చింతూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చింతూరు
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో చింతూరు మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో చింతూరు మండలం యొక్క స్థానము
చింతూరు is located in Telangana
చింతూరు
తెలంగాణ పటములో చింతూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°26′N 81°14′E / 17.44°N 81.23°E / 17.44; 81.23
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము చింతూరు
గ్రామాలు 89
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,725
 - పురుషులు 19,899
 - స్త్రీలు 20,826
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.14%
 - పురుషులు 50.85%
 - స్త్రీలు 37.69%
పిన్ కోడ్ {{{pincode}}}

చింతూరు మండలం చింతూరు అనునది రంపచోడవరం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం లోని ఒక మండల కేంద్రము అయిన గ్రామము.[1].. ఇది పూర్వము తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము, కాగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో భాగంగా ముంపునకు గురికాబోయే ఈ మండలం జూన్ 2014 న ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసినది. చింతూరు మండల కేంద్రము కాగా జిల్లా కేంద్రము కాకినాడ, మరియు డివిజను కేంద్రము రంపచోడవరం. చింతూరు మండలమునకు తూర్పున మారేడుమిల్లి మండలము, పడమర నెల్లిపాక మండలము, ఉత్తరమున కొంట (చత్తీస్ ఘడ్ రాష్ట్రం), మల్కనగిరి (ఒరిస్సా రాష్ట్రము), దక్షిణమున వరరామచంద్రపురం కూనవరం మండలములు సరిహద్దులుగా కలవు.

చింతూరు శబరి నదీతీరమున గలదు. చింతూరు మండలము శబరి నదికి ఇరువైపులా ఆవరించి యున్నది. చత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రముల సరిహద్దుల నుండి ప్రవహించుచున్నశబరి నది ఈ మండల సరిహద్దున ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించు చున్నది. శబరి నదికి సీలేరు ఉపనది. సీలేరు నది మన రాష్ట్రమునకు అత్యధిక విద్యుత్తును అందించే జలవిధ్యుత్ కేంద్రములయిన మోతుగూడెం, సీలేరు, డొంకరాయి లను కలిగియుండి ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రము లను వేరుచేయుచూ శబరితో కలసి కూనవరం వద్ద భారతదేశం లో రెండవ అతిపెద్ద నది, దక్షిణ గంగ గా పిలువబడే గోదావరి నదిలో కలుస్తుంది.

మండల గణాంకాలు[మార్చు]

చింతూరు మండల జనాభా 42,025 కాగా అందు 20,667 మంది పురుషుల సంఖ్య, 21,359 మంది స్త్రీల సంఖ్య కలరు. కాగా మండలములో 9,979 కుటుంబములు నివాసము చేయుచున్నారు.

సామాజిక భౌగోళిక స్థితిగతులు[మార్చు]

ఈ మండలములో అత్యధికులు ఆదివాసీ గిరిజన తెగలు కాగా కొద్ది మంది ఇతర ప్రాంతముల నుండి వచ్చి స్థిరపడిన వారు కూడా నివాసముంటున్నారు. ఈ మండలములో కోయదొర, కొండ దొర, కొండ రెడ్లు, కొండ కాపు, వాల్మీకి మొదలగు షెడ్యుల్డ్ జాతుల వారు మరియు తెలంగాణ ఒరిస్సాల నుండి వచ్చి స్థిరపడిన లంబాడా తదితరులు కలరు. ఇక్కడ ప్రజలు మాట్లాడు భాషలు తెలుగు, కోయ మరియు ఉర్దూ. చింతూరు మండలములో 15 ప్రకటిత గ్రామ పంచాయితీలు, 89 గ్రామాలు (ఆవాసములు) కలవు. ఈ మండలము ఏజెన్సీ గా పిలువబడు అటవీ ప్రాంతపు ఆదివాసీ గిరిజన ప్రదేశము. ఈ మండలములో బలిమెల అతి చిన్న గ్రామము కాగా చింతూరు అత్యధిక జనాభా గల గ్రామము. ఈ ప్రదేశము భౌగోళికముగా 17°44’N మరియు 81°23’E అక్షాంశ రేఖాంశములపై వున్నది. ఇది సముద్ర మట్టమునకు 35 మీటర్లు (118 అడుగులు) ఎత్తున వున్నది.

సరిహద్దులు[మార్చు]

చింతూరు ఆంధ్ర, తెలంగాణా, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రములను కలుపు జాతీయ రహదారులు ఎన్‌హెచ్ 221, ఎన్‌హెచ్ 41 లకు జంక్షన్ గా వున్నది. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, భద్రాచలం, విజయవాడ, హైదరాబాద్ లే కాక ఛత్తీస్ ఘడ్ ఒరిస్సా లలోని జగదల్ పూర్, జైపూర్ లకు పోవు రహదారులు కలిగియుండి ఆయా ప్రదేశములకు డైరెక్ట్ బస్సు సౌకర్యములు కలిగియున్నది. చింతూరు మండలము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వుండి తెలంగాణా, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రములను సరిహద్దులనుగా కలిగియుంది. చింతూరుకు 7 కిలోమీటర్ల దూరములో గల “కుంట” గ్రామము ఆంధ్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రములకు కూడలి (Tri State Junction). ఇచట శబరి సీలేరు నదులు కలుస్తూ ఈ మూడు రాష్ట్రము లను వేరుచేయు చున్నవి. కుంట గ్రామము ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో, మోటు గ్రామము ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులో, కల్లేరు గ్రామము ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో కలవు.

పర్యాటక కేంద్రములు[మార్చు]

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రములైన భద్రాచలం, రాజమండ్రి, ప్రముఖ విహార, పర్యటక కేంద్రములైన పాపికొండలు, కోనసీమ, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, మణుగూరు, కొత్తగూడెం, మల్కనగిరి లు చింతూరు కు అందుబాటులో కలవు. అంతేగాక మండలమునకు అతి సమీపములో అందమైన చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు, టైగర్ క్యాంపు, పాములేరు, పాలధార, జలతరంగిణి, పాపి కొండలు జాతీయ అభయారణ్యము, అల్లూరి సీతారామరాజు రక్షిత అటవీ ప్రాంతము, పొల్లూరు, కల్లేరు మరియు సుకుమామిడి జలపాతములు, మోతుగూడెం, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, డొంకరాయి, కొంట, మూడు రాష్ట్రముల కూడలి (Tri State Junction) ప్రాంతములు పర్యాటక కేంద్రములుగా భాసిల్లుచున్నవి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 40,725 - పురుషులు 19,899 - స్త్రీలు 20,826

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామ పంచాయతీలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=చింతూరు&oldid=1829369" నుండి వెలికితీశారు