సుజిత్ సోమసుందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుజిత్ సోమసుందర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సుజిత్ బిజ్జహళ్లి సోమసుందర్
పుట్టిన తేదీ (1972-12-02) 1972 డిసెంబరు 2 (వయసు 51)
బెంగళూరు, కర్ణాటక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 99)1996 అక్టోబరు 17 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే1996 అక్టోబరు 21 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991–2000కర్ణాటక
2001–2002సౌరాష్ట్ర
2002–2003కేరళ
2004–2006కర్ణాటక
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 2 99 66
చేసిన పరుగులు 16 5,525 2,121
బ్యాటింగు సగటు 8.00 35.64 34.77
100s/50s 0/0 11/30 6/6
అత్యధిక స్కోరు 9 222 152
వేసిన బంతులు 1074 257
వికెట్లు 14 5
బౌలింగు సగటు 34.92 45.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/15 3/12
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 93/– 22/–
మూలం: ESPNcricinfo, 2006 మార్చి 6

సుజిత్ బిజ్జహళ్లి సోమసుందర్, కర్ణాటకకు చెందిన భారతీయ మాజీ క్రికెటర్. కర్ణాటక తరపున దేశీయ క్రికెట్ తోపాటు, 1996లో భారతదేశం తరపున రెండు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడాడు.

జననం[మార్చు]

సుజిత్ సోమసుందర్ 1972, డిసెంబరు 2న కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించాడు.

దేశీయ క్రికెట్[మార్చు]

కర్ణాటకతో డొమెస్టిక్ సర్క్యూట్‌లో కొన్ని మ్యాచ్ లలో మంచి ఆటతీరు కారణంగా సోమసుందర్‌కు అవకాశం లభించింది. సోమసుందర్ 1990-91 సీజన్‌లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున మొదటిసారిగా ఆడాడు. 1991, ఫిబ్రవరిలో మహారాష్ట్రపై తన మొదటి ఆటను మరొక అరంగేట్ర క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 29, 27 (నాటౌట్) పరుగులు చేశాడు. తరువాతి సీజన్‌లో తమిళనాడుతో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఐదు ఓవర్లలో 3/15తో తీశాడు. కర్ణాటక జట్టులో శాశ్వత స్థానాన్ని పొందేందుకు ఎటువంటి అవకాశాలు రానప్పుడు, సోమసుందర్‌కు మాజీ భారత క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ మద్దతు ఇచ్చాడు. స్థానిక క్లబ్ అయిన సిటీ క్రికెటర్స్ కోసం ఆడుతున్నప్పుడు మాజీ ఆటగాడితో కలిసి ఆడాడు. కర్ణాటకకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన కార్ల్టన్ సల్దాన్హా రిటైర్మెంట్ కారణంగా సోమసుందర్‌కు మళ్ళీ జట్టులో చోటు లభించింది.[1]

1994-95లో విజృంభించి గోవాపై సెంచరీ సాధించాడు. 1995-96 రంజీ ట్రోఫీ సీజన్‌లో కర్ణాటకకు కీలక సభ్యుడిగా ఉన్నాడు. రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలతో రంజీ ట్రోఫీలో కర్ణాటక విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో 99, 53 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో 61.76 సగటుతో 803 పరుగులు చేశాడు.[1][2]

అంతర్జాతీయ కాల్-అప్[మార్చు]

దేశీయ టోర్నమెంట్లలో మంచి ఆటతీరు వల్ల సోమసుందర్‌ను టైటాన్ కప్ (దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను కూడా కలిగి ఉన్న ముక్కోణపు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్) కోసం భారత జాతీయ జట్టుకు పిలిపించారు.[3] హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేశాడు. డారిల్ కల్లినన్ చేతిలో రనౌట్ కావడానికి ముందు అతను 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు.[4] ఆ తదుపరి వన్డేలో చివరిసారిగా ఆడాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తన సొంత మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడుతుండగా, సోమసుందర్‌ను పేస్‌మెన్ గ్లెన్ మెక్‌గ్రాత్[5] పరుగుల వద్ద అవుట్ చేశాడు. తరువాత జట్టు నుండి తొలగించబడ్డాడు, మిగిలిన ఆటలకు అతని స్థానంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపికయ్యాడు.[6]

తరువాత దేశీయ క్రికెట్[మార్చు]

జాతీయ సెలెక్టర్లచే తిరస్కరించబడిన సోమసుందర్ మంచి ఫామ్‌లో కొనసాగాడు, 1997-98 సీజన్‌లో 629 పరుగులు చేశాడు. ఆ మరుసటి సంవత్సరం 529 పరుగులు చేయడం ద్వారా కర్ణాటకను మరో రంజీ ట్రోఫీని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. 1998లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో సోమసుందర్ 68 పరుగులు చేశాడు. 1990లలో అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్, డేవిడ్ జాన్సన్, దొడ్డా గణేష్, సునీల్ జోషి వంటి అనేకమంది ఆటగాళ్ళను భారత జట్టుకు అందించిన కర్ణాటక సెటప్‌లో భాగంగా ఉన్నాడు.

2002లో కేరళ తరపున ఆడుతూ, త్రిపురపై తన అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 222 స్కోర్ చేశాడు. ఆ సీజన్‌లో 1000 పరుగులకు పైగా పరుగులు చేశాడు. ఇది ఆ సంవత్సరంలో బ్యాట్స్‌మెన్‌ అత్యధిక పరుగులుగా నమోదైంది. తన కెరీర్ చివరి సంవత్సరాల్లో సౌరాష్ట్ర తరపున ఆడాడు, 2007లో రిటైరయ్యాడు.[7] 2006 నవంబరు నుండి 2012 మే వరకు విప్రో టెక్నాలజీస్ కోసం బిహేవియరల్ ఎక్స్‌పర్ట్ & లీడర్‌షిప్ ట్రైనింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. వారి వ్యాపార నాయకులు, నిర్వాహకుల పనితీరును మార్చే బాధ్యతను చేపట్టాడు. 2012 జూన్ నుండి 2014 మార్చి వరకు కేరళ క్రికెట్ అసోసియేషన్‌ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. కోచ్‌గా మొదటి సంవత్సరంలో, బిసిసిఐ నిర్వహించిన విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) & గులాం అహ్మద్ ట్రోఫీ (20 ఓవర్ల ఫార్మాట్) రెండింటిలోనూ రన్నరప్‌గా నిలిచి కేరళ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో గుర్తింపు పొందిన స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అయిన డా. ప్యాట్రిక్ కోన్ వద్ద శిక్షణ పొందిన పార్ట్-టైమ్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Jaishankar, Vedam (14 October 1996). "At 24, Somasundar is almost a late bloomer". The Indian Express. Archived from the original on 24 April 1997. Retrieved 2023-08-07.
  2. "Batting - Most Runs". ESPNcricinfo. Retrieved 2023-08-07.
  3. "Ankola back in squad for Titan Cup". The Indian Express. 14 October 1996. Archived from the original on 24 April 1997. Retrieved 2023-08-07.
  4. "Full Scorecard of South Africa vs India 1st Match 1996/97 - Score Report | ESPNcricinfo.com".
  5. "Full Scorecard of Australia vs India 3rd Match 1996/97 - Score Report | ESPNcricinfo.com".
  6. "Sidhu replaces Somasundar in Indian team". The Indian Express. 24 October 1996. Archived from the original on 24 April 1997. Retrieved 2023-08-07.
  7. "Interview with Sujith Somasundar". 25 October 2016.

బయటి లింకులు[మార్చు]