Jump to content

కుటీర పరిశ్రమ

వికీపీడియా నుండి

కుటుంబంలో సభ్యులతో నడిపే చిన్న పరిశ్రమలను కుటీర పరిశ్రమ (Cottage Industry) అంటారు. ఇవి పెట్టుబడి తక్కువగా పరిశ్రమ ఎక్కువగా కలిగి ఉంటాయి. కుటీర పరిశ్రమ అంటే గృహ పరిశ్రమ. సమాజానికి అవసరమైన వస్తువులని చిన్న చిన్న పనిముట్ల ద్వారా తక్కువ ఖర్చుతో ఇంట్లో గానీ లేదా ఏదైనా చిన్న ప్రదేశంలో ఆయా వస్తువులను తయారు చేయటం కుటీర పరిశ్రమగా పరిగణించవచ్చు,[1] ఈ కుటీర పరిశ్రమలకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. చాలామంది వారి వృత్తిపనులు,కుల వృత్తులతో భాగంగా కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఈ పరిశ్రమలకు ఆర్థిక వ్యవస్థలలో విశేషమైన స్థానం ఉంది.కుటీర పరిశ్రమలొ ఈ క్రింది అంశాలు ప్రాముఖ్యత వహిస్తాయి

  • కుటుంబసభ్యుల తోర్పాటు వుంటే వారి నైపుణ్యం ఆయా రంగాల్లో ఉన్న అనుభవం
  • ఎన్నుకున్న శ్రమ లో ఉన్న పోటీ పరిస్థితి మార్కెటింగ్ , లాభ అవకాశాలు
  • సాంకేతికపరమైన సాధ్యాసాధ్యాలు పరిజ్ఞానం ముడి పదార్థాలు ,యంత్ర పరికరాలు, వాటి విడిభాగాల లభ్యత
  • కుటీర పరిశ్రమ నడపటానికి స్థానం వాటికి కావలసిన నీరు విద్యుత్తు ఇంధనం ఇంకా ఇతర ప్రయోజనాలు
  • నైపుణ్యం గల పనివారు వారి లభ్యత ఆవశ్యకత
  • కుటీర పరిశ్రమ పెట్టుబడికి మూలధనం[2]
  • సంప్రదాయ కళలను, ప్రాచీన కాలం కళలను కాపాడడం

తక్కువ పెట్టుబడి అనగా సుమారు లక్ష రూపాయలు కంటే తక్కువ పెట్టుబడి తో ముగ్గురు లేదా నలుగురు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించుకోగలిగే చిన్న తరహా పరిశ్రమలు.

ఈ కుటీర పరిశ్రమలు ముఖ్యంగా మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు

  • వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు:ఉదాహరణకు లాభదాయక మైన వాణిజ్య పంటల పెంపకం, ఉద్యానవన పంటల పెంపకం పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ లేదా పౌల్ట్రీ , గొర్రెల, మేకల పెంపకం తదితరమైనవి. ఈ పరిశ్రమలు చేపట్ట దలచినట్లయితే వీటికి భారతదేశంలొని ప్రతి జిల్లాలో వ్యవసాయశాఖ వారి యొక్క రైతు శిక్షణా సంస్థ (FTC) లో శిక్షణను పొందవచ్చు. వ్యవసాయశాఖ వారు కాకుండా వ్యవసాయ అనుబంధ శాఖలైనటువంటి ఉద్యాన వన శాఖ, పశు సంవర్ధకశాఖ, సెరికల్చర్ డిపార్టుమెంటు, అటవిశాఖ, మత్స్యశాఖ మొదలగు శాఖల శిక్షణా కేంద్రాలలో ఆయా శాఖలకు సంబంధించిన శిక్షణలను ఉచితంగా పొందడమే కాకుండా తగిన ఆర్ధిక సహాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందవచ్చు.
  • వ్యవసాయేతర పరిశ్రమలు:అగరబత్తి తయారి, కొవ్వొత్తులతయారి, నాయిల్, డిటర్జెంట్. కుటీర పరిశ్రమలు వంటివి వీటికి భారతదేశంలొ[3] డి.ఆర్.డి.ఎ. శాఖకు చెందిన టిటిడిసి (Training And Technology Development Centre), Ministry of HRD కి చెందిన జన శిక్షణా సంస్థాన్ (JSS), నెహ్రు యువ కేంద్రాలు నుండిగాని, బ్యాంకులు నిర్వహిస్తున్న శిక్షణా సంస్థలు సహాయాన్ని ఇస్తాయి.
  • వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలు:వాణిజ్య రంగంలో కుటీర పరిశ్రమలైనటు వంటి కిరాణా షాపు యాజమాన్యం, జిరాక్స్ సెంటర్లు నిర్వహణ కొరకు ఎన్నో ప్రభుత్వ పధకాలు, బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది.

కుటీర పరిశ్రమలు

[మార్చు]

Appadam Labhalu Nastalu

మూలాలు

[మార్చు]
  1. Rao, Bhaskar. Telugu Grammar and Composition. New Saraswati House India Pvt Ltd. ISBN 978-81-7335-501-1.
  2. ఫణిశ్రీ (1927). స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ (కుటీర పరిశ్రమలు).
  3. "Cottage | National Portal of India". www.india.gov.in. Retrieved 2020-06-09.
  4. "Just View". www.justview.co. Archived from the original on 2020-01-11. Retrieved 2020-06-09.

వెలుపలి లంకెలు

[మార్చు]