Jump to content

జాక్ కాలిస్

వికీపీడియా నుండి
జాక్ కాలిస్
2015 లో కాలిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాక్ హెన్రీ కాలిస్
పుట్టిన తేదీ (1975-10-16) 1975 అక్టోబరు 16 (వయసు 49)
కేప్ టౌన్, వెస్టర్న్ కేప్, దక్షిణాఫ్రికా
మారుపేరుజేక్స్, వూగీ,[1] కలహారి
ఎత్తు1.83 మీ. (6 అ. 0 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 262)1995 డిసెంబరు 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2013 డిసెంబరు 26 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 38)1996 జనవరి 9 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2014 జూలై 12 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 4)2005 అక్టోబరు 21 - న్యూజీలాండ్ తో
చివరి T20I2012 అక్టోబరు 2 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94–2003/04Western Province
1997మిడిల్‌సెక్స్
1999గ్లామోర్గాన్
2006/07–2007/08Cape Cobras
2008–2010రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2008/09–2010/11Warriors
2011–2014కోల్‌కతా నైట్‌రైడర్స్
2011/12–2013/14Cape Cobras
2014/15–2015/16Sydney Thunder
2015Trinidad and Tobago Red Steel
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 166 328 257 424
చేసిన పరుగులు 13,289 11,579 19,695 14,845
బ్యాటింగు సగటు 55.37 44.36 54.10 43.53
100లు/50లు 45/58 17/86 62/97 23/109
అత్యుత్తమ స్కోరు 224 139 224 155*
వేసిన బంతులు 20,232 10,750 29,033 13,673
వికెట్లు 292 273 427 351
బౌలింగు సగటు 32.65 31.79 31.69 30.68
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 2 8 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/54 5/30 6/54 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 200/– 131/– 264/– 162/–
మూలం: Cricinfo, 2016 ఫిబ్రవరి 14

జాక్ హెన్రీ కాలిస్ (జననం 1975 అక్టోబరు 16) దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్, మాజీ క్రికెటరు. సార్వకాలిక గొప్ప క్రికెటర్లలో ఒకడుగా, గొప్ప ఆల్-రౌండర్లలో ఒకడిగా అతన్ని పరిగణిస్తారు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఫాస్ట్-మీడియం స్వింగ్ బౌలర్. [2] క్రికెట్ చరిత్రలో వన్‌డే, టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో 10,000 కంటే ఎక్కువ పరుగులు, 250 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్, కాలిస్ . వన్డేల్లో 131 క్యాచ్‌లు కూడా పట్టాడు. టెస్ట్ మ్యాచ్ కెరీర్‌లో 13,289 పరుగులు చేశాడు, 292 వికెట్లు తీసాడు, 200 క్యాచ్‌లు పట్టుకున్నాడు. 23 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. టెస్టు చరిత్రలో ఏ ఆటగాడూ ఇన్నిసార్లు ఈ అవార్డు పొందలేదు.[3] [4]

దక్షిణాఫ్రికా గెలుచుకున్న 1998 ICC నాకౌట్ ట్రోఫీలో (ప్రస్తుతం ICC ఛాంపియన్స్ ట్రోఫీ అంటారు) కాలిస్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా చరిత్రలో అది వారి ఏకైక ICC టోర్నమెంట్ విజయం. ఆ టోర్నమెంటులో కాలిస్ అత్యధిక పరుగులు చేసి 2వ స్థానంలో నిలిచాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఒకడు. సెమీ-ఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు పొందాడు. 1998 ICC నాకౌట్ ట్రోఫీ ఫైనల్‌లో, కలిస్ 30 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.

కాలిస్ 166 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతని బ్యాటింగ్ సగటు 55 కు పైమాటే.[5] [6] 2007 అక్టోబరు - డిసెంబరు మధ్య కాలంలో అతను, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు చేశాడు. 2011 జనవరిలో భారత్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరీతో, అతని 40వ సెంచరీ అది, అతను రికీ పాంటింగ్‌ను దాటి టెస్ట్ సెంచరీలలో రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 51 శతకాలతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

