Jump to content

జస్‌ప్రీత్ బుమ్రా

వికీపీడియా నుండి
జస్ప్రీత్ బుమ్రా
2019 లో బుమ్రా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జస్ప్రీత్ జస్బీర్ సింగ్ బుమ్రా
పుట్టిన తేదీ (1993-12-06) 1993 డిసెంబరు 6 (వయసు 30)
అహ్మదాబాదు, గుజరాత్
మారుపేరుజెబి,జస్సీ, బూమ్ బూమ్, జస్ప్రీత్
ఎత్తు5 అ. 9 అం. (175 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్[a]
పాత్రబౌలరు
బంధువులు
Sanjana Ganesan (wife)
(m. 2021)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 290)2018 జనవరి 6 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2022 జూలై 1 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 210)2016 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2022 జూలై 14 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.93
తొలి T20I (క్యాప్ 57)2016 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2022 సెప్టెంబరు 25 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.93
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–presentగుజరాత్ క్రికెట్ జట్టు
2013–ఇప్పటి వరకుముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 93)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే టి20 ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 30 72 210 58
చేసిన పరుగులు 212 47 90 392
బ్యాటింగు సగటు 7.31 6.71 8.18 10.05
100లు/50లు 0/0 0/0 0/0 0/1
అత్యుత్తమ స్కోరు 35* 14* 16* 55*
వేసిన బంతులు 6368 3807 4698 11,534
వికెట్లు 128 121 256 220
బౌలింగు సగటు 21.99 24.30 21.54 23.53
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 8 2 1 14
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 9/86 6/19 5/10 6/27
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 17/– 30/– 17/–
మూలం: ESPNCricinfo, 13 July 2023

జస్ప్రీత్ జస్బీర్‌సింగ్ బుమ్రా (జననం 1993 డిసెంబరు 6) అన్ని ఫార్మాట్‌లలోనూ భారత క్రికెట్ జట్టు తరఫున ఆడే అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. విశిష్టమైన బౌలింగ్ యాక్షన్‌తో ఉండే కుడిచేతి ఫాస్ట్ బౌలరైన బుమ్రాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను దేశీయ క్రికెట్‌లో గుజరాత్ తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపునా ఆడతాడు.

అతను 2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించి, త్వరలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేసి జట్టుకు విజయం అందించి ఖ్యాతిని పెంచుకున్నాడు. ఏ సమయంలోనైనా స్థిరంగా యార్కర్లు వేయడం అతని ప్రత్యేకత. వన్‌డే, T20I బౌలర్లకు ICC ఇచ్చిన ర్యాంకింగుల్లో అతను నిలకడగా అగ్ర స్థానాల్లో ఉన్నాడు. అంతిమ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యానికి అతను ప్రసిద్ది చెందాడు .ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారతదేశం సాధించిన విజయాలకు అతని సహకారం చాలా కీలక. వన్డేల్లో అత్యంత వేగంగా 50, 100 వికెట్లు సాధించిన భారత బౌలరతను. టి20I లలో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన భారతీయ బౌలరు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బుమ్రా అహ్మదాబాద్‌లో స్థిరపడిన సిక్కు పంజాబీ కుటుంబంలో జన్మించాడు. [4] బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ 5 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. [5] అతను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మధ్యతరగతి పరిసరాలలో పెరిగాడు. తన తల్లి దల్జీత్ బుమ్రా పాఠశాల ఉపాధ్యాయురాలు, దల్జీత్ 2019 నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ క్రికెట్ ఫీవర్: ముంబై ఇండియన్స్‌లో కనిపించింది. అక్కడ ఆమె తన కొడుకు క్రికెట్ విజయంపై భావోద్వేగానికి గురైంది.[6] [7]

2021 మార్చి 15 న, అతను గోవాలో సంజనా గణేశన్ అనే మోడల్‌ను పెళ్ళి చేసుకున్నాడు. [8] పూణేకి చెందిన గణేశన్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్టు. 2014 లో MTV స్ప్లిట్స్‌విల్లాలో కూడా పాల్గొంది [9]

దేశీయ క్రికెట్

[మార్చు]

