Jump to content

పూసపాటి కృష్ణసూర్యకుమార్

వికీపీడియా నుండి
పూసపాటి కృష్ణసూర్యకుమార్
జననం
పూసపాటి కృష్ణసూర్యకుమార్

నవంబరు 29 1954
విద్యబి.కాం.,మెటీరియల్స్ మేనేజిమెంటులో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా
వృత్తిసిరమిక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(సామర్లకోట)
స్టోర్స్ అడ్వయిజర్, 3ఎఫ్ ఇండస్ట్రీస్,కృష్ణపట్నం.
జీవిత భాగస్వామిపూసపాటి నాగమణి
తల్లిదండ్రులుసత్యనారాయణ
సుశీల
పూసపాటి కృష్ణసూర్యకుమార్, నాగమణి

పూసపాటి కృష్ణసూర్యకుమార్ అంకెల సామ్రాజ్యంలో ఘనాపాఠి. అతిపెద్ద గణిత పజిల్ ను 2005లో రూపొందించారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన తెనాలిలో నవంబరు 29 1954 న సత్యనారాయణ, సుశీల దంపతులకు జన్మించారు. ఆయన 6 వయేట తన తండ్రి మరణించారు. ఆయన బి.కాం చేసారు. అనంతరం ఆయన మెటీరియల్స్ మేనేజిమెంటులో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. సిరమిక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సామర్లకోట), స్టోర్స్ అడ్వయిజర్, 3ఎఫ్ ఇండస్ట్రీస్, కృష్ణపట్నం లలో ఉద్యోగాలను చేసారు. ఆయన ఎన్నడూ గణిత శాస్త్రం చదువుకోలేదు. ఆయన మొదట మిమిక్రీ ఆర్టిస్టుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రాం సమక్షంలో ప్రదర్శనను కూడా యిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ పశుసంవర్థక శాఖామాత్యులు యడ్లపాటి వెంకటరావు నుండి బహుమతిని కూడా స్వీకరించారు. 1973 లో జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన కవి, రచయితగా కొన్ని కవితలను వ్రాసారు. అవి ఈనాడు పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆయన ఈనాడులోని "హాయ్ బుజ్జీ" శీర్షికలో క్విజ్ ఆర్టికల్స్ కూడా ఆయన, ఆయన బంధువుల పేర్లతో సుమారు 100 వ్రాసారు. ఆయన ఆలిండియా రేడియోలో కార్మికుల కార్యక్రమం నిర్వహించేవారు. హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో ఏకపాత్రాభినయాలు, కథానికలు నిర్వహించారు.

గణిత పజిల్స్ లో ఘనాపాఠి

[మార్చు]

ఒక దశాబ్దకాలం ఆయన గణితశాస్త్ర పజిల్స్ పై చేసిన కృషి ఆయనను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నించేందుకు దోహదపడింది.[1] కానీ ఇదే పజిల్ ఒక జర్మన్ వ్యక్తి ముందుగా చేయడంవల్ల ఆ అవకాశం జారి పోయింది. ఆయన గుంటూరు లోని భజరంగ్ జ్యూట్ మిల్లు స్టోర్స్ లో మేనేజరుగా పనిచేసారు. ఆయన ప్రత్యేకంగా గణిత శాస్త్రం ఏనాడూ అభ్యసించలేదు. ఆయన రూపొందించిన ఛార్ట్ లో 63,001 నలుచదరాలు ఉన్నాయి. 1 నుండి 63,001 వరకు అనేక అంకెలను, సంఖ్యలను (పునరావృతం కాకుండా) ఉపయోగించాడు. ఈ ఛార్ట్ లో ఏ వైపు మూల నుంచి వరుస నుంచి కూడినప్పటికీ 79,06,751 మొత్తం సంఖ్య లభిస్తుంది.[1][2][3] ఆయన ఖాళీ సమయాలలో 251X251 చదరంలో గల చతురస్రాలలో ఎటుపైపునుండి కూడినా ఒకే విధంగా వచ్చేటట్లు సాధారణ సమికరణం ద్వారా తయారుచేసేవాడు.

ప్రత్యేకమైన వ్యక్తి

[మార్చు]

ఈయనలో మరో ప్రత్యేకత ఉంది. అది ఈయనకు గుండె కుడివైపున ఉంది.[4] కాలేయం ఎడమవైపు ఉంది. ఈ ప్రత్యేకత లక్షమందిలో ఒకరికి ఉండవచ్చు. ఈ విషయం దూరదర్శన్, సాక్షి లలో ప్రసారమయినది. ఆయన మొదట వార్తాపత్రికలలోని చిన్న చిన్న పజిల్స్ ను చేస్తూ క్రమంగా పజిల్ పరిమాణాన్ని పెంచుతూ ఈ ఘనతను సాధించినట్లు తెలియజేసారు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన మార్చి 14 1976లో గుంటూరుకు చెందిన అవ్వారి శేషగిరిరావు, కుసుమ ల కుమార్తె అయిన నాగమణిని వివాహం చేసుకున్నారు. చార్ట్ లు తయారుచేయుటకు తన భార్య నాగమణి ప్రోత్సాహమిచ్చేవారు.

సంపాదకునిగా

[మార్చు]

ఆయన రాక్ సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సామర్లకోట వారు ప్రచురిస్తున్న అంతర్జాతీయ త్రైమాసిక పత్రికకు ప్రధాన సంపాదకునిగా ఉన్నాడు. ఆయన జూట్ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు "ఉషోదయ లలిత కళా సమితి" పేరుతో సాంస్కృతిక అసోసియేషన్ ప్రారంభించాడు. దానికి కార్యదర్శిగా ఉన్నాడు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Charts his way to glory". Staff Reporter. ది హిందూ. 2005-08-14.
  2. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). విజయవాడ: శ్రీ వాసవ్య. 2011.
  3. "గణితేంద్రజాలికుడు సూర్యకుమార్". ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా ఎడిషన్. 2005-08-14.
  4. "కుడివైపు గుండె ఓ ప్రత్యేకత". ఈనాడు -గుంటూరు జిల్లా ఎడిషన్,14 ఆగష్టు 2005.

ఇతర లింకులు

[మార్చు]