Jump to content

లెన్ హట్టన్

వికీపీడియా నుండి
లెన్ హట్టన్
1938లో లెన్ హట్టన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లెనార్డ్ హట్టన్
పుట్టిన తేదీ(1916-06-23)1916 జూన్ 23
ఫల్‌నెక్, పడ్సే, యార్క్‌షైర్, ఇంగ్లండ్
మరణించిన తేదీ1990 సెప్టెంబరు 6(1990-09-06) (వయసు 74)
థేమ్స్ వద్ద కింగ్‌స్టన్, లండన్, ఇంగ్లండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతివాం లెగ్ బ్రేక్
పాత్రఓపెనింగ్ బ్యాటర్
బంధువులురిచర్డ్ హట్టన్ (కొడుకు)
జాన్ హట్టన్ (కొడుకు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 294)1937 జూన్ 26 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1955 మార్చ్ 25 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1934–1955యార్క్‌షైర్
1938–1960మేరీలెబోన్ కౌంటీ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 79 513
చేసిన పరుగులు 6,971 40,140
బ్యాటింగు సగటు 56.67 55.51
100లు/50లు 19/33 129/179
అత్యధిక స్కోరు 364 364
వేసిన బంతులు 260 9,740
వికెట్లు 3 173
బౌలింగు సగటు 77.33 29.51
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 1/2 6/76
క్యాచ్‌లు/స్టంపింగులు 57/– 401/–
మూలం: CricInfo, 2007 ఆగస్టు 14

సర్ లియోనార్డ్ హట్టన్ (1916 జూన్ 23 - 1990 సెప్టెంబరు 6) ఇంగ్లీష్ క్రికెట్ ఆటగాడు. అతను 1934 నుండి 1955 వరకు యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరఫున, 1937 నుంచి 1955 వరకూ 79 టెస్ట్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ తరపున ఆడాడు. అతను ప్రధానంగా ఓపెనింగ్ బ్యాటర్.[1] క్రికెట్ బైబిల్‌గా పేరొందిన విజ్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ అతన్ని "క్రికెట్ చరిత్రలోకెల్లా గొప్ప బ్యాట్స్‌మాన్లలో ఒకడు" అని అభివర్ణించింది.[2] అతను 1938లో తన ఆరవ టెస్ట్ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై 364 పరుగులు చేసి "ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్‌" రికార్డును నెలకొల్పాడు.[3][4][5] ఇది దాదాపు 20 సంవత్సరాల పాటు అంతర్జాతీయంగా నిలబడిన రికార్డు. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ రికార్డుల్లో అయితే 84 సంవత్సరాల తరువాత 2023 నాటికి కూడా ఈ రికార్డు ఇంకెవరూ అధిగమించలేకపోయారు.[6] రెండవ ప్రపంచ యుద్ధం తరువాత క్రికెట్లో అతను ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్‌కు మూలస్తంభంగా నిలిచాడు.[7] 1952లో అతనికి ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది; మరుసటి సంవత్సరం అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్ 19 సంవత్సరాల తర్వాత యాషెస్‌ను గెలుచుకుంది.[8]

తన టీనేజీ వయసు నుండి భావి స్టార్‌గా అతన్ని క్రికెట్ ఆట తెలిసినవారు గుర్తించేవారు.[9] హట్టన్ 1934లో యార్క్‌షైర్‌కు తన అరంగేట్రం చేసాడు. త్వరలోనే కౌంటీ స్థాయిలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్నాడు.[10] 1937 నాటికి, అతను ఇంగ్లాండ్ తరపున ఆడడం ప్రారంభించాడు.[11][3] 1939లో యుద్ధం అతని కెరీర్‌కు అంతరాయం కలిగించేనాటికే విమర్శకులు అతన్ని ఇంగ్లండ్‌లోనే కాక ప్రపంచంలోనూ ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించడం ప్రారంభించారు.[12] యుద్ధ సమయంలో, కమాండో శిక్షణా కోర్సులో పాల్గొంటూండగా అతని చేతికి తీవ్రమైన గాయం అయింది.[13] అతని చేయి పూర్తిగా కోలుకోకపోవడంతో బ్యాటింగ్ శైలిని మార్చుకోవలసి వచ్చింది.[14][15] క్రికెట్ మళ్ళీ మొదలైనప్పుడు, ఇంగ్లండ్ జట్టు ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా హట్టన్ తన కెరీర్ తిరిగి ప్రారంభించాడు[16]; 1950-51లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా పర్యటన సమయానికి, జట్టు అతని బ్యాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడసాగింది. ఇక అప్పటి నుంచి అతని మిగిలిన కెరీర్‌ అంతా జట్టు అతనిపై ఆధారపడడం కొనసాగించింది. బ్యాట్స్‌మన్‌గా హట్టన్ జాగ్రత్తగా ఉండేవాడు. గట్టి డిఫెన్స్‌లో తన శైలిని నిర్మించుకున్నాడు. స్ట్రోక్‌ప్లేతో దాడి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, యార్క్‌షైర్, ఇంగ్లండ్ జట్లు రెండూ అతనిపై ఆధారపడి ఉండేవి. తన జట్టు తన ప్రదర్శనపైన ఆధారపడిందన్న గమనింపు అతని శైలిని ప్రభావితం చేసింది.[17][18][19] గణాంకాల్లో చూసినా హట్టన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

హట్టన్ 1952 నుంచి 1955 వరకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వం కొన్నిసార్లు వివాదాస్పదం అయింది. జాగ్రత్తతో కూడిన అతని విధానాన్ని అతని బలహీనతగా విమర్శకులు నిందించేవారు.[20][21] కెప్టెన్ బాధ్యతల్లో అతను ఎప్పుడూ సౌకర్యవంతంగా కుదురుకోలేదు.[22] ఇంగ్లీష్ క్రికెట్ వ్యవస్థ నిర్వహణ, పరిపాలన సాగించిన ఆనాటి మాజీ అమెచ్యూర్ ఆటగాళ్ళు తనను విశ్వసించలేదని హట్టన్ భావించాడు.[23] కెప్టెన్‌గా 23 టెస్టుల్లో ఎనిమిది టెస్టులు గెలిచి, నాలుగింటిలో ఓడి, మిగతావి డ్రా చేసుకున్నాడు. మానసికంగానూ, శారీరకంగానూ ఒత్తిడి కలిగించే నాయకత్వ బాధ్యతలతో విసిగిపోయిన హటన్ 1955 సీజన్లో సాధారణ ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 1956లో అతను క్రికెట్‌కు చేసిన సేవలకు నైట్‌ బ్యాచిలర్ హోదాను పొందాడు. అతను టెస్ట్ సెలెక్టర్‌గానూ, జర్నలిస్టుగానూ, బ్రాడ్‌కాస్టర్‌గానూ కొనసాగాడు.[24][25] 1984లో ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసే వరకు ఒక ఇంజనీరింగ్ సంస్థకు ప్రతినిధిగా కూడా పనిచేశాడు.[26][27][28] పదవీ విరమణ తర్వాత కూడా హట్టన్ క్రికెట్‌ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండేవాడు. 1990లో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడయ్యాడు.[29] ఆపైన కొన్ని నెలల తర్వాత 1990 సెప్టెంబరులో 74వ ఏట మరణించాడు.[30]

మూలాలు

[మార్చు]
  1. Howat, pp. 10–11.
  2. "Len Hutton (Obituary)". Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. 1991. Retrieved 18 May 2010.
  3. 3.0 3.1 "Statsguru: L Hutton Test matches (innings by innings list)". ESPNcricinfo. Archived from the original on 11 August 2011. Retrieved 30 July 2010.
  4. "England v Australia 1938". Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. 1939. Retrieved 3 May 2010.
  5. "England v Australia in 1938". CricketArchive. Retrieved 3 May 2010.
  6. "Records: Test matches: Batting records: Most runs in an innings". ESPNCricinfo. Retrieved 5 July 2013.
  7. Frith, David. "David Frith on Len Hutton". ESPNcricinfo. Retrieved 13 August 2010.
  8. "England v Australia 1953 (Fifth Test)". Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. 1954. Retrieved 27 July 2010.
  9. Howat, p. 7.
  10. "First-class Batting and Fielding in Each Season by Len Hutton". CricketArchive. Retrieved 5 February 2010.
  11. Howat, pp. 28–29.
  12. Howat, pp. 48–49.
  13. Howat, pp. 53–54.
  14. Birley, p. 268.
  15. "Yorkshire in 1946". Wisden Cricketers' Almanack. John Wisden & Co. 1947. p. 486.
  16. "M.C.C. team in Australia and New Zealand, 1946–47". Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. 1948. Retrieved 22 May 2010.
  17. Woodhouse, p. 374.
  18. Murphy, pp. 142–43.
  19. Woodcock, p. 55.
  20. Gibson, p. 190.
  21. Howat, p. 198.
  22. Marshall, p. 159.
  23. Birley, p. 283.
  24. Howat, p. 175.
  25. Howat, pp. 169–70.
  26. Howat, p. 176.
  27. మూస:Cite ODNB
  28. Howat, p. 182.
  29. మూస:Cite ODNB
  30. Swanton, p. 145.

గ్రంథ పట్టిక

[మార్చు]