ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2021
తేదీలుఏప్రిల్‌ 9, 2021 – మే 30,2021
నిర్వాహకులుబీసీసీఐ
క్రికెట్ రకంట్వంటీ20
ఆతిథ్యం ఇచ్చేవారు India
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఛాంపియన్లుచెన్నై సూపర్ కింగ్స్ (4వ టైటిల్th title)
పాల్గొన్నవారు8
ఆడిన మ్యాచ్‌లు60
మ్యాన్ ఆఫ్ ది సీరీస్భారతదేశం హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్) (59 పరుగులు & 32 వికెట్స్)
అత్యధిక పరుగులుభారతదేశం రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) (635)
అత్యధిక వికెట్లుభారతదేశం హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్) (32)
← 2020
2022

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2021 దేశవాలీ టీ-20 లీగ్ ఏప్రిల్‌ 9, 2021 నుంచి 2021 మే 30 వరకు జరుగనుంది. ఏప్రిల్ 9న చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో ప్రారంభ మ్యాచ్, మే 30న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (మొతేరా స్టేడియం) లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.[1] కొవిడ్ మహమ్మారి కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌-2021) సీజన్ ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా 2021 మే 4న ప్రకటించాడు.[2][3][4] ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) లో నిర్వహించాలని 2021 మే 29న జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) లో బీసీసీఐ నిర్ణయించింది.[5]

ఐపీఎల్ - 2021 లో పాల్గొన్న జట్లు & ఆటగాళ్లు

[మార్చు]

1.పంజాబ్‌ కింగ్స్ - కేఎల్​ రాహుల్​ (కెప్టెన్​&వికెట్​ కీపర్​), మయాంక్​ అగర్వాల్​, క్రిస్​ గేల్​, మన్​దీప్​ సింగ్​, ప్రభ్​సిమ్రాన్​ సింగ్​, నికోలస్​ పూరన్​ (వికెట్​ కీపర్​), సర్ఫ​రాజ్​ ఖాన్​, దీపక్​ హుడా, మురుగన్ అశ్విన్​, రవి బిష్ణోయ్​, హర్​ప్రీత్ బ్రార్, మహ్మద్​ షమీ, అర్షదీప్ సింగ్, ఇషాన్​ పోరెల్​, దర్శన్​ నల్కండే, క్రిస్​ జోర్డాన్​. మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. డేవిడ్​ మలన్​, జే రిచర్డ్​సన్​, షారుక్​ ఖాన్​, రిలే మెరిడిత్​, మొయిసెస్​ హెన్రిక్స్​, జలజ్​ సక్సేనా, ఉత్కర్ష్​ సింగ్​, ఫాబియన్​ అలెన్​, సౌరభ్​ కుమార్​.

2. రాజస్థాన్​ రాయల్స్ - సంజూ శాంసన్​ (కెప్టెన్​&వికెట్​ కీపర్​), జోస్ బట్లర్​ (వికెట్​ కీపర్​), బెన్​ స్టోక్స్​, యశస్వి జైస్వాల్, మనన్​ వోహ్ర, అనుజ్​ రావత్​, రియాన్​ పరాగ్​, డేవిడ్​ మిల్లర్, రాహుల్ తెవాతియా, మహిపాల్​ లామ్రర్​, శ్రేయస్​ గోపాల్, మయాంక్​ మార్కండే, జోఫ్రా ఆర్చర్​ (గాయం కారణంగా దూరమయ్యాడు), శివమ్ దూబే, ఆండ్రూ టై, జయ​దేవ్​ ఉనద్కత్​, కార్తీక్​ త్యాగి.

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. శివం దూబే, క్రిస్​ మోరిస్​, ముస్తాఫిజుర్​ రెహ్మాన్​, చేతన్​ సకారియా, కేసీ కరియప్ప, లియమ్​ లివింగ్​స్టోన్​, కుల్​దీప్​ యాదవ్​, ఆకాశ్​ సింగ్​.

