Jump to content

మరిడమ్మ తల్లి దేవాలయం

వికీపీడియా నుండి

మరిడమ్మ తల్లి దేవాలయం

[మార్చు]

మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన గ్రామదేవత యొక్క ఆలయం. ఇది 1952 లో దేవాదాయ శాఖ వారి అధీనం లోనికి వెళ్ళింది.

స్థల పురాణం

[మార్చు]

పూర్వకాలంలో కలరా, మశూచి లాంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యువు భారిన పడుతుండేవారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా, మశూచి మహమ్మారిని పారద్రోలిన మారెమ్మ అమ్మవారు పాత పెద్దాపురంలో గ్రామదేవతగా ఎన్నో ఏళ్ల క్రిందటే వెలిశారు. ఆనాటి నుండి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆతల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. 17 వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి “ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడివి గా వుండేధి. ఒక సారి ఆ అడవిలో పశువుల కాపరులకి “ 16 ఏళ్ల యువతి కనిపించి నేనుచింతపల్లి వారి ఆడపడుచుని నేను ఈ ప్రదేశములో వున్నాను అని మా వాళ్ళకి చెప్పండి. అని చెప్పి మాయం అయ్యింది ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగింది అంతా చెప్పారు. అంతకు మునుపే మరిడమ్మ అమ్మ వారు చింతపల్లి వారికి కలలో కనిపించి తనకి మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ మానోజి చెరువు చుట్టుపక్కల ప్రాంతములు వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతి రూపము దర్శనమిచింది. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప ధీప, నైవేధ్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు.

మరిడమ్మ జాతర మహోత్సవం

[మార్చు]

ఈ మరిడమ్మ అమ్మ వారి జాతర ప్రతీ సంవత్సరము జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసంలోని అమావాస్య వరకూ 37 రోజుల పాటు ఎంతో వైభవముగా జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి మరిడమ్మ అమ్మ వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూంటారు ఒక్క ఆదివారం రోజునే దాదాపు 40 నుండి 50 వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం.

ఉయ్యాల తాడి

[మార్చు]

బహులైక జేష్ఠ అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మ వారికి ఉయ్యాల తాడిని వేస్తారు. జాతర రోజు నుండి జాతర ముగిసే వరకూ అమ్మవారు, ఆమె ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం. ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ఎగబడతారు అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవలసి వుంటుంది. ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మందికి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ వుంటే దారిపొడవునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడివద్దకు సాగనంపుతారు (వారిని కాదని వేరొకరు తేలేరు ఆ దారి కాదని వేరొక దారి పోరాదు) అది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివద్దకు రావాలి అది అనాదిగా వస్తున్న ఆచారం

తొలి జాతర

[మార్చు]

పెద్దాపురం పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో దాదాపు అన్ని వార్డుల ప్రజలు మరిడమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు ఐతే మొట్టమొదటి జాతర మాత్రం పాత పెద్దాపురం కోటముందు గ్రామస్థులు మాత్రమే నిర్వహిస్తారు. వీరు నిర్వహించేది జాగారం మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరం గానూ వ్యవహరిస్తారు. బహులైక జేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదట జాతర గరగలు గుడి వద్ద జాతర గరగల కంటే ముందు ఎత్తి అమ్మవారి సమక్షంలో గరగ నృత్యం ఒక ఆట పులి నృత్యం ( పులి ఆటకి రాష్ట్రము లోనే ప్రసిద్ధి చెందిన పులి ఆటకారులున్నారిక్కడ ) ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోటముందుకి పయనమవుతారు మరిడమ్మ ఆస్థానం నుండి తీసుకువెళ్లిన గరగలను పాతపెద్దాపురం మరిడమ్మ ఆలయానికి అనువంశిక ఆలయ ధర్మకర్తలు పానుపు వేసి పసుపు కుంకుమలు పూసి, కాగడాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారికి ఇష్టమైన పాటపాడి హారతి ఇవ్వడంతో పాన్పు పూర్తవుతుంది - తరువాత జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా, గరగలు, పులి, కొయ్యడాన్సులు, తప్పెటగుళ్లు, కర్రసాము, కోలాటం ఇంకా అనేక ఇతర కార్యకమాలతో, దేవతా వేషధారణ లతో వున్న ట్రాక్టర్ల ఊరేగింపుతో బాణాసంచా పేలుళ్లతో రెండు ఆలయాల వద్ద భారీగా జరుగుతుంది. - ఇంకా సరిదిద్దవలసి ఉంది వంగలపూడి శివకృష్ణ

ఆలయ కమిటీ

[మార్చు]

అనువంశిక ధర్మకర్త - చింతపల్లి బ్రహ్మాజీ అసిస్టెంట్ కమీషనర్ - ఆర్. పుష్పనాధం వేదపండితులు - సి. హెచ్. హరిగోపాల శర్మ, ఎన్. వి. శాస్త్రి, ఐ.వి. ప్రసాదశర్మ, ఎ.వి. భానుమూర్తి, అసాదులు - రాయి విజయ్, రాయి నాని,

మూలాలు

[మార్చు]
  • ఆంధ్ర ప్రభ సోమవారం, తూర్పుగోదావరి, పెద్దాపురం ఎడిసన్ ది. 04/07/2016
  • ప్రజాశక్తి తూర్పుగోదావరి జిల్లా ఎడిసన్ 04/07/2016, ప్రత్యేక అనుభందం 31/07/2015.
  • సాక్షి 04/07/2016 తూర్పుగోదావరి జిల్లా ఎడిసన్