఏప్రిల్ లో భారత జట్టు నుండి తొలగించబడ్డాడు.

2006లో శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే, కొలంబోలో బాంబు పేలుడు కారణంగా మూడవ జట్టు దక్షిణాఫ్రికా వైదొలగడం, ఎడతెరిపిలేని వర్షం కారణంగా టోర్నమెంట్ జరగలేదు. బదులుగా 2006 సెప్టెంబరులో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో మలేషియాలో జరిగిన ట్రై-సిరీస్‌లో మోంగియాకు అవకాశం లభించింది, అక్కడ అతను ఆస్ట్రేలియాతో జరిగిన చివరి గ్రూప్ గేమ్‌లో అజేయంగా 68 పరుగులు చేశాడు, అయినప్పటికీ భారత్ గేమ్‌ను కోల్పోయి ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

రాజకీయాలు

[మార్చు]

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు మోంగియా 2021 డిసెంబరులో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Full Scorecard of Leics vs Lancashire North Group 2004 – Score Report". ESPNcricinfo. Retrieved 17 November 2021.
  2. "Former cricketer Dinesh Mongia joins BJP ahead of Punjab assembly polls". 28 December 2021.

బయటి లింకులు

[మార్చు]