3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ - విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవ్ద​త్ పడిక్కల్​, జోస్ ఫిలిప్​ (వికెట్ కీపర్​), ఏబీ డివిలియర్స్​ (వికెట్​ కీపర్​), పవన్​ దేశ్​పాండే, వాషింగ్టన్​ సుందర్​, డానియల్​ సామ్స్​, చాహల్​, ఆడమ్​ జంపా, షాబాద్​ అహ్మద్​, మహమ్మద్ సిరాజ్​, నవ్​దీప్ సైనీ, కేన్​ రిచర్డ్​సన్​, హర్షల్​ పటేల్​.

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. గ్లెన్​ మ్యాక్స్​వెల్​, సచిన్​ బేబి, రజత్ పాటిదార్, ​ మహ్మద్​ అజారుద్దీన్​, కైల్​ జేమిసన్​, డానియల్​ క్రిస్టియన్​, సుయాష్ ప్రభుదేశాయ్​, శ్రీకర్ భరత్‌​.

4. చెన్నై సూపర్ కింగ్స్ - ఎంఎస్ ధోనీ (కెప్టెన్​&వికెట్​ కీపర్​), రుతురాజ్ గైక్వాడ్‌​, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్​ జగదీశన్​ (వికెట్ కీపర్​), రాబిన్​ ఉతప్ప, రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్​, మిచెల్​ శాంట్నర్​, ఇమ్రాన్ తాహిర్​, దీపక్‌ చాహర్‌​, శార్దూల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, కేఎమ్ ఆసిఫ్​.

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. మొయిన్​ అలీ, కే గౌతమ్​, ఛెతేశ్వర్​ పుజారా, ఎమ్​ హరిశంకర్​ రెడ్డి, కే భగత్​ వర్మ, సీ హరి నిషాంత్​.

5. ముంబయి ఇండియన్స్ - రోహిత్​ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్​), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్​), సూర్యకుమార్ యాదవ్​, క్రిస్​ లిన్​, సౌరభ్ తివారీ, అన్​మోల్​ప్రీత్​ సింగ్, ఆదిత్య తారే (వికెట్ కీపర్​), కీరన్ పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, అనుకుల్​ రాయ్, జస్ప్రీత్​ బుమ్రా, ట్రెంట్​ బౌల్ట్​, ధవల్​ కులకర్ణి, మోహిసిన్ ఖాన్.

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. ఆడమ్​ మిల్నే, నాథన్​ కౌల్టర్​నైల్​, పీయూష్ చావ్లా, జేమ్స్ నీషమ్​, యుధ్​వీర్​ చరక్​, మాక్రో జాన్సెన్, అర్జున్​ తెందూల్కర్​.

6. ఢిల్లీ క్యాపిటల్స్ - రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్​​), ​శిఖర్​ ధావన్, పృథ్వీ షా, ఆజింక్యా రహానె, షిమ్రాన్ హెట్‌మైర్, మార్కస్​ స్టోయినిస్, క్రిస్ వోక్స్​, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, లలిత్​ యాదవ్, ప్రవీణ్ దూబే, కసిగో రబాడా, ఆన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, అవేష్​ ఖాన్​.

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. స్టీవ్​ స్మిత్​, ఉమేశ్​ యాదవ్​, రిపల్​ పటేల్​, విష్ణు వినోద్​, లుక్మాన్ మెరివాలా, ఎం సిద్ధార్థ్, టామ్ కర్రన్, సామ్ బిల్లింగ్స్​.

7. సన్​రైజర్స్​ హైదరాబాద్ - డేవిడ్​ వార్నర్ (కెప్టెన్), కేన్​ విలియమ్సన్, జానీ బెయిర్​ స్టో​ (వికెట్ కీపర్​), మనీశ్ పాండే, శ్రీవాస్తవ్​ గోస్వామి (వికెట్ కీపర్​), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్​), ప్రియమ్ గార్గ్​, విజయ్​ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్​ సమద్​, విరాట్​ సింగ్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్​ శర్మ, ఖలీల్ అహ్మద్​, సిద్ధార్ధ్​ కౌల్, బాసిల్ తంపి. ( 2021 మే 01న డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ను సన్​రైజర్స్​ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు మేనేజ్‌మెంట్‌ తెలిపింది.) [6]

