లక్ష్మీ విలాస్ ప్యాలెస్, వడోదర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీ విలాస్ ప్యాలెస్
లక్ష్మీ విలాస్ ప్యాలెస్, వడోదర
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిIndo-Saracenic Revival architecture
పట్టణం లేదా నగరంవడోదర
దేశంభారతదేశం
పూర్తి చేయబడినది1890
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిRobert Chisholm

గుజరాత్ లోని వడోదర నగరంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ మరాఠా గైక్వాడ్ వంశస్థులు నిర్మించిన రాజ భవనం. వీళ్ళు బరోడా సంస్థానానికి పరిపాలకులు. మేజర్ చార్లెస్ మాంట్ దీనికి ముఖ్య శిల్పిగా చెబుతారు.[1]

నిర్మాణం[మార్చు]

ఈ భవనం భారతీయ నిర్మాణశైలితో సహా వివిధ రకాలైన శైలిలో నిర్మించబడింది. దీన్ని సా.శ 1890 సంవత్సరంలో శాయాజీరావ్ గైక్వాడ్ - III సుమారు లక్షా ఎనభైవేల పౌండ్ల ఖర్చుతో (అప్పటి విలువ ప్రకారం 27 లక్షల రూపాయలు) నిర్మించాడు. దర్బారు హాలు వైశాల్యం 5000 చదరపు అడుగులు.[2] ఈ రాజభవన ప్రాంతం మొత్తం 500 ఎకరాలు. ఇందులో ప్రధాన భవనంతో బాటు ఫంక్షన్ హాలు, మోతీ భాగ్ ప్యాలెస్, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం లాంటి ఇతర భవనాలు కూడా ఉన్నాయి.

ప్రత్యేకతలు[మార్చు]

ఇది నిర్మించినప్పుడు అత్యంత పెద్దదైన ప్రైవేటు నివాసంగా పేరుగాంచింది. ఇది లండన్ లో ఉన్న బకింగ్‌హామ్ ప్యాలెస్ కన్నా నాలుగు రెట్లు పెద్దది. అప్పట్లోనే అధునాతనమైన సౌకర్యాలైన ఎలివేటర్లు, భవనం లోపల యూరోపియన్ శైలితో కూడిన అలంకరణలు లాంటివి కలిగి ఉంది. ఈ భవనంలో ఇప్పటికీ బరోడా రాజ వంశీయులు నివసిస్తున్నారు.

1930 వ దశకంలో అప్పటి మహారాజు ప్రతాప్ సింగ్ యూరోపియన్ అతిథుల కోసం భవన ప్రాంగణం ఎదురుగా గోల్ఫ్ కోర్స్ నిర్మించాడు. 1990 వ దశకంలో ప్రతాప్ సింగ్ మనవడు, మాజీ రంజీ క్రికెటర్ అయిన సమర్ జిత్ సింగ్ ఈ గోల్ఫ్ కోర్సును పునరుద్ధరించి సాధారణ ప్రజలకు కూడా అందుబాటు లోకి తెచ్చాడు.[3]

చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Laxmi Vilas Palace". Vadodara: Udaipur Kiran. 23 December 2021. Retrieved 26 April 2022.
  2. HoVB (2009-09-09). "Lukshmi Vilas Palace". History of Vadodara - Baroda (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  3. "Lukshmi Vilas Palace - Baroda". Gujarat Tourism. Archived from the original on 2017-07-30. Retrieved 2023-08-30.