బుమ్రా, 2013-14 సీజన్లో 2013 అక్టోబరులో గుజరాత్ తరపున ఆడుతూ విదర్భపై ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తొలి ఆట ఆడాడు. [10]

అసాధారణమైన బౌలింగ్ యాక్షన్‌తో గుజరాత్‌కు చెందిన రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం పేసర్, బుమ్రా 2012-13 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై తన తొలి టి20 ఆట ఆడాడు. అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచినా ఆ ఆటలో అతని జట్టు టైటిల్‌ను సాధించింది. 3/14తో అతని గణాంకాలు ఫైనల్‌లో పంజాబ్‌పై గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. [11]

19 ఏళ్ల బుమ్రా తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అడుగుపెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3/32 సాధించి వెలుగులోకి వచ్చాడు. [12] బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున పెప్సీ IPL 2013 లో ఆడినది 2 మ్యాచ్‌లే అయినప్పటికీ, ముంబై ఇండియన్స్ అతనిని పెప్సీ IPL 2014 సీజన్‌లో ఉంచుకుంది. [13]

2020 డిసెంబరు 11 న, ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియా A కి వ్యతిరేకంగా తన తొలి ఫస్ట్ క్లాస్ హాఫ్ సెంచరీ (55*) సాధించాడు. [14]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నవాళ్లలో బుమ్రాయే అత్యుత్తమమైన, అత్యంత ప్రభావశీలమైన యార్కర్ వెయ్యగలడు.

– క్రికెట్ వ్యాఖ్యాత వసీమ్ అక్రమ్, 2019 జనవరి[15]

2016 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన T20I సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో, అతను ఒక క్యాలెండర్ సంవత్సరంలో ట్వంటీ20 లో అత్యధిక వికెట్లు (28) సాధించిన బౌలర్‌గా డిర్క్ నాన్స్ రికార్డును అధిగమించాడు. [16]

2017 జనవరిలో, ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో T20I సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో బుమ్రా 20 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. [17] 2017 శ్రీలంక పర్యటనలో బుమ్రా వన్‌డే సిరీస్‌లో 15 తీసుకున్నాడు. ఇది ఐదు లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్‌డే సిరీస్‌లో ఫాస్ట్ బౌలరు తీసుకున్న అత్యధిక వికెట్ల రికార్డు.[18] ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో నో బాల్ బౌలింగ్ చేసి వికెట్‌ తీసినందుకు అతను గుర్తుండిపోతాడు. ఆ బ్యాట్స్‌మెన్, ఫఖర్ జమాన్, ఆ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించిన శతకం సాధించాడు. [19]

2017 నవంబరులో అతను దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [20] అతను 2018 జనవరి 5 న కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్‌లో దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా భారతదేశం తరపున తన తొలి టెస్టు ఆడాడు.[21] జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 3వ టెస్టులో బుమ్రా, 18.5 ఓవర్లలో 5/54 గణాంకాలతో టెస్టుల్లో తన తొలి ఐదు వికెట్ల రికార్డు సాధించాడు.[22]

ట్రెంట్ బ్రిడ్జ్‌లో (2018 ఆగస్టు) ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (ఎడమవైపు నుండి నాల్గవ), ఫీల్డింగ్ చేస్తూ.