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. ముజిబుర్ రెహ్మాన్, జగదీష్ సుచిత్​, కేదార్ జాదవ్

8. కోల్‌కతా నైట్‌రైడర్స్ - ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్) ​, శుభ్​మన్​​ గిల్​, నితీశ్​ రాణా, టిమ్​ సీఫర్ట్​, రాహుల్ త్రిపాఠి, రింకు సింగ్​, దినేశ్​ కార్తీక్​​ (వికెట్ కీపర్​), ఆండ్రూ రసెల్​, సనీల్​ నరైన్​, వరుణ్​ సి.వి., కుల్దీప్​ యాదవ్​, ప్యాట్​ కమిన్స్​, లూకీ ఫెర్గూసన్​, కమ్​లే​ష్​ నాగర్​కోటీ, శివమ్​ మావి, సందీప్​ వారియర్​, ప్రసిద్ధ్​ కృష్ణ.

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. హర్భజన్​ సింగ్​, బెన్​ కటింగ్​, షకిబుల్​ హసన్​, షెల్డన్​ జాక్సన్​, వైభవ్​ అరోరా, కరుణ్​ నాయర్​, వెంకటేశ్ అయ్యర్​, పవన్​ నేగి.

వేదికలు

[మార్చు]
 1. అహ్మదాబాద్‌ - నరేంద్ర మోడీ స్టేడియం
 2. బెంగళూరు - చిన్నస్వామి స్టేడియం
 3. చెన్నై - ఎం ఏ . చిదంబరం స్టేడియం
 4. ఢిల్లీ - అరుణ్‌జైట్లీ స్టేడియం ( ఫిరోజ్ షా కోట్ల స్టేడియం)
 5. ముంబయి - వాంఖడే స్టేడియం
 6. కోల్‌కతా - ఈడెన్ గార్డెన్ స్టేడియం

