అజీమ్ ప్రేమ్‌జీ
అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (dropped out in 1966, completed in 1999)[1] |
నికర విలువ | US$17.0 billion (2010)[2][3] |
జీవిత భాగస్వామి | యాస్మీన్ ప్రేమ్‌జీ |
పిల్లలు | రిషద్ & తారిఖ్[4] |
అజీమ్ ప్రేమ్‌జీ (జననం:జులై 24, 1945) గుజరాతుకు చెందిన ప్రముఖ ఇంజనీరు,, పారిశ్రామిక వేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థకు అధ్యక్షుడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ప్రేమ్‌జీ 1999 నుంచి 2005 వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అజీమ్ ప్రేమ్‌జీ గుజరాత్ నుంచి వచ్చి ముంబైలో నివసిస్తున్న ఒక షియా ముస్లిం కుటుంబంలో జన్మించాడు.ఆయన తండ్రి ఎం.హెచ్. ప్రేమ్‌జీ వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రాడక్ట్ కంపెనీ (దీన్నే తరువాత విప్రోగా మార్చడం జరిగింది)అనే సంస్థకు యజమాని. ఈ సంస్థ వంటనూనెలు ఉత్పత్తి చేసేది. ఆయన తాత బర్మాలో బియ్యం వ్యాపారం చేసేవాడు. అజీమ్ తండ్రిని మహమ్మదాలీ జిన్నా పాకిస్తాన్ కు వెళ్ళమన్నా ఆయన వెళ్ళలేదు.[6]
ముంబై లోని సెయింట్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింలో విద్య నభ్యసిస్తుండగా తండ్రి 1966 లో హఠాత్తుగా కన్నుమూయడంతో చదువును అర్ధాంతరంగా వదిలిపెట్టి వ్యాపార వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది.అప్పటికి ఆయన వయసు 21 ఏళ్ళు. తరువాత ముప్ఫై ఏళ్ళకు మళ్ళీ పట్టుబట్టి అక్కడ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The World's Billionaires #83 Azim Premji". Forbes.com. November 3, 2009. Retrieved 7 December 2009.
- ↑ [1]
- ↑ "India's Richest #83 Azim Premji". Forbes.com. November 3, 2009. Retrieved 7 December 2009.
- ↑ "What you didn't know about Rishad Premji". Rediff. June 7, 2007. Retrieved 7 December 2009.
- ↑ "The World's Billionaires". Forbes. March 3, 2009. Retrieved 2009-03-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-27. Retrieved 2010-04-14.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-04-28. Retrieved 2010-04-14.
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- ప్రపంచ ప్రసిద్ధులు
- గుజరాత్ పారిశ్రామికవేత్తలు
- 1945 జననాలు
- గుజరాత్ వ్యక్తులు
- ముస్లిం ప్రముఖులు
- జీవిస్తున్న ప్రజలు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు