Jump to content

ప్రవీణ్ కుమార్

వికీపీడియా నుండి
ప్రవీణ్ కుమార్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1986-10-02) 1986 అక్టోబరు 2 (వయసు 38)
షామ్లి జిల్లా, ఉత్తర ప్రదేశ్
మారుపేరుPK
ఎత్తు1.80 మీ. (5 అ. 11 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 270)2011 జూన్ 20 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2011 ఆగస్టు 13 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 170)2007 నవంబరు 18 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2012 మార్చి 18 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.8
తొలి T20I (క్యాప్ 20)2008 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2012 మార్చి 30 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.8
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005–2018ఉత్తర ప్రదేశ్
2008–2010రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 8)
2011–2013కింగ్స్ XI పంజాబ్ (స్క్వాడ్ నం. 8)
2014ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 88)
2015సన్ రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 19)
2016–2017గుజరాత్ లయన్స్ (స్క్వాడ్ నం. 17)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 6 68 66 139
చేసిన పరుగులు 149 292 2,110 1,481
బ్యాటింగు సగటు 14.90 13.90 22.44 20.28
100లు/50లు 0/0 0/1 0/11 0/6
అత్యుత్తమ స్కోరు 40 54* 98 64
వేసిన బంతులు 1,611 3,242 14,158 6,730
వికెట్లు 27 77 267 185
బౌలింగు సగటు 25.81 36.02 23.61 28.84
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 17 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 5/106 4/31 8/68 5/32
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 11/– 12/– 21/–
మూలం: ESPNcricinfo, 2018 అక్టోబరు 20

ప్రవీణ్ కుమార్ (జననం 1986 అక్టోబరు 2) మాజీ భారతీయ క్రికెటరు, కుడిచేతి మీడియం-పేస్ బౌలరు. [1] ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. అతనికి లైన్, లెంగ్త్‌తో పాటు రెండు విధాలుగా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. [2] 2018 అక్టోబరులో, అతను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. [3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కుమార్ 1986 అక్టోబరు 2 న షామ్లీ జిల్లాలోని లప్రానా గ్రామంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సకత్ సింగ్ ఖైవాల్, మూర్తి దేవి ఖైవాల్ దంపతులకు జన్మించాడు. [4] 2010 లో జాతీయ స్థాయి షూటింగ్ క్రీడా క్రీడాకారిణి అయిన సప్నా చౌదరిని పెళ్ళి చేసుకున్నాడు. [5]

బర్నావా గ్రామంలో అతనికి ఒక ఫామ్‌హౌస్ ఉంది. మీరట్‌లో NH-58, రోహ్తా రోడ్ క్రాసింగ్‌ వద్ద ప్రవీణ్ రెస్టారెంట్, పెళ్ళి వేదిక ఉన్నాయి.[6]

ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

కుమార్ ఒత్తిడి-సంబంధిత అనారోగ్యాలతో పోరాటం చేసాడు. క్రిక్‌ఇన్‌ఫో ప్రకారం, ఒకసారి కుమార్ తుపాకీ కొనుక్కుని దుకాణం నుండీ బయటికి రాగానే, దారిన పోయే ఒక డాక్టరు కారు వలన ప్రవీణ్ బట్టలపై బురద చిందింది. దాంతో అతను ఆ డాక్టరును కొట్టాడు. కొట్టింది ఒక గాజుసామాను దుకాణంలో అవడంతో కొన్ని గాజు సామాన్లు పగిలిపోయాయి.[7]

ఒత్తిడికి గురై ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసాడు. ఆ తరువాత కోలుకున్నాడు.[8]

క్రికెట్‌లో ప్రాభవం

[మార్చు]

అతను 2004-05 విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు. ప్రవీణ్ కుమార్ తొలిసారిగా 2007లో NKP సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ ఇండియా రెడ్ తరపున ఆడి వెలుగులోకి వచ్చాడు.

భారత్ తరఫున వన్డే ప్రవేశం

[మార్చు]

అతను 2007 నవంబరులో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుపై భారత జాతీయ క్రికెట్ జట్టు కోసం తన వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

తర్వాత 2008లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు, శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుతో ట్రై-నేషన్ కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నమెంటులో భారత విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. తను సాధించిన స్వింగుకూ, రికీ పాంటింగ్‌తో చేసిన పోరాటాలకూ ప్రసిద్ధి చెందాడు.

