రిడ్లీ జాకబ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిడ్లీ జాకబ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిడ్లీ డెటామోర్ జాకబ్స్
పుట్టిన తేదీ (1967-11-26) 1967 నవంబరు 26 (వయసు 56)
స్వీట్స్ విలేజ్, ఆంటిగ్వా, బార్బుడా
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1998 26 నవంబర్ - దక్షిణ ఆఫ్రికా తో
చివరి టెస్టు2004 జూలై 29 - ఇంగ్లండ్ తో
తొలి వన్‌డే1996 మార్చి 26 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2004 జూలై 10 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991–2005Leeward Islands
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 65 147 157 222
చేసిన పరుగులు 2,577 1,865 7,518 3,180
బ్యాటింగు సగటు 28.31 23.31 38.75 25.64
100లు/50లు 3/14 0/9 17/40 0/16
అత్యుత్తమ స్కోరు 118 80* 149 85
వేసిన బంతులు 0 0 6 0
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 0/0
క్యాచ్‌లు/స్టంపింగులు 207/12 160/29 443/33 254/43
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 22
రిడ్లీ జాకబ్స్

1967, నవంబర్ 26న జన్మించిన రిడ్లీ జాకబ్స్ (ఆంగ్లం: Ridley Detamore Jacobs) వెస్ట్‌ఇండీస్ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 1990 దశాబ్దం, 2000 దశాబ్దంలలో ఇతడు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టెస్ట్ క్రికెట్[మార్చు]

ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన రిడ్లీ జాకబ్స్ 31వ యేటా తొలి టెస్ట్ ఆడి తన ఆరేళ్ళ టెస్టు క్రీడా జీవితంలో మొత్తం 65 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తిచేసుకునాడు. వికెట్ కీపర్‌గా 65 టెస్టులలో 207 క్యాచ్‌లను వికెట్ల వెనుక పట్టుకున్నాడు. జెఫ్ డూజాన్ తరువాత ఈ ఘనత సాధించిన రెండో వెస్ట్‌ఇండీస్ వికెట్ కీపర్ గా రికార్డు సాధించాడు.

వన్డే క్రికెట్[మార్చు]

రిడ్లీ జాకబ్స్ 147 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 1865 పరుగులు, వికెట్ల వెనుక 160 క్యాచ్‌లు సాధించాడు. వన్డేలలో 19 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 80 నాటౌట్.

బ్రియాన్ లారా సూపర్ ఇన్నింగ్స్‌లోనూ ఇతని పాత్ర[మార్చు]

ఇంగ్లాండ్కు విరుద్ధంగా బ్రియాన్ లారా సాధించిన టెస్ట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 400 నాటౌట్ సమయంలో అతడు కూడా క్రీజులో ఉండి సెంచరీతో కదం తొక్కి లారాతో కలిపి భారీ భాగస్వామ్యం జతచేశాడు. అతడు టెస్టులలో సాధించిన 3 సెంచరీలలో దీనికి ప్రత్యేకత ఉంది.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

రిడ్లీ జాకబ్స్ 1999, 2003 ప్రపంచ కప్ క్రికెట్‌లలో వెస్ట్‌ఇండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

టెస్ట్ కెప్టెన్‌గా[మార్చు]

జాకబ్స్ వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు రెండు టెస్టులలో నాయకత్వం వహించాడు. 2002-03లో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టులకు నాయకత్వం వహించి ఆ రెండింటినీ డ్రాగా ముగించాడు.

మూలాలు[మార్చు]