మొహమ్మద్ షమీ
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్షమీ | |||
జననం | అమోహా, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 1990 మార్చి 9|||
ఎత్తు | 5 అ. 8 అం. (1.73 మీ.) | |||
బ్యాటింగ్ శైలి | కుడిచేతి | |||
బౌలింగ్ శైలి | కుడి చేతి (ఫాస్టు మీడియం) | |||
పాత్ర | బౌలర్ | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | భారతదేశం | |||
టెస్టు అరంగ్రేటం(cap 279) | 21 నవంబరు 2013 v వెస్ట్ ఇండీస్ | |||
చివరి టెస్టు | 27 జనవరి 2018 v దక్షిణ ఆఫ్రికా | |||
వన్డే లలో ప్రవేశం(cap 195) | 6 జనవరి 2013 v పాకిస్తాన్ | |||
చివరి వన్డే | 28 సెప్టెంబరు 2017 v ఆస్ట్రేలియా | |||
ఒ.డి.ఐ. షర్టు నెం. | 11 | |||
టి20ఐ లో ప్రవేశం(cap 46) | 21 మార్చి 2014 v పాకిస్తాన్ | |||
చివరి టి20ఐ | 9 జూలై 2017 v వెస్ట్ ఇండీస్ | |||
టి20ఐ షర్టు సంఖ్య. | 11 | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
2010/11–ప్రస్తుతం | బెంగాల్ క్రికెట్ టీం | |||
2012–2013 | కోల్‌కతా నైట్ రైడర్స్ (squad no. 11) | |||
2014–ప్రస్తుతం | ఢిల్లీ డేర్ డివిల్స్ (squad no. 11) | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్టు క్రికెట్ | ఒన్ డే ఇంటర్నేషనల్ | టి 20 | లిస్టు A క్రికెట్ |
మ్యాచులు | 30 | 50 | 7 | 79 |
చేసిన పరుగులు | 371 | 116 | – | 289 |
బ్యాటింగ్ సరాసరి | 14.27 | 10.54 | – | 9.96 |
100s/50s | 0/1 | 0/0 | -/- | 0/1 |
అత్యధిక స్కోరు | 51 | 25 | – | 26 |
బౌలింగ్ చేసిన బంతులు | 5634 | 2525 | 142 | 3949 |
వికెట్లు | 110 | 91 | 8 | 145 |
బౌలింగ్ సగటు | 28.91 | 25.37 | 31.25 | 23.97 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 3 | 0 | 0 | 0 |
మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | 0 | 0 | 0 |
ఉత్తమ బౌలింగు | 5/28 | 4/35 | 3/38 | 4/25 |
క్యాచులు/స్టంపులు | 6/– | 16/– | -/– | 28/– |
Source: ESPN Cricinfo, 26 జనవరి 2018 |
మొహమ్మద్ షమీ (జననం 1990 మార్చి 9) బెంగాల్ దేశీయ క్రికెట్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. అతను కుడి చేతి ఫాస్ట్-మీడియం స్వింగ్, సీమ్ బౌలర్. అతడు 85 మీ/గం. (140కి.మీ/గం) వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తాడు. ఇది అతనికి మాయాశీల ఫాస్ట్ బౌలర్గా పేరు తెచ్చింది.[1][2] అతడిని రివర్స్ స్వింగ్ స్పెషలిస్టుగా కూడా పిలుస్తారు.[3] అతడు ఒన్ డే ఇంటర్నేషనల్ లో జనవరి 2013న పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రవేశించాడు. ఆ చ్ లో నాలుగు మేడిన్ ఓవర్స్ చేసి రికార్డు సృష్టించాడు. నవంబరు 2013 న వెస్ట్ ఇండీస్ తోజరిగిన టెస్టు మ్యాచ్ లో ప్రవేశించి ఐదు వికెట్లను పడగొట్టాడు.
