కోలిన్ క్రోఫ్ట్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కోలిన్ ఎవర్టన్ హుంటే క్రోఫ్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాన్సెస్టర్ గ్రామం, డెమెరారా, బ్రిటిష్ గినియా | 1953 మార్చి 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | స్మైలింగ్ అసాసిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 5 అం. (1.96 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతివాటం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 159) | 1977 ఫిబ్రవరి 18 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1982 జనవరి 30 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 20) | 1977 మార్చి 16 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1981 నవంబరు 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1972–1982 | గయానా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1975–1982 | డెమెరారా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1977–1982 | లంకషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2012 ఆగస్టు 14 |
కోలిన్ ఎవర్టన్ హంటే క్రోఫ్ట్ (జననం 1953 మార్చి 15) వెస్ట్ ఇండియన్ మాజీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. 1970లు, 80ల నాటి సుప్రసిద్ధ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లలో క్రోఫ్ట్ ఒకడు.[Notes 1] ఆరున్నర అడుగుల ఎత్తుతో, ఎడమచేతివాటం బౌలర్లా పరుగుపెట్టి కుడిచేతితో బాల్ విసిరే ఆసక్తికరమైన శైలితో చాలా దూకుడుగా, వేగంగా బౌలింగ్ వేసేవాడు.[1] క్రోఫ్ట్ పాకిస్తాన్ జట్టు మీద 1977లో సాధించిన 8-29 ఇప్పటికీ వెస్టిండీస్ జట్టు ఫాస్ట్ బౌలర్లలో అత్యంత మెరుగైన ప్రదర్శన. 1979లో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో ఇతనూ భాగంగా ఉన్నాడు.
1979-80లో న్యూజీలాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన వివాదగ్రస్తమైన సీరీస్‌లో క్రోఫ్ట్ అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని లాకేస్టర్ పార్కులో 1980 ఫిబ్రవరిలో జరిగిన రెండవ టెస్టులో అంపైర్ ఫ్రెడ్ గుడాల్ సరైన పద్ధతిలో అంపైరింగ్ చేయట్లేదని ఆరోపిస్తూ వెస్టిండీస్ జట్టు మైదానంలోకి రావడానికి నిరాకరించారు. కొంత చర్చల తర్వాత మైదానంలోకి జట్టు దిగింది. అప్పటికే రెండుసార్లు తన అపీల్స్ నిరాకరించడంతో క్రోఫ్ట్ బౌలింగ్ రనప్ చేస్తూ గూడాల్‌ని ఢీకొన్నాడు.[2]
కెరీర్ మొదట్లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టు అయిన వార్‌వెక్‌షైర్ ఇతనికి కోచింగ్ స్కాలర్‌షిప్ ఇచ్చింది. అయితే అప్పటికే ఆ జట్టు వెస్టిండీస్ ఆటగాళ్ళతో నిండిపోవడంతో అవకాశం లేక ఇతను లంకషైర్ జట్టులో 1977 నుంచి 1982 మధ్యలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.[3]
జాతివివక్ష కారణంగా దక్షిణాఫ్రికా జట్టును అంతర్జాతీయ క్రికెట్లో బ్యాన్ చేసినప్పుడు దక్షిణాఫ్రికా ఈ నియమాలు ఉల్లంఘించి తమతో ఆడే క్రికెటర్లకు రాయితీలు ప్రకటించింది. నల్లజాతికి చెందినవారైనా అంతర్జాతీయ క్రికెటర్లు రెబల్ టూర్లలో భాగమై దక్షిణాఫ్రికాకు వస్తే తెల్లవారికి మాత్రమే పరిమితమైన క్రీడామైదానాల్లోకి "లాంఛనపూర్వకంగా తెల్లవారిగా" (ఆనరరీ వైట్స్) గుర్తిస్తూ అనుమతించింది.[4]
క్రోఫ్ట్ ఈ జట్టులో భాగంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాడు. జోహాసెన్‌బర్గ్‌లో ఒక రైల్లో తెల్లవారికి మాత్రమై పరిమితమైన కంపార్ట్‌మెంటు నుంచి ఇతన్ని వెళ్ళగొట్టడంతో వివాదం జరిగింది.[5] ఈ జట్టులో ఆడిన అందరు ఆటగాళ్ళనూ స్థానిక క్రికెట్ బోర్డుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా నిషేధించింది. ఈ నిషేధం 1982 నుంచి 1989 వరకూ సాగింది. దీనితో ఇతని క్రికెట్ కెరీర్ ముగిసింది. స్వంత దేశాలకు వెళ్తే చట్టబద్ధమైన చర్యలకు కానీ, ప్రజల ఆగ్రహానికి కానీ గురవుతానన్న భయంతో క్రోఫ్ట్ అమెరికాకు వలసవెళ్ళి స్థిరపడ్డాడు.[6]
1994 నుంచి ఇతను క్రికెట్ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగానూ, విశ్లేషకుడిగానూ కొనసాగుతున్నాడు. 2007-08లో యుకెలో లెక్కలు కూడా బోధించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "- YouTube". YouTube.
- ↑ The West Indians in New Zealand, 1979-80, Wisden, 1981; What's going on? Goodall has some news for Gavaskar, Cricinfo.com, 31 July 2003; Shoulder barges and flying stumps, Cricinfo.com, 18 February 2006; Scorecard
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2020-05-29.
- ↑ AdelaideNow... Tragedy of the West Indian rebels[permanent dead link]
- ↑ Cricket and society in South Africa, 1910-1971 : from union to isolation. Murray, Bruce K., Parry, Richard, 1956-, Winch, Jonty. Cham, Switzerland. September 2018. ISBN 978-3-319-93608-6. OCLC 1050448400.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) CS1 maint: others (link) - ↑ Colin Croft states so in the documentary Fire in Babylon.
మూస:West Indies Squad 1979 Cricket World Cupమూస:Rebel West Indies squad
ఉల్లేఖన లోపం: "Notes" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="Notes"/>
ట్యాగు కనబడలేదు