2018 ఆస్ట్రేలియా పర్యటనలో, బాక్సింగ్ డే టెస్టులో తన కెరీరు లోనే అత్యుఉత్తమ గణాంకాలు 6/33 సాధించాడు. ఒకే క్యాలెండరు సంవత్సరంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మూడు దేశాల్లోనూ ఐదు వికెట్ల పంట తీసిన తొలి ఆసియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. [23] మొత్తంమీద, అతను 21 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసి ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ తో కలిసి ఉమ్మడిగా రికార్డు సాధించాడు. [24] ఆ సంవత్సరంలో మొత్తం 48 వికెట్లు సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో తొలి సంవత్సరంలో భారత బౌలరు సాధించిన వికెట్ల రికార్డు. [25] 2018లో అతని ప్రదర్శనలకు గాను అతను, ICC వరల్డ్ టెస్ట్ XI, ODI XI రెండింటిలోనూ ఎంపికయ్యాడు. [26] 2019 ఏప్రిల్‌లో అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ భారత జట్టులో ఎంపికయ్యాడు. [27] [28] అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అతనిని తొలి ప్రపంచ కప్‌ ఆడుతున్న ఐదుగురు అద్భుతమైన ప్రతిభావంతుల్లో ఒకడిగా పేర్కొంది. [29] 2019 జూన్ 5 న, దక్షిణాఫ్రికాతో జరిగిన టోర్నమెంట్‌లో భారత ప్రారంభ మ్యాచ్‌లో బుమ్రా తన 50వ వన్‌డే మ్యాచ్‌ ఆడాడు.[30] 2019 జూలై 6 న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, బుమ్రా వన్‌డేలలో తన 100వ వికెట్‌ను తీసుకున్నాడు. అతని సహచరుడు మహమ్మద్ షమీ తర్వాత అత్యంత వేగంగా వన్డేల్లో 100 వికెట్లు తీసిన రెండవ భారత ఆటగాడిగా నిలిచాడు.[31][32] అతను టోర్నమెంట్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో పద్దెనిమిది వికెట్లతో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా, మొత్తం మీద ఐదవ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[33] ICC, ESPNCricinfo ల 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో ఎంపికయ్యాడు. [34] [35]

ఆగష్టు 2019లో, సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో వెస్టిండీస్ టూర్ 2019 యొక్క మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా 2వ ఇన్నింగ్స్‌లో 5/7తో తన నాల్గవ టెస్ట్ ఐదు వికెట్లు సాధించాడు. [36] రెండో టెస్టు మ్యాచ్‌లో, టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. [37]

విదేశాల్లో 17 టెస్టులు ఆడిన తర్వాత 2021 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో MA చిదంబరం స్టేడియంలో బుమ్రా భారతగడ్డపై తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వికెట్‌ను 2021లో ఇంగ్లాండుకు చెందిన డేనియల్ లారెన్స్‌ను ఔట్ చేసినపుడు భారత్‌లో తొలి టెస్టు వికెట్ దక్కింది [38] [39] [40]

అతనికి ది టైమ్స్ ఆఫ్ ఇండియా అతనికి 2021 TOISA క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ప్రసాదించింది.[41]

2022 ఫిబ్రవరిలో, రెగ్యులర్ వైస్-కెప్టెన్ KL రాహుల్ అందుబాటులో లేకపోవడం వల్ల శ్రీలంకతో జరిగే టి20I, టెస్ట్ సిరీస్‌లకు బుమ్రా భారత వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [42] 2022 మార్చిలో శ్రీలంకతో జరిగిన రెండో డే నైట్ టెస్ట్‌లో బుమ్రా భారత్‌లో టెస్టుల్లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [43]

2022 జూలై 1 న, కోవిడ్-19 తో బాధపడుతున్న రోహిత్ శర్మ స్థానంలో బుమ్రా మొదటిసారిగా ఇంగ్లండ్‌తో జరిగిన భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా పనిచేసాడు. [44]

2022 జూలై 2 న జస్‌ప్రీత్ బుమ్రా, స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో 35 పరుగులు చేసి, బ్రియాన్ లారా (ఓవర్‌లో 28 పరుగులు చేశాడు) నెలకొల్పిన 18 ఏళ్ల పాత రికార్డును అధిగమించాడు. [45]

2022 జూలై 12 న, ఇంగ్లండ్‌తో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 6/19 తో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ భారత బౌలింగు గణాంకాలు సాధించాడు.[46] అది ODIలలో భారతదేశం తరపున మూడవ అత్యుత్తమ గణాంకాలు. [47]

2022 జూలై 17 న, బుమ్రా ICC వన్‌డే ర్యాంకుల్లో నంబరు 1 బౌలరయ్యాడు. [48]

బౌలింగ్ శైలి

[మార్చు]

