రిషబ్ పంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిషబ్ పంత్
England v India, Trent Bridge (44180102251).jpg
భారత్ vs ఇంగ్లాండ్ సిరీస్ 2018లో
వికెట్ కీపింగ్ చేస్తున్న రిషబ్ పంత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు రిషబ్ రాజేంద్ర పంత్
జననం (1997-10-04) 1997 అక్టోబరు 4 (వయసు 25)
రూర్కీ, ఉత్తరాఖండ్, భారతదేశం[1]
బ్యాటింగ్ శైలి ఎడమ చేతి
బౌలింగ్ శైలి కుడి చేతి మీడియం ఫాస్ట్[2]
పాత్ర వికెట్‌ కీపర్‌ - బ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు భారత జట్టు
టెస్టు అరంగ్రేటం(cap 291) 18 ఆగష్టు 2018 v ఇంగ్లాండు
చివరి టెస్టు 12 మార్చి 2022 v శ్రీలంక
వన్డే లలో ప్రవేశం(cap 224) 21 అక్టోబర్ 2018 v వెస్ట్ ఇండీస్
చివరి వన్డే 11 ఫిబ్రవరి 2022 v వెస్ట్ ఇండీస్
ఒ.డి.ఐ. షర్టు నెం. 17
టి20ఐ లో ప్రవేశం(cap 68) 1 ఫిబ్రవరి 2017 v ఇంగ్లాండ్
చివరి టి20ఐ 18 ఫిబ్రవరి 2022 v వెస్ట్ ఇండీస్
టి20ఐ షర్టు సంఖ్య. 17
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2015–ప్రస్తుతం ఢిల్లీ
2016–ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (squad no. 17)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ వన్డే క్రికెట్‌ టీ20 ఫస్ట్ -క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 30 24 43 54
సాధించిన పరుగులు 1,920 715 683 3,772
బ్యాటింగ్ సగటు 40.85 32.50 24.39 47.15
100s/50s 4/9 0/5 0/3 9/17
ఉత్తమ స్కోరు 159* నాటౌట్ 85 65* నాటౌట్ 308
క్యాచులు/స్టంపింగులు 107/11 19/1 13/7 177/18
Source: Cricinfo, 14 మార్చి 2022 {{{year}}}

రిషబ్‌ పంత్‌ (జననం 1997 అక్టోబరు 4) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2022లో దక్షిణ ఆఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్ కు భారత జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[3] రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా మంచి గుర్తింపునందుకున్నాడు.[4] ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రతినిధ్యం వహించాడు.[5] రిషబ్ పంత్ డిసెంబర్ 2021లో తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు.[6]

జూన్ 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన T20I సిరీస్‌కు కెప్టెన్ కె.ఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమవ్వగా రిషబ్ పంత్‌ని భారత కెప్టెన్‌గా నియమించారు.[7]

బాల్యం[మార్చు]

రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో రాజేంద్ర పంత్, సరోజ్ పంత్ దంపతులకు జన్మించాడు. 12 సంవత్సరాల వయస్సులో రిషబ్ పంత్ తన తల్లితో కలిసి వారాంతాల్లో సోనెట్ క్రికెట్ అకాడమీలో తారక్ సిన్హా దగ్గర శిక్షణ కోసం ఢిల్లీకి వెళ్లేవాడు. అక్కడ వసతి లేకపోవడంతో మోతీ బాగ్‌లోని గురుద్వారాలో బస చేసేవారు. రిషబ్ తండ్రి ఏప్రిల్ 2017లో గుండెపోటుతో మరణించాడు.

కెరీర్[మార్చు]

తారక్ సిన్హా సూచనమేరకు రిషబ్ పంత్ రాజస్థాన్‌ U-13, U-15 క్రికెట్ ఆడటానికి సిద్ధమయ్యాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మెరుగైన బ్యాట్స్‌మన్‌గా రాణించాలని తన బ్యాటింగ్ టెక్నిక్‌ను సరిదిద్దుకున్నాడు. అతను ఆడిన అస్సాంతో ఢిల్లీ తరపున U-19 క్రికెట్ ఆటతో తన కెరీర్ మలుపుతిరిగింది. రిషబ్ పంత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేశాడు.[8]

2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా రిషబ్ పంత్ 2016 ఫిబ్రవరి 1న నేపాల్‌పై 18 బంతుల్లో ఫిఫ్టీని సాధించాడు.[9]

రోడ్డు ప్రమాదం[మార్చు]

2022 డిసెంబరు 30న రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి స్వస్థలం ఉత్తరాఖండ్‌ కు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కీ దగ్గర ఆయన ప్రయానిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‎ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆయనని వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.[10]

మూలాలు[మార్చు]

  1. "People are going to be scared of bowling to Pant in the future". ESPN Cricinfo. Retrieved 9 April 2017.
  2. "Rishabh Pant - Wisden Profile". Wisden. Retrieved 4 January 2022.
  3. Eenadu (8 June 2022). "దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  4. Sakshi (7 June 2022). "అందుకే నేను వికెట్‌ కీపర్‌ అయ్యాను: రిషబ్ పంత్". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  5. Sakshi (3 April 2022). "ఢిల్లీ కెప్టెన్‌ రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త‌". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  6. Namasthe Telangana (21 December 2021). "ఉత్తరాఖండ్‌ ప్రచారకర్తగా పంత్‌". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  7. "Injured Rahul and Kuldeep out of South Africa T20I series, Pant to lead India". ESPNcricinfo. Retrieved 2022-06-08.
  8. "Keeping calm and carrying on: The cricketing journey of Rishabh Pant". The Indian Express (in Indian English). 27 January 2019. Retrieved 28 January 2019.
  9. "Rishabh Pant slams fastest fifty in huge India win". ESPNcricinfo. Retrieved 1 February 2016.
  10. "Rishabh Pant: రోడ్డు ప్రమాదం.. క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు తీవ్ర గాయాలు". web.archive.org. 2022-12-30. Archived from the original on 2022-12-30. Retrieved 2022-12-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)