మ్యాచుల వివరాలు

[మార్చు]
 1. ఐపీఎల్ 14వ సీజ‌న్ ఏప్రిల్‌ 9, 2021 న ప్రారంభమైంది. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. ముంబై ఇండియ‌న్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవ‌ర్ల‌లో 159/9పరుగులు చేసింది. ముంబై ఇండియ‌న్స్ తరపున క్రిస్ లిన్ అత్యధికంగా 49 పరుగులు చేశాడు. ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ 27పరుగులకు 5వికెట్లు తీశాడు. 160 పరుగుల లక్ష్యంతో బాటింగ్ దిగిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 160/8పరుగులు చేసి 2 వికెట్ల‌తో గెలిచింది.[7]
 2. ఐపీఎల్ 2021లో భాగంగా (10 ఏప్రిల్‌ 2021 న) ముంబై - వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగుల చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 54బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సర్లతో 85 పరుగులు చేసిన శిఖర్ ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.[8][9]
 3. ఐపీఎల్ 2021లో భాగంగా (11 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫీల్డింగ్​ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులే చేయడంతో 10 పరుగుల తేడాతో కోల్‌కతా గెలుపొందింది.[10]
 4. ఐపీఎల్ 2021లో భాగంగా (12 ఏప్రిల్‌ 2021 న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 4వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌‌‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్ ‌20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ 7 వికెట్లకు 217 పరుగులే చేయడంతో 4 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది.[11]
 5. ఐపీఎల్ 2021లో భాగంగా (13 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన 5వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌‌‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన కోల్‌కతా బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయడంతో 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ గెలుపొందింది.[12]
 6. ఐపీఎల్ 2021లో భాగంగా (14 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన 6వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు‌‌‌‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేయడంతో 6 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు‌ గెలుపొందింది.[13]
 7. ఐపీఎల్ 2021లో భాగంగా (15 ఏప్రిల్‌ 2021 న) ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన 7వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ శాంసన్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ ‌ రాయల్స్ 19.4 ఓవర్లలో 7వికెట్లకు 150 పరుగులు చేసి మూడు వికెట్లతో మ్యాచ్ గెలిచింది.[14]
 8. ఐపీఎల్ 2021లో భాగంగా (16 ఏప్రిల్‌ 2021 న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 8వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్​ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు కేవ‌లం 106 ప‌రుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి ఆరు వికెట్లతో మ్యాచ్ గెలిచింది.[15]
 9. ఐపీఎల్ 2021లో భాగంగా (17 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్‌ మైదానంలో జరిగిన 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ‌మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ముంబై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.[16]
 10. ఐపీఎల్ 2021లో భాగంగా (18 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్‌ మైదానంలో జరిగిన 10వ మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు‌ ‌మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని, 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.[17][18]
 11. ఐపీఎల్ 2021లో భాగంగా (18 ఏప్రిల్‌ 2021 న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 11వమ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని, 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 18.2ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది.[19]
 12. ఐపీఎల్ 2021లో భాగంగా (19 ఏప్రిల్‌ 2021 న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ‌జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేయడంతో చెన్నై 45 పరుగుల తేడాతో గెలిచింది.[20]
 13. ఐపీఎల్ 2021లో భాగంగా (20 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన 13వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ‌జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ‌‌19.1 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది.[21]
 14. ఐపీఎల్ 2021లో భాగంగా (21 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన 14వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మధ్య జరిగింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన‌ పంజాబ్‌ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్‌ నిర్ధేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించి హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది.[22][23]
 15. ఐపీఎల్ 2021లో భాగంగా (21 ఏప్రిల్‌ 2021న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 15వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ‌జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి కోల్‌కతా కెప్టెన్‌‌ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌట్ కావడంతో18 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుపొందింది.[24]