బుమ్రా తన విలక్షణమైన బౌలింగు యాక్షనుకు, మోచేతులు అతిగా విస్తరించడానికీ ప్రాసిద్ధి పొందాడు. [49] అతని రన్-అప్ తక్కువగా ఉండి, మొదటి భాగంలో చిన్నచిన్న అంగలతో కూడి ఉంటుంది. బౌలింగు చేసేటపుడు చేయి కర్రలాగా బిగుసుకుని ఉంటుంది. అయినప్పటికీ, చాలా వేగంగా బౌలింగు చేస్తాడు. బంతిని విడుదల చేసే స్థానం అసాధారణంగా ఉండి, బ్యాట్స్‌మన్లకు అతని బౌలింగ్‌ని అర్థం చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది. భారత జట్టు అతనిని ఎక్కువగా అంతిమ ఓవర్లలో ఉపయోగిస్తుంది. [50] అతను తరచుగా ఆఫ్-స్టంప్ వెలుపల, యార్కర్లు, షార్ట్ లెంగ్త్ బంతులు వేస్తాడు. [51] [52]

మాజీ అంతర్జాతీయ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకారం, బుమ్రా బౌలింగ్ యాక్షను కారణంగా అతనికి వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది. అతను బౌలింగు చేసేటప్పుడు కొద్దిగా ముందుకు వంగి ఉంటాడు. ఈ రకమైన యాక్షనులో బౌలర్లు తమ భుజాలతో, వీపుతో వేగాన్ని సాధిస్తారు. దీంతో గాయం అయ్యే అవకాశాలను పెరుగుతాయి. [53]

బుమ్రా బౌలింగు యాక్షను విలక్షణంగా ఉంటుంది. అది చూస్తే నాకు నా తరం సహచరుడు జెఫ్ థామ్సన్ గుర్తుకొస్తాడు అని మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలరు డెనిస్ లిలీ అన్నాడు.[54]

బుమ్రాకు తన మాజీ ముంబై ఇండియన్స్ సహచరుడు, శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగ లాగానే,[55][56] బ్లాక్ హోల్‌ను కొట్టే (యార్కర్లు వేసే) అసాధారణ సామర్థ్యం ఉందని పేరు తెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో బుమ్రా భారత జట్టుకు ఆస్తిగా ఎదిగాడు.[57][58][59]

బుమ్రా 142 కి.మీ/గం సగటు వేగంతో అత్యంత వేగవంతమైన భారత బౌలర్లలో ఒకడు. 2018 లో అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 153 కి.మీ/గం వేగంతో అతను మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌లను అధిగమించి బౌలింగ్ చేసాడు. అది అతని అత్యధిక వేగం. [60] [61]

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ ఇలా అన్నాడు: "బూమ్ యాక్షన్ ప్రత్యేకమైనదే, కానీ దాన్ని అనుసరించవచ్చు. అతనికి గొప్ప నియంత్రణ ఉంది." [7]

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా, బుమ్రా బౌలింగ్ యాక్షన్‌పై వ్యాఖ్యానిస్తూ, "రన్-అప్‌లో మొదటి 75-80%లో మీరు ఏం చేస్తారనేది పెద్ద పట్టింపు కాదు. చివరి 15-20% లో చివరి నాలుగు-ఐదు అంగలే ముఖ్యం. బౌలింగ్‌అంటే అదే. బుమ్రా భిన్నంగా పరుగెత్తాడు, కానీ అతని చివరి మూడు-నాలుగు అంగల్లో - అతను లోడ్ చేస్తాడు, ముందు కాలు, వెనుక కాలు, ప్రతిదీ సమలేఖనంలో ఉంటుంది అతను గాలిలో వేగంగా వెళ్తాడు." [7]