అతను 2008 నుండి 2010 వరకు వన్‌డేలలో భారతదేశానికి ప్రీమియర్ ఓపెనింగ్ బౌలర్‌గా స్థిరపడ్డాడు. ICC క్రికెట్ ప్రపంచ కప్ 2011 కి ప్రవీణ్ ఎంపికయ్యాడు గానీ గాయం వలన అతను తప్పుకోగా, అతని స్థానంలో శ్రీశాంత్ వచ్చాడు.

భారత్ తరఫున టెస్టు ప్రవేశం

[మార్చు]

2011 జూన్లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై ప్రవీణ్‌ తొలి టెస్టు ఆడాడు. 2011లో ఇంగ్లండ్‌లో జరిగిన భారత తొలి టెస్టు మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీశాడు.

ఐపీఎల్ కెరీర్

[మార్చు]

ప్రవీణ్ కుమార్ మొదట 2010 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు.

RCBలో ఉన్నప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 6వ బౌలర్‌గా నిలిచాడు. అతను 2010లో బెంగుళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై ఇది సాధించాడు.[9]

2008లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB తరపున ఆడుతూ ఐపిఎల్ చరిత్రలో అతిపెద్ద సిక్సర్‌ని కొట్టాడు. [10] యూసుఫ్ పఠాన్ బౌలింగులో కొట్టిన షాట్‌లో ఆ బంతి రికార్డు స్థాయిలో 124 మీటర్ల దూరంలో పడింది. అదే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటరు అల్బీ మోర్కెల్ కూడా సరిగ్గా అంతే దూరం కొట్టాడు. ప్రవీణ్ ఆ రికార్డును సమం చేసాడు.[11]

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున 2011 నుండి 2013 వరకు ఆడాడు. 2014 ఐపిఎల్ వేలంలో అతని బేస్ ధర ఎక్కువగా ఉన్నందున అతడు అమ్ముడుపోలేదు. [2]

ఐపిఎల్ 2014 వేలంలో అమ్ముడుపోని తర్వాత, ముంబై ఇండియన్స్ గాయపడిన జహీర్ ఖాన్ స్థానంలో అతన్ని తీసుకుంది. ఆరు గేమ్‌లు ఆడిన జహీర్, అతని ఎడమ లాటిస్సిమస్ డోర్సీ కండరానికి ఇబ్బంది కలిగించిన కారణంగా ఐపిఎల్ 2014 సీజన్‌లో మిగిలిన ఆటలు ఆడలేదు.[12]

ఐపిఎల్ 2015 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2.20 కోట్లతో అతన్ని తీసుకుంది. [13]

ఆ తర్వాత 2016, 2017 లలో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. అతను ఐపీఎల్‌లో ఆడడం ఇదే చివరిసారి.

మూలాలు

[మార్చు]
  1. "Praveen Kumar a Jat Boy in Indian Cricket Team". Archived from the original on 2 July 2012. Retrieved 2012-11-30.
  2. 2.0 2.1 "Praveen Kumar". Cricinfo. Retrieved 29 July 2018.
  3. "Former India seamer Praveen Kumar retires". ESPN Cricinfo. Retrieved 20 October 2018.
  4. "In PK country". Thecricketmonthly.com. Retrieved 29 July 2018.
  5. "Praveen Kumar's marriage ceremony". Photogallery.indiatimes.com. Retrieved 29 July 2018.
  6. "People of Meerut were always considered moody, says Praveen". The Times of India. Retrieved 29 July 2018.
  7. "Men Behaving Badly". Cricinfo. Retrieved 8 July 2022.
  8. "Cricketer Praveen Kumar starts new innings as SP politician". Retrieved 29 July 2018.
  9. "Dominant Bangalore crush Rajasthan". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-03-01.
  10. "Full Scorecard of RCB vs Royals 12th match 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-03-01.
  11. "The 10 biggest sixes in IPL history". T20 Head to Head (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-02-17. Retrieved 2021-03-01.
  12. "Mumbai Indians sign Praveen Kumar". Espncricinfo.com. Retrieved 29 July 2018.
  13. "List of players sold and unsold in IPL 2015 auction". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-03-01.