రోజర్ హార్పర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోజర్ హార్పర్

1963, మార్చి 17న జన్మించిన రోజర్ హార్పర్ (Roger Andrew Harper) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1983 నుంచి 1996 వరకు వెస్టీండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు టెస్ట్ క్రికెట్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 535 పరుగులు, 46 వికెట్లు సాధించాడు. వన్డేలలో 105 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 855 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. 1996 ప్రపంచ కప్ క్రికెట్‌లో దక్షిణ ఆప్రికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 47 పరుగులకే 4 వికెట్లు సాధించి ఆ మ్యాచ్‌లో వెస్టీండీస్ పట్టును నిల్పినాడు. అతడు మొత్తం మూడు పర్యాయాలు 1987, 1992, 1996 లలో ప్రపంచ కప్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. 1983 నుండి 1996 వరకు ఈయన అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ప్రస్థానం 13 సంవత్సరాల పాటు సాగింది. ఈయన ఆ తరువాతి కాలంలో ఫాబ్యులస్ ఫీల్డరుగా వర్ణించబడ్డాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. క్రిక్‌ఇన్ఫో లో రోజర్ హార్పర్ ప్రొఫైల్