గమనికలు

[మార్చు]
  1. Some sources list Bumrah as a fast-medium paced bowler[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Jasprit Bumrah - Indian - Right Arm Bowl". Sportskeeda.com (in Indian English). Retrieved 30 May 2023.
  2. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 17 January 2022.
  3. "Jasprit Bumrah profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo.
  4. Bezbaruah, Ajit (19 December 2011). "This Punjabi duo says balle balle to Ahmedabad". The Times of India. Retrieved 10 August 2021.
  5. "I couldn't afford anything: India pacer Jasprit Bumrah recalls his childhood struggles as cricketer". Scroll.in. 9 October 2019. Retrieved 11 January 2021.
  6. Khanna, Akash (9 October 2019). "Jasprit Bumrah, Mother Recall Tough Times, Days Of Struggle" (in ఇంగ్లీష్). NDTV. Archived from the original on 2019-11-13. Retrieved 5 November 2020.
  7. 7.0 7.1 7.2 Ugra, Sharda (23 May 2019). "The boy called Boom". The Cricket Monthly (in ఇంగ్లీష్). ESPNcricinfo. Archived from the original on 2 June 2020. Retrieved 5 November 2020.
  8. "'Love, if it finds you worthy, directs your course': Jasprit Bumrah ties the knot in Goa". Hindustan Times. 15 March 2021. Retrieved 15 March 2021.
  9. "Jasprit Bumrah marriage: Who is Sanjana Ganesan? All you need to know". India Today (in ఇంగ్లీష్). 15 March 2021. Retrieved 15 March 2021.
  10. "Jasprit Bumrah - India". ESPNcricinfo. Retrieved 16 December 2018.
  11. "Gujarat win Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. 31 March 2013.
  12. "Bumrah revels on big stage". ESPNcricinfo. 5 April 2013.
  13. "IPL 2014 Auction: Jasprit Bumrah sold for Rs 1.20 crore to Mumbai Indians". CricketCountry. 13 February 2014.
  14. "Joe Burns' woes continue as Mohammed Shami, Jasprit Bumrah shine with pink ball". ESPNcricinfo. Retrieved 11 December 2020.
  15. "Wasim Akram rates Jasprit Bumrah's yorker the best in the world". Press Trust of India. 19 January 2019.
  16. "Bumrah breaks Nannes' T20 record". Cricket Network. 29 August 2016.
  17. "New-ball Nehra, old-ball Bumrah a recipe for victory". ESPNcricinfo. 29 January 2017. Retrieved 30 January 2017.
  18. "Kohli's century tally second only to Tendulkar". ESPNcricinfo. 3 September 2017. Retrieved 3 September 2017.
  19. "Bumrah bowling a no ball in Champions Trophy 2018 final". sports.ndtv.com. Retrieved 3 September 2018.
  20. "Bumrah earns maiden Test call-up for SA tour". ESPNcricinfo. 4 December 2017. Retrieved 4 December 2017.
  21. "1st Test, India tour of South Africa at Cape Town, Jan 5-9 2018". ESPNcricinfo. Retrieved 5 January 2018.
  22. "Jasprit Bumrah makes a statement in Test cricket with maiden 5-wicket haul". India Today. 25 January 2018.
  23. "Jasprit Bumrah rips through Australia, India on top despite 2nd innings collapse". The Times of India. 28 December 2018.
  24. "Live Cricket Score - IND vs SA, SL vs ZIM, BBL Cricket scores". sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 17 January 2022.
  25. "Live Cricket Score - Ball by Ball Commentary, Cricket News, Match Highlights | Sportskeeda". sportskeeda.com.
  26. "ICC announces men's Test and ODI Teams of the Year". icc-cricket.com.
  27. "Rahul and Karthik in, Pant and Rayudu out of India's World Cup squad". ESPNcricinfo. 15 April 2019. Retrieved 15 April 2019.
  28. "Dinesh Karthik, Vijay Shankar in India's World Cup squad". International Cricket Council. Retrieved 15 April 2019.
  29. "Cricket World Cup 2019: Debutant watch". International Cricket Council. Retrieved 28 April 2019.
  30. "Teetering South Africa hope not to capsize". ESPNcricinfo. Retrieved 5 June 2019.
  31. "Jasprit Bumrah becomes second fastest Indian bowler to scalp 100 ODI wickets". The Times of India. Retrieved 6 July 2019.
  32. "The Latest: Bumrah earns 100th ODI wicket". Fox Sports. 6 July 2019. Retrieved 6 July 2019.