 16. ఐపీఎల్ 2021లో భాగంగా (22 ఏప్రిల్‌ 2021న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 16వ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌ ‌జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ‌‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.3 ఓవర్లలో 181 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై గెలుపొందింది.మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దేవదత్‌ పడిక్కల్ (52 బంతుల్లో 101 పరుగులు) ‌.[25]
 17. ఐపీఎల్ 2021లో భాగంగా (23 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన 17వ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్‌ 17.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 132 పరగుల చేసి 9 వికెట్ల తేడాతో గెలిచింది.[26] మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కేఎల్‌ రాహుల్ (52 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు).‌‌‌
 18. ఐపీఎల్ 2021లో భాగంగా (24 ఏప్రిల్‌ 2021న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 18వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్ సంజు సామ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయం సాధించింది.[27]
 19. ఐపీఎల్ 2021లో భాగంగా (25 ఏప్రిల్‌ 2021 న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 19వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ‌20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులే చేయడంతో 69 పరుగుల తేడాతో చెన్నై జట్టు గెలుపొందింది. జడేజా (62 పరుగులు, 3 వికెట్స్) కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.[28]
 20. ఐపీఎల్ 2021లో భాగంగా (25 ఏప్రిల్‌ 2021 న) చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన 20వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌‌ ఎంచుకొని 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి స్కోర్ సమం చేయడంతో, మ్యాచ్ ‌ "టై" అయ్యి సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఒక ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పరుగులు ఒక ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.[29]
 21. ఐపీఎల్ 2021లో భాగంగా (26 ఏప్రిల్‌ 2021 న) అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 21వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 పరుగులు చేసి 5వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మోర్గాన్‌ (40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్‌) అందుకున్నాడు.[30]
 22. ఐపీఎల్ 2021లో భాగంగా (27 ఏప్రిల్‌ 2021 న) అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 22వ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయ్యింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఏబీ డివిలియర్స్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు).[31]
 23. ఐపీఎల్ 2021లో భాగంగా (28 ఏప్రిల్‌ 2021 న) ఢిల్లీ - అరుణ్‌జైట్లీ స్టేడియం ( ఫిరోజ్ షా కోట్ల స్టేడియం) లో జరిగిన 23వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి7 వికెట్ల తేడాతో గెలిచింది. రుతురాజ్‌ (44 బంతుల్లో 12 ఫోర్లతో 75) కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.[32]
 24. ఐపీఎల్ 2021లో భాగంగా (29 ఏప్రిల్‌ 2021 న) అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 18.3 ఓవర్లలో 18.3 ఓవర్లలో 172 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[33]
 25. ఐపీఎల్ 2021లో భాగంగా (29 ఏప్రిల్‌ 2021 న) ఢిల్లీ - అరుణ్‌జైట్లీ స్టేడియం ( ఫిరోజ్ షా కోట్ల స్టేడియం) లో జరిగిన 25వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పృథ్వీ షా (41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.[34]
 26. ఐపీఎల్ 2021లో భాగంగా (30 ఏప్రిల్‌ 2021 న) అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 26వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులే చేయడంతో 4 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 25 నాటౌట్‌ & 4-1-19- 3 వికెట్లు) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[35]
 27. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 మే 01 న) ఢిల్లీ - అరుణ్‌జైట్లీ స్టేడియం ( ఫిరోజ్ షా కోట్ల స్టేడియం) లో జరిగిన 27వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ‌20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి 4వికెట్ల తేడాతో గెలిచింది. 4వికెట్ల తేడాతో గెలిచింది.మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పొలార్డ్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్‌) [36]
 28. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 మే 02 న) ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ( ఫిరోజ్ షా కోట్ల స్టేడియం) లో జరిగిన 28వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ ‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులే చేయడంతో రాజస్థాన్‌ ‌ 55 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచింది.[37]
 29. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 మే 02 న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 29వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 167 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.[38]
 30. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 మే 03 న) ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ( ఫిరోజ్ షా కోట్ల స్టేడియం) లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగాల్సి 30వ మ్యాచ్‌ను వాయిదా వేశారు. కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.[39]

ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌

[మార్చు]
 1. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 19న - 30వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 1వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి 20 పరుగుల తేడాతో ఓడింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[40]
 2. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 20న - 31వ మ్యాచ్) షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన 2వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19 ఓవర్లలో 10 వికెట్లకు 92 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 10 ఓవర్లలో 1 వికెట్లకు 94 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో గెలిచింది. వరుణ్‌ చక్రవర్తి (వరుణ్‌ చక్రవర్తి 4-0-13-3) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[41]
 3. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 21న - 32వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. కార్తీక్‌ త్యాగి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[42]
 4. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 22న - 33వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిట‌ల్స్‌, సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 139 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది. అన్రిచ్‌ నోర్ట్జే ( 4-0-12-2) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[43]
 5. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 23న - 34వ మ్యాచ్) షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. నరైన్‌ (4-0-20-1) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[44]
 6. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 24న - 35వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 15.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది.డ్వేన్ బ్రావో (3/24) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[45]
 7. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 25న - 36వ మ్యాచ్) షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ కేపిట‌ల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసి 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శ్రేయస్ అయ్యర్ (43) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[46]
 8. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 25న - 37వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. జేసన్ హోల్డర్ (3/19, 47 నాటౌట్: 29 బంతుల్లో) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[47]
 9. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 26న - 38వ మ్యాచ్) అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతో గెలిచింది. జడేజా (8 బంతుల్లో 22 పరుగులు, 1/21) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[48]
 10. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 26న - 39వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 18.1 ఓవర్లలో 10 వికెట్లకు 111 పరుగులు చేసి 654 పరుగులతో ఓడిపోయింది. మ్యాక్స్‌వెల్ (56: 37 బంతుల్లో, 2/23) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[49]
 11. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 27న - 40వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. జాసన్ రాయ్ (60: 42 బంతుల్లో, 8 ఫోర్లు 1 సిక్స్) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[50]
 12. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 28న - 41వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 18.2 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతో గెలిచింది. సునీల్ నరైన్ (10 బంతుల్లో 21 పరుగులు & 2\18) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[51]
 13. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 28న - 42వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. కిరాన్ పొలార్డ్ (7 బంతుల్లో 15 పరుగులు & 2\8) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.[52]
 14. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 29న - 43వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. చాహల్‌కు (చాహల్‌ 4-0-18-2) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[53]
 15. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 సెప్టెంబరు 30న - 44వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ హాజెల్‌వుడ్ కు (చాహల్‌ 4-0-24-3) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[54]
 16. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 1న - 45వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలిచింది. కేఎల్‌ రాహుల్‌కు (55 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[55]
 17. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 2న - 46వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలిచింది. అక్షర్‌ పటేల్‌ కు ( 4-0-21-3) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[56]
 18. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 2న - 47వ మ్యాచ్) షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 190 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ కు (60 బంతుల్లో 101 నాటౌట్‌; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[57]
 19. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 3న - 48వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్లెన్ మాక్స్‌వెల్ కు (57 పరుగులు, 33 బంతుల్లో ) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[58]
 20. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 3న - 49వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. శుభమన్‌ గిల్ కు (57 పరుగులు, 51 బంతుల్లో ) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[59]
 21. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 4న - 50వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలిచింది. అక్షర్‌ పటేల్‌ కు ( (2/18) & 5 పరుగులు, 10 బంతుల్లో ) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[60]
 22. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 5న - 51వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్ రాయల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 90 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది. నాథన్ కౌల్టర్ కు (4/14) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.
 23. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 6న - 52వ మ్యాచ్) షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 137 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. విలియమ్సన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[61]
 24. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 7న - 53వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 13 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. కేఎల్‌ రాహుల్‌ (42 బంతుల్లో 98 నాటౌట్‌; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.
 25. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 7న - 54వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 16.1 ఓవర్లలో 10 వికెట్లకు 85 పరుగులు చేసి 86 పరుగుల తేడాతో ఓడిపోయింది. శివమ్ మావికు (4/21 - 3.1 ఓవర్లు) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.
 26. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 8న - 55వ మ్యాచ్) షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసి 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇషాన్‌ కిషన్‌ (84) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.
 27. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 8న - 56వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీకర్‌ భరత్‌ (52 బంతుల్లో 78 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ప్లే ఆఫ్స్‌