జీవిత విశేషాలు[మార్చు]
షమీ వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లోణి సాహస్‌పూర్ కి చెందినవాడు. [4] అతడి తండ్రి టోసిఫ్ ఆలీ సాధారణ రైతు. తండ్రి కూడా యుక్తవయసులో క్రికెట్ లో ఫాస్టు బౌలర్ గా ఆడేవాడు. షమీకి ఒక సోదరి, ముగ్గురు సోదరులు. సోదరులు కూడా ఫాస్టు బౌలర్స్ కావాలని కోరుకుంటున్నారు.[5] 2005లో అతడి తంద్రి షమీలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిని తన గ్రామానికి 22 కి.మీ దూరంలో ఉన్న మొరాదాబాదులోని క్రికెట్ కోచ్ బద్రుద్దీన్ సిద్దిక్ వద్దకు తీసుకుపోయాడు.
"నేను 15 యేండ్ల బాలునిగా నెట్స్ వద్ద భౌలింగ్ ను చూసినపుడు నేను ఈ బాలుడు సామాన్యమైన వాడు కాదని అనుకున్నాను. అందువల్ల ఈ బాలునికి శిక్షణ ఇవ్వాలనుకున్నాను. ఒక సంవత్సరంలో మాకు క్లబ్ క్రికెట్ ఇక్కడ లేనందువల్ల అతడిని యు.పి. ట్రైల్స్ కు తయారుచేసాను. అతడు బాగా సహకరించేవాడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం కలిగి ఉండేవాడు. అతడు శిక్షణలో ఒక్కరోజు కూడా గైర్హాజరు కాలేదు. అండర్ 19 ట్రయల్స్ లో అతడు బాగా బౌలింగ్ చేసాడు, కానీ రాజకీయ కారణాల వల్ల సెలక్షన్ కాబడలేదు. వారు అతడిని తరువాత సంవత్సరం తీసుకురమ్మని చెప్పారు, కానీ ఆ సమయంలో నేను ఒక సంవత్సరం మిస్ చేయకూడదని కోరుకున్నాను. అందువల్ల నేను అతడి తల్లిదండ్రులకు కోల్‌కతా పంపించమని సలహా ఇచ్చాను."
— బద్రుద్దిన్ సిద్దిక్ (మొహమ్మద్ షమీ గురించి)
షమీ అండర్ 19 విభాగంలో ఉత్తర ప్రదేశ్ జట్టులో స్థానం పొందలేనందున బద్రుద్దీన్ అతడిని 2005లో కోల్‌కతాకు పంపాడు. షమీ డల్హౌసీ అథ్లెటిక్ క్లబ్ కు ఆడేవాడు. ఆ క్లబ్ కొరకు ఆడుతున్నప్పుడు బెంగా క్రికెట్ అసోసియేషన్‌కు మాజీ అసిస్టెంట్ సెక్రటరీ అయిన "దెబబ్రాటదాస్" చే గుర్తింపబడ్డాడు. అతడు షమీ బౌలింగ్ కు ఆకర్షితుడై అతడి టీం (టౌన్ క్లబ్) లో ఆడవలసినదిగా కోరాడు. దీనికి రూ. 75,000 కాంట్రాక్ట్ గా కూడా మాట్లాడుకున్నారు. దాస్ కలకత్తాలో నివాస స్థానం లేని షమీని తన ఇంటికి తీసుకు పోయాడు.[6] షమీ టౌన్ క్లబ్ తరౌన బాగా బౌలింగ్ చేసి అండర్ 22 బెంగాల్ జట్టులో స్థానం సంపాదించాడు. దాస్ క్రికెట్ జట్టు ఎంపికదరులలో ఒకరైన సమర్బన్ బెనర్జీ వద్దకు షమీని తీసుకొని పోయి షమీ బౌలింగ్ పరిశీలించవలసినదిగా కోరాడు. బెనర్జీని అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. అతడు బెంగాల్ అండర్ 22 జట్టులో స్థానం కల్పించాడు.