  33. "ICC Cricket World Cup, 2019 - India: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 10 July 2019.
  34. "CWC19: Team of the Tournament". ICC. Retrieved 25 July 2019.
  35. "Starc, Archer, Ferguson, Bumrah in ESPNcricinfo's 2019 World Cup XI". ESPNcricinfo. 17 July 2019. Retrieved 25 July 2019.
  36. "Jasprit Bumrah sets Asian record with 5-wicket haul in West Indies". India Today. Retrieved 26 August 2019.
  37. "India vs West Indies | Bumrah Becomes Third Indian to Take a Test Hat-trick". News18. 1 September 2019. Retrieved 16 March 2021.
  38. Vishwanathan, Siddharth (5 February 2021). "India vs England: Jasprit Bumrah makes special debut, but Rishabh Pant spoils a dream start". DNA India (in ఇంగ్లీష్). Retrieved 6 February 2021.
  39. Das, Devadyuti (5 February 2021). "India vs England 1st Test: Jasprit Bumrah finally picks up a wicket at home, sets THIS new record". Zee News (in ఇంగ్లీష్). Retrieved 6 February 2021.
  40. "IND vs ENG 1st Test Day 1: Watch Jasprit Bumrah takes maiden Test wicket in India". India TV. 5 February 2021. Retrieved 6 February 2021.
  41. "TOISA 2021: Neeraj Chopra headlines the list of winners". The Times of India. New Delhi. 14 October 2021. Archived from the original on 26 అక్టోబరు 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  42. "Rohit Sharma named India's captain for two-Test series against Sri Lanka; Jasprit Bumrah named his deputy". Hindustan Times. 19 February 2022. Retrieved 19 February 2022.
  43. "IND vs SL: Jasprit Bumrah becomes first ever Indian bowler to join elusive list with magnificent Bengaluru Test feat". Hindustan Times (in ఇంగ్లీష్). 15 March 2022. Retrieved 15 March 2022.
  44. "India vs England, 5th Test: Jasprit Bumrah to lead India after Rohit Sharma Ruled out due to COVID". The Times of India. 30 June 2022.
  45. "Records | Test matches | Batting records | Most runs off one over | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 6 July 2022.
  46. "Bumrah takes career-best 6 for 19 as India skittle England". ESPNcricinfo. Retrieved 12 July 2022.
  47. "India Cricket Team Records & Stats | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 14 July 2022.
  48. "ICC Men's ODI Bowling | Player Rankings | ICC". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 17 July 2022.
  49. G, Sandip (6 January 2019). "The Million Dollar Arm of Jasprit Bumrah". The Indian Express. Retrieved 4 November 2022.
  50. "The Rocket Science behind Bumrah's art". Yahoo Cricket. 17 May 2019. Retrieved 17 May 2019.
  51. "The 'Sling' connect!". BCCI. 4 March 2016. Archived from the original on 29 March 2016. Retrieved 21 December 2018.
  52. "Jasprit Bumrah: Arrival of the death-ly striker". The Week. 2 November 2017.
  53. टीम, एबीपी माझा वेब (29 September 2022). "Shoaib Akhtar: शोएब अख्तरनं जसप्रीत बुमराहबाबत केलेली भविष्यवाणी खरी ठरली!". marathi.abplive.com (in మరాఠీ). Retrieved 5 October 2022.
  54. "Jasprit Bumrah reminds me of Jeff Thomson: Dennis Lillee". Indo-Asian News Service. 20 December 2018.
  55. "Jasprit Bumrah reveals how he learnt the art of bowling yorkers". Sportskeeda.com. 14 September 2017. Retrieved 28 April 2019.
  56. Viswanath, G. (27 April 2016). "Tennis ball practice helped Bumrah bowl yorkers". Sportstar. Retrieved 28 April 2019.
  57. "'Bumrah the find of the tour' - Dhoni". ESPNcricinfo. 31 January 2016.
  58. "Ashwin lauds India's improved death bowling". ESPNcricinfo. 29 February 2016.
  59. "Jasprit Bumrah shows off best-in-the-world credentials". CricBuzz. 24 September 2018.
  60. "Jasprit Bumrah Fastest Ball: Pacer Clocks 153kmph During IND vs AUS 1st Test at the Adelaide Oval; Beats Mitchell Starc, Pat Cummins & Others!". latestly.com. 7 December 2018.
  61. "Jasprit Bumrah beats Mitchell Starc to bowl the fastest delivery in the Test match". crictracker. 7 December 2018.