గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి
Jump to navigation
Jump to search
గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి (1922 - 2001) ప్రముఖ ఆయుర్వేద, జ్యోతిష పండితుడు.[1]
గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి | |
---|---|
![]() గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి | |
జననం | 1922 అనంతపురం జిల్లా, చిన్న ముష్టూరు |
మరణం | 2001 |
వృత్తి | ఆయుర్వేద, జ్యోతిష పండితుడు. |
ప్రసిద్ధి | ప్రముఖ ఆయుర్వేద, జ్యోతిష పండితుడు. |
తండ్రి | సీతారామశాస్త్రి |
తల్లి | సుబ్బమ్మ |
ఈయన గొల్లాపిన్ని వారి వంశంలో జన్మించాడు. ఇతను గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, సుబ్బమ్మ దంపతుల సంతానం. ఇతనిది పండిత వంశము కనుక కవిత్వము ఉగ్గుపాలతోనే అబ్బింది. ఆయుర్వేదంలో కూడా అనుభవం సంపాదించుకున్నాడు. అబ్కారీ డిపార్ట్‌మెంటులో కడపలో పనిచేశాడు.
రచనలనుండి ఉదాహరణలు[మార్చు]
సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పలుకుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురుసి
శ్రీకృష్ణరాయలు వాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ
గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె!
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజూడ.
(మహాంధ్రోదయము నుండి)
మూలాలు[మార్చు]
- ↑ కల్లూరు అహోబలరావు. రాయలసీమ రచయితల చరిత్ర - 3వ సంపుటి (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 162–164. Retrieved 28 July 2021.