[మార్చు]

1. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 8న - 57వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

2. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 8న - 58వ మ్యాచ్) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌ (ఎలిమినేటర్‌ మ్యాచ్‌) మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలిచింది. సునీల్‌ నరైన్‌ (15 బంతుల్లో 26 నాటౌట్‌; 0 ఫోర్లు, 3 సిక్స్‌లు & 21 పరుగులిచ్చి 4 వికెట్స్ ) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

3. ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 8న - 59వ మ్యాచ్) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్‌ - 2 కు అర్హత సాధించిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[62]

ఐపీఎల్‌ ఫైనల్

[మార్చు]

ఐపీఎల్ 2021లో భాగంగా ( 2021 అక్టోబరు 15న - 60వ మ్యాచ్) దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులకు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.[63][64]

ఈ సీజ‌న్‌లో అత్యధిక వికెట్లు (15 మ్యాచుల్లో 32) పడగొట్టిన బెంగళూరు బౌలర్‌ హర్షల్ పటేల్ ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]
 1. "IPL 2021 to kick off on April 9; will be played across six Indian cities". ESPNcricinfo. Retrieved 8 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. NDTVSports (4 May 2021). "Indian Premier League Postponed After Several Players Test Positive For COVID-19" (in ఇంగ్లీష్). Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
 3. www.iplt20.com (4 May 2021). "VIVO IPL 2021 Postponed" (in ఇంగ్లీష్). Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Eenadu. "IPL నిరవధిక వాయిదా". www.eenadu.net. Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
 5. Andhrajyothy (30 May 2021). "ఐపీఎల్‌ యూఏఈలోనే". www.andhrajyothy.com. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
 6. Sakshi (1 May 2021). "ఎస్‌ఆర్‌హెచ్‌ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా విలియమ్సన్‌". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
 7. నమస్తే తెలంగాణ, Home > News (9 April 2021). "చెల‌రేగిన డివిలియ‌ర్స్‌.. ముంబైపై ఆర్సీబీ విజ‌యం". Namasthe Telangana. Archived from the original on 9 April 2021. Retrieved 9 April 2021.
 8. నమస్తే తెలంగాణ (11 April 2021). "మెరిసిన ధావన్‌, షా.. ఢిల్లీ బోణీ". Namasthe Telangana. Archived from the original on 10 April 2021. Retrieved 11 April 2021.
 9. Deccan Chronicle (11 April 2021). "Delhi Capitals gun down Chennai Super Kings for 7-wicket win". Archived from the original on 14 April 2021. Retrieved 14 April 2021.
 10. Sakshi (11 April 2021). "ఐపీఎల్‌ 2021: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనవిజయం‌‌‌‌". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
 11. The Times of India (13 April 2021). "IPL 2021, PBKS vs RR: Sanju Samson's ton ends in heartbreak as Punjab Kings beat Rajasthan Royals | Cricket News - Times of India". Archived from the original on 13 April 2021. Retrieved 14 April 2021.
 12. Telangana Today (14 April 2021). "KKR does harakiri as Mumbai Indians record stunning 10-run win". Archived from the original on 14 April 2021. Retrieved 14 April 2021.
 13. Sakshi (14 April 2021). "ఐపీఎల్‌ 2021: ఒత్తిడిలో సన్‌రైజర్స్‌ చిత్తు". Archived from the original on 14 April 2021. Retrieved 15 April 2021.
 14. Sakshi (16 April 2021). "IPL 2021, DC vs RR: మోరిస్‌ మ్యాజిక్‌". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
 15. Andhrajyothi (17 April 2021). "చెన్నై.. అలవోకగా". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
 16. Sakshi (17 April 2021). "ఐపీఎల్‌ 2021: ఎస్‌ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్‌ పరాజయం‌‌‌‌‌‌‌‌". Archived from the original on 17 April 2021. Retrieved 18 April 2021.
 17. Telangana Today. "De Villiers, Maxwell fire all-round RCB to 38-run win against KKR". Archived from the original on 18 April 2021. Retrieved 18 April 2021.
 18. Sakshi (19 April 2021). "IPL 2021, RCB vs KKR: భళా... బెంగళూరు". Archived from the original on 19 April 2021. Retrieved 19 April 2021.
 19. NDTV Sports (18 April 2021). "DC vs PBKS IPL 2021 Highlights: Shikhar Dhawan Smashes 92 As Delhi Capitals Chase Down 196 To Beat Punjab Kings | Cricket News" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
 20. Sakshi (20 April 2021). "IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్‌..." Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
 21. Namasthe Telangana (21 April 2021). "ఢిల్లీ ధమాకా". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
 22. Namasthe Telangana (21 April 2021). "హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ అద్భుత విజయం". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
 23. India Today. "PBKS vs SRH: Khaleel Ahmed, Sunrisers Hyderabad openers fire team to 1st win of IPL 2021" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-21. Retrieved 21 April 2021.
 24. ఆంధ్రజ్యోతి (22 April 2021). "చెమటోడ్చిన చెన్నై". Archived from the original on 22 April 2021. Retrieved 22 April 2021.
 25. Sakshi (22 April 2021). "ఐపీఎల్‌ 2021: ఆర్‌సీబీ ఘన విజయం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
