కొత్తపల్లి జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి నుంచి పాడేరు వెళ్లే మార్గంలో కొక్కిరపల్లి ఘాట్‌ దిగువున కొత్తపల్లి గ్రామం ఉంది. ఇక్కడ 20 నుంచి 50 మీటర్ల ఎత్తుతో పది జలపాతాలు ఉన్నాయి. పాడేరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో, జి.మాడుగుల నుండి చింతపల్లి మార్గంలో ఈ జలపాతం ఉంది. కొత్తపల్లి గ్రామస్థులు, కొంతమంది విద్యార్థులు ఈ జలపాతాన్ని మూడు సంవత్సరాల క్రితం వెలుగులోకి తెచ్చారు . ఈ జలపాతం ముందు భాగం నుంచి కర్రలు, రోడ్డు మార్గం నుండి పర్యటకులు లోపలికి వెళ్తుంటారు. వివిధ మండలాలు, జిల్లాల నుండి సందర్శకులు జలపాత ప్రదేశానికి వస్తుంటారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కొత్తపల్లి వద్ద జలపాతం