Jump to content

దొడ్డ గణేష్

వికీపీడియా నుండి
Dodda Ganesh
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 4 1
చేసిన పరుగులు 25 4
బ్యాటింగు సగటు 6.25 4.00
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు 8 4
వేసిన బంతులు 461 30
వికెట్లు 5 1
బౌలింగు సగటు 57.39 20.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు 2/28 1/20
క్యాచ్‌లు/స్టంపింగులు -/- -/-
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4

1973, జూన్ 30న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించిన దొడ్డగణేష్ (Doddanarasiah Ganesh) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు జట్టు తరఫున 1997లో 4 టెస్టులు, ఒక వన్డేలో ప్రాతినిధ్యం వహించాడు. 4 టెస్టులు ఆడిననూ తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 4 వికెట్లు మాత్రమే సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కర్ణాటక తరఫున 104 మ్యాచ్‌లు ఆడి 365 వికెట్లు సాధించాడు.

టెస్ట్ గణాంకాలు

[మార్చు]

గణేష్ 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 57.39 సగటుతో 5 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 6.25 సగటుతో 25 పరుగులు చేశాడు. టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 28 పరుగులకు 2 వికెట్లు కాగా అత్యధిక వ్యక్తిగత స్కోరు 8 పరుగులు.

వన్డే గణాంకాలు

[మార్చు]

దొడ్డ గణేష్ ఒకే ఒక్క వన్డే ఆడి 30 బంతులు బౌలింగ్ చేసి 20 పరుగులకు ఒక్క వికెట్టు సాధించాడు. ఆ వన్డేలో బ్యాటింగ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక టెస్టు, వన్డే గణాంకాలు సరిగా లేనందున అతనికి మళ్ళీ జట్టులో స్థానం లభించలేదు.