 26. Sakshi (24 April 2021). "IPL 2021 PBKS vs MI: పంజాబ్‌ ప్రతాపం". Archived from the original on 24 April 2021. Retrieved 24 April 2021.
 27. Andhrajyothi (24 April 2021). "కేకేఆర్‌పై రాజస్థాన్ విన్". Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.
 28. Andhrajyothy (25 April 2021). "బెంగళూరును చిత్తు చేసిన చెన్నై.. ఏకంగా 69 పరుగులు తేడాతో." Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.
 29. HMTV (26 April 2021). "IPL 2021 DC Vs SRH: ఢిల్లీ 'సూప‌ర్' విక్ట‌రీ". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
 30. Andhrajyothi (27 April 2021). "కోల్‌కతా.. ఎట్టకేలకు". www.andhrajyothy.com. Archived from the original on 27 April 2021. Retrieved 27 April 2021.
 31. Sakshi (28 April 2021). "IPL 2021 RCBvsDC: బెంగళూరు బతికిపోయింది". Archived from the original on 28 April 2021. Retrieved 28 April 2021.
 32. Andhrajyothy (29 April 2021). "రైజర్స్‌..అదే ఆట". www.andhrajyothy.com. Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
 33. Sakshi (30 April 2021). "MI vs RR: ముంబై అలవోకగా." Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021.
 34. Andhrajyothy. "పృథ్వీ షో". www.andhrajyothy.com. Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021.
 35. ఆంధ్రజ్యోతి (1 May 2021). "పంజాబ్‌.. బల్లే బల్లే". www.andhrajyothy.com. Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
 36. Sakshi (2 May 2021). "IPL 2021, CSK vs MI: చెన్నైపై పొలార్డ్‌ పిడుగు". Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
 37. Andhrajyothy (3 May 2021). "బట్లర్‌ భళా.. రైజర్స్‌ డీలా". www.andhrajyothy.com. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
 38. Andhrajyothy. "ఢిల్లీ దంచెన్‌." www.andhrajyothy.com. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
 39. Sakshi (3 May 2021). "IPL 2021: ఇద్దరు ప్లేయర్లకు కరోనా, మ్యాచ్‌ వాయిదా!". Archived from the original on 4 May 2021. Retrieved 4 May 2021.
 40. Andrajyothy (20 September 2021). "చెన్నై సూపర్‌". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
 41. Eenadu (21 September 2021). "బెంగళూరు విలవిల". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
 42. Andrajyothy (22 September 2021). "రాజస్థాన్‌ వండర్‌ షో". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
 43. Sakshi (22 September 2021). "SRH Vs DC : ఎస్‌ఆర్‌హెచ్‌పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
 44. Andrajyothy (24 September 2021). "కోల్‌కతా కేక." Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
 45. Sakshi (24 September 2021). "RCB Vs CSK: ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
 46. Sakshi (25 September 2021). "రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి.. ప్లేఆఫ్‌కు చేరువగా ఢిల్లీ". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 47. Andrajyothy (26 September 2021). "సెకండ్ షెడ్యూల్‌లో పంజాబ్ బోణీ". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 48. Sakshi (26 September 2021). "CSK Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ.. చెన్నై విజయం". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 49. Andrajyothy (26 September 2021). "బెంగళూరు ఎట్టకేలకు.. ముంబై చిత్తు". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 50. Andrajyothy (27 September 2021). "హమ్మయ్య.. ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో మరో గెలుపు". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 51. Sakshi (28 September 2021). "KKR Vs DC: ఢిల్లీ జైత్రయాత్రకు కేకేఆర్‌ అడ్డుకట్ట.. 3 వికెట్ల తేడాతో విజయం". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 52. Andrajyothy (29 September 2021). "ముంబై.. కష్టంగా!". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
 53. Andrajyothy (30 September 2021). "కూల్‌గా కొట్టేశారు." Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
 54. Andrajyothy (30 September 2021). "హైదరాబాద్‌పై చెన్నై విజయం". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 55. Sakshi (2 October 2021). "పంజాబ్‌కో గెలుపు". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 56. Sakshi (3 October 2021). "ముంబై మళ్లీ ఓడింది". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 57. Sakshi (3 October 2021). "రాయల్స్‌ రాజసం". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 58. Andrajyothy (4 October 2021). "ప్లేఆఫ్స్‌కు బెంగళూరు". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 59. Andrajyothy (4 October 2021). "రైజర్స్‌పై కేకేఆర్ విజయం". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 60. Andrajyothy (5 October 2021). "ఢిల్లీ జోరు..చెన్నై బేజారు". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 61. Sakshi (7 October 2021). "'సన్‌'తోషించాల్సిన విజయం!". Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.
 62. Sakshi (14 October 2021). "కోల్‌కతా 'సిక్సర్‌'తో..." Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.
 63. Andrajyothy (16 October 2021). "IPL 2021 FINAL: కోల్‎కతాపై చెన్నై ఘన విజయం". Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.
 64. Eenadu (16 October 2021). "IPL 2021 CHAMPION: గర్జించిన చెన్నై సింహాలు". Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.