మేధా పాట్కర్
Appearance
మేధా పాట్కర్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | మేధా తాయీ |
విద్య | సోషల్ వర్క్ లో ఎం.ఎ. |
విద్యాసంస్థ | టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ |
నేషనల అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (NAPM) | |
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఉద్యమం | నర్మదా బచావో ఉద్యమం |
పురస్కారాలు | రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ |
మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
జననం
[మార్చు]డిసెంబరు 1, 1954న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ. (సోషల్ వర్క్) విద్య అభ్యసించిన తరువాత 7 సంవత్సరాలు పలు స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది. 2014 సాధారణ ఎన్నికలలో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈశాన్య ముంబయి లోక్ సభ స్థానానికి పోటీ చేసారు, కాని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
భావాలు
[మార్చు]- ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో భూ మాఫియాను ప్రోత్సాహించడమే. ప్రత్యేక ఆర్థిక మండళ్లు రైతుల బతుకుల్ని నాశనం చేస్తున్నాయే తప్ప వారికి ప్రయోజనకరంగా లేవు. పంట భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే ఆ మండళ్ల వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఆదివాసులు, రైతులు, పేదలు జీవించేందుకు వీలులేని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు. ఎస్‌ఈజడ్‌లు ఏర్పడితే నేరాలు కూడా పెరుగుతాయి. అభివృద్ధి పేరిట పాలకులు అన్నదాతకు ద్రోహం చేస్తున్నారు. దేశానికి వెన్నెముక అంటూనే పాలకులు రైతు వెన్ను విరుస్తున్నారు. పచ్చని పంట పొలాలను నిప్పచ్చరం చేసే ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి. జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగకపోవడానికి కారణం పెట్టుబదీదారులకు భూములు తెగనమ్మటమే. ఇలా భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కరువవుతాయి.
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- (ఆంధ్రజ్యోతి11.11.2009)
వికీమీడియా కామన్స్లో Medha Patkarకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.