జిమ్మీ ఆడమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిమ్మీ ఆడమ్స్
దస్త్రం:West Indies Cricket Board Flag.svg West Indies
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి ఎడమచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి స్లో లెఫ్ట్ ఆర్మ్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 54 127
పరుగులు 3012 2204
బ్యాటింగ్ సగటు 41.26 28.62
100లు/50లు 6/14 0/14
అత్యుత్తమ స్కోరు 208* 82
ఓవర్లు 475 309
వికెట్లు 27 43
బౌలింగ్ సగటు 49.48 34.86
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 1 1
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 5/17 5/37
క్యాచ్ లు/స్టంపింగులు 48/- 68/5

As of ఆగష్టు 18, 2007
Source: Cricinfo

1968, జనవరి 9న జన్మించిన జిమ్మీ ఆడమ్స్ (James Clive Jimmy Adams) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. ఎడమచేతి బ్యాటింగ్, ఎడమచేతితో బౌలింగ్ చేయగల ఆడమ్స్ మంచి ఫీల్డర్ కూడా.ఆవసమైనప్పుడు వికెట్ కీపర్ విధులను కూడా నిర్వర్తించాడు. 1992లో దక్షిణాఫ్రికాపై బ్రిడ్జిటౌన్లో తొలి టెస్ట్ ఆడినాడు.

టెస్ట్ క్రికెట్[మార్చు]

ఆడమ్స్ టెస్టులలో ఆరంగేట్రం చేసిన వెంటనే తన ప్రతిభను చూపడం ప్రారంభించాడు. తన తొలి 12 టెస్టులలోనే 87 సగటుతో 1132 పరుగులు సాధించాడు. ఇలాంటి రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్‌మెన్కు తప్ప ఎవరికీ లేకపోవడం విశేషం. 1995లో ఇంగ్లాండు పర్యటనలో గాయపడటంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. 2000లో బ్రియాన్ లారా నుంచి వెస్ట్‌ఇండీస్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. స్వయంగా జట్టులో స్థానం కోసం పోరాడుతున్న సమయంలో కెప్టెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టడంతో దేనికీ న్యాయం చేయలేకపోయాడు. ఆస్ట్రేలియాతో సీరీస్ 5-0 తేడాతో చిత్తుగా ఓడి కెప్టెన్‌గానే కాకుండా తాను స్వయంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తరువాత కార్ల్ హూపర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

1992 నుంచి 2001 వరకు మొత్తం 54 టెస్టులు ఆడి 41.26 సగటుతో 3012 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 14 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 208 (నాటౌట్). టెస్టులలో 27 వికెట్లు కూడా సాధించాడు.

వన్డే క్రికెట్[మార్చు]

1992లో పాకిస్తాన్ పై తొలి వన్డే ఆడినప్పటి నుంచి 2001లో ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో చివరి వన్డే ఆడే వరకు మొత్తం 127 మ్యాచ్‌లలో 28.62 సగటుతో 2204 పరుగులు సాధించాడు. అందులో 14 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు ఆస్ట్రేలియాపై సాధించిన 82 పరుగులు. వన్డేలలో 43 వికెట్లు కూడా సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ పాకిస్తాన్ పై అడిలైడ్లో సాధించిన 37 పరుగులకు 5 వికెట్లు.

జట్టు కెప్టెన్‌గా[మార్చు]

జిమ్మీ ఆడమ్స్ 15 టెస్టులకు నాయకత్వం వహించాడు. అందులో నాలిగింటిలో విజయం సాధించగా, 8 టెస్టులలో పరాజయం పొందినాడు. మిగితా 3 టెస్టులు డ్రాగా ముగిసాయి. వన్డేలలో 26 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి పదింటిని గెలిపించగా, 14 వన్డేలలో పరాజయం లభించింది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

జిమ్మీ ఆడమ్స్ 1996, 1999 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో వెస్ట్‌ఇండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

బయటి లింకులు[మార్చు]