లోకేష్ రాహుల్
![]() | ||||
250px | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | కన్నౌర్ లోకేష్ రాహుల్ | |||
జననం | 1992 ఏప్రిల్ 18 | |||
బ్యాటింగ్ శైలి | Right-handed | |||
పాత్ర | Batsman; Wicket-Keeper | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | India | |||
టెస్టు అరంగ్రేటం(cap 284) | 26 డిసెంబర్ 2014 v ఆస్ట్రేలియా | |||
చివరి టెస్టు | 6 జనవరి 2015 v ఆస్ట్రేలియా | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
2010–ప్రస్తుతం | Karnataka | |||
2013 | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | |||
2014–ప్రస్తుతం | సన్ రైజర్స్ హైదరాబాద్ (squad no. 11) | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | Test | FC | LA | T20 |
మ్యాచ్‌లు | 2 | 27 | 28 | 30 |
సాధించిన పరుగులు | 130 | 2,100 | 1,067 | 511 |
బ్యాటింగ్ సగటు | 32.50 | 55.08 | 41.03 | 23.22 |
100s/50s | 1/0 | 8/9 | 2/8 | 0/3 |
ఉత్తమ స్కోరు | 110 | 337 | 110 | 62 |
బాల్స్ వేసినవి | - | - | - | - |
వికెట్లు | - | - | - | - |
బౌలింగ్ సగటు | - | - | - | - |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | - | - | - | - |
మ్యాచ్ లో 10 వికెట్లు | - | - | - | - |
ఉత్తమ బౌలింగ్ | - | - | - | - |
క్యాచులు/స్టంపింగులు | 1/– | 27/0 | 17/1 | 13/0 |
Source: Cricinfo, 11 November 2014 |
కె.ఎల్.రాహుల్ (జ: 18 April 1992, మంగళూరు) కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ఎక్కువగా బ్యాటింగ్, అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ చేస్తాడు. రాహుల్ 19-సంవత్సరాల చిన్నవారి 2010 క్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం తరపున పాల్గొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2013 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ తరపున ఆడాడు. ఆ తర్వాత 2014 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున పాల్గొన్నాడు.
కెరీర్[మార్చు]
జాతీయ పోటీలు[మార్చు]
రాహుల్ 2010-11 సీజన్ లో మొదటగా తన కెరీర్ ను ప్రారంభించాడు. కర్ణాటక రాష్ట్రానికి మొదటి-తరగతి క్రికెట్ ఆడాడు. ఆ సీజన్ లో మొట్టమొదటి త్రిబుల్ సెంచరీ సాధించిన మొదటి కర్ణాటక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెంగళూరులో జరిగిన ఆటలో, ఉత్తర ప్రదేశ్ మీద 337 రన్లు సాధించాడు. అందులొ 47 బౌండ్రీలు, 4 సిక్సర్లు ఉన్నాయి. మొదటగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ తరపున ఆడినాడు, 2014 నుండి సన్ రైజర్స్, హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు.[1]
అంతర్జాతీయ పోటీలు[మార్చు]
కర్ణాటక రాష్టానికి ఆడి చూపిన నైపుణ్యం ఆధారంగా రాహుల్ ను ఆస్ట్రేలియా తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2014) కోసం ఎంపిక చేశారు. అయితే అతడు అంతగా రాణించలేకపోయాడు.
జనవరి 8, 2015 తేదీన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద సెంచరీ సాధించాడు.
అంతర్జాతీయ సెంచరీలు[మార్చు]
టెస్ట్ సెంచరీలు[మార్చు]
లోకేష్ సాధించిన టెస్ట్ సెంచరీలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
No. | Runs | Match | Against | Venue | H/A/N | Year | Result | Ref. |
1 | 110 | 2 | ఆస్ట్రేలియా | సిడ్నీ క్రికెట్ మైదానం, సిడ్నీ | Away | 2015 | ఫలితం లేదు | [2] |
2 | 108 | 4 | శ్రీలంక | పి శర మైదానం, కొలంబో | Away | 2015 | గెలుపు | [3] |
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- Lokesh Rahul - Cricinfo Profile
- Lokesh Rahul's profile page on Wisden