చింతా మోహన్
చింతా మోహన్ | |||
![]() చింతామోహన్ | |||
పదవీ కాలము 8వ, 9వ, 10వ, 12వ, 14వ లోకసభ సభ్యులు | |||
నియోజకవర్గము | తిరుపతి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ | 19 నవంబరు 1954||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | రేవతి | ||
సంతానము | 1 కుమారుడు, 1 కుమార్తె | ||
నివాసము | తిరుపతి | ||
వెబ్‌సైటు | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3001 | ||
May 12, 2006నాటికి |
చింతా మోహన్ (జ: 19 నవంబర్, 1954) ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఇతడు భారత లోక్‌సభకు (8వ, 9వ, 10వ, 12వ, 14వ) తిరుపతి లోకసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎన్నికయ్యారు.
Constituency : Tirupati (Andhra Pradesh ) Party Name : Indian National Congress (INC)
బాల్యము[మార్చు]
చింతా మోహన్ గారు 11/11/1954 లో చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ నారాయణ, తల్లి సుబ్బమ్మ గార్లు.
విద్య[మార్చు]
వీరు తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.బి.బి.ఎస్. పట్టా పొందారు.
కుటుంబము[మార్చు]
వీరికి 11/11/1983 లో రేవతి గారితో వివాహము జరిగింది. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు కలరు.
విలాసము[మార్చు]
- శాశ్వత చిరునామా
రామ చంద్ర నగర్, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
- తాత్కాలిక చిరునామా
- (ప్రస్తుత)
170, సౌత్ అవెన్యూ, కొత్త ఢిల్లీ. 1100110
రాజకీయ ప్రస్థానం.[మార్చు]
చింతా మోహన్ గారు 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరుపతి లోక్ సభ నియోజక వర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఎన్నికయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. మూడవసారి కూడా 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లోకూడా గెలుపొందారు. ఈ సమయంలో వీరు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా 5వ సారి లోక్ సభకు ఎన్నికై సేవలందించారు. వీరు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యులుగా పనిచేశారు. 2009 లో జరిగిన 15 వ లోక్ సభకు ఆరవ పర్యాయము ఎన్నికైనారు.
బయటి లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- 8వ లోక్‌సభ సభ్యులు
- 9వ లోక్‌సభ సభ్యులు
- 10వ లోక్‌సభ సభ్యులు
- 12వ లోక్‌సభ సభ్యులు
- 14వ లోక్‌సభ సభ్యులు
- 15వ లోక్‌సభ సభ్యులు
- 1954 జననాలు
- చిత్తూరు జిల్లా రాజకీయ నాయకులు
- చిత్తూరు జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు