Jump to content

ఓటిస్ గిబ్సన్

వికీపీడియా నుండి
ఓటిస్ గిబ్సన్

1969, మార్చి 16న జన్మించిన ఓటిస్ గిబ్సన్ (Ottis Delroy Gibson) బార్బడస్కు చెందిన వెస్ట్‌ఇండీస్ జట్టు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1995లో 2 టెస్ట్ మ్యాచ్‌లలో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టెస్ట్ క్రికెట్

[మార్చు]

గిబ్సన్ 1995లో తొలి టెస్టులో ఇంగ్లాండుతో ఆడి తొలి ఇన్నింగ్సులో 81 పరుగులకు 2 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్సులో 51 పరుగులిచ్చిననూ వికెట్టు లభించలేదు. ఈ టెస్ట్‌లో వెస్ట్‌ఇండీస్ 72 పరుగుల తేడాతో పరాజయం పొందినది.[1] 1999లో దక్షిణాఫ్రికాపై తన రెండో టెస్ట్ ఆడి తొలి ఇన్నింగ్సులో 92 పరుగులకు ఇక్క వికెట్టు మాత్రమే సాధించాడు. రెండో ఇన్నింగ్సులో 51 పరుగులకు ఒక్క వికెట్టు కూడా దక్కలేదు. ఈ టెస్టులో కూడా వెస్ట్‌ఇండీస్ పరాజయం పొందినది.[2] పేవలమైన ప్రదర్శన కారణంగా గిబ్సన్ రెండూ టెస్టులకు మించి ఆడలేకపోయాడు.

వన్డే క్రికెట్

[మార్చు]

గిబ్సన్ 15 వన్డే మ్యాచ్‌లను ఆడి 34 వికెట్లను సాధించాడు. బ్యాటింగ్‌లో 141 పరుగులు చేశాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు ఆస్ట్రేలియాపై సాధించిన 52 పరుగులు. వన్డే బౌలింగ్‌లో అత్యుత్తమ రథర్శన శ్రీలంకపై సాధించిన 42 పరుగులకు 5 వికెట్లు.[3]

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

1996లో గిబ్సన్ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో రిచీ రిచర్డ్‌సన్ నాయకత్వంలోని వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కోచ్‌గా బాధ్యతలు

[మార్చు]

2007 సెప్టెంబర్ 20న గిబ్సన్ ఇంగ్లాండు బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక వన్డే సీరీస్ సమయంలో నియమించబడ్డాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. England v. West Indies scorecard from www.cricinfo.com
  2. South Africa v. West Indies scorecard from www.cricinfo.com
  3. ODI Career from www.cricinfo.com
  4. Gibson named England bowling coach for Sri Lanka tour from www.cricinfo.com

వర్గంవెస్ట్‌ఇండీస్ టెస్ట్ క్రికెట్ క్రీడాకారులు