"షమీ ఎప్పుడూ డబ్బును కోరుకోలేదు. అతడి లక్ష్యం స్టంపులు, స్టంపుకు బంతి తగిలినప్పుడు దాని నుండి వచ్చిన శబ్దం. నేను అతనిని చూసినప్పటి నుండి, అతని వికెట్లలో ఎక్కువగా బౌల్డ్ చేయబడినవి. అతను ఒక నిటారుగా ఉండి, స్టంపుపై లేదా ఆఫ్ స్టంపుకు కొద్దిగా వెలుపలకు, వెనుకకు కట్ అయ్యే విధంగా బౌల్ చేస్తాడు."[6]
— మొహమ్మద్ షమీ గురించి దేబాబ్రత దాస్
బెంగాల్ జట్టులో స్థానం పొందిన తరువాత దాస్ బెంగాల్ లో పెద్దక్లబ్ అయిన మోహన్ బగన్ క్లబ్ కు షమీని పంపాడు ఆ క్లబ్ లో చేరిన తరువాత ఈడెన్ గార్డెన్ నెట్స్ వద్ద సౌరవ్ గంగూలీకు బౌలింగ్ చెసేవాడు. గంగూలీ షమీ బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సెలక్టర్లను కోరాడు. తరువాత 2010లో బెంగాల్ రంజీ స్క్వాడ్ లో స్థానంపొందాడు.
దేశీయ జీవితం[మార్చు]
షమీ మొట్టామొదటి సారిగా 2010లో ఆస్సాంతో ఫస్టు క్లాసు క్రికెట్ ను ప్రారంభించాడు. అందులో మూడు వికెట్లను తీసుకున్నాడు. దేశీయ క్రికెట్ లో అతని ప్రదర్శన కారణంగా 2012 లో వెస్ట్ ఇండీస్-బౌండ్ ఇండియా (ఎ) స్క్వాడ్ లో స్థానం పొందాడు. ఆ ఆటలో మ్యాచ్ గెలుపు కోసం 10వ వికెట్ వద్ద 73 పరుగుల భాగస్వామ్యాన్ని చేసాడు. 2012-12 లో రంజీ ట్రోఫీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాదు జట్టుకు ప్రత్యర్థిగా ఆడాడు. అందులో 4/36, 6/71 వికెట్లు తీసుకొని 6 బంతులకు 15* పరుగులను చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్[మార్చు]
షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో "కోల్‌కతా నైట్ రైడర్స్" 2011 సీజన్ కు ఒప్పందం చేసుకున్నాడు. దీనికి కోచ్ గా వసీం అక్రం వ్యవహరించేవాడు. ఈ సీజన్ లో షమీ కొన్ని మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అతను తరువాతి రెండు సీజన్లలో ఫ్రాంచైజ్ చేత కొనసాగించబడ్డాడు, 2012 లో టైటిల్ గెలుచుకున్న జట్టులో ఒక భాగమయ్యాడు.
2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని 4.25 కోట్లకు కొనుగోలు చేసింది. అందులో అతడు కొన్ని మ్యాచ్ లు ఆడాడు. అయితే అతని బృందం మంచి సీజన్ఉం లో లేనందువల్ల అతడిని ఐపిఎల్ యొక్క 2015 ఎడిషన్లో ఫ్రాంచైస్ ఉంచాడు. అతను మంచి పేస్ బౌలింగ్ చేసాడు. అతడు 140 కిమీ / గం వేగం కంటే ఎక్కువగా బౌలింగ్ చేసాడు. అతడి వేగవంతమైన బంతి వేగం 147.9 km/h.
జనవరి 2018 లో ఐపిల్ 2018 అతడిని కొనుగోలుచేసింది.[7]
అంతర్జాతీయ జీవితం[మార్చు]
ODI జీవితం[మార్చు]
షమీ బెంగాల్ జట్టు సహ సభ్యుదు అశోక్ దిండా స్థానంలో పాకిస్థాన్ తో జరిగిన ఒన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ కు ఎంపిక కాబడ్డాడు. [8] తరువాత 2013 జనవరి 5 న మూడవ ఒ.డి.ఐలో ప్రవేశించాడు. అతను 9 ఓవర్లలో 1/23 స్కోరును చేసి తక్కువ స్కోరు ఆటలో ఓడించి భారతదేశం 10 పరుగుల తేడాతో విజయం సాధించేటట్లు చేసాడు. [9]
అక్టోబరు 2013 లో ఆస్ట్రేలియా పర్యటన కోసం అతడు ఎంపికయ్యాడు. మొదటి 3 మ్యాచ్లకు ఆడకపోయినప్పటికీ, అతను నాల్గో మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు.
