సంజనా గణేశన్
సంజనా గణేశన్ | |
---|---|
జననం | పూణే, భారతదేశం | 1991 మే 6
జాతీయత | భారతీయురాలు |
ఎత్తు | 5 ft 5 in |
భార్య / భర్త | |
పిల్లలు | 1 |
సంజనా గణేశన్ (జననం 1991 మే 6) ఒక భారతీయ క్రీడా పాత్రికేయురాలు, యాంకర్, క్రికెట్ మ్యాచ్ ల ప్రసారకర్త.
వృత్తి జీవితం
[మార్చు]సంజన మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆమె స్పోర్ట్స్ ప్రెజెంటర్, స్టార్ స్పోర్ట్స్ కోసం క్రికెట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ల సమయంలో ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహిస్తుంది. సంజన ఇంగ్లాండ్లో జరిగిన 2019 ప్రపంచ కప్, 2020 మహిళల టి 20 ప్రపంచ కప్, 2024 ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ లలో పని చేసింది. ఆమె అనేక సీజన్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో స్టార్ స్పోర్ట్స్ ప్రసార జట్టులో కూడా ఉంది.[1][1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సంజనా గణేశన్ తన పాఠశాల విద్యను ది బిషప్ స్కూల్లో పూర్తి చేసింది. దీని తరువాత, ఆమె ఇంజనీరింగ్ చదివింది. పూణే లోని సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి.ఆమె మిస్ ఇండియా ఫైనలిస్ట్, 2014లో ఎంటీవి స్ప్లిట్స్విల్లాలలో కూడా పాల్గొన్నది.[1]2021 మార్చి 15న సంజన గోవాలో భారత క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాను వివాహం చేసుకుంది.[2][3] 2023 సెప్టెంబరు 4న, ఈ జంట తమ కుమారుడు అంగద్ జస్ప్రీత్ బుమ్రాను స్వాగతించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Jasprit Bumrah marriage: Who is Sanjana Ganesan? All you need to know". India Today (in ఇంగ్లీష్). 15 March 2021. Archived from the original on 9 July 2021. Retrieved 15 March 2021.
- ↑ "'Love, if it finds you worthy, directs your course': Jasprit Bumrah ties the knot in Goa". Hindustan Times. 15 March 2021. Archived from the original on 15 March 2021. Retrieved 15 March 2021."Jasprit Bumrah married Sanjana Ganesan, shares photos from their wedding". The Indian Express. 15 March 2021. Archived from the original on 20 April 2021. Retrieved 15 March 2021."Jasprit Bumrah marries model turned TV presenter Sanjana Ganesan". The Times of India. 15 March 2021. Archived from the original on 19 February 2024. Retrieved 15 March 2021.
- ↑ "Jasprit Bumrah And Sanjana Ganesan Become Parents: Know All About Their Love Story, In PICS". Zee News. 4 September 2023. Archived from the original on 23 September 2023. Retrieved 19 February 2024.
- ↑ "Jasprit Bumrah blessed with baby boy". The Indian Express. 4 September 2023. Archived from the original on 6 September 2023. Retrieved 6 September 2023.