కాలిస్, 2005 లో "ICC టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్", "ICC ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌" 2008 లో విస్డెన్‌ ప్రపంచంలోని ప్రముఖ క్రికెటరు వంటి సత్కారాలు పొందాడు.[7] కెవిన్ పీటర్సన్, డారిల్ కల్లినన్‌లు అత్యంత గొప్ప క్రికెటరు అని కాలిస్‌ను అభివర్ణించారు. టెస్ట్ బ్యాటింగ్ సగటు 50 కంటే ఎక్కువగాను, టెస్ట్ బౌలింగ్ సగటు 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అతి కొద్ది మంది టెస్ట్ ఆల్-రౌండర్‌లలో ఒకడుగా కాలిస్, వాలీ హమ్మండ్, సర్ గ్యారీ సోబర్స్‌ల సరసన నిలబడతాడు.[8]

2013 జనవరి 2 న న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు తొలి రోజున టెస్టుల్లో 13,000 పరుగులు చేసి, అది సాధించిననాల్గవ ఆటగాడుగా, మొదటి దక్షిణాఫ్రికా ఆటగాడిగా కాలిస్ నిలిచాడు.[9] 2013 అతనులో విస్డెన్ క్రికెటర్లలో ఒకడిగా ఎంపికయ్యాడు [10] 2013 డిసెంబరులో డర్బన్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడిన తర్వాత టెస్టులు, ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు; [11] [12] [13] ఆ మ్యాచ్‌లో కాలిస్, తన 45వ టెస్ట్ సెంచరీని సాధింక్షి, చివరి టెస్టులో శతకం చేసిన అతికొద్ది మంది బ్యాట్స్‌మెన్‌లలో ఒకడుగా నిలిచాడు.[14][15] 2014 జూలై 30 న కాలిస్, అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరయ్యాడు [16]

2020 ఆగష్టులో అతన్ని, ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. [17]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile". Cricket South Africa. Archived from the original on 15 January 2013. Retrieved 25 January 2013.
  2. Dwaipayan Datta (27 December 2013). "Jacques Kallis: Two greats rolled into one". Times of India. Retrieved 27 December 2013.
  3. Tests – 1000 runs, 50 wickets, and 50 catches, Cricinfo, Retrieved on 21 November 2007
  4. "ODIs – 1000 runs, 50 wickets and 50 catches". ESPN Cricinfo. Retrieved 21 November 2007.
  5. "All-round records | Test matches | Cricinfo Statsguru | ESPN Cricinfo". Stats.espncricinfo.com. Archived from the original on 8 October 2013. Retrieved 21 July 2012.
  6. "Jacques Kallis | South Africa Cricket | Cricket Players and Officials". ESPN Cricinfo. Retrieved 21 July 2012.
  7. "Jacques Kallis | South Africa Cricket | Cricket Players and Officials | ESPN Cricinfo". Content-nz.cricinfo.com. Retrieved 21 July 2012.
  8. Hobson, Richard (12 November 2009). "Refreshed Kevin Pietersen hoping for change of stance from South African fans". The Times. London.[permanent dead link]
  9. "BBC Sport – Jacques Kallis is fourth man to reach 13,000 Test runs". Bbc.co.uk. 2 January 2013. Retrieved 26 December 2013.
  10. "Kallis, Amla, Steyn among Wisden's five Cricketers of the Year". Wisden India. 10 April 2013. Archived from the original on 16 April 2013. Retrieved 10 April 2013.
  11. "South Africa Cricket News: Jacques Kallis to retire after Durban Test". ESPN Cricinfo. Retrieved 26 December 2013.
  12. NDTVCricket. "South Africa's Jacques Kallis to quit Tests after India series | India vs South Africa Series, 2013-14 - News | NDTVSports.com". Sports.ndtv.com. Archived from the original on 25 December 2013. Retrieved 26 December 2013.
  13. "Kallis to call time on Test career | London Evening Standard". Standard.co.uk. 26 December 2013. Retrieved 26 December 2013.
  14. "Records / Test matches / Batting records / Hundred in last match". Cricinfo. 26 December 2013. Retrieved 26 December 2013.
  15. "Records / Test matches / Batting records / Oldest player to score a hundred". Cricinfo. Retrieved 26 December 2013.
  16. "Kallis retires from international cricket". ESPNcricinfo. Retrieved 30 July 2014.
  17. "Jacques Kallis, Zaheer Abbas and Lisa Sthalekar enter ICC's Hall of Fame". ESPN Cricinfo. Retrieved 23 August 2020.