విప్రో
విప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ | |
---|---|
Wipro logo | |
తరహా | Public బి.ఎస్.ఇ: 507685 NYSE: WIT |
స్థాపన | 1945 |
స్థాపకులు | ఎమ్. హెచ్. ప్రేమ్ జీ |
ప్రధానకేంద్రము | బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం |
కీలక వ్యక్తులు | అజీమ్ ప్రేమ్‌జీ (Chairman) T K Kurien ( CEO) SA Sudarshan |
పరిశ్రమ | IT సేవలు |
సేవలు | IT Consulting Business Process Outsourcing Product Engineering Solutions Technology Infrastructure Services |
రెవిన్యూ | ![]() |
నికర ఆదాయము | ![]() |
మొత్తం ఆస్తులు | ![]() |
ఉద్యోగులు | 135,920 (2012 నాటికి) |
నినాదము | "Applying Thought". |
వెబ్ సైటు | Wipro.com |
విప్రో టెక్నాలజీస్ లిమిటెడ్(బి.ఎస్.ఇ: 507685, NYSE: WIT) భారతదేశంలోని బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ. 2008-09 సంవత్సరానికి గానూ IT సేవలనందించే భారతీయ సంస్థలలో విప్రో రెండవది. 2009 సంవత్సరంలో విప్రో 98,391 నిపుణులను నియమించినది. కన్జ్యూమర్ కేర్, బల్బుల ఉత్పత్తి, ఇంజినీరింగ్, ఆరోగ్య రంగాలలో కూడా విప్రో లో ఉన్నాయి.
చరిత్ర[మార్చు]
విప్రో అనగా వెస్టర్న్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ (Western India Palm Refined Oils). మహరాష్ట్రలోని అమల్నేర్ ప్రాంతంలో అజీమ్ ప్రేమ్‌జీ గారి తండ్రి 1947 లో కాయగూరల నూనె కార్మాగారంగా నెలకొల్పాడు.
అజిం స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థి. 1966 లో తన తండ్రి పరమపదించటంతో తన 21వ ఏట సంస్థ బాధ్యతలని చేపట్టాడు.
1977 లో ఐ బీ ఎంను భారతదేశం బహిష్కరించిన సమయంలో విప్రో ఐటీ రంగంలో అడుగు పెట్టింది.
1979 లో విప్రో సొంతంగా కంప్యూటర్లను తయారు చేయటం మొదలు పెట్టి 1981 నుండి వాటి అమ్మకాలను మొదలుపెట్టినది.
మూలాలు[మార్చు]
- ↑ Sridhar, V (April 23, 2009). "Wipro net up at Rs. 3,899 crore". The Hindu. Archived from the original on 2009-06-29. Retrieved 2009-08-14.