క్వింటన్ డికాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్వింటన్ డికాక్ (Quinton de Kock)
Quintondecock.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు క్వింటన్ డికాక్
జననం (1992-12-17) 1992 డిసెంబరు 17 (వయసు 30)
జొహాన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
బ్యాటింగ్ శైలి Left-handed
పాత్ర ఉన్నత శ్రేణి బ్యాట్స్మన్, వికెట్ కీపర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు దక్షిణాఫ్రికా
టెస్టు అరంగ్రేటం(cap 317) 20 February 2014 v ఆస్ట్రేలియా
చివరి టెస్టు 17-20 December 2014 v వెస్ట్ ఇండీస్
వన్డే లలో ప్రవేశం(cap 105) 19 January 2013 v న్యూజిలాండ్
చివరి వన్డే 23 November 2014 v ఆస్ట్రేలియా
ఒ.డి.ఐ. షర్టు నెం. 12
టి20ఐ లో ప్రవేశం(cap 54) 21 December 2012 v న్యూజిలాండ్
చివరి టి20ఐ 19 November 2014 v ఆస్ట్రేలియా
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2009– గౌటెంత్
2011– లయన్స్ (squad no. 12)
2013– సన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచులు 5 35 20 27
చేసిన పరుగులు 264 1482 457 1,954
బ్యాటింగ్ సరాసరి 37.71 43.58 28.56 46.52
100s/50s 0/1 6/4 0/0 4/8
అత్యధిక స్కోరు 81 135 48* 194
క్యాచులు/స్టంపులు 19/1 57/2 18/6 72/5
Source: CricketArchive, 4 January 2015

క్వింటన్ డికాక్ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు. 2013 లో ఇతడు మనదేశ క్రికెట్ జట్టు పై వరుసగా మూడు శతకాలు సాధించి ఒకే సిరీస్ లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ పోటీలలో ఇతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నేపధ్యము[మార్చు]

దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ చదివిన కింగ్ ఎడ్వర్డ్ హైస్కూల్‌లోనే చదివిన డి కాక్ అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు. అదే సమయంలో క్లబ్ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో పాటు దూకుడైన మనస్తత్వం అతడికి జాతీయ అండర్-19 జట్టు కెప్టెన్‌గా కూడా అవకాశం కల్పించింది. సీఎల్‌టి20 ప్రదర్శన, ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో నిలకడతో పాటు డివిలియర్స్ విశ్రాంతి కోరడంతో ఇతడికి దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వికెట్ కీపర్‌గా రాణించడం, చిన్న వయసు కూడా కావడంతో వరుసగా అతడిని కొనసాగించారు.

ఈ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఎట్టకేలకు తాను ఆడిన తొమ్మిదో వన్డేలో (పాక్‌పై) శతకంతో పోటీలో ఉన్న కీపర్లను వెనక్కి తోసి కాక్ నిలదొక్కుకున్నాడు. ఇక భారత్‌తో సిరీస్‌లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల అనుభవం తర్వాతే దిగ్గజాలకు సాధ్యమైన వరుస సెంచరీల రికార్డును చిన్న వయసులోనే అందుకున్నాడు.

శతకాలు[మార్చు]

వన్డే శతకాలు[మార్చు]

క్వింటన్ డికాక్ వన్డే శతకాలు
# పరుగులు బంతులు 4s 6s ప్రత్యర్థి జట్టు వేదిక తేదీ ఫలితము
1 112 135 9 1  పాకిస్తాన్ షేక్ జాయద్ క్రికెట్ మైదానము, అబుదాబి, UAE 02013-11-08 8 నవంబరు 2013 28 పరుగులతో గెలుపు[1]
2 135 121 18 3  భారతదేశం వాండరర్స్, జొహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా 02013-12-05 5 డిసెంబరు 2013 141 పరుగులతో గెలుపు[2]
3 106 118 9 0  భారతదేశం కింగ్స్ మీడ్, డర్బన్, దక్షిణాఫ్రికా 02013-12-08 8 డిసెంబరు 2013 134 పరుగులతో గెలుపు[3]
4 101 120 9 2  భారతదేశం సూపర్ స్పోర్ట్ పార్క్, సెంచురియన్, దక్షిణాఫ్రికా 02013-12-11 11 డిసెంబరు 2013 వర్షం వలన ఫలితం తేలలేదు.[4]

ట్వంటీ20 శతకాలు[మార్చు]

క్వింటన్ డికాక్ ట్వంటీ20 శతకాలు
# పరుగులు బంతులు 4s 6s జట్టు ప్రత్యర్థి జట్టు వేదిక తేదీ
1 126* 69 13 6 హైవెండ్ లయన్స్ కేప్ కోబ్రాస్ పోచెఫ్‌స్టోర్మ్ 02013-02-17 17 ఫిబ్రవరి 2013[5]
2 109* 63 10 5 హైవెండ్ లయన్స్ ఒట్టాగో ఓల్ట్స్ జైపూర్ 02013-09-29 29 సెప్టెంబరు 2013[6]

మూలాలు[మార్చు]

  1. "De Kock's maiden ODI ton, RSA v PAK Scorecard". Cricinfo.
  2. "De Kock scores 2nd ODI ton to lead South Africa to victory against India". Cricinfo.
  3. "De Kock's successive ODI tons win South Africa the series 2-0 against India". Cricinfo.
  4. "IND vs RSA Scorecard". ESPN Cricinfo. 11 December 2013.
  5. "Scorecard Lions v Cobras". Cricinfo.
  6. "Scorecard Lions v Otago". Cricinfo.


బయటి లంకెలు[మార్చు]