2014 లో న్యూజిలాండ్లో జరిగిన భారత పర్యటనలో, షామీ 28.72 సగటుతో 11 వికెట్లు తీసుకున్నాడు.
2014 మార్చి 5 న, ఆసియా కప్ కొరకు ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మ్యాచ్లో షామీ 50 వన్డేల వికెట్లు సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచాడు. అతను టోర్నమెంట్ను 9 వికెట్లు 23.59 వద్ద ముగించాడు.
ఇంగ్లండ్ తో 3-1 తేడాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన తరువాత భారతదేశం 3-1 తేడాతో ODI సిరీస్ను గెలుచుకుంది, దీనిలో 24.16 సగటుతో 8 వికెట్లు తీసుకున్నాడు.
5వ ODI లో ఓటమి అంచున ఉన్న స్పెల్ లో మంచి లైన్ అండ్ లెంగ్త్ , మిడిల్ స్టప్ యార్కర్స్ తో బౌలింగ్ చేసాడు క్రికెట్ పండుతులు అతడిని "ఇండియా బౌలింగ్ ప్యూచర్" అనిపిలుస్తారు.[10]
2014 అక్టోబరులో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో షామీ 10 వికెట్లు 17.40 సగటుతో సాధించాడు. [11]
సిరీస్లో రెండో వన్డేలో అతను తన వన్డేల్లో అత్యదిక స్థానాన్ని పొందాడు. అతను 9.3 ఓవర్లలో 36 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
9 మార్చి 2018 న షమీ, అతని కుటుంబ సభ్యులపై అతని భార్య హసీన్ జహాన్ గృహ హింస, అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసింది. [12][13][14][15] హత్యాయత్నం, మాన భంగం ఆరోపణలను కూడా హసీన్ జత చేసింది. [16][17] షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని కూడా హసీన్ ఆరోపించింది.
ఈ ఆరోపణల దృష్ట్యా BCCI షమీ పేరును తమ ఒప్పందాల చిట్టా నుండి తొలగించింది. [18] 2018 మార్చి 22 న, BCCI యొక్క అవినీతి నిరోధక విభాగం షమీ నిర్దోషి అని తేల్చాక, తిరిగి అతను ఒప్పందాల చిట్టాలో చేరాడు. [19][20]
11 ఏప్రిలల్ 2018న హసీన్ జహాన్ తన/తమ కూతురి ఖర్చులకు గాను షమీ వద్ద నుండి నెలకు 15 లక్షల చొప్పున భరణం కోరింది [21] [22].
జీవితంలో మైలు రాళ్ళు[మార్చు]
ఐదు వికెట్లు తీసుకొన్న మ్యాచ్ లు[మార్చు]
# | సంఖ్యలు | మ్యాచ్ | ప్రత్యర్థి | క్రికెట్ మైదానం | క్రికెట్ మైదానం | దేశం | సంవత్సరం |
---|---|---|---|---|---|---|---|
1 | 5/47 | 1 | ![]() |
ఈడెన్ గార్డెన్స్ | కోల్‌కతా | భారతదేశం | 2013 |
2 | 5/112 | 12 | ![]() |
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ | సిడ్నీ | ఆస్ట్రేలియా | 2015 |
3 | 5/28 | 30 | ![]() |
న్యూ వాండర్స్ స్టేడియం | జోహన్స్‌బర్గ్ | దక్షిణాఫ్రికా | 2018 |
అంతర్జాతీయ పురస్కారాలు[మార్చు]
ఒన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్[మార్చు]
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు[మార్చు]
క్ర.సం. | ప్రత్యర్థి జట్టు | క్రికెట్ మైదానం | తేదీ | మ్యాచ్ ప్రదర్శన | ఫలితం |
---|---|---|---|---|---|
1 | వెస్ట్ ఇండీస్ | ఫిరోజ్ షా కోట్లా మైదానం, ఢిల్లీ | 2014 అక్టోబరు 11 | DNB ; 9.3-0-36-4 | ![]() |
2 | వెస్ట్ ఇండీస్ | WACA మైదానం, పెర్త్ | 2015 మార్చి 6 | 8-0-35-3 ; DNB | ![]() |
మూలాలు[మార్చు]
- ↑ His deceptive pace earns praise
- ↑ Mohammad Shami Profile Cricbuzz
- ↑ "The rise and rise of Mohammad Shami, in his own words". NDTV. Retrieved 15 February 2015.[permanent dead link]
- ↑ http://timesofindia.indiatimes.com/sports/india-in-zimbabwe/top-stories/Power-play-Even-cuts-cant-deny-Shamis-Sahaspur-village/articleshow/46618117.cms
- ↑ Laha, Somshuvra. "Farmer's son Mohammad Shami swings it for team India". Hindustan Times. Archived from the original on 17 ఫిబ్రవరి 2015. Retrieved 15 February 2015.
