గుత్తి కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తి కోట

గుత్తి కోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన దుర్గములలో ఒకటి.

చరిత్ర[మార్చు]

గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు అయితే విజయనగర రాజులు దీనిని పటిష్ఠము చేసారు. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము మరియు సంస్కృతములో ఉన్నాయి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. ఒక శాసనములో ఈ కోట పేరు గదగా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో గుత్తి కోట దుర్గ రాజముగా కీర్తించబడింది.

గుత్తి కైఫియత్ ప్రకారము కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనెను. ఆ తరువత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉంది. 1746 లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు దీనిని జయించారు. 1775 లో హైదర్ అలీ గుత్తి కోటను తొమ్మిది నెలల నిర్భంధము తర్వాత వశపరచుకొనెను. 1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.

కోట గుత్తి చుట్టూ ఉన్న మైదానము కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారములు కలిగి ఉంది. ఇందులో రెండు శాసనములు, వ్యాయామశాల మరియు మురారి రావు గద్దె ఉన్నాయి. మురారి రావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. కోటలో చాలా నూతులున్నవి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]