- ↑ 6.0 6.1 "Shami's rise from small-time club to country". ESPNcricinfo. Retrieved 15 February 2015.
- ↑ "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
- ↑ "Shami Ahmed debuts, Ajinkya Rahane replaces Virender Sehwag as India bat first in the third ODI against Pakistan". Wisden India. Retrieved 6 January 2013.[permanent dead link]
- ↑ "India saved the blushes in wintry Delhi".
- ↑ "Shami offers Dhoni hope for future". Retrieved 5 September 2014.
- ↑ "Most Wickets – West Indies tour of India 2014". ESPNcricinfo. ESPN Sports Media. Retrieved 18 October 2014.
- ↑ "FIR against cricketer Mohammed Shami for domestic violence - Times of India". The Times of India. Retrieved 2018-03-09.
- ↑ NDTVSports.com. "Mohammed Shami Charged With Attempt To Murder After Complaint By Wife Hasin Jahan – NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2018-03-09.
- ↑ "Cricketer charged with domestic violence". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-03-09. Retrieved 2018-03-09.
- ↑ "Mohammad Shami: Contract on hold after adultery and domestic violence claims". BBC Sport. 8 March 2018. Retrieved 11 March 2018.
- ↑ NDTVSports.com. "Mohammed Shami's Wife Hasin Jahan Remains Defiant, Questions Facebook's Decision Of Blocking Her Account – NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2018-03-09.
- ↑ "Adultery, domestic abuse claims against me a conspiracy, says Mohammed Shami". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-09. Retrieved 2018-03-09.
- ↑ "Shami's BCCI contract withheld amid allegations of domestic trouble". ESPN Cricinfo. 7 March 2018. Retrieved 9 March 2018.
- ↑ "Mohammed Shami cleared of match fixing charges by BCCI, can play IPL". The Indian Express. Retrieved 22 March 2018.
- ↑ "Shami offered Grade B contract as corruption investigation ends". Cricbuzz. Retrieved 22 March 2018.
- ↑ షమీ నుండి నెలకు పదిహేను లక్షల భరణం కావాలని కోరిన హసీన్ (డెక్కన్ క్రానికల్ - 11 ఏప్రిల్ 2018)
- ↑ జాదవ్ పూర్ అపార్టుమెంటు నుండి గెంటివేయబడకుండా, తమ అమ్మాయిని తన నుండి దూరం చేయకుండా ఉండేందుకు రక్షణ కోరిన హసీన్ (టైమ్స్ ఆఫి ఇండియా - 11 ఏప్రిల్ 2018))
- ↑ "India v West Indies at Delhi, Oct 11, 2014".
- ↑ "India vs West Indies, CWC, 2015". India Today. March 6, 2015. Retrieved March 6, 2015.
- All articles with dead external links
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- 1990 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- భారతీయ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ ముస్లింలు
- Bengal cricketers
- East Zone cricketers
- Kolkata Knight Riders cricketers
- India Twenty20 International cricketers
- India One Day International cricketers
- India Test cricketers
- Cricketers who have taken five wickets on Test debut
- Cricketers at the 2015 Cricket World Cup